Skip to main content

Posts

Showing posts from December, 2018

టాలీవుడ్ పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

టాలీవుడ్ పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తోంది టాలీవుడ్ . ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలరించేలా వార్తలను అందిస్తూ మీ ముందుకు వస్తున్న మాకు ఇంతకుముందు లాగే మరింత ఆదరణ లభిస్తుందని ఆశిస్తూ …… ఈ ఏడాది మీకు సుఖ , సంతోషాలను అందించాలని కోరుకుంటోంది టాలీవుడ్ డాట్ నెట్ . Subscribe to my channel « Prev 1 / 11 Next » విజయ్ దేవరకొండ పెళ్లెప్పుడంటే - Vijay Deverakonda | Marriage - Tollywood మహేష్ బాబు కు ఐటీ శాఖాధికారుల షాక్ - Mahesh Babu | GST - Tollywood స్టార్ హీరోలను అవమానించిన త్రివిక్రమ్ - Trivikram Srinivas | Vinaya Vidheya Rama - Tollywood రాజమౌళి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హీరోలు - S S Rajamouli | Karan Johar - Tollywood ఎక్స్ పోజింగ్ తో చంపేస్తున్న కృష్ణ ష్రాఫ్ - Krishna Shroff | Jackie Shroff | Tollywood టిడిపి లీడర్ నెల్లి సాదురావ్ రాసలీలలు - Nelli Sadhu Rao | TDP Leader - Tollywood « Prev 1 / 11 Next » from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http:...

సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘మహర్షి’ సెకండ్‌ లుక్‌ విడుదల

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని చాలా పెద్ద స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్‌ లుక్‌ను నూతన సంవత్సర కానుకగా డిసెంబర్‌ 31 సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేశారు. ఈ చిత్ర షూటింగ్‌ భారీ ఎత్తున జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో షెడ్యూల్‌ పూర్తయింది. జనవరి రెండో వారం నుంచి మార్చి వరకు జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కామెడీ కింగ్‌, హీరో అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ తారాగణం నటిస్తోన్న ఈ ‘మహర్షి’ చిత్రం హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్‌ మూవీకి కె.యు.మోహనన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు....

`నేను లేను` ట్రైలర్ కు 1 మిలియన్ వ్యూస్

ఓ.య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ` నేను లేను `. `లాస్ట్ ఇన్ లవ్` అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరో. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలె విడుదలై వన్ మిలియన్ వ్యూస్ ను అందుకుంది. ఫిబ్రవరి 1 విడుదలవుతున్న ఈ చిత్రం గురించి ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ -“ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ కి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. 1 మిలియన్ వ్యూస్ ను మా ట్రైలర్ రీచ్ అయింది.రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా థ్రిల్లింగ్ కాన్సెప్టుతో తీసిన సినిమా ఇది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్ర‌వ‌రి 1 సినిమాను విడుదల చేస్తున్నాం. ఇండియన్ సినిమా స్క్రీన్ పై ఇప్పటివరకు రానీ చూడని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రమిద‌ని అన్నారు. హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్య...

‘అల్లు అర్జున్’, ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో చిత్రం జనవరి లో ప్రారంభం:

స్టైలిష్ స్టార్ ‘ అల్లు అర్జున్ ’  మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘ త్రివిక్రమ్ ’ ల కాంబినేషన్ లో  మరో చిత్రం రూపుదిద్దుకోవటానికి సన్నద్ధమవుతోంది. హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19 వ చిత్రం కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ చిత్రం. ‘ జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి ’ చిత్రాల విజయాల నేపథ్యంలో  ముచ్చటగా మూడోసారి  తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాలలోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో  ఉన్నాయి. వీటిని నిజం చేసే దిశగా  సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘ గీతాఆర్ట్స్ ’  అధినేతలు  అల్లు అరవింద్ ,   ఎస్. రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే మరో ప్రకటనలో అధికారికంగా మీడియా వారికి తెలియజేయటం జరుగుతుంది. 2019 జనవరిలో చిత్రం ప్రారంభ మవుతుందని, అందరికీ 2019 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు చిత్ర న...

మందు పార్టీలో మహేష్ బాబు

కొత్త సంవత్సర వేడుకల కోసం కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన మహేష్ అక్కడ తన మిత్రులతో కలిసి మందు పార్టీలో మునిగి తేలుతున్నాడు . ఫ్యామిలీతో ఫారిన్ వెళ్లిన మహేష్ బాబు కి గట్టి షాక్ ఇచ్చింది ఐటీ శాఖా అయితే ఆ షాక్ నుండి ఇంకా మహేష్ బాబు తేరుకోలేదు కానీ వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి కాబట్టి ఆ పని చేస్తున్నాడు . ఇక ఈరోజు న్యూ ఇయర్ పార్టీ హడావుడి అంతా దుబాయ్ లోనే అని ట్వీట్ చేసాడు మహేష్ బాబు . తన మిత్రులతో కలిసి మందు పార్టీలో మునిగిన మహేష్ అంతకు ముందే ఫోటోలకు ఫోజిచ్చి ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టేసాడు . మహేష్ ని ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ ఫోటో వైరల్ అవ్వడం ఖాయం . న్యూ ఇయర్ వేడుకల తర్వాత తిరిగి ఇండియాకు తిరిగి రానున్నాడు మహేష్ బాబు . వచ్చాక మహర్షి చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉంటాడు . ఏప్రిల్ 5 న మహర్షి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . English Title: Mahesh babu enjoying liqueur party in dubai from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2AjTvkA

ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీ రిలీజ్ బిజినెస్

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ” ఎన్టీఆర్ బయోపిక్ ”. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందిన విషయం తెలిసిందే . అయితే మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని జనవరి 9న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ఎనలేని క్రేజ్ రావడంతో ఈ సినిమాని కొనడానికి బయ్యర్లు పోటీ పడ్డారు . దాంతో బిజినెస్ బ్రహ్మాండంగా జరిగింది . ఏరియాల వారీగా ఎన్టీఆర్ కథానాయకుడు చేసిన బిజినెస్ ఓసారి చూద్దామా ! నైజాం – 13. 50 కోట్లు సీడెడ్ – 12 కోట్లు ఉత్తరాంధ్ర& కృష్ణా – 11. 40 కోట్లు గుంటూరు – 6 కోట్లు నెల్లూరు – 2. 50 కోట్లు ఈస్ట్ – 5. 40 కోట్లు వెస్ట్ – 4. 20 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా – 6. 30 కోట్లు ఓవర్ సీస్ – 10 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం : 71. 30 కోట్లు . ఇవి కాకుండా శాటిలైట్ , డిజిటల్ , డబ్బింగ్ రైట్స్ కలుపుకుంటే వంద కోట్ల బిజినెస్ ఒక్క ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రమే చేసింది . ఇక రెండో భాగం ఉండనే ఉంది . అది ఎన్ని కోట్లు చేస్తుందో ఈ విజయం పై ఆధారపడి ఉంది . English Title: NTR Kathanayakud...

2018 లో హాట్ భామలు -హిట్ భామలు

సమంత : రంగస్థలం చిత్రంలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల నీరాజనాలను అందుకున్న భామ సమంత . పల్లటూరి అమ్మాయిగా అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూనే అందాల ప్రదర్శన కూడా చేసి మెప్పించింది సమంత . అలాగే యు టర్న్ , అభిమన్యుడు చిత్రాలతో కూడా హిట్ కొట్టింది . పాయల్ రాజ్ పుత్ : ఆర్ ఎక్స్ 100 చిత్రంలో శృంగార సన్నివేశాల్లో నటించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ పాయల్ రాజ్ పుత్ . శృంగార దేవతగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన పాయల్ ఒక్క సినిమాతోనే ఊహించని స్టార్ డం అందుకుంది . కైరా అద్వానీ : మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో  నటించి మంచి మార్కులు కొట్టేసింది . నటన తోనే కాకుండా అందాల విందుతో కుర్రకారుని ఆకట్టుకుంటోంది కియారా . ఆ సినిమా ఇచ్చిన హిట్ తో మరిన్ని ఛాన్స్ లు కొట్టేసింది . రష్మిక మందన్న : ఛలో చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ కన్నడ భామ గీత గోవిందం చిత్రంతో భారీ హిట్ కొట్టింది . ఒకే ఏడాదిలో రెండు హిట్స్ కొట్టి సంచలనం సృష్టించింది . అదితిరావు హైదరీ : సమ్మోహనం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన భామ అదితిరావు హైదరీ . తన నటనతో టాలీవుడ్ ని ఆకర్షించిన ఈ భామ ఈ ఏడాది అంతరిక్షం తో కూడా ప్రేక్షకుల ముం...

మహేష్ బాబుకు ఘోరమైన అవమానం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఘోరమైన అవమానం జరిగింది . ఐటీ శాఖాధికారులు మొత్తంగా 73. 5 లక్షలను ఫైన్ తో సహా వసూల్ చేసారు అది కూడా మహేష్ బాబు నేరుగా ఇవ్వకుండానే ! సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఇటీవలే జరిగింది . 2007 – 2008 సంవత్సరానికి గాను 18. 5 లక్షల జి ఎస్ టి పన్ను కట్టాలట మహేష్ బాబు . అయితే ఆ పన్ను సకాలంలో కట్టకపోవడంతో పదేళ్లుగా 18 లక్షలకు ఫైన్ వేస్తూనే ఉన్నారు . పదేళ్ల కాలానికి అసలు 18. 5 లక్షలకు ఫైన్ వేసి మొత్తంగా 73. 5 లక్షలను వసూల్ చేసారు . మొదట మహేష్ బాబు బ్యాంక్ ఖాతాలను జప్తు చేసారు , ఆ తర్వాత మహేష్ తో సంబంధం లేకుండానే 42 లక్షలను మహేష్ ఖాతాలోంచి తీసుకున్నారు యాక్సిస్ బ్యాంక్ ద్వారా . ఇక మిగిలిన 31. 5 లక్షలను ఐసిఐసిఐ బ్యాంక్ నుండి తీసుకున్నారు . దాంతో మహేష్ బాబు నుండి మొత్తం సొమ్ము ని రికవరీ చేసినట్లయింది . ఒకవైపు మహేష్ బాబు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నాడు కానీ ఈలోగా మహేష్ కు అనుకూలంగా కోర్టు తీర్పు లేదని భావించిన ఐటీ అధికారులు మహేష్ భారత్ లో లేని సమయంలో ఖాతాలను సీజ్ చేయడమే కాకుండా డబ్బు కూడా తీసుకున్నారు . అంటే అతడు కు ఇది ఘోరమైన అవమానమే ! English Title: IT officials ins...

ఒక్కరు కాదు ఈ భామకు ఇద్దరు కావాలట

మహానటి లో నటించిన కీర్తి సురేష్ కు భర్తగా వచ్చేవాడిలో ఇద్దరు హీరోల వ్యక్తిత్వాలు ఉండాలట ! అంటే ఒక్కరు కాదు ఇద్దరు కావాలట ఈ భామకు . ఆ హీరోలు ఎవరయ్యా అంటే ……. విజయ్ – విక్రమ్ ల లాంటి హీరోల వ్యక్తిత్వం కలిగిన వాడు నాకు భర్తగా లభిస్తే అదృష్టం అంటూ అసలు విషయాన్నీ చెప్పేసింది కీర్తి సురేష్ . అయితే ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదట కానీ ఒకవేళ పెళ్లి చేసుకునే సమయం వస్తే తనకు తమిళ హీరోలైన విజయ్ – విక్రమ్ ల లాంటి వాడు భర్తగా రావాలని అంటోంది . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది కీర్తి సురేష్ అయితే ఈ భామకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది మాత్రం మహానటి చిత్రం మాత్రమే ! ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని కూడా చెప్పింది . మహానటి తర్వాత అటు తమిళంలోనూ ఇటు తెలుగులోను మంచి అవకాశాలు వస్తున్నాయి . తాజాగా ఆర్ ఆర్ ఆర్ అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశం ఈ భామకు వచ్చినట్లు తెలుస్తోంది అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . English Title: Keerthy suresh opens about her marriage from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2EW9kC0

జై బాలయ్య అని అరిచిన ఎన్టీఆర్

జై బాలయ్య … …. జై జై బాలయ్య అంటూ నినాదాలు ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ . తాజాగా ఈ హీరో రాజస్థాన్ లోని జైపూర్ కు వెళ్ళాడు . అక్కడ రాజమౌళి – రామా రాజమౌళి ల తనయుడు కార్తికేయ వివాహ వేడుకల్లో పాల్గొన్నాడు , ఈ వేడుకలలో ఎన్టీఆర్ మాత్రమే కాకుండా పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు . కాగా ఆ వేడుకలో జై బాలయ్య అని ఎన్టీఆర్ అనగానే మిగతా వాళ్ళు కూడా జై బాలయ్య అని అరవడం , మళ్ళీ ఎన్టీఆర్ జై జై బాలయ్య అని గట్టిగా అరిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . కొన్నాళ్లుగా బాలయ్య బాబాయ్ తో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నాడు ఎన్టీఆర్ అయితే హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం మళ్ళీ ఒక్కటయ్యింది . ఇటీవలే ఎన్టీఆర్ బాలయ్య బాబాయ్ నటించిన బయోపిక్ వేడుకకు హాజరయ్యాడు . ఆ వేడుకలో బాలయ్య బాబాయ్ పై తనకున్న ప్రేమని , అభిమానాన్ని చాటుకున్నాడు . కట్ చేస్తే ఇప్పుడు జైపూర్ లో పెళ్లి వేడుకలో జై బాలయ్య , జై జై బాలయ్య నినాదాలతో హోరెత్తించాడు . English Title: NTR says jai balayya …. jai jai balayya from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Ti...

మహేష్ బాబు కి మరో షాక్ తగిలింది

ఇప్పటికే మహేష్ బాబు కి జి ఎస్ టి రూపంలో షాక్ మీద షాక్ తగిలింది , ఇంకా ఆ షాక్ నుండి తేరుకోక ముందే మరో షాక్ తగిలింది మహేష్ బాబు కు . తాజాగా మహేష్ బాబు మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఎవరో కావాలని లీక్ చేసారు . మహర్షి చిత్రంలోని సన్నివేశాలు లీక్ అయ్యాయని తెలుసుకున్న చిత్ర బృందం చాలా షాక్ అయ్యారు . వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాటిని సోషల్ మీడియాలో స్ప్రెడ్ కాకుండా జాగ్రత్త పడ్డారు . అయితే అప్పటికే కొంతమంది షేర్ చేస్తూ వైరల్ అయ్యేలా చేసారు. జి ఎస్ టి పన్ను కట్టలేదు అంటూ మహేష్ బాబు బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసిన ఐటీ అధికారులు 42 లక్షలను డ్రా చేసుకున్నారు కూడా . దిల్ రాజు , అశ్వనీదత్ , పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న మహర్షి చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది . ఇక ఈ సినిమాని 2019 ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . English Title: Another shock to Mahesh babu from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/...

టెంపర్ అక్కడ రిలీజ్ అయ్యింది కానీ …..

2015 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . అవినీతి పరుడైన ఓ పోలీస్ అధికారి చివరకు నీతి నిజాయితీల కోసం ఎలా పోరాడాడు అన్నది కథ . కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి . కట్ చేస్తే ఆ సూపర్ హిట్ చిత్రాన్ని బాలీవుడ్ లో ” సింబా ” పేరుతో రీమేక్ చేసారు . హీరోగా రణ్ వీర్ సింగ్ నటించాడు . నిన్ననే విడుదల అయ్యింది కూడా . ఎన్టీఆర్ స్థాయిలో కాకపోయినా రణ్ వీర్ సింగ్ కూడా బాగానే పోషించాడు ఆ పాత్రని . అయితే కథలో మెయిన్ కంటెంట్ టెంపర్ స్థాయిలో లేకపోవడంతో టెంపర్ స్థాయిలో సింబా హిట్ అవుతుందా ? అన్నది ప్రశ్నగా మారింది . రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సింబా కు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ ఏది లేదు దాంతో ఈ సినిమా విజయం సాధించవచ్చు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . అయితే ఎన్టీఆర్ స్థాయిలో , టాలీవుడ్ టెంపర్ స్థాయిలో సింబా లేదన్నది మాత్రం వాస్తవం . English Title: Simmba bollywood movie review from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Q77gbj

ఇన్ కమ్ టాక్స్ వివాదం పై మహేష్ బాబు స్పందన

జి ఎస్ టి కమిషనరేట్, హైదరాబాద్ వారు, కోర్ట్ పరిధిలో ఉన్న 18 లక్షల 50 వేల రూపాయల  పన్నుని వడ్డీతో కలిపి  73 లక్షల 50 వేలు గా నిర్ణయించి బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించారు. 2007 – 08 ఆర్ధిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సర్వీసెస్ కి ఈ పన్ను చెల్లించాలని వారు నిర్ణయించారు. వాస్తవానికి ఆ కాలంలో  అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి టాక్స్ పరిధిలోకి రాదు.   అంబాసిడర్ సర్వీసెస్ ని టాక్స్ పరిధిలోకి సెక్షన్ 65 (105) (zzzzq ) ద్వారా 01 -07 -2010 నుండి చేర్చడం జరిగింది. టాక్స్ పేయర్ చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా, పైగా ఈ విషయం ఇంకా కోర్ట్ పరిధిలో ఉన్నప్పటికీ  జి ఎస్ టి కమిషనరేట్ బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించడం జరిగింది. మహేష్ బాబు చట్టానికి కట్టుబడే పౌరునిగా తన పన్నులన్నిటినీ సక్రమంగా చెల్లించారు. —- లీగల్ టీం ఆఫ్ జి.మహేష్ బాబు English Title: Mahesh Babu about Income Tax Returns from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2VeipLj

నష్టపోయి అమ్మాడా ? లేక ……

దర్శకులు వివివినాయక్ తాజాగా విశాఖపట్టణం లో ఉన్న తన థియేటర్ లను అమ్మేశాడు దాంతో ఆర్ధికంగా నష్టాల్లో ఉండి అమ్ముకున్నాడా ? లేక పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయని అమ్మాడా ? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు . అయితే దర్శకుడిగా వివివినాయక్ కు అంతగా కాలం కలిసి రావడం లేదు . గతకొంత కాలంగా ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందినవే ! ఒక్క ఖైదీ నెంబర్ 150 తప్ప . బాలయ్య తో సినిమా అనుకున్నాడు , ఆశపడ్డాడు కానీ కుదరలేదు . బాలయ్య తాజాగా బోయపాటి శ్రీను తో తన తదుపరి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఇక వినాయక్ థియేటర్ ల విషయానికి వస్తే …… దర్శకుడిగా సంచలనం సృష్టిస్తున్న రోజుల్లో బాగా డబ్బులు రావడంతో విశాఖ లోని థియేటర్ లను కొని వాటిని ఆధునీకరించి ” వి మ్యాక్స్ ” గా నామకరణం చేసాడు . అయితే తాజాగా ఓ పెద్ద మాల్ వస్తున్న నేపథ్యంలో వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడంతో వాళ్లకు తన థియేటర్ లను అమ్మేసాడట . English Title: Director vv vinayak sold his theatres in vizag from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2V9umC5