నటీనటులు : అక్కినేని నాగార్జున , రకుల్ ప్రీత్ సింగ్ , వెన్నెల కిషోర్ సంగీతం : చేతన్ భరద్వాజ్ నిర్మాతలు : నాగార్జున , జెమిని కిరణ్ దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్ రేటింగ్ : 3 /5 రిలీజ్ డేట్ : 9ఆగస్టు 2019 17 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు సూపర్ హిట్ ఐన విషయం తెలిసిందే . ఇన్నాళ్లకు మళ్ళీ అదే టైటిల్ తో దానికి కొనసాగింపుగా 2 ని చేర్చి నాగార్జున చేసిన ప్రయత్నం మన్మథుడు 2 . అయితే ఇది ఆ సినిమాకు సీక్వెల్ కానప్పటికీ అంచనాలు అయితే బాగానే ఏర్పడ్డాయి ఈ సినిమా మీద . మరి ఆ అంచనాలను నాగ్ అందుకున్నాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . కథ : తొలిసారి ప్రేమలో విఫలం కావడంతో ఆగ్రహం చెందిన సామ్ ( అక్కినేని నాగార్జున ) ప్లే బాయ్ లా మారతాడు . కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తుంటాడు . అయితే ఏజ్ బార్ అవుతోంది కాబట్టి త్వరగా పెళ్లి చేసుకోమని ఇంట్లో పోరు పెడుతుంటారు . ఇంట్లో వాళ్ళ పోరు పడలేక అవంతిక ( రకుల్ ప్రీత్ సింగ్ ) తో కలిసి తన పెళ్లి చెడగొట్టే పనులు మొదలు పెడతాడు . అయితే ఈ క్రమంలో ఎలాంటిసంఘటనలు జరిగాయి ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . హైలెట్స్ : నాగార్జ...