Skip to main content

Posts

Showing posts from September, 2019

ఇప్పుడు అల్లు శిరీష్ పరిస్థితి ఏంటి?

Allu Sirish మెగా హీరో అల్లు శిరీష్ ఇప్పటిదాకా చేసిన సినిమాలతో తెచ్చుకున్న గుర్తింపు సున్నా అని చెప్పవచ్చు. ఒక్క శ్రీరస్తు శుభమస్తు తప్పితే తన కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేదు. ఆ సినిమా కూడా దర్శకుడి ప్రతిభ వల్ల ఆడిందే ఎక్కువ. అల్లు శిరీష్ లాస్ట్ సినిమా ABCD పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు కానీ దాని వల్ల మరో ప్లాప్ ఎదురైంది. ABCD పరాజయంతో అల్లు శిరీష్ పూర్తిగా డల్ అయిపోయాడు. ఇప్పటిదాకా మరో సినిమా మొదలుపెట్టింది లేదు. కనీసం నెక్స్ట్ సినిమా ఇంతవరకూ అనౌన్స్ చేయలేదు. ఈమధ్య మీడియాతో మాట్లాడుతూ కొత్త దర్శకుడితో ఒక లవ్ స్టోరీ ఉంటుందని, వివరాలు వారంలో వెల్లడిస్తాడని అన్నాడు కానీ ఇంతవరకూ దాని ఊసే ఎత్తలేదు. మిగతా మెగా హీరోలు డిఫరెంట్ స్క్రిప్ట్స్ తో దూసుకెళ్తుంటే అల్లు శిరీష్ కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది పరిస్థితి. అందుకే ఈసారి గ్యాప్ ఎక్కువైనా పర్లేదు పక్కా స్క్రిప్ట్ తోనే రావాలని డిసైడ్ అయిపోయాడు. అందుకనే ఈ లేట్. మరి ఈసారైనా అల్లు శిరీష్ హిట్ కొడతాడో లేదో చూడాలి. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2mzb4JS

పూరి కి రామ్….బిగ్ బి కి రామ్ చరణ్…. బహుమతులు

Amitabh Puri ఏదైనా పండగ వస్తే బహుమతులు పంచుకోవటం మరియు మన ఆత్మీయ బంధాల విలువలని పెంచుకోవటం చూస్తేనే ఉంటాము. కానీ మన సినిమా పరిశ్రమ విషయంలో కూడా ఇలాంటి బహుమతులు పంచుకుంటారు. మరి దానికి పండగ కావాలా? అంటే ఏమి అవసరం లేదు సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు, లేదా మంచి పని కోసం చేసిన మేలు అయినా చాలు  అదే పెద్ద పండగ లాగ భావిస్తారు ప్రతి ఒక్కలు. మొదట బిగ్ బి- రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవాలి. బిగ్ బి అంటే మన ఇండియన్ సూపర్ స్టార్ “అమితాబ్ బచ్చన్” గారు. రేపు విడుదల అవుతున్న ‘సైరా’ సినిమాలో చిరంజీవి గురువుగా ‘గోసాయి వెంకన్న’ పాత్రలో ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించారు అంటే అది మన సినిమాలా మీద ఉన్న నమ్మకం, చిరు-రామ్ చరణ్ మీద ఉన్న ఆత్మీయ బంధం విలువ అని చెప్పవచ్చు. మరి రామ్ చరణ్ కూడా ఒక్కరూపాయి ఇవ్వకుండా ఊరుకున్నాడా అంటే, బిగ్ బి కి అదిరిపోయే గిఫ్ట్ ‘రోల్స్ రాయిస్ ఫాంటమ్’ లగ్జరీ కారుని ఇచ్చారు. నిజంగా ఇది మంచి పరిణామం అని చెప్పవచ్చు. అలాగే ఇంకొక జంట పూరి-రామ్ కూడా ఇలా బహుమతులు పంచుకున్నారు. ఈ ఏడాది ‘ ఇస్మార్ట్ శంకర్ ‘ రూపంలో రామ్ కి అదిరిపోయే, కెరీర్ లో గుర్తుండే పోయే గిఫ్ట్ ఇ...

బాబా భాస్కర్ ను బయటకు పంపడానికి బిగ్ బాస్ భారీ స్కెచ్

bigg boss sketch to eliminate baba bhaskar బిగ్ బాస్ అనేది పేరుకి ఒక రియాలిటీ షో. కానీ ఇక్కడ జరిగేదంతా ప్రేక్షకుల చేతుల్లో ఉండదు. ఏవో ఓట్స్ వేసి మనకు నచ్చిన వాళ్ళను సేవ్ చేసుకున్నామని ప్రేక్షకులు ఆనందపడిపోతారు కానీ ప్రేక్షకులకు ఏది చూపించాలో, ఏది చూపించకూడదో నిర్వాహకులు డిసైడ్ అవుతారు. ఉండాల్సిన వాళ్ళ గురించి పాజిటివ్ గా చెప్పించడం, బయటకు పంపాలన్న వాళ్ళ గురించి నెగటివ్ గా మాట్లాడించడం వంటివి బిగ్ బాస్ లో సర్వసాధారణం. ప్రస్తుతం బిగ్ బాస్ లో బాబా భాస్కర్ టార్గెట్ అయిన విషయం స్పష్టంగా తెలుస్తుంది. దానికి రెండు ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి ఫేక్ ఎలిమినేషన్ కు వెళ్లి, సీక్రెట్ రూమ్ లో ఒక రోజు ఉండి హౌజ్ లోకి వచ్చినప్పుడు బాబా భాస్కర్ తో తేల్చుకోవాల్సి ఉందని అన్నాడు. అలా ఎందుకన్నాడో ప్రేక్షకులకు మాత్రం అర్ధం కాలేదు. అలాగే బాబా భాస్కర్ తో అప్పటిదాకా చాలా క్లోజ్ గా ఉన్న అలీ, రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా చాలా నెగటివ్ గా మాట్లాడుతున్నాడు. దానికి రీజన్ మాత్రం ఎప్పుడో అలీ, పునర్నవి తో కలిసి సీక్రెట్ రూమ్ కు వెళ్లిన దాని గురించి చెప్తున్నాడు. దాని తర్వాత కూడా చాలా రోజులు ఇద్దరూ కలిసి ఉన్నారు. కానీ రీ...

సామజవరగమన సునామి ఇది

samajavaragamana breaking records in youtube స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెల్సిందే. సాధారణంగా ఏదైనా సినిమా విడుదలకు నెల రోజుల ముందు తొలి పాటను విడుదల చేస్తారు. కానీ ఈ చిత్రానికి మాత్రం చాలా ముందే, దాదాపు మూడు నెలలు ముందుగా తొలి పాట “సామజవరగమన”ను విడుదల చేసేసారు. ఇంత ముందు విడుదల చేయడం సంగతి పక్కనపెడితే ఈ పాట యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తోంది. కేవలం రెండే రోజుల్లో ఈ పాట కోటి వ్యూస్ దాటేసింది. దాంతోపాటు అప్పుడే 400K+ లైక్స్ సాధించింది. లైక్స్ పరంగా ఇప్పటికే ఇంత త్వరగా ఇన్ని లైక్స్ సాధించిన తెలుగు పాట మరొకటి లేదు. సీతారామశాస్త్రి అద్భుతమైన భావుకతకు, థమన్ సంగీతం, సిద్ శ్రీరామ్ గానం తోడై ఈ పాట సరికొత్తగా నిలిచింది. ట్యూన్ చాలా క్యాచీగా ఉండడంతో యూత్ దీనికి బాగా అట్ట్రాక్ట్ అవుతున్నారు. అల వైకుంఠపురము లో చిత్రానికి ప్రమోషన్ పరంగా మంచి స్టార్ట్ లభించిందని చెప్పాలి. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2oOM9Tm

ఆవిరి టీజర్ ను పొగిడేస్తున్న మహేష్

mahesh appreciates aaviri teaser అనసూయ, అమరావతి, అవును వంటి చిత్రాలతో హారర్, థ్రిల్లర్ జోనర్లలో సినిమాలు తెరకెక్కి విజయాలు అందుకున్న రవిబాబు , లేటెస్ట్ గా చేస్తున్న మరో ప్రయత్నం ఆవిరి. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే మూడు టీజర్లు విడుదలై జనాల్లో ఆసక్తి రేకెత్తించాయి. స్పిరిట్ ని కనుగొనండి అంటూ చేసిన ప్రచారం బాగా పనిచేసింది. ఇప్పుడు ఈ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు పొగడడం ప్రాధాన్యత సంతరించుకుంది. “ప్రేక్షకులలో హారర్ చిత్రాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తాయి. అయితే ఇందులో రవిబాబు మాస్టర్ అయిపోయాడు. ఆవిరి చిత్ర యూనిట్ కి, రవిబాబుకి ఆల్ ది బెస్ట్” అని ట్వీట్ చేసారు. అయితే ఈ టీజర్లకు పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు నెగటివ్ రెస్పాన్స్ కూడా అదే స్థాయిలో వస్తోంది. ఈ చిత్రానికి అవును పార్ట్ 3 అని టైటిల్ పెట్టుకోవచ్చని, కొత్తగా ఈ టీజర్ లో ఏం లేదని, అవును సినిమా మళ్ళీ చూసినట్లే ఉందని కొంతమంది అంటున్నారు. అయితే సినిమా విడుదలైతే కానీ ఈ సినిమా గురించి ఒక అంచనాకు రాలేం. దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండడం విశేషం. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift...

గద్దలకొండ గణేష్ 10 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

Gaddalakonda Ganesh 10 days collections మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ విడుదలై 10 రోజులు పూర్తయింది. మరో రెండు రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలవుతోంది. అయితే ఇప్పటికే గద్దలకొండ గణేష్ చిత్రాన్ని కొన్న బయ్యర్లందరూ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. సీడెడ్, గుంటూరు, కృష్ణ బయ్యర్లు మాత్రం ఇంకా సేఫ్ అవ్వలేదు. అయితే రేపో, ఎల్లుండో వారు కూడా లాభాల బాట పడతాడని అంటున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 10 రోజులకు 20 కోట్ల షేర్ వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల షేర్ వచ్చింది. 25 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం ఒక్క ఓవర్సీస్ లో మాత్రమే నష్టాల బాటలో ఉంది. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2nTw1zy

మహేష్ సినిమాలో రష్మికను డమ్మీ చేసేశారుగా

Rashmika role in sarileru neekevvaru కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న మీడియం బడ్జెట్ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయమై చాలా త్వరగా టాప్ హీరోల రేంజ్ కి వెళ్ళింది. కెరీర్ మొదట్లో ఛలో, గీత గోవిందం , దేవదాస్ వంటి మీడియం బడ్జెట్ సినిమాల్లో చేసింది. ఇప్పుడు మహేష్ తో పాటు అల్లు అర్జున్ – సుకుమార్ సినిమాలో కూడా రష్మిక సెలెక్ట్ అయింది. తమిళంలో కూడా పలు ఆఫర్లు అందుకునేలా ఉంది. ఇదంతా పక్కనపెడితే మహేష్ సినిమాలో రష్మిక రోల్ డమ్మీనేమోనని అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే సరిలేరు నీకవ్వరు అనేది పక్కా కమర్షియల్ సినిమా. ఇది మహేష్ సెంట్రిక్ గా ఉంటుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.రష్మిక మొదటినుండి గ్లామరస్ హీరోయిన్ కాదు. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గా ఉంటుంది. అందుకే గ్లామర్ రిలీఫ్ కోసం స్పెషల్ సాంగ్ లో తమన్నాను తీసుకున్నారు. మరో పాట కోసం పూజ హెగ్డే ను కూడా అనుకుంటున్నారట. ఇక ఇద్దరు గ్లామర్ హీరోయిన్స్ ఉన్నారంటే రష్మిక రోల్ డమ్మీనేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎంత పెద్ద సినిమాలో అయినా డమ్మీ రోల్ అయితే ఒరిగేదేముంటుందన్న ప్రశ్న సినీ ప్రేక్షకులకు కలుగుతోంది. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | T...

సైరా ప్రీమియర్స్ జోరు మాములుగా లేదుగా

Syeraa overseas premiers update అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా సైరా నరసింహారెడ్డి పై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కానుండగా అన్ని చోట్లా టిక్కెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా యూఎస్ లో ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి యూఎస్ లో అవుతోన్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది. లేటెస్ట్ సమాచారం అందే సమయానికి యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే $4,00,000 డాలర్లు అందాయని సమాచారం. ఈ క్రేజ్ చూస్తుంటే కేవలం ప్రీమియర్స్ ద్వారానే దాదాపు 1 మిలియన్ దాకా వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్స్ విషయంలో రాం చరణ్, చిరంజీవి , తమన్నా బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే మలయాళంలో, కన్నడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లు నిర్వహించారు. భారీ ఎత్తున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2nPJh8e

ఫ్లాప్స్ వచ్చినా ప్రయత్నాలు మాత్రం తగ్గట్లేదు

Srinuvaitla Next movie with Srinivas Bellamkonda దర్శకుడు ‘ శ్రీనువైట్ల ‘ మార్క్ కామెడీ-యాక్షన్ ని ఇప్పటికి ఇష్టపడేవారుంటారు. ‘సొంతం’ సినిమా దగ్గరనుండి ‘దూకుడు’ సినిమా వరకు ప్రతి సినిమాలో తన మార్క్ కనిపిస్తుంది. దూకుడు తర్వాత ‘బాద్ షా’ హిట్ అయినప్పటికీ  జూ. ఎన్.టి.ఆర్  అభిమానుల వరకు మాత్రమే ఆ సినిమా హిట్ గా నిలిచింది. మిగిలిన వారికి దూకుడు 2 గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. తర్వాత 4 సినిమాలకి దర్శకత్వం చేసాడు శ్రీనువైట్ల. 4 సినిమాలలోని కథానాయకులకు అవి కెరీర్ వరస్ట్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అంటే శ్రీను వైట్ల శైలి మార్చుకోవడానికి ఇవి మంచి ఉదాహరణగా నిలిచాయి. గత సంవత్సరం రవితేజకి నిజంగానే హిట్ ఇస్తాడు అని అనుకున్నారు. అలా అనుకొని ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ సినిమాకి వెళ్లిన జనాల పరిస్థితి  గోరంగా తయారయ్యింది, శ్రీను వైట్లకి కూడా రవితేజ ఫ్యాన్స్ బాగా వార్నింగ్ ఇచ్చారు. 3 హిట్స్  తర్వాత 4 వ కాంబినేషన్ కి మంచి పేరుంది బయట.తీరా చూస్తే ఆ సినిమా రవితేజ కెరీర్ లో భారీ డిసాస్టర్ కాగా, సినిమా 10 కోట్లు కూడా కలెక్షన్ రాబట్టలేకపోయింది. అయితే ఇప్పుడు శ్రీనువైట్ల గారు ‘ బెల్లంకొండ శ్రీన...

ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలి…హీరోతో కూడా కొట్టించాలి

ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలి. ..హీరోతో కూడా కొట్టించాలి జనరల్ గా దర్శకులు, కథానాయకులు ఫ్లాప్స్ లిస్ట్ లో ఉంటే జనాల నుండి అంతగా మద్దతు రాదూ… కారణం వారి ఎక్సపెక్టేషన్స్ ని రీచ్ చేసుకోలేరు, తర్వాతి సినిమాకి అయిన శ్రద్ధగా, జాగ్రత్తగా పని చేస్తారని కూడా నమ్మకం ఉండదు. అలాంటి కాంబినేషన్ ఒక్కటి తమిళ పరిశ్రమలో రెడీ అవుతుంది. దర్శకుడు ‘బాల’, ‘సూర్య’ కలయికలో ఇదివరకే 2 సినిమాలు వచ్చాయి అందులో “పితామగన్ (శివ పుత్రుడు)” , “నంద (ఆక్రోశం)” రిలీజ్ అయ్యాయి. చూసుకుంటే శివ పుత్రుడు సినిమాలో సూర్య నటన అందరిని కట్టి పడేసింది. ఆ సినిమా తర్వాతనే ‘గజినీ’ , యముడు, 24 సినిమాల ద్వారా సూర్యకి తెలుగులో మార్కెటింగ్ బాగా పెరిగింది. అయితే ఈ మధ్య సినిమాల విషయంలో ఇద్దరు చాల వెనుకబడ్డారు. సూర్యకి ఏమో “బందోబస్త్”, “ఎన్.జి.కె” సినిమాలు భారీ ఫ్లాప్స్ ని ఇచ్చాయి. అలాగే బాల గారు కూడా చేసిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ కూడా ట్రైలర్ దగ్గరే గట్టి ఫ్లాప్స్ ని ఇచ్చింది. ఇక ఈ సినిమాని బాల చేతుల నుండి వేరే దర్శకులకి ఇచ్చేసారు. అలాగా ఇద్దరు ఇప్పుడు కలిసి పనిచేసే అవకాశం మళ్ళీ తిరిగి వచ్చింది. ‘సుధ కొంగర’ [‘గురు (వ...

బెల్లంకొండ ఫ్యామిలీ నుండి ఇంకొక హీరో వస్తున్నాడు…

బెల్లంకొండ ఫ్యామిలీ నుండి ఇంకొక హీరో వస్తున్నాడు… ‘బెల్లంకొండ సాయి శ్రీనివాస్’ చాలా ఫ్లాపుల మధ్య ఈ మధ్య “రాక్షసుడు” సినిమా ద్వార హిట్ కొట్టాడు. కథ తమిళ పరిశ్రమ నుండి వచ్చినా కూడా, అక్కడ ఎలా తీశారో, ఇక్కడ కూడా అలానే తీసి ఏమి తేడాలేకుండా చేయడంతో సినిమా హిట్ దిశగా వెళ్లి సక్సెస్ అయ్యింది. అయితే మొదట ‘అల్లుడు శీను’ సినిమా అప్పుడు కూడా ‘బెల్లంకొండ సురేష్’ బాబు సాయి శ్రీనివాస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ తారాగణంతో మాస్ డైరెక్టర్ ‘వి.వి.వినాయక్’ దర్శకత్వంలో చేసినప్పటికీ, ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమంత, తమన్నా, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళతో ఆడియో రిలీజ్ అయ్యి, సినిమా విడుదల అయ్యేంతవరకు ప్రతి చిన్న విషయంలో తీసుకున్న శ్రద్ధ ఇప్పుడు సాయి శ్రీనివాస్ అనుభవిస్తున్నాడు. సాయి శ్రీనివాస్ కూడా తన తమ్ముడిని ‘బెల్లంకొండ గణేష్’ ని పరిచయం చెయ్యాలి అని అనుకుంటున్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ సినిమాల దర్శకుడు ‘పవన్ సాధినేని’ చెప్పిన లైన్ బెల్లంకొండ ఫ్యామిలీ మొత్తానికి నచ్చిందంటా. అలా చిన్న కుమారుడు గణేష్ గురించి శ్రీనివాస్ ఆలోచించడం మంచి పని అంటున్నారు సురేష్ గ...

‘సీటిమార్’ కొట్టడానికి రెడీగా ఉన్నాము….

‘సీటిమార్’ కొట్టడానికి రెడీగా ఉన్నాము…. దర్శకుడు ‘హరీష్ శంకర్’ తీసిన సినిమా ‘వాల్మీకి’ నుండి ‘గడ్డలకొండ గణేష్’ గా మారింది. సినిమా విడుదల అవ్వడానికి 8 గంటల సమయంలో అభిప్రాయం బేధాలు వస్తున్నాయని చెప్పి మార్చేశారు. అయితే గడ్డలకొండ గణేష్ సినిమాలో ‘వరుణ్ తేజ్’ పవర్ఫుల్ క్యారక్టర్ చేస్తూ, సినిమాకి హీరోగా చేస్తాడు. ఆ సినిమా పేరు “సీటిమార్”. ఆ సీటిమార్ సినిమా పేరు ఇప్పుడు మాచో స్టార్ ‘ గోపీచంద్ ‘ తదుపరి సినిమాకి పనికివచ్చింది. సంపత్ నంది దర్శకత్వంలో, తమన్నా కథనాయికగా నిర్మస్తున్నారు ఈ సినిమాని ‘శ్రీనివాస చిత్తూరి’ గారు. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. అయితే మాస్ మసాలా సినిమాలని దూరంగా ఉంచిన గోపీచంద్ గారు, సంపత్ నంది తో కలిసి ఈ సారి మరలా మాస్ మాసాల ఫార్మటు లో తీస్తారంటా. అందుకే సంపత్ నంది గారు ఈ సారి సినిమాకి సీటిమార్ అని టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేయయించారు అని, తొందరలో అధికారక ప్రకటన కూడా ఇస్తారంటా. అయితే తమన్నా కూడా ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉంది. గోపిచంద్ తో కలిసి మొదటి సారి నటిస్తుండగా, సంపత్ నంది తో తనకి ఇది మూడవ సినిమా. ఇదివరకే ‘రచ...

బిగ్ బాస్ విన్ అయ్యే ఛాన్స్ ఇక ఆ ఇద్దరిదేనా?

బిగ్ బాస్ విన్ అయ్యే ఛాన్స్ ఇక ఆ ఇద్దరిదేనా? అంచనాలకు అతీతంగా సాగే రియాలిటీ షోలో నిన్న ఆసక్తికర పరిణామం జరిగింది. మొదటి నుండి హౌస్ మేట్స్ లో స్ట్రాంగ్ అనిపించుకుంటున్న సీరియల్ నటుడు రవికృష్ణ నిన్న షో నుండి ఎలిమినేట్ కావడమే దానికి కారణం. గత వారం అందరూ బలమైన వాళ్లే ఎలిమినేషన్ కు నామినేట్ కావడం దీనికి అతిపెద్ద కారణం. వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి, రవికృష్ణ నామినేట్ అయ్యారు. వీళ్ళందరూ బలమైన వారే. బయట విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వారే. ఇక నిన్న రవికృష్ణ వెళ్లిపోవడంతో ఈ ముగ్గురిలో ఒకరు బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వడానికి ఫెవరేట్స్ గా పరిగణిస్తున్నారు. వీరిలో కూడా బాబా భాస్కర్ కు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తెలుగు సరిగ్గా రాకపోవడం, టాస్క్ లను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవడం, ఇంట్లోంచి వెళ్లిపోవాలన్న కోరికను ఇప్పటికే బయటపెట్టడం, రీసెంట్ గా తన మీద వచ్చిన నెగటివ్ ఇంప్రెషన్.. ఇవన్నీ బాబా భాస్కర్ కు నెగటివ్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకనే వరుణ్, శ్రీముఖి లలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక బిగ్ బాస్ లో ఐదు వారాలు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో ఇంకా తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ...

అల వైకుంఠపురములో.. సాంగ్ పై మ్యూజిక్ డైరెక్టర్ గుస్సా

అల వైకుంఠపురములో.. సాంగ్ పై మ్యూజిక్ డైరెక్టర్ గుస్సా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో సినిమాలోని మొదటి సింగిల్ ‘సామజవరగమన’ పాటకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెల్సిందే. ఒక్క రోజులోనే 8 మిలియన్ వ్యూస్ దాటి వ్యూస్ వచ్చాయంటే ఈ పాట ఎంతగా అలరిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. అయితే రెస్పాన్స్ బాగున్నా ఒక వర్గం ఈ పాటలో అర్ధవంతమైన లిరిక్స్ ను సింగర్ ఖూనీ చేసిన విధానాన్ని తప్పుపడుతున్నారు. ఈ విధమైన విమర్శలు చేసినవారిలో ప్రముఖులు సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్. సోషల్ మీడియాలో ఈ పాటపై విమర్శలు చేసారు. ఈ పాట పాడిన సింగర్, దాన్ని ఓకే చేసిన థమన్ ను ఉద్దేశిస్తూ ‘నీ ఉచ్ఛారణకి నా జోహార్లు. కేవలం నీ టైం నడుస్తుంది కాబట్టి నువ్వెలా ఖూనీ చేసి పాడినా దాన్ని అదే మహా ప్రసాదం అని భావించిన ఆ సంగీత దర్శకుడికి సాష్టాంగ ప్రాణామాలు. మై డియరెస్ట్‌ కండోలెన్సెస్‌ టు ది లిరిక్స్‌’ అని కల్యాణి మాలిక్ అన్నాడు. అద్భుతమైన భావుకతతో సీతారామశాస్త్రి అందించిన లిరిక్స్ ను భాష తెలియని సిద్ శ్రీరామ్ పాడిన విధానం నిజంగానే అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. from టాప్ స్టోరీస్ ...

తప్పుడు ప్రచారం అయ్యింది… మా సమస్య ఎప్పుడో అయిపోయింది…

తప్పుడు ప్రచారం అయ్యింది… మా సమస్య ఎప్పుడో అయిపోయింది… టాలీవుడ్ టాప్ స్టార్ రైటర్ ‘కోన వెంకట్’ సినిమాలలోని మాటలు, మాటల తూటాలు హీరోల నైజాన్ని పెంచేవి. అలా చాలా పెద్ద సినిమాలకి పనిచేసిన కోన గారు తర్వాత విమర్శకుల పాలు అయ్యారు. తనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది అంటూ ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. సినిమా కథ ఇస్తానని 2017లో 13.50 లక్షలు తీసుకున్నారని అవి అడిగితే బెదిరిస్తున్నారని కేసు నమోదయింది. కోన వెంకట్ పై, జెమినీ ఎఫ్.ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్ కేసు పెడుతూ జూబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కోన వెంకట్ పై 406.. 420 కేసులను నమోదు చేసారని ప్రచారమైంది. అలా కోన వెంకట్ ఇస్తారన్న కథ సంగతి అటు పెడితే ఇలా కేసు లో ఇరుక్కోవటం ఏంటి అని అందరూ ఆశ్యర్య పోయారు. ఆ కథ ఇన్నాళ్టికి ముగిసింది. నిజానికి అలాంటి కథనాలు ఏమి లేవని జూబ్లీ పోలీసులకి ఒక లేఖ వచ్చింది అంటా. అది రాసింది స్వయానా కేసు పెట్టిన జెమినీ ఎఫ్.ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్ గారే అంటా. ఈ వివాదం తమ మధ్య సమసిపోయిందని జెమిని ఎఫ్.ఎక్స్ ఇన్ ఛార్జ్ (జూబ్లీహిల్స్ ఆఫీస్) ఆర్.వి.ప్రసాద్ ఓ లేఖ రాశారు. ”మిస్ ...

డాన్ శీను..బలుపు.. మరీ ఈ సారి ఏంటిదో?

డాన్ శీను..బలుపు.. మరీ ఈ సారి ఏంటిదో? ‘మాస్ మహారాజ్ రవితేజ’ టాలీవుడ్ లో మాస్ ఆడియన్స్ ని బాగా గ్రిప్ లో పెట్టుకున్నాడు. తీసే ప్రతి సినిమాలో కామెడీ, యాక్షన్, రొమాన్స్, మాస్ మాసాల, హీరోయిన్ ని టార్చర్ పెడుతూ సాగే పాటలు. ఇలా అన్ని సమపాళ్లలో ఉండేలా చేసుకున్నాడు. ఒకరకంగా చూసుకుంటే 2000 – 2011 సంవత్సరానికి ఒక హిట్ ఉండేలా చూసుకున్నాడు. అదే విధంగా మూస కథలనే చేస్తున్నాడు అని పేరు కూడా వచ్చింది. తర్వాత కథ అడ్డం తిరిగి ఫ్లాప్స్ వచ్చి వరించాయి మాస్ మహారాజ్ ని. అయితే 2011 లో విడుదల అయిన ‘డాన్ శీను’ సినిమా రవితేజ కేరీర్ ని బాగా మలుపు తిప్పింది, దర్శకుడు ‘ గోపీచంద్ మలినేని ‘ రవితేజ గత సినిమాలని చూసి వాటికంటే బెటర్ గా చేద్దాం అని చెప్పి, రవితేజని ఒప్పించి సినిమా తీసి హిట్ కొట్టాడు. తర్వాత కూడా వరుస పరాజయాల మధ్య ఉన్న తరుణంలో కూడా రవితేజకి గారికి ‘బలుపు’ కథ చెప్పి ఇంకొక హిట్ సినిమాని ని అందించాడు. అయితే మలినేని గారికి రవితేజని ఎప్పటికప్పుడు డిఫరెంట్ గా చూపించాలి అని చెప్పేవారు చాలా ఇంటర్వూస్ లో. అయితే గత సంవత్సరం కూడా ‘టచ్ చేసి చూడు’, ‘నెల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ సినిమాలు పరాజయం అయినప్పుడు ము...

సైరాతో పోటీపై గోపిచంద్ స్పందనేంటి?

సైరాతో పోటీపై గోపిచంద్ స్పందనేంటి? మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ఈ అక్టోబర్ 2న విడుదలవుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా విడుదలకు మూడు రోజుల తర్వాత అంటే అక్టోబర్ 5న గోపిచంద్ హీరోగా నటించిన చాణక్య వస్తోంది. చిరంజీవి సినిమా వస్తున్నప్పుడు దానికి పోటీగా మరో సినిమా విడుదలవ్వడం ఏంటని పలువురు అభిప్రాయపడినా దీనిని పోటీగా భవించకూడదని గోపిచంద్ అంటున్నాడు. అసలు తన సినిమా చిరంజీవి చిత్రానికి పోటీనే కాదని, దసరాకి రెండు, మూడు సినిమాలు విడుదలయ్యే స్కోప్ ఉంటుందని గోపీచంద్ గుర్తుచేసాడు. నిజానికి చాణక్య ఎప్పుడో విడుదలవ్వాలి. కానీ గోపిచంద్ కు అయిన గాయం కారణంగా చాణక్య లేట్ అవుతూ వచ్చి చివరికి దసరాకి విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే మరోవైపు చాణక్య చిత్రానికి థియేటర్లు కేటాయించకూడదని ఒక వర్గం నుండి తీవ్ర ఒత్తిడి వస్తోందని వార్తలు వస్తున్నాయి. మరి వీటిలో నిజానిజాలేంటో తెలియలేదు. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2mdfENB

పూరి తనయుడు చాలా ‘రొమాంటిక్’ అంటా…

పూరి తనయుడు చాలా ‘రొమాంటిక్’ అంటా… ‘పూరి జగన్నాధ్’ సినిమాలు అంటే హీరో, హీరోయిన్ ని ఫేమస్ చేయడానికి మాత్రమే తీస్తాడు…అంటే ప్రేక్షకుల కోసం కూడా ఉద్దెశించి తీస్తాడు అందులోనూ నిజం ఉంది. నిజానికి పూరి జగన్నాధ్ సినిమాల ప్రభావం హీరోకి, హీరోయిన్ కి మాత్రమే దక్కుతుంది. అలా ఉంటాయి ఆ సినిమాలు మరీ. అందుకే హీరో, హీరోయిన్స్ తెగ తాపత్రయ పడతారు పూరి తో సినిమా తియ్యడానికి. అయితే పూరి కుటుంబం నుండి కూడా తమ్ముడు ‘సాయిరాం శంకర్’, తనయుడు ‘ఆకాష్ పూరి’ వారు కూడా తెలుగు పరిశ్రమకి పరిచయం అయ్యాడు. తమ్ముడు ‘నేనింతే’ సినిమాలో చేసిన అభిమాని పాత్ర బాగా జనాలకి నచ్చడంతో అన్నయ్య దర్శకత్వంలో ‘బంపర్ ఆఫర్’ సినిమా చేసి హిట్ అందుకున్నాడు. కానీ తనయుడు ఆకాష్ పూరి కి మాత్రం హిట్ ఇవ్వలేకపోయాడు. ‘మెహబూబా’ సినిమా ద్వారా తనయుడు పరిచయం అయ్యి హిట్ కొడతారు అనుకున్నారు, కానీ సినిమా గోరా పరాజయం పాలు అయ్యింది. దానికి దర్శకుడు మన పూరీనే. అయితే ఇప్పుడు తనయుడికి హిట్ అవసరం అని చెప్పి, తన నిర్మాణంలో ‘ఛార్మి’ తో కలిసి నిర్మిస్తున్నారు ఒక సినిమాని. ఆ సినిమా పేరు “రొమాంటిక్”, ‘అనిల్ పాదూరి’ దర్శకుడు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్...

నయనతారకి మైనస్..తమన్నాకి కి ప్లస్ అయ్యింది…

నయనతారకి మైనస్..తమన్నాకి కి ప్లస్ అయ్యింది… ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా రోజు రోజుకి జనాల దగ్గరికి రీచ్ అవుతుంది. పబ్లిక్ కూడా బాగా చేస్తున్నారు. సినిమా ఇంకో 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది. మెగా అభిమానులే కాకుండా, సినిమా బాహుబలి, సాహో రికార్డ్స్ ని తిరగ రాయాలి అని అందరూ వేడుకుంటున్నారు. ఇక తారాగణం విషాయానికి వస్తే, భారీ సినిమా కాబట్టి భారీ తారాగణం ఉంటుంది. అందులోనూ కథానాయికల విషయంలో వెనక్కి అడుగు వేయలేం అని ముందే సినిమా యూనిట్ అనగా సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ “ నయనతార “,”తమన్నా” లని సెలెక్ట్ చేసారు. ఇద్దరికి అన్ని పరిశ్రమలో మంచి పేరుంది, ఇదివరకే సినిమాలు బాగా హిట్ అయ్యాయి అని చెప్పొచ్చు. నయనతారకి మాత్రం అంతకు ముందు తీసిన ప్రతి సినిమా హిట్ అయ్యేవి తమిళంలో. అలా అవి తిరిగి తెలుగు, హిందీ లో డబ్బింగ్ లాగ రిలీజ్ చేసేవారు. మరి నయనతారకి కథ చెప్పేటప్పుడు మీకే ఎక్కువ ప్రాధాన్యత అన్నారు, కానీ నయనతార ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. చూసుకుంటే నయనతార ఇప్పటివరకు ప్రొమోషన్ కి రాలేదు, టీం తో కలవలేకపోయింది. ఆ అవకాశాన్ని తమన్నా దక్కించుకుంది. నిజానికి తమన్నా క్యారక్టర్ చిన్నది, నయనతార షూటింగ్...

పాపం సూర్య సినిమా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది?

పాపం సూర్య సినిమా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గజిని, శివపుత్రుడు, వీడొక్కడే వంటి చిత్రాలతో సూర్య తెలుగునాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఒకానొక దశలో సూర్య  సినిమాకు 20 కోట్ల దాకా ఇక్కడ బిసినెస్ జరిగే పరిస్థితి. ఇటీవలే విడుదలైన సూర్య సినిమా బందోబస్త్ చిత్రానికి 10 కోట్ల మేర బిజినెస్ జరిగిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇదే అధ్వాన్నం అనుకుంటే దానికంటే దారుణం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. బందోబస్త్ చిత్రం చాలా తక్కువ అంచనాలతో విడుదలైన విషయం తెల్సిందే. అయితే ఈ చిత్రంలో విషయం లేదని క్రిటిక్స్ తేల్చేశారు. విఐ ఆనంద్ వంటి టాలెంటెడ్ దర్శకుడి నుండి ఇలాంటి ఔట్పుట్ ఏంటని విమర్శకులు దుయ్యబట్టారు. తమిళంలో కూడా ప్లాప్ అయిన ఈ చిత్రం తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం దాదాపుగా ఫుల్ రన్ కి వచ్చేసింది. ఆడిన చోట్ల కూడా మినిమం వసూళ్లు రావట్లేదు. ఈ చిత్రం ఫుల్ రన్ లో కేవలం కోటి 75 లక్షల షేర్ ను రెండు తెలుగు రాష్ట్రాల నుండి వసూలు చేసింది. సూర్య వంటి స్టార్ హీరో తెలుగులో కనీసం 2 కోట్లు కూడా వసూలు చేయలేకపోవడం ని...

గోపీచంద్ కి థియేటర్లు ఇస్తే ఇక అంతే మీ సంగతి…

గోపీచంద్ కి థియేటర్లు ఇస్తే ఇక అంతే మీ సంగతి… మాచో స్టార్ ‘గోపీచంద్’ కి ఇప్పుడు సినిమా హిట్ నిజంగా అవసరం, ఎంతలా అంటే ఇప్పుడు వచ్చే ‘చాణక్య’ సినిమా కనుక హిట్ అవ్వకపోతే జనాలు అతగాడిని పట్టించుకోరు అని ‘ గోపీచంద్ ‘ గారికి తెలిసిన విషయమే. గత సంవత్సరం ‘పంతం’ అంటూ వచ్చిన సినిమా కథ, కథనం పరంగా బాగున్నా కొత్త డైరెక్టర్ కాబట్టి కొద్దిలో తప్పి ప్లాప్ సినిమాగా మారింది. అయితే తన ఫ్యాన్స్ కి ‘చాణక్య’ థియేట్రికల్ ట్రైలర్ చూపించి సినిమా మీద బాగా హైప్ పెంచేసాడు. అందులోను ‘సైరా నరసింహా రెడ్డి’ అక్టోబర్ 02 న విడుదల అవుతుండాగా, చాణక్య 05 వ తారీఖున విడుదల అవుతుంది. మరి చిరంజీవి పోటీగా వస్తున్న గోపీచంద్ పరిస్థితి ఏంటి అని చాలా మంది గుసగుసలాడుతున్నారు. అయితే ఇప్పుడు ‘చాణక్య’ టీం కి ఒక సవాలు వచ్చింది, అది పెద్ద సమస్యే అని చెప్పాలి. విషయానికి వస్తే చాణక్య 05 వ తారీఖున విడుదల అవుతుంది కదా.. మెగా కుటుంబానికి చెందిన సన్నిహితులు థియేట‌ర్ య‌జ‌మానుల‌కు ఫోన్ చేసి ‘చాణక్య‌’కు థియేట‌ర్లు ఇవ్వొద్దు’ అని బెదిరిస్తున్నారని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. పండ‌గ అయ్యేంత వ‌ర‌కూ సైరా సినిమా ఆడాల‌ని.. అలా జ‌ర‌గాలంటే – ‘చాణ‌క...

త్రివిక్రమ్, చిరంజీవి సినిమా గురించి తాజా అప్డేట్

త్రివిక్రమ్, చిరంజీవి సినిమా గురించి తాజా అప్డేట్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత నవంబర్ నుండి కొరటాల శివ సినిమా మొదలవుతుంది. అయితే చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ గురించి ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. అసలు ఉందో లేదో అనేది ఇంకా మెగా ఫ్యాన్స్ కు ఎటువంటి క్లారిటీ లేదు. దీనిపై ప్రస్తుతం చిరంజీవి స్పందించాడు. ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటుందన్న తరహాలోనే చిరంజీవి స్పందించాడు. త్రివిక్రమ్ ఇప్పటికే తనకు ఒక లైన్ వినిపించాడని, అది తనకు నచ్చిందని, పూర్తి స్క్రిప్ట్ వినిపించాక సినిమా ఎప్పుడనేది క్లారిటీ వస్తుందని చిరంజీవి స్పందించాడు. ఈ విషయం తెలియగానే చిరంజీవి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్ అంటేనే ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. ఎంటర్టైన్మెంట్ విషయంలో చిరు రేంజ్ ఏంటనేది స్పెషల్ గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి, త్రివిక్రమ్ సినిమా ఎలా ఉంటుందనే ఊహాగానాలు ఇప్పటినుండే మొదలయ్యాయి. from ...

రామ్ చరణ్ సినిమా గురించి మళ్ళీ లీక్ చేసిన చిరు

రామ్ చరణ్ సినిమా గురించి మళ్ళీ లీక్ చేసిన చిరు ఆ మధ్య రంగస్థలం సినిమా విడుదల సమయంలో ఆది పాత్ర చనిపోయేటప్పుడు రామ్ చరణ్ పలికించిన భావోద్వేగాలు అద్భుతంగా ఉన్నాయంటూ చిరు ముందే లీక్ చేసిన విషయం తెల్సిందే. అయితే అది సినిమాకి హెల్ప్ అయిందనే చెప్పాలి. ప్రేక్షకుడిని ముందే ఆ సీన్ కి ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడింది. ఇప్పుడు కూడా చిరు లీక్ చేసేసాడు. అప్పుడంటే సినిమా విడుదలకు ముందు లీక్ చేసిన చిరంజీవి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు ఇంకా ఆరు నెలలకి పైగా సమయమున్నా కూడా లీక్ చేసేసాడు. ఇంతకీ ఏం చేసాడంటే.. ఆ మధ్య చిరంజీవి, సురేఖతో కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమా సెట్స్ కు వెళ్లారట. అక్కడ ఒక సన్నివేశం కోసం రామ్ చరణ్ శ్రమిస్తున్న తీరుకి వారి గుండెలు బరువెక్కాయట. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ ఆ సమయంలో స్వతంత్ర పోరాటానికి ముందు ప్రిపేర్ అయ్యే సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారట. ఈ లీక్ చిత్రానికి ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూడాలి. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2nHdsyv

తిట్టినోళ్లతోనే పొగిడించుకుంటున్న థమన్

తిట్టినోళ్లతోనే పొగిడించుకుంటున్న థమన్ పోయిన చోటే తిరిగి సంపాదించుకోవడం, తిట్టిన వాళ్ళ చేతే పొగిడించుకోవడం.. ఇవన్నీ ఎంత కిక్ నిస్తాయో ప్రస్తుతం ఎవరికైనా తెలుసా అంటే అది థమన్ కేనని ఘంటాపధంగా చెప్పవచ్చు. మొదట్లో థమన్ సంచలనాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. వరసగా హిట్ ఆల్బమ్స్ అందించడంతో టాప్ రేంజ్ కి చేరుకున్నాడు. అయితే థమన్ సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తున్నా తన మీద విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చేవి. డప్పు మ్యూజిక్ ఎక్కువ కొడతాడని, రొటీన్ మ్యూజిక్ ఉంటుందని, కాపీ కొడతాడని కూడా నానారకాల ట్రోల్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే థమన్ ఈ విషయంలో నిరుత్సాహానికి గురవ్వకుండా, పట్టుదలతో పనిచేసి ట్రోల్స్ నే పొగడ్తలుగా మార్చుకున్నాడు. తనను తాను కొత్తగా రీ ఇన్వెంట్ చేసుకున్నాడు. థమన్ రీసెంట్ గా చేసిన సినిమాలు తొలిప్రేమ, మహానుభావుడు, అరవింద సమేత వంటి సినిమాలతో క్లాస్ మ్యూజిక్ తో అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక రీసెంట్ గా విడుదలైన అల వైకుంఠపురములో చిత్రంలోని సామజవరగమన పాట అయితే శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకుంటోంది. ఆల్రెడీ ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తోంది. from టాప్ స్టోరీస్ – Telugu Mov...

ఇలాంటి పాత్రలతో ఏం ఒరుగుతుంది పూజ?

ఇలాంటి పాత్రలతో ఏం ఒరుగుతుంది పూజ? ఇటీవలే విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రంలో పూజ హెగ్డే కేవలం 20 నిముషాలు మాత్రమే కనిపించే పాత్రలో తళుక్కున మెరిసింది. ఆమె ఉన్నది కాసేపే అయినా ఆమె వల్ల తెగిన టికెట్లు ఎక్కువ. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అందులో వచ్చే ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఒకవేళ ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లేకపోయి ఉంటే గద్దలకొండ గణేష్ ఫలితం ఎలా ఉండేదో ఊహించుకోవడం కష్టం. హరీష్ శంకర్ కు మాస్ పల్స్ బాగా తెలుసనడానికి ఉదాహరణ గద్దలకొండ గణేష్. ఈ సినిమా చూసిన క్రిటిక్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ చిత్రానికి మైనస్ అవుతుందని అంచనా వేశారు. తీరా చూస్తే అదే ఈ చిత్రానికి ప్లస్ గా మారింది. ముఖ్యంగా ఎల్లువొచ్చి గోదారమ్మ పాట రీమిక్స్ చేయడం అనేది సూపర్ గా వర్కౌట్ అయింది. అందులోనూ పూజ హెగ్డే పాత్రకు వచ్చిన రెస్పాన్స్ సూపర్. 20 నిముషాలు కనిపించినా సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపించగలిగింది పూజ. అందుకే ఆమెకు ఇప్పుడు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. అయితే పూజ మాత్రం ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా హౌస్ ఫుల్ 4 లో నటించింది. ట్రైలర్ చూస్తేనే పూజ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదని ఇట్టే అర్ధమైప...

‘అతడు’కి ‘సరిలేరు..’ అంటున్నారే!

‘అతడు’కి ‘సరిలేరు..’ అంటున్నారే! సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని మహేష్ కెరీర్ లోనే కల్ట్ హిట్ గా నిలిచిన అతడు సినిమా స్టోరీని పోలి ఉంటుందని అంటున్నారు. ఆర్మీలో మేజర్ గా పనిచేస్తున్న మహేష్ యుద్ధంలో తన స్నేహితుడు మరణిస్తే ఆ స్నేహితునిగా వెళ్లి విజయశాంతిని కలుస్తాడట. సరిగ్గా అతడులో కూడా ఇదే ఉంటుంది. తన వల్ల చనిపోయిన రాజీవ్ కనకాల ఇంటికి తనలా వెళ్లి అక్కడి వాళ్లతో కలిసిపోతాడు మహేష్ . ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా ఇదే స్టోరీ లైన్ తో ఉంటుందని అంటున్నారు. విజయశాంతికి, మహేష్ స్నేహితుడికి ఉన్న రిలేషన్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అట. విజయశాంతి ఈ చిత్రంలో రాయలసీమ రాజకీయవేత్తగా కనిపించబోతోంది. స్టోరీ రొటీన్ గా అనిపిస్తోంది కానీ మహేష్ బాబు, అనిల్ రావిపూడిపై తన నమ్మకాన్ని ఉంచాడట. కమర్షియల్ హంగులతో సినిమాను జనాలకు నచ్చేలా తీర్చిదిద్దడంలో అతను స్పెషలిస్ట్. ఈ నమ్మకంతోనే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరి నిజంగానే అనిల్ రావిపూడి మ్యాజిక్ చేయగలడా? from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2odtC...

సైరా నరసింహారెడ్డి క్లోజింగ్ బిజినెస్

సైరా నరసింహారెడ్డి క్లోజింగ్ బిజినెస్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. మరో మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. సైరా చిత్రం ఇప్పటికే కంటెంట్ కు సంబంధించి పనులన్నీ పూర్తి చేసుకుని ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది. దాదాపు 240 కోట్లతో తెరకెక్కిన సైరా , బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. అసలు ఒక్కొక్క ఏరియాకి బిజినెస్ ఏ విధంగా జరిగిందో బ్రేక్ డౌన్ ఇక్కడ చూద్దాం. నైజాం 30 కోట్లు సీడెడ్ 22 కోట్లు నెల్లూరు 5.20 కోట్లు కృష్ణా 9.60 కోట్లు గుంటూరు 11.50 కోట్లు వైజాగ్ 14.40 కోట్లు ఈస్ట్ గోదావరి 10.40 కోట్లు పశ్చిమ గోదావరి 9.20 కోట్లు మొత్తం ఆంధ్రా తెలంగాణా 112.30 కోట్లు కర్ణాటక 28 కోట్లు తమిళనాడు 7.50 కోట్లు కేరళ 2.50 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా 27.50 కోట్లు ఓవర్సీస్ 20 కోట్లు వరల్డ్ వైడ్ బిజినెస్ 200 కోట్లు ఈలెక్కన సైరా హిట్ అనిపించుకోవాలంటే పబ్లిసిటీ, ప్రింట్స్ ఖర్చు అన్నీ కలిపి దాదాపు 240 కోట్లు ఖర్చయింది. సో, 240 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా హిట్ అనిపించుకుంటుందన్నమాట. మరి ఏం జరుగుతుందో...

వరుణ్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న హరీష్ శంకర్.. ఈసారి మరింత పెద్దగా

Varun-Tej-and-Harish-Shankar మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా పేరున్న హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాథం తర్వాత మరో సినిమా తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. తాను రాసుకున్న దాగుడుమూతలు స్క్రిప్ట్ ను ఓకే చేయించుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా అది వర్కౌట్ కాకపోవడంతో చివరికి వరుణ్ తేజ్ తో జిగర్తాండ చిత్రాన్ని రీమేక్ చేసాడు. గద్దలకొండ గణేష్ గా విడుదలైన ఈ చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించకపోయినప్పటికీ చాలా దగ్గర్లో ఉంది. ఈరోజో రేపో దాన్ని అందుకోవడం ఖాయం. వరుణ్ తేజ్ తో తొలిసారి పనిచేసిన హరీష్ శంకర్, ఇంప్రెస్ అయిపోయాడట. అందుకే వరుణ్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు స్వయంగా హరీష్ శంకర్ ప్రకటించాడు. “అన్ని భాషల వారిని ఆకట్టుకోగల పర్సనాలిటీ వరుణ్ తేజ్ సొంతం. త్వరలోనే తనతో మరో సినిమా చేయబోతున్నా. అది తెలుగుతో పాటు పలు భాషలలో విడుదలవుతుంది” అని చెప్పాడు. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2nwvuDw

న్యూమరాలజీ ఫాలో అవుతున్న అల వైకుంఠపురములో..

Ala Vaikuntapuramulo స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుండగా నిన్న ఈ చిత్రంలోనుండి మొదటి పాట “సామజవరగమన”ను విడుదల చేసారు. సీతారామశాస్త్రి రచనలో, థమన్ సంగీతం సారధ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన ఈ మెలోడియస్ పాట శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో ఈ పాట పాత రికార్డులను తిరగరాస్తోంది. పాట విడుదలైన 15 గంటల్లోనే ఈ పాట దాదాపు 5 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ పాటతో చిత్రం మీద సరైన అంచనాలు ఏర్పడ్డాయి అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంచితే.. ఈ పాట యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు సినిమా టైటిల్ ను ఇంగ్లీష్ లో Ala Vaikuntapurramulo… ని ఉంది. సరిగ్గా గమనిస్తే ఒక R ఎక్కువగా వాడుతున్నారు. ఈ చిత్రాన్ని ముందు ప్రమోట్ చేసినప్పుడు ఒక R తక్కువగా Ala Vaikuntapuramulo… అని ఉండేది. కానీ ఇప్పుడు R ను చేర్చడం వెనక న్యూమరాలజీ, ఉందని తెలుస్తోంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ చిత్రం కావడంతో గురి తప్పడకూడదని న్యూమరాలజీ కూడా ఫాలో అవుతున్నారన్నమాట. from టాప్ స్టోరీస్ – Telu...

బాడీగార్డ్ ని…క్రూర మృగం లాగ బంధించారు.

బాడీగార్డ్ ని…క్రూర మృగం లాగ బంధించారు. జనరల్ గా ఎప్పుడైనా పలానా హీరోనో, హీరోయినో ఫేమస్ అయితే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కూడా ఫేమస్ అయిపోతారు. ముక్యంగా పెద్ద హీరోల దగ్గర చేసే మానేజర్ దగ్గర నుండి, బాడీ గార్డ్స్ వరకి అందరికి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఆ పెద్ద హీరో ప్రొద్దున్న లేచిన దగ్గరనుండి వారితో మాట్లాడుతారు, కలుస్తారు, మీటింగ్స్ ఏంటి అని అడుగుతారు కాబట్టి ఆ ఫేమస్ అలా పెద్దగా ఏర్పడుతుంది. ముక్యంగా బయటికి పోతే జనసంద్రాన్ని దాటాలంటే బాడీగార్డ్స్ ముఖ్యం. అలా మన బాలీవుడ్ సుల్తాన్ “ సల్మాన్ ఖాన్ ” బాడీ గార్డ్ ఈ రోజు వార్తల్లో నిలిచాడు, అది ఏ విధంగా అంటే….తన మాజీ సెక్యూరిటీ గార్డ్ ‘ఆనస్ ఖురేషి’.ఇతడు వీధుల్లో పడి పాదచారుల్ని కొట్టాడు.. వాహనదారుల్ని పడగొట్టాడు..రాత్రికి రాత్రి రచ్చ, రచ్చ చేశాడు. అతడి వీరంగం వీడియో నెటిజనుల్లో వైరల్ గా మారింది. అతడు అంత దారుణంగా ప్రవర్తించడానికి కారణమేంటి? అంటే.. శ్రుతి మించి డ్రగ్స్ సేవించడమేనని తెలుస్తోంది. అతడు కొన్ని స్టెరాయిడ్స్ ని శరీరంలోకి ఎక్కించుకొని ముంబై లోని మొరాదాబాద్ పరిసరాలకు వెళ్లాడు. అక్కడ నడిరోడ్డున పడి దారిన వస్తున్న వాహనాల్ని ఆపి…వారిని చిత...

రష్మిక తన కెరీర్ ను నాశనం చేసుకుంటోందా?

రష్మిక తన కెరీర్ ను నాశనం చేసుకుంటోందా? రష్మిక మందన్న.. ప్రస్తుతం తెలుగులో టాప్ ఫామ్ లో ఉన్న హీరోయిన్. ప్రస్తుతం మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు, నితిన్ సరసన భీష్మ చేస్తోంది. అల్లు అర్జున్ – సుకుమార్ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. ఇంత బిజీగా ఉండి కూడా రష్మిక ప్రస్తుతం పక్క చూపులు చూస్తోంది. తెలుగులో ఫుల్ డిమాండ్ ఉన్న సమయంలోనే తమిళంలో బిజీ అవ్వాలన్న తన కోరికను బయటపెట్టింది. ప్రస్తుతం కార్తీ సరసన ఒక సినిమా చేస్తున్న రష్మిక .. విజయ్ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు లాబీయింగ్ మొదలుపెట్టింది. కచ్చితంగా ఈమెకే అవకాశం వచ్చేలా ఉందని సమాచారం. దీంతో పాటు అజిత్ తో కూడా నటించాలని ఉందని తన భావాన్ని వ్యక్తపరిచింది. ఇందుకోసమే తెలుగులో రామ్ సినిమా అవకాశం వచ్చినా తోసిపుచ్చింది. తన డేట్స్ ఖాళీగా ఉంటే విజయ్, అజిత్ సినిమాలకు కేటాయించొచ్చని ఆమె భావన. మరి ఆమె ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేక రెండిటికి చెడ్డ రేవడిలా తయారవుతుందో చూడాలి. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2mlOYKR

నాకు యువతని మెప్పించే సినిమాలే కావాలి…

నాకు యువతని మెప్పించే సినిమాలే కావాలి… ‘అర్జున్ రెడ్డి’ తో యావత్ ప్రపంచాన్ని నిద్రలేపాడు ‘ విజయ్ దేవరకొండ ‘. అంతకుముందు వరకి ‘లైఫ్ ఇస్ బ్యూటిఫుల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘పెళ్లి చూపులు’ లాంటి సినిమాలలో మంచిగా పక్కింటి కుర్రాడిలా చలాకీతనంతో తన నటనని కనబరిచి కూల్ గా అనిపించాడు. ఇక ఎప్పుడైతే ‘సందీప్ వంగ’ దర్శకుడితో కలిసి అర్జున్ రెడ్డి తీసాడో, వచ్చే సినిమాలు కూడా అలానే యువతని మేల్కొలపాలి అని దర్శకులకి చెప్తున్నాడు అంటా. సినిమాలు అన్ని అలాగే ఉంటె కష్టం అంటున్నారు దర్శకులు, వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకుండా నాకు యువతని ప్రశ్నించే, లేక యువతని ప్రేరేపించే సినిమాలు తియ్యాలని అంటున్నాడు అంటా. మరి మన దర్శకులు మాత్రం అలాంటి కథలే కావాలంటే కుదరదు అంటున్నారు. తన నెక్స్ట్ సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా లుక్ కూడా అలాగే అర్జున్ రెడ్డి ని పోలివుండటం చూసి విజయ్ సాయి క్రాంతి మాధవ్ కి….తనని రెబల్‌ తరహా పాత్రల్లో చూడ్డానికి యూత్‌ ఇష్టపడుతున్నారు కనుక ఈ చిత్రంలోను గడ్డం పెంచి కనిపించే ఫేజ్‌ ఒకటి వుండాలని ఒప్పించాడని అంటున్నారు సినిమా సభ్యులు. మరి అలా అయితే అప్పుడప్పుడు గీత గోవిందం లాంటి కథలు తెచ్చిన ...

సిద్ శ్రీరామ్ ఓ మెట్టు ఎక్కినట్టేనా?

సిద్ శ్రీరామ్ ఓ మెట్టు ఎక్కినట్టేనా? నాని నటించిన నిన్ను కోరి చిత్రంలోని ‘అడిగా అడిగా’ పాట ద్వారా సిద్ శ్రీరామ్ గురించి తెలుగు శ్రోతలకు తెల్సింది. ఆ వెంటనే ‘ఇంకేం ఇంకేం కావాలె’, అందం అమ్మాయైతే’, ‘మాటే వినదుగా’ వంటి పాటలతో యూత్ లో సెన్సేషన్ అయిపోయాడు. అయితే సిద్ శ్రీరామ్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడినా కానీ తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు మాత్రం పాడలేదు. కారణాలు ఏవైనా కానీ, తన పాటలకు యూట్యూబ్ లో కోట్ల కొద్దీ వ్యూస్ వస్తున్నా సిద్ శ్రీరామ్ ను స్టార్ హీరోలు పట్టించుకోలేదు. సంగీత దర్శకులలో కూడా థమన్, దేవిశ్రీ ప్రసాద్ వంటి వారు సిద్ తో పాడించకపోవడంతో స్టార్ హీరోలకు పాడలేకపోయి ఉండవచ్చు. అయితే ఎట్టకేలకు సిద్, అల్లు అర్జున్ సినిమాకు పాట పాడి టాప్ హీరోలకు పాడడం మొదలుపెట్టాడు. థమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ‘సామజవరగమన’ పాట ఈరోజే విడుదలైంది. ఈ పాట మెలోడియస్ గా ఉంటూ శ్రోతలకు ఇన్స్టంట్ గా ఎక్కేస్తోంది. సిద్ శ్రీరామ్ కు ఉండే పెక్యూలియర్ గొంతు కూడా పెద్ద ప్లస్ అయిందనే చెప్పవచ్చు. అల వైకుంఠపురములో నుండి ఫస్ట్ సింగిల్ గా రిలీజైన ఈ పాట సూపర్ హిట్ అవ్వడం ఖాయం. మరి దీంతోనైనా సిద్ శ్రీరామ్ ను టాప్ హీ...

పండగకి నందమూరి అభిమానులు కాచుకోండి…రెడీ గా ఉండండి…

పండగకి నందమూరి అభిమానులు కాచుకోండి…రెడీ గా ఉండండి… మన అందరికి ఇష్టమైన హీరో అంటే టాలీవుడ్ లో ఎక్కువగా వినపడే పేరు నటసింహం “ నందమూరి బాలకృష్ణ “. సినిమాలు హిట్ అయితే థియేటర్ లో గోల గోల చేస్తారు. అదే సినిమా ఆడకపోయినా కూడా బాలయ్య డైలాగు లు ఎలా చెప్తున్నాడు అని వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. బయట కూడా తాను అభిమానులందరితో చాలా ఖుషీగా ఉంటారు అని కూడా విన్నాం. అడపాదడపా అప్పుడప్పుడు బాలయ్య బాబు నోరు అదుపు తప్పి మాట్లాడటం, అవి బాగా పాపులర్ అవ్వడం కూడా చూసాం, మొతానికి బాలయ్య పేరు అలా మారు మోగిపోతుంది. సినిమాల విషయంలో ఎంతో కేర్ తీసుకునే బాలయ్య తన 105 వ చిత్రం తమిళ దర్శకుడు ‘కేఎస్ రవికుమార్’ గారి దర్శకత్వం లో చేస్తున్నారు, సినిమాకి ‘రూలర్’ అని అనుకుంటున్నారు అని ఫిలిం నగర్ లో చర్చలు జరుగుతున్నాయి. దాదాపుగా ఇదే టైటిల్ ఉండొచ్చు అని కూడా అంటున్నారు సినిమా విడుదల ఎప్పుడనే విషయంపై ఇంకా సమాచారం లేదు కానీ డిసెంబర్ లో రిలీజ్ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ రెడీ అవుతున్నారని సమాచారం. దసరా సీజన్ త్వరలో ప్రారంభం కానుంది కదా..విజయదశమి రోజే ‘రూలర్’ టీజర్ ను రిలీ...

పూజ హెగ్డే ఐరన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్…

పూజ హెగ్డే ఐరన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్… నటిగా అరంగేట్రం చేసిన ఏ భాషలోనూ పూజ హెగ్డే కు పెద్దగా కలిసిరాలేదు. తమిళంలో చేసిన మాస్క్ అట్టర్ ప్లాప్ అయింది. తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద ప్లాపులుగా మిగిలాయి. హిందీలో చేసిన మొహెంజదారో ఎంత పెద్ద డిజాస్టరో అందరికీ తెల్సిందే. వెళ్లిన ప్రతీ భాషలో చేసిన మొదటి సినిమా ప్లాపులుగా మారడంతో ఆమెకు ఐరన్ లెగ్ ముద్ర వేసేసారు జనాలు. అయితే ఇండస్ట్రీ మాత్రం ఆమెను పక్కన పెట్టలేకపోయింది. స్టార్ హీరోయిన్ ఫీచర్లు ఉండటం, కొంచెం పొడుగ్గా ఉండడంతో పొడుగు హీరోల పక్కన సరిగ్గా సెట్ అయ్యేది. అయితే తెలుగులో రీఎంట్రీ చిత్రం దువ్వాడ జగన్నాథం కూడా కమర్షియల్ గా పెద్ద ఆడేసిందేంలేదు. అయితే తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. గద్దలకొండ గణేష్ చిత్రంలో చేసింది చిన్న రోల్ అయినా కోటి పారితోషికం అందుకుంది. వెంటనే అల్లు అర్జున్, మహేష్ బాబు చిత్రాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ రెండూ హిట్ అనిపించుకున్నాయి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్, ప్రభాస్ ల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ కామెడీ సిరీస్ హౌస్ ఫుల్ 4 చిత్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలు...

తండ్రిగా నేను చాలా గర్వపడుతున్న

తండ్రిగా నేను చాలా గర్వపడుతున్న ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో వారసుడిగా నిలదొక్కుకోవడానికి అతని కుమారుడుగా, కుమార్తెగా ఆరంగేట్రం చేస్తారు. ఒక దాని తర్వాత సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. హిట్ వచ్చినా, ఫ్లాప్స్ వచ్చినా తమ నటనతో మెప్పిస్తారు, అభిమానులని సొంతం చేసుకుంటారు. ఒక్క సినిమా రంగంలోనే కాదు క్రీడా రంగంలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ నటుల కుమారులు, కుమార్తెలు. నటుడు మాధవన్ కుమారుడు కూడా అలాంటి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. మాధవన్.ఆర్ కుమారుడు వేదాంత్.ఆర్ అంతర్జాతీయంగా తన సత్తా చాటాడు. అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వేదాంత్.ఆర్ సిల్వర్ మెడల్ (రజత పతకం) దక్కించుకున్నాడు. థాయ్ లాండ్‌లో జరుగుతున్న ఏషియన్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ పోటీల్లో 4×100మీ విభాగంలో వేదాంత్ రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. గతంలో ఇదే థాయ్‌లాండ్ వేదికగా జరిగిన 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మంగ్‌లోనూ వేదాంత్ కాంస్య పతకాన్ని సాధించాడు. 14 ఏళ్ల వయస్సులోనే వేదాంత్ అంతర్జాతీయంగా సత్తా చాటుతుండటం గర్వించదగ్గ విషయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జాతీయ స్థాయిలో జ...

హాస్యనటులు.. హీరోలే కాదు! మెగా ఫోన్ కూడా పట్టబోతున్నారు.

హాస్యనటులు.. హీరోలే కాదు! మెగా ఫోన్ కూడా పట్టబోతున్నారు. హాస్యనటులు అంటే మనం సినిమాల్లో చూసే కొద్దిపాటి కమెడియన్స్ అని కొట్టిపారెయ్యలేం. ఎందుకంటే ఒక్కోసారి వారి క్యారెక్టర్ సినిమాలో బాగుంటే వారికోసం కూడా వెళ్తాము. అలాంటి హాస్యనటులు కూడా ఈ మధ్య హీరోలుగా తమ అదృష్టాన్ని హీరో వేషాలు వేస్తూ పరీక్షించుకుంటూన్నారు. మొన్న శ్రీనివాస్ రెడ్డి, ఆలీ.. నేడు గెట్ అప్ శ్రీను, సుడిగాలి సుధీర్ , మహేష్ ఆచంట. ఇలా వరుసగా ఒక్కొక్క వారం వీళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కొన్ని సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అయితే శ్రీనివాస్ రెడ్డి కథ వేరు. ”గీతాంజలి”, “జయమ్ము నిశ్చ‌య‌మ్మురా”, “ఆనందో బ్రహ్మ” సినిమాలు ఉదాహరణగా చెప్పుకుంటే బాగా నటించాడు సినిమాని హిట్ చేపించాడు అని చెప్పుకోవచ్చు. వాటి తర్వాత వచ్చిన “జంబ లకిడి పంబ” సినిమా గోరమైన పరాజయాన్ని చిత్ర యూనిట్ అందరికి హెచ్చరించింది. అలా హీరోగా కొంచెం చూసి అడుగులు వేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి. అయితే ఇప్పుడు ఏకంగా దర్శక నిర్మాతలుగా మెగా ఫోన్ పెట్టబోతున్నారు. రీసెంట్ గ తన తదుపరి సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసారు. ‘భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గమ్మత్తు’ అని వైవిధ్యంగా సాగ...

నవ్విస్తున్న వాళ్ళు… అర్ధాంతరంగా అనంతలోకాలకు…

నవ్విస్తున్న వాళ్ళు… అర్ధాంతరంగా అనంతలోకాలకు… ఇదివరకు గర్వంగా తెలుగు వాళ్ళు చెప్పుకునేవాళ్ళు.. మాకున్నంత మంది కమెడియన్లు ఇక ఏ భాషలోనూ లేరని. అరడజనుకు పైగా కమెడియన్లు ఇక్కడ విరివిగా సినిమాలు చేసేవారు. అందరినీ నవ్వించేవారు. ప్రతీ సినిమాలోనూ ఆల్మోస్ట్ వీరందరూ ఉండాల్సిందే. దర్శకులు సైతం ఈ కమెడియన్లకు మంచి మంచి పాత్రలు ఇచ్చేవారు. ఒక సినిమాలోనైతే తొమ్మిది మంది కమెడియన్స్ ఫుల్ లెంగ్త్ రోల్స్ వేసి అలరించారు. బ్రహ్మానందం , ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, అలీ, వేణుమాధవ్, తెలంగాణ శకుంతల, కొండవలస, ఆహుతి ప్రసాద్ ఇలా ఎంతో మంది నవ్వించేవారు మనకుండడం మన అదృష్టంగా భావించేవాళ్లు. అయితే ఇదంతా గతం. ఆ నవ్వులు మూగబోతున్నాయి. చాలా తక్కువ వ్యవధిలోనే ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, తెలంగాణ శకుంతల, కొండవలస, గుండు హనుమంతరావు, ఆహుతి ప్రసాద్.. ఇలా అందరూ అర్ధాంతరంగా తనువు చలించినవాళ్ళే. ఇప్పుడు వేణుమాధవ్ కూడా మనందరినీ విడిచి వెళ్ళిపోయాడు. ఇందులో చాలా మంది కెరీర్ లో మంచి ఫ్లోలో ఉన్నప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళే కావడం గమనార్హం. ఇంత మంది కమెడియన్లను కోల్పోయిన తెలుగు సినీ ఇండస్ట్రీ ఇప్పు...

శ్రీముఖికి ఇక ఎదురులేకుండా చేసారుగా

Srimukhi మొదటినుండి బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు చేస్తున్న కంప్లైంట్ ఒకటే. ఈ సీజన్ శ్రీముఖి కి ఎక్కువ ఫేవర్ గా ఉందని. సీజన్ మొదటి నుండి ఆమె ఫుటేజ్ ఎక్కువ టెలికాస్ట్ చేయడం, ఆమెనే ఎక్కువ హైలైట్ చేయడం వంటివి జరుగుతూ వచ్చాయి. అయితే అనుకోకుండా అలీ రెజా ఎలిమినేట్ కావడం, ‘ఆ నలుగురు’గా గ్రూప్ అయిన వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్ గ్రూప్ గా చాలా స్ట్రాంగ్ అవడంతో శ్రీముఖి గత వారం బాగా డల్ అయిపోయింది. అయితే ఇక్కడే బిగ్ బాస్ తన స్ట్రాటజీని అమలు చేసినట్లు తెలుస్తోంది. ఎటువంటి ఓటింగ్ లేకుండా అలీ రెజాను వైల్డ్ కార్డు పేరుతో ఇంట్లోకి పంపడంతో శ్రీముఖి కొండంత బలం వచ్చినట్లైంది. దానికంటే ముందు ఇటుకుల టాస్క్ లో ‘ఆ నలుగురు’ మధ్య గొడవై ఈ గ్రూప్ విడిపోవడం కూడా శ్రీముఖికి ప్లస్ అయింది. దీంతో నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో శ్రీముఖిని ఎదురించే వారే లేకుండా పోయారు. కనీసం తనను కదపడానికి కూడా ఎవరూ సాహసించలేదు. రాహుల్ , పునర్నవి కూడా శ్రీముఖి కెప్టెన్సీకి సపోర్ట్ చేసారు. ఇప్పుడు శ్రీముఖి కెప్టెన్ కావడంతో ఒక వారం రోజుల పాటు ఆమెకు ఎదురులేదు. అప్పటికి ఇంట్లోంచి ఇద్దరు వెళ్ళిపోతారు. మొత్తానికి శ్రీముఖికి బిగ్ బాస్...

పొద్దున్న.. మధ్యాహ్నం.. సాయంత్రం.. టీజర్లు

పొద్దున్న.. మధ్యాహ్నం.. సాయంత్రం.. టీజర్లు నటుడు, దర్శకుడు “రవి బాబు” సినిమాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. మొదట కామెడీ ని నమ్ముకున్న రవి గారు నెమ్మదిగా సస్పెన్స్ థ్రిల్లర్, సైకో థ్రిల్లర్, హారర్ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అలా అందరు తన సినిమాల కోసం తపించేలా చేసాయి. కొంతకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న రవి బాబు కి “ఆవిరి” ఏ విధంగా హెల్ప్ చేస్తుందో చూద్దాం. గతంలో లడ్డు బాబు, అవును 2, అదుగో సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలి అని గట్టిగా ‘ ఆవిరి ‘ సినిమా మీద భారీ ఆశలతో ఉన్నాడు. ఎక్కడైనా సినిమా ట్రైలర్ అంటే ఒకటి రిలీజ్ చేస్తారు కానీ రవి బాబు గారు పొద్దున్న ట్రైలర్ 1, మధ్యాహ్నం ట్రైలర్ 2, సాయంత్రం ట్రైలర్ 3 ప్లాన్ చేసారంటా. మొత్తానికి ఈ సారి కూడా సినిమా ప్రమోషన్ విషయంలో ఎప్పటిలాగానే తన పంధా మార్చుకోకుండా తన స్టైల్ లో చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు ఫిలిం నగర్లో. సినిమాకి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహిస్తున్నారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ నిర్మాతలుగా సినిమాని నిర్మిస్తున్నారు. రవి బాబు , నేహా చౌహన్, శ్రీ ముక్త ,భరణి శంకర్, ముఖ్తర్ ఖాన్ ఇతర తారాగణ...