Skip to main content

Posts

Showing posts from November, 2018

సీనియర్ బుష్ కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ (94 ) కన్నుమూశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు 41 వ అధ్యక్షుడు గా పనిచేశారు. 12 జూన్ 1924 న జన్మించిన జార్జ్ డబ్ల్యూ బుష్ 1989 నుండి 1993 వరకు అమెరికా అధ్యక్షుడు గా సేవలందించాడు. అంతకుముందు 1981 నుండి 1989 వరకు అమెరికా ఉపాధ్యక్షుడు గా పనిచేశారు బుష్. సీనియర్ బుష్ మరణంతో అగ్ర రాజ్యం అమెరికా లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీనియర్ బుష్ మరణం పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాధి నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. జార్జ్ బుష్ కుటుంబం అమెరికా అభివృద్ధి కి అంకితం అయ్యింది. సీనియర్ బుష్ అధ్యక్షుడు గా ఉన్న కాలంలోనే పలు సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కొని అమెరికాకు సరికొత్త జీవ సత్వాలను అందించాడు. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EaQB5g

బట్టలు విప్పేసి పెళ్లి చేసుకుంటారట

పెళ్లిళ్లు రకరకాలుగా చేసుకుంటున్నారు . ఒక్కో మనిషి ఒక్కో రకంగా ఆలోచిస్తూ వెరైటీ గా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఎప్పటికప్పుడు రకరకాల వింత పెళ్లిళ్లు చూస్తూనే ఉన్నాం అయితే అవన్నీ ఒక ఎత్తు వివాదాస్పద భామ రాఖీ సావంత్ చేసుకోవాలనుకుంటున్న పెళ్లి వేరు ఎందుకో తెలుసా ……. బట్టలు విప్పేసి నగ్నంగా పెళ్లి చేసుకుంటారట . అవును ఈ మాటలు స్వయంగా రాఖీ సావంత్ ని చేసుకోబోయే వాడు అన్నాడు దానికి రాఖీ కూడా ఒప్పుకుంది . ఇద్దరం కలిసి నగ్నంగా పెళ్లి చేసుకుందాం అంటూ కొత్త ప్రతిపాదన తో అందరికీ షాక్ ఇస్తున్నారు . ఇంతకీ రాఖీ సావంత్ చేసుకునేది ఎవరినో తెలుసా ….. సోషల్ మీడియా లో ఫేమస్ అయిన దీపక్ కళాల్ ని . రాఖీ ని పెళ్లి చేసుకోబోతున్న ఆనందంలో రకరకాలుగా వేషాలు వేసుకొని వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టాడు . ఇక పెళ్లి వంతు వచ్చేసరికి మనిద్దరం నగ్నంగా మారి పెళ్లి చేసుకుందాం కాకపోతే నువ్ రెండు అరటి పళ్ళు మాత్రం ముందు ఒకటి వెనక ఒకటి పెట్టుకోవాలి అనే కండీషన్ పెట్టాడు . దానికి రాఖీ సావంత్ కూడా ఒప్పుకుంది . అదన్న మాట బట్టలు విప్పి పెళ్లి చేసుకొని వార్తల్లోకి ఎక్కాలని చూస్తున్నారు రాఖీ సావంత్ – దీపక్ కళాల్ . English...

ఎన్టీఆర్ కేసీఆర్ కు భయపడ్డాడా ?

అక్క కూకట్ పల్లి లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తోంది అయితే అక్క కోసం ఎన్టీఆర్ ఇంతవరకు ప్రచారం చేయలేదు . దాంతో కేసీఆర్ కు భయపడి ఎన్టీఆర్ ప్రచారానికి దూరమయ్యాడు అని విమర్శలు వినిపిస్తున్నాయి . ఎన్టీఆర్ కు ఒకవేళ చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే తెలంగాణ లోని ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేయొద్దు కానీ అక్క కోసమైనా కూకట్ పల్లి లోనైనా ప్రచారం చేయాలి కదా ! కానీ అలా ఎన్టీఆర్ ప్రచారం చేయడం లేదు . పోనీ అక్క పోటీ చేయడం ఇష్టం లేకపోతె …… చంద్రబాబు నాయుడు అంటే కోపం ఉంటే అసలు అక్క చేత నామినేషన్ వేయించకూడదు . అక్క సుహాసిని నామినేషన్ వేయడమే కాకుండా నా తమ్ముళ్లు నాకోసం ప్రచారానికి వస్తారని పదేపదే చెబుతోంది కానీ తమ్ముళ్ల జాడ మాత్రం కానరావడం లేదు . మరోవైపు ప్రచారం కూడా గడువు ముగుస్తోంది , అయినా ఎన్టీఆర్ వైపు నుండి ఎలాంటి ప్రకటన లేదు దాంతో కేసీఆర్ కు భయపడి ప్రచారానికి రావడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి . తెలంగాణ లో తెలుగుదేశం పని అయిపొయింది కాబట్టి కేసీఆర్ తో పెట్టుకోవడం ఎందుకు ? ఇబ్బంది పడటం ఎందుకు ? అన్న భావనలో ఉండి ఉంటాడు ఎన్టీఆర్ . English Title: NTR feared with kcr from టాప్ స్టోరీస్ – Telug...

కేటీఆర్ సభలో ఆత్మహత్యా యత్నం

తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ సభలో ఆత్మహత్యా యత్నం కలకలం సృష్టించింది . నేరెళ్ల బాధితులు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ సభలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసారు అయితే పోలీసులు వాళ్ళని అడ్డుకోవడంతో ఒంటిమీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు కోల హరీష్ అనే వ్యక్తి . హరీష్ తో పాటుగా పెంట బానయ్య ని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన నిన్న తంగళ్లపల్లి లో జరిగింది . నేరెళ్ల సంఘటన యావత్ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . అప్పటి నుండి బాధితులకు సరైన న్యాయం జరగడం లేదు దాంతో మరోసారి తమ బాధని వ్యక్తం చేయడానికి కేటీఆర్ సభని వినియోగించుకున్నారు బాధితులు . నేరెళ్ల గ్రామం సిరిసిల్ల నియోజకవర్గం లోనిదే కావడం విశేషం . కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . నీతి , న్యాయం గురించి గొంతు చించుకొని మాట్లాడే కేటీఆర్ మమ్మల్ని పట్టించుకోవడం లేదని , అణగదొక్కేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు . English Title: Nerella victim suicide attempt at ktr from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | T...

అక్కకు నాన్న లేరు ,తమ్ముళ్లు రారు

అక్క నందమూరి సుహాసిని కి నాన్న హరికృష్ణ లేడు , ఆయనే బ్రతికుంటే కూతురు కోసం మరోసారి చైతన్య రథసారధి అయి ప్రచారం చేసేవాడు , గెలిపించేవాడు కానీ నాన్న లేడుగా అందుకే నందమూరి సుహాసిని ఒంటరి పోరాటం చేస్తోంది ఇద్దరు తమ్ముళ్లు అందునా హీరోలైన తమ్ముళ్లు ఉండి కూడా . అక్క కోసం ప్రచారానికి ఎందుకు వస్తారు వాళ్ళు రారు !…… వాళ్లకు వాళ్ళ డబ్బు , కెరీర్ మాత్రమే ముఖ్యం , కేసీఆర్ తో పెట్టుకుంటే పగబట్టి వాళ్ళని వేధిస్తాడేమో అన్న భయం కావచ్చు ….. …. చంద్రబాబు నాయుడు మీద కోపం కావచ్చు ఏది ఏమైనా అక్క కు నాన్న లేడు తమ్ముళ్లు రారు , ఇది నందమూరి సుహాసిని పరిస్థితి . నందమూరి సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ కి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా హరికృష్ణ కూతురు ని కూకట్ పల్లి నుండి రంగంలోకి దింపిన విషయం తెలిసిందే . అయితే సుహాసిని కి మద్దతుగా ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ప్రచారం చేస్తారని వార్తలు వచ్చాయి కానీ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఎన్నికల ప్రచారానికి మాత్రం రాలేదు . English Title: NO Father ,No Brothers for Nandamuri Suhasini from...

తెలంగాణ ఎన్నికల్లో గెలిచేది ఎవరు ?

from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ADqpMr

తెలంగాణలో లగడపాటి జోస్యం ఎలా ఉందంటే

తెలంగాణలో ఎన్నికలు సమీపించిన తరుణంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పాడు . అయితే మొత్తం ఫలితాలపై నోరు మెదపలేదు కానీ సంచలన ఫలితాలు మాత్రం రాబోతున్నాయని స్ఫష్టం చేసాడు . తెలంగాణ మొత్తం మీద 8 నుండి 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధిస్తారని అందులో ఇద్దరినీ శాంపిల్ గా ప్రకటించాడు లగడపాటి . ఇంతకీ తెలంగాణ ఎన్నికల్లో గెలిచే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరో తెలుసా …….. నారాయణ్ పేట్ లో శివకుమార్ రెడ్డి , బోధ్ లో అనిల్ జాదవ్ . ఈరోజు ఈ ఇద్దరినీ ప్రకటించాడు . వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అయితే టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు . ఇంతేకాదు ప్రతీ రోజు కి ఇద్దరి అభ్యర్థుల చొప్పున వెల్లడిస్తానని కూడా ప్రకటించాడు . తెలంగాణ లో ఎవరు గెలవబోతున్నారు అన్నది మాత్రం ఇప్పుడే చెప్పనని డిసెంబర్ 7న వెల్లడిస్తానని , ఇంకా నా మనుషులు సర్వే చేస్తూనే ఉన్నారని సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని అంటున్నాడు లగడపాటి . అంటే ఏతా వాతా చెప్పేదేంటంటే కేసీఆర్ ఓడిపోతున్నట్లు ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నాడన్న మాట లగడపాటి . English Title: Lagadapati Rajagopal comments...

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు . తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఎంతగా చెప్పినా , ఎంతగా మొత్తుకున్నా ప్రయోజనం లేకపోవడంతో పోలీసుల వైఖరికి , ప్రభుత్వ వైఖరికి నిరసనగా రెండు రోజుల పాటు ప్రచారం చేయకూడదనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి . కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పట్ల నిరంకుశ వైఖరి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . దాంతో ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ వ్యవహారశైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నాడు . ప్రచారం కోసం ప్రజల వద్దకు వెళ్తున్నానని , అయితే నన్ను అంతం చేయడానికి పెద్ద కుట్ర చేసారని అందుకే తగిన రక్షణ కల్పించాల్సిందిగా కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అందుకే ప్రచారాన్ని వాయిదా వేసుకున్నానని అంటున్నాడు . డిసెంబర్ 7 న పోలింగ్ దాంతో మరో అయిదు రోజుల పాటు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది కాబట్టి ఇది కీలకం కానీ కీలకమైన సమయంలో ప్రచారం చేయకుండా హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నాడు రేవంత్ రెడ్డి . మరి ఈ ఆరోపణలపై తెలంగాణ పోలీసులు , ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి . English Title: Revanth reddy Taken sensational decisi...

సిద్దార్థ్ విలన్ గా ఒప్పుకున్నట్లేనా

విక్రమ్ కుమార్ సినిమాలో నాని నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాగా ఆ చిత్రంలో కీలక పాత్రలో విలన్ గా నటించడానికి హీరో సిద్దార్థ్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది . హీరోగా సిద్దార్థ్ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు . ఈ హీరోకు తమిళనాట మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు అయితే గతకొంత కాలంగా హీరోగా సక్సెస్ లు అందుకోలేక పోతున్నాడు సిద్దార్థ్ . దాంతో అతడ్ని నాని సినిమాలో విలన్ గా నటించమని విక్రమ్ కుమార్ కోరినట్లు అందుకు సిద్దార్థ్ అంగీకరించినట్లు చెబుతున్నారు . అయితే సిద్దార్థ్ విలన్ గా నటిస్తాడా ? అన్న అనుమానం కూడా నెలకొంది . విభిన్న కథా చిత్రాలు చేస్తున్న నాని కి వరుసగా రెండు సినిమాలు పెద్ద దెబ్బ కొట్టాయి దాంతో విక్రమ్ కుమార్ సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది . ఇప్పటికే జెర్సీ అనే సినిమా చేస్తున్నాడు నాని , దాన్ని కంప్లీట్ చేసాక విక్రమ్ కుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట . థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్క నున్న విక్రమ్ సినిమాపై నాని ఆశలు పెట్టుకున్నాడు . ఇక నాని – సిద్దార్థ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు కట్ చేస్తే తెరమీద మాత్రం బద్ద శత్రువులుగా నటించడానికి సిద్ధం అవుతున్న...

డిసెంబర్ 12న రాజమౌళి కీలక ప్రకటన

11- 11- 11 న అంటే నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ఆర్ ఆర్ ఆర్ ప్రారంభం జరిగింది . ఎన్టీఆర్ , రాంచరణ్ , ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబినేషన్ లో ఈ సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే . కాగా ఇప్పుడు మరో అప్ డేట్ ని ఇవ్వడానికి డిసెంబర్ 12 న సిద్ధం అవుతున్నాడట రాజమౌళి . 12 డిసెంబర్ మధ్యాహ్నం 12 గంటలకు మరో ప్రకటన చేయనున్నాడట రాజమౌళి . ఇంతకీ రాజమౌళి చేసే ప్రకటన ఏంటో కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు హీరోయిన్ లను అధికారికంగా ప్రకటిచనున్నారట . ఎన్టీఆర్ , చరణ్ ల సరసన కీర్తి సురేష్ , కైరా అద్వానీ లను ఫిక్స్ చేశారట జక్కన్న. అందుకే డిసెంబర్ 12న హీరోయిన్ లను ఖరారు చేస్తూ ప్రకటన జారీ చేయనున్నారట . బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ అనూహ్యంగా పెరిగింది . దాంతో ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది . ఇక ఈ సినిమాకు రామ రావణ రాజ్యం గా నామకరణం చేయనున్నట్లు తెలుస్తోంది . తాజాగా ఈ సినిమా కోసం 20 మంది ఫైట్ మాస్టర్ లు ఒక్క ఫైట్ సీన్ కోసం కష్టపడుతున్నారట . English Title: One more Announcement from RRR on dec 12th from టాప్ స్టో...

2. ఓ ఏపీ తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం నిన్న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల అయిన విషయం తెలిసిందే . భారీ ఓపెనింగ్స్ సాధించిన 2. ఓ చిత్రం తెలుగునాట కూడా భారీ వసూళ్లు సాధించింది . నిన్న ఒక్క రోజే ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ లో కలిపి 12 కోట్లకు పైగా షేర్ సాధించింది . రజనీకాంత్ గత చిత్రాలు ఘోర పరాజయం పొందినప్పటికీ ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగానే లభించాయి . తెలంగాణలో 4కోట్ల 73 లక్షల షేర్ వచ్చింది , ఇక ఆంధ్రప్రదేశ్ లో 7 కోట్ల 80 లక్షల షేర్ ని వసూల్ చేసింది దాంతో ఈ సినిమా ని రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్న దిల్ రాజు , ఎన్వీ ప్రసాద్ , యువి క్రియేషన్స్ సంతోషంగా ఉన్నారు . ఈ జోరు ఇలాగె కొనసాగితే తప్పకుండా మంచి లాభాలు వస్తాయని నమ్ముతున్నారు . రెండు తెలుగు రాష్ట్రాలలో వసూళ్లు ఇలా ఉన్నాయి తెలంగాణ – 4. 73 కోట్ల షేర్ సీడెడ్ – 1. 98 కోట్ల షేర్ ఉత్తరాంధ్ర – 1. 65 కోట్ల షేర్ గుంటూరు – 1. 02 కోట్ల షేర్ కృష్ణా – 73 లక్షలు నెల్లూరు – 73 లక్షలు ఈస్ట్ – 96 లక్షలు వెస్ట్ – 75 లక్షల షేర్ మొత్తం – 12. 53 కోట్ల షేర్ English Title: 2.0 first day collections in AP and Telangana from టాప్ స్టోరీస...

భారీ అగ్నిప్రమాదం నుండి బయట పడిన షారుఖ్

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భారీ అగ్ని ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు . ముంబై లో ఓ స్టూడియో లో వేసిన సెట్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది . అగ్నిప్రమాదం జరిగినపుడు షారుఖ్ ఖాన్ అక్కడే ఉన్నాడు దాంతో అప్రమత్తమైన చిత్ర బృందం షారుఖ్ ని అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారు . సంఘటన వివరాలలోకి వెళితే …….. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తాజాగా షారుఖ్ ఖాన్ ” జీరో ” అనే చిత్రంలో మరుగుజ్జుగా నటిస్తున్నాడు . ఈ చిత్రంలో షారుఖ్ సరసన కత్రినా కైఫ్ , అనుష్క శర్మ నటిస్తున్నారు . కాగా జీరో చిత్రం కోసం ఓ పాట చిత్రీకరించడానికి ముంబై లోని ఓ స్టూడియోలో సెట్ వేశారు . సెట్ లో పాట చిత్రీకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో యానిట్ సిబ్బంది షాక్ అయ్యారు . మంటలు మరింతగా ఎగిసి పడకముందే అక్కడి నుండి షారుఖ్ ని వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు . భారీ ప్రమాదం నుండి షారుఖ్ బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు . జీరో చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈలోగా ఈ సంఘటన జరిగింది . English Title: Shahrukh khan escape from fire accident at zero sets from టాప్ స్టోరీస్ – Telugu Movie Re...

ఈ సీనియర్ హీరో హిట్ కొట్టగలడా ?

తక్కువ సమయంలోనే వంద చిత్రాలను పూర్తిచేసిన హీరో శ్రీకాంత్ , అయితే ఇప్పుడు యువతరం హీరోలు దూసుకువస్తున్న రోజులు కావడంతో ఈ ఫ్యామిలీ చిత్రాల హీరో రేసులో లేకుండా పోయాడు . ఇతర హీరోల చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్నాడు కూడా అయితే అప్పుడప్పుడు మాత్రం హీరోగా కొన్ని సినిమాలు చేస్తున్నాడు . అవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలీడం లేదు కూడా . తాజాగా శ్రీకాంత్ హీరోగా రెండు సినిమాల్లో నటించాడు ఒకటి తెలంగాణ దేవుడు , రెండోది ఆపరేషన్ 2019 . రెండు చిత్రాలు కూడా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు కావడం గమనార్హం . అయితే తెలంగాణ దేవుడు కేసీఆర్ నేపథ్యంలో సాగే కథ కాగా ఆపరేషన్ 2019 చిత్రం మాత్రం ఈరోజుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి , రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు , అలాగే జనాలు ఓట్ల కోసం నోట్లు ఎలా తీసుకుంటున్నారు అన్న అంశాల నేపథ్యంలో తెరకెక్కింది . ఆపరేషన్ 2019 చిత్రం రేపు విడుదల అవుతోంది . ఆపరేషన్ దుర్యోధన చిత్రం శ్రీకాంత్ కు మంచి హిట్ గా నిలిచింది దాంతో ఆపరేషన్ 2019 అనే చిత్రం చేసారు . మరి ఈ హీరో కు సోలోగా హిట్ కొట్టే దమ్ము ఉందా ? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న . English Title...

ఎనిమిదేళ్ల తర్వాత హిట్ కొట్టిన రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎనిమిదేళ్ల తర్వాత హిట్ కొట్టాడు . 2010 లో వచ్చిన రోబో చిత్రం సంచలన విజయం సాధించింది . శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో చిత్రం తర్వాత రజనీకాంత్ నటించిన చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందాయి . రజనీకాంత్ సూపర్ స్టార్ కావడంతో అతడి నుండి వస్తున్న చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రాలన్నీ డిజాస్టర్ లు అయ్యాయి , దాంతో రజనీకాంత్ సినిమాలను కొన్న బయ్యర్లు రోడ్డున పడ్డారు . రోబో తర్వాత కొచ్చాడైయాన్ , లింగా , కబాలి , కాలా చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి . ఈ ఎనిమిదేళ్ల కాలంలో చేసిన సినిమాలు అన్నీ ప్లాప్ కావడంతో రజనీ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు కట్ చేస్తే నిన్న విడుదలైన 2 . ఓ చిత్రం తో మళ్ళీ హిట్ అందుకున్నాడు రజనీకాంత్ దాంతో రజనీ అభిమానుల సంతోషానికి అంతే లేకుండా పోయింది . ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు 2. ఓ రూపంలో హిట్ లభించడం తో రజనీకాంత్ కూడా ఫుల్ ఖుషీ గా ఉన్నాడట . 2. ఓ సక్సెస్ కొట్టింది కానీ ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో అన్న ఆత్రుత నెలకొంది . English Title: Rajinikanth gets solid hit after eight years from టాప్ స్ట...

విబేధాలను పక్కన పెట్టి కలుస్తారా ?

ఎన్టీఆర్ కుటుంబంలో నివురుగప్పిన నిప్పులా ఉంది పరిస్థితి . ఎన్టీఆర్ కుటుంబం చాలా పెద్దది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఎన్టీఆర్ సంతానం ఏకంగా 12 మంది దానికి తోడు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బంధువర్గమంతా ఓ గ్రామమే అవుతుంది . అయితే బంధువర్గాన్ని పక్కన పెడితే ఎన్టీఆర్ కుటుంబంలోనే సఖ్యత లేదు , పెద్దల్లుడు వెంకటేశ్వర్ రావు – చిన్నల్లుడు చంద్రబాబు లకు అంతగా పడదు . అయితే ఈ ఇద్దరినీ ఒక్క తాటిపైకి తేవాలని బాలయ్య భావిస్తున్నాడట అది ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ వేడుక కోసం . ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు ఇలా రెండు భాగాలుగా 2019 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు బాలయ్య . జనవరిలో విడుదల కాబట్టి డిసెంబర్ 16 న ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ వేడుక ఎన్టీఆర్ కుటుంబం అందరినీ ఏకతాటి పైకి తెచ్చి చేయాలనీ డిసైడ్ అయ్యాడట బాలయ్య . అయితే అందరినీ ఏకం చేయొచ్చు కానీ వెంకటేశ్వర్ రావు ని ఈ వేడుకకు రప్పించడం కష్టమే కావచ్చు అన్న మాట వినబడుతోంది . ఎందుకంటే చంద్రబాబు అంటే వెంకటేశ్వర్ రావు కు పడదు మరి . English Title:...

విజయ్ సినిమా గురించి రష్మిక ఏమందో తెలుసా

విజయ్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తుందని అనుకున్నాను కానీ కొద్దిలో మిస్ అయ్యింది కానీ ఈసారి మాత్రం పక్కా……. ఛాన్స్ వదులుకునే ప్రసక్తి లేదు అని అంటోంది హాట్ భామ రష్మిక మందన్న . అదేంటి విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించింది కదా ! మళ్ళీ ఛాన్స్ రావడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఆ విజయ్ దేవరకొండ గురించి కాదు తమిళ స్టార్ హీరో విజయ్ గురించి . ఇటీవలే సర్కార్ చిత్రంతో ప్రభంజనం సృష్టించిన హీరో విజయ్ కాగా తన తదుపరి చిత్రంగా 63 వ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు . అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ని అనుకున్నారట కానీ ఎక్కడో తేడా కొట్టింది అందుకే రష్మిక ని పక్కన పెట్టేసారు . నయనతార ని ఎంపిక చేసారు . దాంతో కాస్త నిరాశ పడింది రష్మిక , విజయ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినందుకు బాధపడుతూ ఈసారి మాత్రం ఆ ఛాన్స్ వస్తే ఊరుకునేది లేదని తప్పకుండా నటిస్తానని అంటోంది . గీత గోవిందం చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ మరోసారి విజయ్ దేవరకొండ తోనే రొమాన్స్ చేస్తోంది డియర్ కామ్రేడ్ అంటూ . English Title: Rashmika Mandanna eagerly waiting for Vijay from టాప్ స్టోరీస్ – ...

మహేష్ మల్టీప్లెక్స్ లకు అడ్డంకులు తొలిగాయ్

మహేష్ బాబు మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే . ఏషియన్ సునీల్ తో కలిసి కొండాపూర్ – కొత్తగూడ లోని బొటానికల్ గార్డెన్ పక్కన అధునాతన వసతులతో ఏ ఎం బి సినిమాస్ నిర్మించాడు . ఈ మల్టీప్లెక్స్ ని గత నెలలో ప్రారంభించాలని అనుకున్నారు , కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈనెల 29 న అనుకున్నారు కానీ అప్పుడు కూడా కుదరలేదు అయితే ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించి డిసెంబర్ 2 న ఏ ఎం బి సినిమాస్ ప్రారంభానికి ముహూర్తం కుదిరింది . మొత్తం ఏడు స్క్రీన్ లున్నాయి ఇందులో . కాగా అన్ని కూడా అధునాతనమైన వసతులతో ఏర్పాటు చేసారు . సాఫ్ట్ వేర్ రంగం తో పాటుగా రిచ్ పీపుల్ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో తప్పకుండా ఏ ఎం బి సినిమాస్ కు బ్రహ్మాండమైన ఆదరణ లభించడం ఖాయమని ధీమాగా ఉన్నారు . మహేష్ బాబు సంపాదన ని వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెడుతోంది నమ్రత . ఇప్పటికే పలు ఏరియాల్లో భూములను , భవంతులను కొన్నది నమ్రత . ఇక ఇప్పుడేమో మల్టీప్లెక్స్ తో హడావుడి చేయనున్నాడు మహేష్ బాబు . English Title: Mahesh babu AMB cinemas opening on dec 2nd from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https:...

2. ఓ మొదటి రోజున 125 కోట్ల వసూళ్లు

రజనీకాంత్ నటించిన విజువల్ వండర్ 2. ఓ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే . ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11 వేల స్క్రీన్ లలో రిలీజ్ చేసారు 2. ఓ చిత్రాన్ని . దాంతో మొదటి రోజున 125 కోట్ల భారీ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది . కరెక్ట్ ఫిగర్ మధ్యాహ్నం కు రానుండగా ప్రాథమిక అంచనా ప్రకారం 125 కోట్లు వసూల్ అయినట్లు అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు . రజనీకాంత్ కున్న క్రేజ్ కి తోడు శంకర్ , అక్షయ్ కుమార్ ల ఇమేజ్ కూడా ఈ భారీ వసూళ్ల కు కారణం . ఆసియా ఖండంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది దాంతో మొదటి వారం కూడా భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది . రెహ్మాన్ నేపథ్య సంగీతం , శంకర్ టేకింగ్ , విజువల్ గ్రాండియర్ వీటన్నింటిని మించి రజనీకాంత్ నటన 2. ఓ చిత్రాన్ని సూపర్ హిట్ చేసాయి . తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల చేసారు . 2. ఓ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు శంకర్ ని రజనీకాంత్ , అక్షయ్ కుమార్ లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . English Title: Rajinikanth’s 2. 0 earning125 crores on first day from టాప్ ...

ఎన్టీఆర్ ప్రచారానికి రాడా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అక్క సుహాసిని కోసం కూకట్ పల్లి లో ప్రచారం చేస్తాడని అనుకున్నారు , డేట్స్ కూడా చెప్పేసారు కానీ ఇప్పుడేమో ఎన్టీఆర్ ప్రచారానికి రాలేదు . మరో నాలుగు రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది ఆ తర్వాత ఎన్నికలే ! అయినా ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు రాలేదు దాంతో చంద్రబాబు పై ఎన్టీఆర్ కోపంగా ఉన్నాడన్న విషయం రూడీ అయ్యింది . తెలంగాణలో ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో కూకట్ పల్లి నుండి ఎన్టీఆర్ ప్రచారం చేయాల్సింది పోయి మీనమేషాలు లెక్కిస్తున్నాడు . కూకట్ పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుహాసిని కూడా తన తరుపున ప్రచారం చేయడానికి నా సోదరులు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు వస్తారని చెప్పింది . కానీ ఇంతవరకు ఎన్టీఆర్ ప్రచారానికి రాలేదు అలాగే కళ్యాణ్ రామ్ కూడా రాలేదు . ఇక మిగిలింది నాలుగు రోజులే కాబట్టి చివరి రోజు వస్తారేమో అని అనుకుంటున్నారు . ఎన్టీఆర్ రాకపోతే తప్పకుండా చంద్రబాబు మీద ఉన్న కోపం తోనే అన్న విషయం మాత్రం ఖచ్చితంగా తెలిసిపోతుంది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BFu4ez

ఇదిగో సాక్ష్యం

హాట్ భామ మలైకా అరోరా తో హీరో అర్జున్ కపూర్ బంధం మరింతగా ముదురుతోంది అనడానికి తాజాగా మరో సాక్ష్యం దొరికింది . వచ్చే ఏడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి . కాగా తాజాగా ఈ భామ మెడలో ధరించిన పెండెంట్ పై ఉన్న అక్షరాలతో మరోసారి రుజువు చేసిందని అంటున్నారు . ఇంతకీ మలైకా తన మెడలో వేసుకున్న పెండెంట్ ఏంటి ? అది సాక్ష్యం ఎలా అయ్యిందని అనుకుంటున్నారా ? మెడలో వేసుకున్న పెండెంట్ కు ‘ A M ‘ అనే అక్షరాలు ఉన్నాయి . ‘ఏ’ అంటే అర్జున్ కపూర్ అని ‘ఎం’ అంటే మలైకా అరోరా అని అర్ధం అందుకే మలైకా ఆ పెండెంట్ ధరించింది అని అంటున్నారు . నిజమే ! ఆ అక్షరాలను బట్టి చూస్తే తప్పకుండా అర్జున్ కపూర్ – మలైకా అరోరా అనే తెలిసిపోతోంది . మలైకా కు 45 సంవత్సరాలు కాగా అర్జున్ కపూర్ కు 33 సంవత్సరాలు మాత్రమే అంటే ఇద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది . మలైకా కంటే అర్జున్ 12 ఏళ్ళు చిన్నవాడు అయినప్పటికీ ఈ ఇద్దరి ఆమధ్య ఫెవికాల్ బంధం బాగా రాసుకుపోయింది . ముంబై లో ఎక్కడ చూసిన ఈ ఇద్దరే కనిపిస్తూ సల్మాన్ ఖాన్ కు అర్భాజ్ ఖాన్ కు నిద్ర లేకుండా చేస్తున్నారు . English Title: Malaika Arora wears a pendant AM ...

2. ఓ చిత్రం లీక్ అయ్యింది

పూర్తి హెడ్ డి ప్రింట్ ని తమిళ రాకర్స్ పెట్టేసారు దాంతో 2. ఓ చిత్ర బృందం షాక్ కి గురయ్యింది . భారీ సినిమాలు తమిళ్ లో విడుదల అవడమే ఆలస్యం తమిళ రాకర్స్ హెచ్ డి ప్రింట్ ని వెబ్ సైట్ లో పెట్టేస్తున్నారు . దాంతో చాలామంది దర్శక నిర్మాతలు అగ్ర హీరోలు బాధపడుతున్నారు . తాజాగా రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం కూడా పైరసి బారిన పడింది . అత్యంత భారీ బడ్జెట్ తో ఆసియా ఖండంలోనే ఆసక్తి గొలిపిన చిత్రం ఈ 2. ఓ . 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది కాబట్టి పైరసీ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా కోర్టుని ఆశ్రయించారు . దాంతో దాదాపు 1200 వెబ్ సైట్ లను మూసెయ్యాల్సిందిగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు . అయినప్పటికీ 2. ఓ పైరసీ బారిన పడింది . సినిమా మొత్తం అది కూడా హెచ్ డి ప్రింట్ వెబ్ లీక్ కావడంతో ఏమి చేయాలో పాలుపోక తల పట్టుకుంటున్నారు . ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున 11 వేల స్క్రీన్ లలో విడుదల అయ్యింది 2. ఓ చిత్రం . సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది దాంతో ఆ చిత్ర బృందం సంతోషంగా ఉండగా అదే సమయంలో లీక్ అయిన విషయం తెలియడంతో షాక్ కి గురయ్యారు . English Title: Rajinikanth 2. 0 full movie...

జాన్వీ కామెంట్ పై విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తో నటించాలని ఉందని తెల్పిన జాన్వీ కపూర్ మాటలు ఆమధ్య వైరల్ గా మారిన విషయం తెలిసిందే . అయితే జాన్వీ వ్యాఖ్యల పట్ల మొత్తానికి స్పందించాడు హీరో విజయ్ దేవరకొండ . నాకు కూడా జాన్వీ కపూర్ తో నటించాలని ఉందని త్వరలోనే ఆ సినిమా సాకారం కానుందని వ్యాఖ్యానించాడు . కరణ్ జోహార్ మొదట అడ్డుపడ్డాడు జాన్వీ కపూర్ విజయ్ సరసన నటించకుండా , అయితే కరణ్ జోహార్ షోలోనే పాల్గొన్న సందర్బంగా విజయ్ దేవరకొండ లా నిద్ర లేవాలని ఉందని అలాగే అతడి సరసన నటించాలని ఉందని ….. విజయ్ చాలా సెక్సీ గా ఉంటాడని చెప్పి షాక్ ఇచ్చింది జాన్వీ కపూర్ . విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం ఇదే నెలలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది . ఇంకా మంచి వసూళ్ల ని సాధిస్తోంది కూడా . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో విజయ్ దేవరకొండ రేంజ్ పూర్తిగా మారిపోయింది . తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన టాక్సీ వాలా 20 కోట్ల షేర్ రాబట్టింది . ఇక జాన్వీ కపూర్ కూడా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది అలాగే మంచి నటి అని కూడా నిరూపించుకుంది . ఇక ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు . English Tit...

ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్

హీరోయిన్ రియా మిక్క ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టిస్తోంది . తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి రియా మిక్క . అయితే అనూహ్యంగా నిన్న తమిళనాడు లోని వలసర వాక్కం లోని తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది రియా మిక్క . ఈ వార్త తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆత్మహత్య కు గల కారణాలు తెలుసుకున్నారు . అయితే ఆత్మహత్య చేసుకుంటే సూసైడ్ నోట్ ఉండాలని కానీ అది ఎక్కడా లభించలేదని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు . రియా మిక్క గతకొంత కాలంగా డిప్రెషన్ తో బాధపడుతోంది . కెరీర్ పట్ల ఏదో ఊహించుకుంది కానీ ఊహలు తల్లకిందులు కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు . అయితే ఆత్మహత్య కోణంలో అలాగే హత్య కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రియా మిక్క ఇలా అర్దాంతరంగా చనిపోవడం అందరినీ కలిచి వేస్తోంది . English Title: Tamil actress Riya Mikka commits suicide from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FNnXsH

క్యాన్సర్ తో బాధపడుతున్న హీరో భార్య

రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతోంది బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తాహీరా కశ్యప్ . అయితే ఆ క్యాన్సర్ ప్రాధమిక దశలోనే ఉందని గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది తాహీరా కశ్యప్ . క్యాన్సర్ బారిన పడ్డానని కుంగిపోకుండా ధైర్యం తెచ్చుకొని మరీ ఈ విషయాన్నీ పబ్లిక్ లో పెట్టేసింది . క్యాన్సర్ మహమ్మారి ని జయిస్తాను , కాకపోతే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాను …….. ప్రాథమిక దశలోనే రొమ్ము క్యాన్సర్ ని గుర్తించామని కాబట్టి ఎవరూ నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసింది . విక్కీ డోనర్ అనే సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రంలో నటించాడు ఆయుష్మాన్ ఖురానా . తాహీర కశ్యప్ – ఆయుష్మాన్ ఖురానా లకు ఇద్దరు పిల్లలు . అయితే ఇటీవలే క్యాన్సర్ పరీక్షలు చేయించుకోగా రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు రిపోర్ట్ లో వెల్లడి కావడంతో చికిత్స పొందుతోంది . తప్పకుండా త్వరగా కోలుకుంటానన్న నమ్మకం ఉందని చెప్పడమే కాకుండా …… ” ఫ ….. క్యాన్సర్ ” అంటూ క్యాప్షన్ పెట్టి ఓ ఫోటోకి ఫోజిచ్చింది . దాన్నే సోషల్ మీడియాలో పెట్టేసింది . English Title: Ayushman khurrana wife tahira kashyap revealed her cancer from టాప్ స్టోరీస్ –...

అడ్వాన్స్ బుకింగ్ లతోనే వంద కోట్లు రాబట్టిన 2. ఓ

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ లతోనే వంద కోట్ల ని రాబట్టింది ప్రపంచ వ్యాప్తంగా . రజనీకాంత్ కున్న క్రేజ్ ఒక కారణం అయితే , శంకర్ విజువల్ వండర్ తీసాడని భావిస్తున్న ప్రేక్షకులు 2 . ఓ టికెట్ల కోసం ఎగబడుతున్నారు . ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11 వేల స్క్రీన్ లలో 2 . ఓ చిత్రం విడుదల అవుతోంది . ఇది రిలీజ్ ల పరంగా ఓ రికార్డ్ కాగా వసూళ్ల పరంగా కూడా రికార్డ్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి . ఎందుకంటే 11 వేల స్క్రీన్ లతో పాటుగా అడ్వాన్స్ బుకింగ్ లకు డిమాండ్ ఏర్పడటంతో అన్నీ ఫుల్స్ అయ్యాయి దాంతో ఫస్ట్ డే వసూళ్ల లో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది . ఈ సినిమాకు రిపోర్ట్స్ కూడా పాజిటివ్ గా ఉండటంతో తప్పకుండా భారీ వసూళ్లు రావడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఈ సినిమాని చూసిన పలువురు సినీ ప్రముఖులు కూడా శంకర్ ప్రతిభని , రజనీకాంత్ స్టైల్ ని మెచ్చుకుంటున్నారు .మొత్తానికి రజనీకాంత్ కు రోబో చిత్రం తర్వాత సక్సెస్ దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రజనీ అభిమానులు . English Title: Rajinikanth 2. 0 joins 100 crore club with advance booking from టాప్ స్టోరీస...

‘ఎల్‌.ఆర్‌.క్రియేషన్స్‌ ‘కనకం 916 కేడియమ్‌’ షూటింగ్‌ ప్రారంభం!!

‘కేరాఫ్ కంచ‌రపాలెం’ ఫేమ్‌ మోహన్‌ భగత్‌ హీరోగా ఎల్‌ఆర్‌ క్రియేషన్స్‌ పతాకంపై క్ష్మణరావు బూరగాపు నిర్మిస్తోన్న చిత్రం ‘కనకం 916 కేడియమ్‌’. రాకేష్‌ పోతాప్రగడ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమవుతున్నారు. వైశాఖి బోనం హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాల‌కృష్ణ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వగా చిత్ర నిర్మాత క్ష్మణరావు బూరగాపు కెమేరా స్విచాన్‌ చేశారు. ప్రముఖ దర్శకులు ఎస్‌.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. హీరో, డైర‌క్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్, ప్రముఖ నిర్మాతలు బివియస్‌ఎన్‌ప్రసాద్‌, రాజ్‌ కందుకూరి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుడవ్వాల‌న్న తన తపన నచ్చి ఈ అవకాశం కల్పించాను. కేరాఫ్‌ కంచరపాలెంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మోహన్‌ భగత్‌ హీరోగా నటిస్తున్నారు. అలాగే టెక్నిషీయన్స్‌ కూడా ప్రతిభావంతులు పని చేస్తున్నారు. ఇందులో కమర్షియల్‌ అంశాల‌తో పాటు అంతర్లీనంగా మంచి సందే అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల‌ సమావేశంలో నిర్మాత ల‌క్ష్మణరావు బూరగాపు మాట్లాడుతూ…‘‘రాకేష్‌ ఓ రో...

2.ఓ రిపోర్ట్ ఎలా ఉందంటే

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 2.ఓ చిత్రం ఈరోజు భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. భారీ ఓపెనింగ్స్ సాధించిన 2. ఓ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. ఓవర్ సీస్ లో 2. ఓ షోలు ముందుగానే పడటంతో టాక్ బయటకు వచ్చేసింది. అంతేకాదు పలువురు నెటిజన్లు ఈ సినిమాని చూసి తమ రివ్యూ ఇచ్చేస్తున్నారు. ఇంతకీ నెటిజన్ లు చెబుతున్న దాని ప్రకారం 2.ఓ హిట్ అని తేల్చేశారు. శంకర్ అద్భుత సృష్టి ఈ 2. ఓ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినిమా చూసిన వాళ్ళు. మొత్తానికి రజనీకాంత్ ఎనిమిది సంవత్సరాలు తర్వాత 2.ఓ చిత్రంతో హిట్ కొట్టాడు. రజనీకాంత్ నటన , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ ల నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే చివరి అరగంట సినిమా హాలీవుడ్ ని తలదన్నేలా ఉందని అంటున్నారు. English Title: Rajinikanth 2.0 movie public talk from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BDa5Ni

హీరోయిన్ మోజులో పడ్డ డైరెక్టర్

హాట్ భామ కేథరిన్ ట్రెసా అంటే పడి చచ్చిపోతున్నాడు దర్శకులు బోయపాటి శ్రీను . తాజాగా తన వినయ విధేయ రామ చిత్రంలో ఈ హాట్ భామ చేత ఐటెం సాంగ్ చేయిస్తున్నాడు . ఇప్పటికే తన సినిమాల్లో కేథరిన్ కు రెండుసార్లు వరుసగా ఛాన్స్ ఇచ్చాడు బోయపాటి . అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన జయ జానకి నాయక చిత్రంలో కేవలం ఐటెం సాంగ్ మాత్రం చేయించాడు బోయపాటి . కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ వినయ విధేయ రామ చిత్రంలో కేథరిన్ ట్రెసా చేత ఐటెం సాంగ్ చేయించడానికి రెడీ అవుతున్నాడు . అసలు ఈ చిత్రంలో ఇలియానా చేత ఐటెం సాంగ్ చేయించాలని భావించారు . ఇలియానాని అడిగారు కూడా కానీ ఆమె 60 లక్షల రెమ్యునరేషన్ విని షాక్ అయ్యారు దాంతో కేథరిన్ ని తీసుకుందామని చరణ్ కు చెప్పాడట బోయపాటి శ్రీను . కేథరిన్ అంటే కాస్త మక్కువ ఏర్పడటంతో ఆ భామతో చేద్దామని చరణ్ ని ఒప్పించాడట . బోయపాటి కోరిక మేరకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . ఇక ఈ చిత్రాన్ని 2019 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . English Title: Catherine tresa item song in Vinaya Vidheya ...

కేసీఆర్ ని చెడుగుడు ఆడుకున్న రేవంత్

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని చెడుగుడు ఆడుకున్నాడు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి . ఈరోజు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొడంగల్ లో ప్రచారానికి వచ్చిన దరిమిల రాహుల్ ముందు చెలరేగిపోయాడు . రేవంత్ రెడ్డి కేసీఆర్ ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటే ప్రజల్లోంచి బ్రహ్మాండమైన స్పందన రావడంతో మరింత జోష్ పెంచాడు . రేవంత్ విమర్శలకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన రావడంతో రాహుల్ గాంధీ సైతం షాక్ అయ్యాడు . రేవంత్ రెడ్డి ఒక్కో మాటని తూటాలా పేల్చుతుంటే సభలో ఒకటే ఈలలు , గోలలు దాంతో రేవంత్ లో మరింత ఉత్సాహం వచ్చింది . ఇక కేసిఆర్ నైతే తీవ్ర స్థాయిలో విమర్శించాడు రేవంత్ , పొద్దస్తమానం మందు తాగెటోన్ని ఫామ్ హౌజ్ కే పరిమితం చేయాలనీ ప్రజలకు పిలుపునిచ్చాడు రేవంత్ రెడ్డి . అంతేకాదు ఎంతసేపు వంద ….. వంద అని అంటున్నాడు వాడి బొంద ……. కేసీఆర్ కు 30 సీట్లు వస్తే గొప్ప . తెలంగాణాలో అధికారం కాంగ్రెస్ పార్టీదే అంటూ కాంగ్రెస్ కార్యకర్తల్లో హుషారు పెంచాడు . రేవంత్ రెడ్డి వాగ్ధాటి ఎలాంటిదో స్వయంగా చూసిన రాహుల్ అందుకే హెలికాఫ్టర్ ఇచ్చి తెలంగాణ అంతటా తిరగమని ప్రోత్సహించాడు . English Title:...

అమర్ అక్బర్ ఆంటోనీ పరిసమాప్తం

రవితేజ – ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే . శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కేవలం 6 కోట్ల షేర్ మాత్రమే సాధించింది . హీరోగా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం . అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాన్ని కొన్న బయ్యర్లంతా ఘోరంగా నష్టపోయారు . 25 కోట్ల బిజినెస్ కాగా రిటర్న్ వచ్చింది మాత్రం కేవలం ఆరు కోట్లు మాత్రమే అంటే 19 కోట్లు నష్టం వచ్చిందన్న మాట . ఈ సినిమాతో వరుసగా మూడు డిజాస్టర్ లు అందుకున్న హీరోగా నిలిచాడు రవితేజ . టచ్ చేసి చూడు , నేల టికెట్టు , ఇప్పుడేమో అమర్ అక్బర్ ఆంటోనీ . ఏరియాల వారీగా అమర్ అక్బర్ ఆంటోనీ షేర్ ఇలా ఉంది . తెలంగాణ : 1.90 కోట్లు సీడెడ్ : 0.89 లక్షలు ఉత్తరాంధ్ర : 0.60 లక్షలు ఈస్ట్ : 0.38 లక్షలు వెస్ట్ : 0.32 లక్షలు గుంటూరు : 0.65 లక్షలు కృష్ణా : 0.30 లక్షలు నెల్లూరు : 0.19 లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.50 లక్షలు ఓవర్ సీస్ : 0.49 లక్షలు ప్రపంచ వ్యాప్తంగా వసూల్ అయిన మొత్తం : 6.20 కోట్లు English Title: Amar Akbar Anthony world wid...

2. ఓ రివ్యూ రేటింగ్ ఎంతో తెలుసా

రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం రేపు విడుదల అవుతుండగా ఈరోజు ఉమైర్ సందు తన రేటింగ్ ఇచ్చేసాడు . ఇతగాడు ఇచ్చిన రివ్యూ రేటింగ్ లన్ని బోగస్ అనే తేలాయి ఎందుకంటే ఉమైర్ సందు 4 రేటింగ్ ఇచ్చిన సినిమాల్లో ఒకటి అరా తప్ప మిగతా సినిమాలు అన్నీ డిజాస్టర్ లు , ప్లాప్ లు , యావరేజ్ లు మాత్రమే ! ఇంతకీ ఈ వివాదాస్పద క్రిటిక్ 2 . ఓ కి ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా ……. 4 . అవును యధావిధంగా ఈ సినిమాకు కూడా 4 రేటింగ్ ఇచ్చాడు . 4 రేటింగ్ ఇచ్చి డబ్బా కొట్టాడంటే సెంటిమెంట్ ప్రకారం ప్లాప్ అన్నమాటే ! కానీ చెప్పలేం ఏం జరుగుతుందో అసలు తీర్పు ప్రేక్షకులు కదా ఇవ్వాలి . ఆ తీర్పు రేపు ఇవ్వనున్నారు . ఉమైర్ సందు రివ్యూ ప్రకారం 2 . ఓ విజువల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయని , రజనీకాంత్ – అక్షయ్ కుమార్ ల నటన ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవని , అలాగే శంకర్ దర్శకత్వ ప్రతిభ అమోఘమని తెగ డప్పు కొడుతున్నాడు . విజువల్ ఫీస్ట్ 2. ఓ అని తేల్చి పడేసాడు ఉమైర్ సందు . అసలు రిపోర్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ ఈ రిపోర్ట్ మాత్రం రజనీ అభిమానులను సంతోషానికి , భయానికి గురిచేస్తోంది . సంతోషం , భయం ఈ రెండింటికి ఉమైర్ సందు కారణం . బాగుంది అని చెప్పడం సంతోషమైతే …… ...

ఆ సినిమా వాయిదాపడటం లేదట

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం కవచం . పోలీస్ అధికారిగా నటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 7 న విడుదల చేయనున్నట్లు మరోసారి అధికారికంగా ప్రకటించారు . కొద్దిరోజులుగా కవచం విడుదల వాయిదా పడనుంది అని గుసగుసలు వినిపించాయి కట్ చేస్తే మేము చెప్పిన సమయానికి వస్తున్నాం కన్ఫర్మ్ అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు . సక్సెస్ కోసం తహతహలాడుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ , మెహరీన్ లు నటించారు . ఇక విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ నటించాడు . శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై నిర్మాత బెల్లంకొండ సురేష్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . తనయుడిని హీరోగా నిలబెట్టాలని , స్టార్ హీరోని చేయాలనీ కలలు కంటున్నాడు . ఇప్పటివరకు చేసిన సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు సాయి శ్రీనివాస్ కానీ సక్సెస్ మాత్రం దక్కలేదు దాంతో కవచం చిత్రంతో తప్పకుండా హిట్ కొడతాం అన్న ధీమాతో ఉన్నారు . డిసెంబర్ 7 న కవచం తో పాటుగా పలు చిత్రాలు విడుదల అవుతున్నాయి . మరి వాటిలో ఏది హిట్ అవుతుందో ? ఎన్ని ప్లాప్ అవుతాయో ? English Title: Bellamkonda Sai Srinivas Kavacham release date ...

మహేష్ బాటలోనే అల్లు అర్జున్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాటలో పయనించడానికి సిద్దమయ్యాడు అల్లు అర్జున్ . మహేష్ బాబు బాటలో అల్లు అర్జున్ పయనించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? మహేష్ బాబు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాడు . ఏషియన్ ఫిలిమ్స్ వాళ్లతో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్ లను నిర్మించాడు హైదరాబాద్ లో . ఇప్పటికే అవి ప్రారంభం కావాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా డిసెంబర్ 2 నుండి ప్రారంభం కానున్నాయట . మహేష్ మల్టీప్లెక్స్ స్టార్ట్ కాకుండానే ఆ మల్టీప్లెక్స్ లకు బ్రహ్మాండమైన క్రేజ్ వచ్చింది . ఇక స్టార్ట్ అయితే దాని రేంజ్ ఏంటో ? మహేష్ బాబు లాగే అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్దమయ్యాడు . అదికూడా ఏషియన్ వాళ్ళతోనే . అమీర్ పేటలోని సత్యం థియేటర్ చాలా ఫేమస్ కాగా ఆ చోట అల్లు అర్జున్ – ఏషియన్ ” A A A ” మల్టీప్లెక్స్ కు శ్రీకారం చుట్టనున్నారట . డబ్బు సంపాదించడం గొప్ప కాదు దాన్ని నిల్వ చేయడం , లాభాలు వచ్చే రంగాల్లో పెట్టుబడులు పెట్టడం తెలివి గల వాళ్ళ పని ఇప్పుడు అదేపని చేస్తున్నాడు అల్లు అర్జున్ . English Title: Allu Arjun investments in Multiplex from ట...

2. ఓ ఎన్ని థియేటర్ లలో విడుదల అవుతుందో తెలుసా

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే . తెలుగు , తమిళ , హిందీ భాషలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఇతర బాషలలో కూడా డబ్ అవుతోంది. మొత్తానికి ఈ సినిమా ఎన్ని థియేటర్ లలో విడుదల అవుతుందో తెలుసా …….. 11000 . వరల్డ్ వైడ్ గా 11000 థియేటర్ లలో 2. ఓ చిత్రం భారీ ఎత్తున విడుదల అవుతోంది . ఇంత పెద్ద ఎత్తున విడుదల కావడానికి కారణం రజనీకాంత్ కున్న డిమాండ్ ఒక కారణమైతే అత్యంత ఆసియా ఖండంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన చిత్రం కావడం మరో కారణం అలాగే శంకర్ దర్శకత్వం , అక్షయ్ కుమార్ విలన్ గా నటించడం ఇలా బోలెడు ప్రత్యేకతలు ఉన్నాయి ఈ చిత్రానికి . అప్పుడే ఈ సినిమాకు బుకింగ్స్ ఫుల్ అయ్యాయి , రజనీకాంత్ సినిమా ఎలా ఉన్నా కూడా ముందుగా చూడాలని తహతహలాడుతుంటారు . దాంతో ఈ చిత్రానికి కూడా క్రేజ్ ఏర్పడింది . గత ఎనిమిది సంవత్సరాలుగా రజనీకాంత్ కు హిట్ లేదు అయినా కూడా క్రేజ్ మాత్రం తగ్గలేదు . అలాగే మొదటి రోజు బాహుబలి రికార్డ్ ని బద్దలు కొట్టాలని భారీ ప్లాన్ వేశారు 2 . ఓ బృందం . మరి ఆ రికార్డ్ ఈ సినిమా వల్ల అవుతుందా ? లేదా ? అన్నది రేపు తేలిపోతుంది ....

జాన్వీ కపూర్ సిస్టర్ ని రేప్ చేస్తామని వార్నింగ్

జాన్వీ కపూర్ సిస్టర్ అన్షులా కపూర్ ని రేప్ చేస్తామని కొంతమంది నెటిజన్ లు వార్నింగ్ ఇచ్చారట దాంతో తీవ్ర ఆందోళనకు గురైంది జాన్వీ కపూర్ . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొంతమంది సైకోలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని , ఇష్టమొచ్చిన బూతులు పోస్ట్ చేస్తున్నారని కనీస మర్యాద కూడా పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది జాన్వీ కపూర్ . నెటిజన్ లలో కొంతమంది కి అన్షులా కపూర్ పై కోపం రావడానికి కారణం ఏంటంటే …….. ఓ షోలో పాల్గొన్న సమయంలో జాన్వీ కపూర్ అన్షులా కపూర్ కు ఫోన్ చేసి సహాయం అడిగింది అయితే అందుకు అన్షులా నిరాకరించడమే ఆమె చేసిన పాపం ! అంతే అన్షులా ని రేప్ చేస్తాం అంటూ భీకరమైన యుద్దాన్ని చేశారట . ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారు అంటూ జాన్వీ మండిపడుతోంది సదరు నెటిజన్ లపైనా . అయినా ముఖం చూపించకుండా ఇలా చెత్త వాగుడు వాగ్దనికి సిగ్గు లేదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది జాన్వీ . సోషల్ మీడియా పుణ్యమా అని మంచి జరుగుతోంది అలాగే కొంతమంది ఆకతాయిలు ఇలా రెచ్చిపోతూనే ఉన్నారు . English Title: Janhvi Kapoor opens up about Rape Threat on her sister from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Ci...

సెన్సార్ చిక్కుల్లో ఆ సినిమా

రాంగోపాల్ వర్మ నిర్మించిన భైరవగీత చిత్రం సెన్సార్ చిక్కుల్లో పడింది . గతనెల రోజులుగా ఇదిగో విడుదల అదిగో విడుదల అంటూ ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న వర్మ ఎట్టకేలకు రజనీకాంత్ నటించిన 2 . ఓ చిత్రానికి మా భైరవగీత చిత్రానికి పోటీ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చి పడేసాడు . 2. ఓ 29 న విడుదల అవుతుంటే దానికి ఒకేరోజు ఆలస్యంగా నవంబర్ 30 న మా భైరవగీత అంటూ ఫోజు కొట్టాడు . కట్ చేస్తే ఇప్పుడు సెన్సార్ సమస్యల్లో ఉంది భైరవగీత చిత్రం దాంతో నవంబర్ 30 న రావడం లేదు డిసెంబర్ 7న మా సినిమా విడుదల అంటూ పోస్ట్ పెట్టాడు వర్మ . భైరవగీత చిత్రంలో హీరోయిన్ ల అందాలు మాత్రమే కాకుండా కత్తులు , నరకడాలు ఉన్నాయి దాంతో ఈ సినిమా సకాలంలో సెన్సార్ కావడం కష్టమే అందుకే డిసెంబర్ 7న విడుదల అనేశాడు . అయినా వర్మ సినిమాలన్నీ పరమచెత్త గా తయారయ్యాయి ఈమధ్య . కాకపోతే ఈ సినిమా వర్మ శిష్యుడు దర్శకత్వం వహించిన సినిమా అందునా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా కావడంతో కాస్త అంచనాలు ఉన్నాయి అంతే ! English Title: Ram gopal varma Bhairavageetha postponed again from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FN4e...

అనసూయ టాటూ ఫోటో వైరల్

హాట్ భామ అనసూయ ఎదపై టాటూ వేసుకొని దిగిన ఫోటో వైరల్ అవుతోంది . తాజాగా ఈ భామ ఎదపై టాటూ ఉన్న ఫోటో ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుంది . ఇద్దరు పిల్లల తల్లి అయిన 33 ఏళ్ల ఆంటీ అనసూయ అందాల ఆరబోతతో కైపెక్కిస్తొంది . జబర్దస్త్ తో ఫేమస్ అయిన ఈ భామ ఆ షోలో అందాల ప్రదర్శన తో ఒక్కసారిగా హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది . గ్లామర్ ని ఒలకబోయడానికి పెళ్లి , పిల్లలు అడ్డుకాదని నిరూపించింది . కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించిన అనసూయ బుల్లితెర మీదే కాదు వెండితెర మీద కూడా సత్తా చాటుతోంది . తాజాగా ఎదమీద వేసుకున్న టాటూ ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకొని మరింతగా రెచ్చగొడుతోంది . కుర్రాళ్ళ ఫాలోయింగ్ ఉంటేనే అందం , ఆనందం అందుకే ఎప్పటికప్పుడు స్కిన్ షో చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడుతూ కొంతమందికి ఆనందం పంచుతోంది అలాగే విమర్శల పాలు కూడా అవుతోంది . పెళ్లి అయి పిల్లలున్న నీకు ఈ స్కిన్ షో అవసరమా ? అంటూ అనసూయ ని విమర్శించే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు . అయితే ఎవరు తిట్టినా , పొగిడినా నా దారి రహదారి అనుకుంటూ దూసుకుపోతోంది …… అందాలను ఆరబోస్తూనే ఉంది . English Title: Anchor Anasuya bharadwaj tattoo pic goes viral in social ...

అమలా పాల్ ని ఆ హీరో పెళ్లి చేసుకోవడం లేదట

హీరోయిన్ అమలా పాల్ ని నేను పెళ్లి చేసుకోవడం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేసాడు తమిళ హీరో విష్ణు విశాల్ . అమలా పాల్ దర్శకులు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసింది , మళ్ళీ పెళ్లి మీదకు గాలి మళ్లిందట ఈ భామకు . అలాగే విష్ణు విశాల్ కూడా పెళ్లి అయినా వాడే ! అతడు కూడా తన భార్యకు విడాకులు ఇచ్చాడు దాంతో అతడు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు . దాంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారని వార్తలు గుప్పు మనడంతో అవి పెద్దగా స్ప్రెడ్ కాకముందే స్పందిస్తే బెటర్ అని భావించిన విష్ణు విశాల్ ఆ పెళ్లి వార్తలను ఖండించాడు . దయచేసి ఇలాంటి రాతలు రాయకండి ! నేను – అమలా పాల్ పెళ్లి చేసుకోవడం లేదు అని సెలవిచ్చాడు . పెళ్ళికి ముందు ఓ మాదిరి ఎక్స్ పోజింగ్ చేసిన అమలా పాల్ విడాకులు ఇచ్చిన తర్వాత మాత్రం వీర లెవల్లో రెచ్చిపోయి అందాలను ఆరబోస్తోంది . ఎప్పటికప్పుడు రకరకాల భంగిమల్లో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతోంది . అంతేకాదు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందని కూడా స్టేట్ మెంట్ లు ఇస్తోంది అమలా పాల్ . English Title: Vishnu vishal thrashes rumours his marriage with amala paul fro...

వివాదంలో రజనీకాంత్ 2. ఓ చిత్రం

సూపర్ స్టార్ రజనీకాంత్ 2. ఓ చిత్రం వివాదంలో చిక్కుకుంది . రేపు విడుదల కానున్న ఈ చిత్రానికి వచ్చిన వివాదం ఏంటో తెలుసా ……. సెల్యులార్ ఆపరేటర్ల సంఘం చేసిన ఫిర్యాదు . ఇంతకీ వీళ్ళు ఎందుకు ఫిర్యాదు చేసారో తెలుసా ……. 2 . ఓ చిత్రంలో సెల్ ఫోన్ లు , సెల్ టవర్ లు భూమి మీద ఉన్న ప్రాణకోటి కి ప్రమాదకరమైనవని చూపించడమే ! ఇప్పటికే 2. ఓ చిత్ర టీజర్ , ట్రైలర్ లు ప్రేక్షకులు చూసే ఉన్నారు వాటిలో సెల్ ఫోన్ లు మాయం అవుతుంటాయి అలాగే వాటిని వాడే వాళ్ళందరూ పర్యావరణానికి , మానవాళికి ప్రమాదకారులు అన్నట్లుగా చూపించారు దాంతో సెల్యులార్ ఆపరేటర్ల సంఘం కేంద్ర సమాచార ప్రసార శాఖలతో పాటుగా సెన్సార్ బోర్డు కు కూడా ఫిర్యాదులు చేసారు . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అవాంతరాలను దాటుకొని రిలీజ్ కి సిద్ధమైంది . అయితే ఈ సమయంలో సెల్యులార్ ఆపరేటర్ల సంఘం వివాదాన్ని రాజేసింది . మరి ఈ వివాదానికి సెన్సార్ వాళ్ళు , కేంద్ర సమాచార శాఖ వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి . అలాగే చిత్ర బృందం కూడా కంటి మీద కునుకు లేకుండా ఉంది ఎందుకంటే 550 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన చిత్రం కాబట్టి దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న ఆత్రుత తో...

పవన్ కళ్యాణ్ ని సీఎం ని చేస్తానంటున్న కేఏ పాల్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సీఎం కావాలని ఆశ ఉంటే అతడ్ని నేను సీఎం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు వివాదాస్పద శాంతి దూత డాక్టర్ కే ఏ పాల్ . ప్రజాశాంతి అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన పాల్ ఆ పార్టీ తరుపున అన్ని చోట్లా అభ్యర్థులను నిలబెట్టలేక చతికిల బడ్డాడు కానీ అమెరికా అధ్యక్షుడి ని చేసింది నేనే , ఒక్క అమెరికా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా పలువురిని దేశాధ్యక్షులు గా చేసింది నేనే అంటూ సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు ఈ పాల్ . స్వతహాగా కాపు కులానికి చెందిన వాడైనప్పటికీ దళిత మహిళను పెళ్లి చేసుకున్నాడు కే ఏ పాల్ . అలాగే క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి విదేశాలు అయితే చుట్టొస్తున్నాడు . తాజాగా ఓ ఛానల్ లో చర్చల్లో పాల్గొన్న కె ఏ పాల్ పవన్ కళ్యాణ్ నా తమ్ముడి లాంటి వాడని అతడ్ని ఆంధ్రప్రదేశ్ కు సీఎం ని చేస్తానని , అయితే అతడు నా ప్రజా శాంతి పార్టీలో చేరాలని అంటున్నాడు . అంతేనా పవన్ ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెడితే నేను ప్రపంచ దేశాలు చుట్టొచ్చి లక్ష కోట్లు తీసుకొస్తానని అంటున్నాడు . ఇక పవన్ కళ్యాణ్ కూడా కె ఏ పాల్ కు ఏమి తీసిపోవడం లేదు . 2019 లో నేనే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు . అసలు ...

ఈ భామ మహేష్ ని ముంచుతుందా ?

పూజా హెగ్డే ……. అందాల భామ అందులో అనుమానం లేదు కాకపోతే ఈ భామ నటించిన చిత్రాలేవీ ఇంతవరకు హిట్ కాలేదు . హీరోయిన్ గా నటించిన చిత్రాలన్నీ ప్లాప్ ……. కాకపోతే ఐటెం సాంగ్ చేసిన రంగస్థలం మాత్రమే బ్లాక్ బస్టర్ . అయితే రంగస్థలం చిత్రంలో ఈ భామ హీరోయిన్ కాదు కాబట్టి ఒక పాట కోసం మూడు నిముషాలు అలా నర్తించి ఇలా వెళ్ళిపోయింది కాబట్టి ఈమె ఖాతాలో ఆ సినిమా వేయలేం . ఇక హీరోయిన్ గా నటించిన చిత్రాల్లో అరవింద సమేత వీర రాఘవ చిత్రం కూడా ఉంది . ఇది దసరా సెలవుల మధ్య విడుదల అయ్యింది కాబట్టి ఆ మాత్రం వసూళ్లు వచ్చాయి లేదంటే ఇంకా ఘోర పరాజయం పొందేది . ఒక్క నైజాం లో మాత్రమే హిట్ అయ్యింది అరవింద సమేత , మిగతా అన్నిచోట్లా బయ్యర్లు నష్టపోయారు . టాలీవుడ్ లో ఈ భామ హీరోయిన్ గా ఒక లైలా కోసం , ముకుంద , దువ్వాడ జగన్నాథం , సాక్ష్యం , అరవింద సమేత చిత్రాలు చేయగా రంగస్థలం లో ఐటెం సాంగ్ చేసింది . ఇక ఇప్పుడేమో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మహర్షి చిత్రంలో నటిస్తోంది . హిందీలో నటించిన సినిమా మొహంజదారో కూడా ప్లాప్ అయ్యింది దాంతో మహేష్ ఫ్యాన్స్ భయపడుతున్నారు . ఈ భామ మహేష్ కు హిట్ ఇస్తుందా ? లేక ముంచుతుందా ? అని . ఏం చేస్తుందో తెలియాలం...

మరో హీరోతో రొమాన్స్ చేయనున్న టాక్సీ వాలా భామ

విజయ్ దేవరకొండ సరసన టాక్సీ వాలా చిత్రంలో నటించి సూపర్ హిట్ కొట్టేసిన భామ ప్రియాంక జవాల్కర్ తాజాగా మాస్ మహారాజ్ రవితేజ తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతోంది . ఇటీవలే అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో నిరాశపరిచిన రవితేజ తాజాగా ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే . కాగా ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు కాగా అందులో ఒక భామగా ప్రియాంక జవాల్కర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . ఇక మరో భామ కూడా హాట్ భామే! ఇంతకీ ఆ భామ ఎవరో తెలుసా ……. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన శృంగార దేవత పాయల్ రాజ్ పుత్ . ఈ భామని కూడా ఒక హీరోయిన్ గా ఎంపిక చేశారట . ఇద్దరు హాట్ భామలు రవితేజ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు . టాక్సీ వాలా చిత్రం ప్రియాంక జవాల్కర్ కు మొదటి చిత్రం . కాగా మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టేసిన ఈ భామ ఫుల్ జోష్ గా ఉంది ఎందుకంటే అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి మరి అందుకు . English Title: Priyanka Jawalkar romance with Raviteja from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews h...

కేటీఆర్ ని సూటిగా ప్రశ్నించిన దర్శకుడు

కేటీఆర్ సార్ ! మీ ప్రభుత్వ పనితీరు ఇదేనా ? హైదరాబాద్ నగరంలోనే వైద్యం అందక ఓ ప్రాణం పొతే ఇక జిల్లాల పరిస్థితి ఏంటి ?అంటూ తెలంగాణ ఐటీ శాఖా మంత్రి పై నిప్పులు చెరిగాడు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ . మహానటి చిత్రం కోసం పనిచేసిన కెమెరామెన్ ఆదివారం రోజున హైదరాబాద్ లో రోడ్డు యాక్సిడెంట్ కి గురయ్యాడు . యాక్సిడెంట్ జరిగి గాయాల పాలు కావడంతో అతడ్ని సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారట . అక్కడ స్టెచర్ మీద తీసుకెళ్లే సిబ్బంది కూడా లేకపోవడంతో పాపం ఆ కెమెరామెన్ తల్లిదండ్రులే ఏడ్చుకుంటూ గాయాలపాలైన కొడుకుని చికిత్స కోసం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు కూడా లేరు దాంతో మూడు గంటల పాటు ప్రాణాలతో విలవిలలాడి చనిపోయాడట . ఇంకేముంది తన మిత్రుడు సకాలంలో వైద్యం అందకుండా చనిపోయాడని తెలుసుకున్న నాగ్ అశ్విన్ ప్రభుత్వ పనితీరు పట్ల , కేటీఆర్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేరుగా కేటీఆర్ కు హ్యాష్ ట్యాగ్ చేసాడు . ఈ మహానగరంలో వైద్యం అందకుండా చనిపోవడం ఏంటి ? ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు నాగ్ అశ్విన్ . గాంధీ ఆసుపత్రి కాకుండా మరో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే నా ఫ్రెండ్ ...

2.5 కోట్లకు అల్లు శిరీష్ “ఏబీసీడీ” హిందీ శాటిలైట్ హక్కులు

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మలయాళంలో సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండడంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. 2.5 కోట్లకు గోల్డ్ మైన్ ఫిల్మ్స్ హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కులు సొంతం చేసుకోవడం విశేషం. గోల్డ్ మైన్ ఫిలిమ్స్ మంచి ఫ్యాన్సీ రేట్ కి హిందీ హక్కుల్ని తీసుకోవడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పటికే సౌతర్న్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పది చిత్రాల హిందీ శాటిలైట్, డిజిటల్ హక్కులు ఇదే సంస్థ కొనుగోలు చేసిం...

తప్పంతా నాదే అంటున్న స్టార్ హీరో

థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ప్లాప్ కావడానికి ఎవరో కారణం కాదు , తప్పంతా నాదే ‘ అని అంటున్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ . అమితాబ్ బచ్చన్ , అమీర్ ఖాన్ , కత్రినా కైఫ్ లు నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం ఇటీవలే విడుదలై ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే . 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ బాహుబలి ని ఢీకొట్టే చిత్రం అంటూ ప్రచారం జరిగింది . ఆ ప్రచారానికి తగ్గట్లుగా అమితాబ్ , అమీర్ , కత్రినా లు నటించడంతో ఈ సినిమాపై అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి . అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యింది థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ . ఈ సినిమాని కొన్న బయ్యర్లు ఘోరంగా నష్టపోవడంతో ఆందోళన చేపట్టారు కూడా . కానీ నిర్మాత నుండి మాత్రం హామీ లభించలేదు . కట్ చేస్తే ఇప్పుడు అమీర్ ఖాన్ క్షమాపణ చెబుతున్నాడు . తప్పంతా నాదే ! ఏదో అనుకోని చేసాం …. ఇంకేదో అయ్యింది కాబట్టి తప్పు వేరే వాళ్ళ మీద నెట్టేయలేం అంటూ సెలవిచ్చాడు కానీ భారీగా నష్టపోయిన బయ్యర్ల పరిస్థితి ఏంటి అన్నది మాత్రం చెప్పలేదు అమీర్ ఖాన్ . English Title: Its my blunder mistake : AAMIR KHAN from టాప్ స్టోరీస్ – Telug...

యుగానికి ఒక్కడు సీక్వెల్

2010 లో విడుదలై సూపర్ హిట్ అయిన చిత్రం యుగానికి ఒక్కడు . కార్తీ , రీమా సేన్ , ఆండ్రియా లు నటించిన యుగానికి ఒక్కడు చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది , దాంతో ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన చేస్తున్నాడు దర్శకుడు సెల్వ రాఘవన్ . టాలీవుడ్ లో సెల్వ రాఘవన్ పలు చిత్రాలు చేసిన విషయం తెలిసిందే . 7/జి బృందావన్ కాలనీ , ఆడవారి మాటలకు అర్దాలే వేరులే చిత్రాలతో విజయాలు అందుకున్నాడు సెల్వ రాఘవన్ . 7/జి బృందావన్ కాలనీ చిత్రంలో నటించిన హీరోయిన్ సోనియా అగర్వాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే యుగానికి ఒక్కడు సినిమా విడుదల అయ్యాక ఆమెకు విడాకులు ఇచ్చాడు .దాంతో నాలుగేళ్ళ కాపురానికి తెరపడింది . 2011 లో గీతాంజలి రామన్ ని పెళ్లి చేసుకున్నాడు సెల్వ , ఇక యుగానికి ఒక్కడు సినిమా సమయంలో కార్తీ చిన్న హీరో మాత్రమే ! కానీ ఇప్పుడు స్టార్ హీరో తమిళనాట మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరో కార్తీ . దాంతో సీక్వెల్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు సెల్వ రాఘవన్ . చోళ రాజుల పరిపాలన అంటే నాకు అమితమైన ఆసక్తి అందుకే యుగానికి ఒక్కడు చిత్రానికి సీక్వెల్ ఆలోచన చేస్తున్నాను అని అంటున్...

పూరి కొడుకు పక్కన కొత్త పోరి

ఆకాష్ పూరి పక్కన కొత్త పోరి ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు దర్శకులు పూరి జగన్నాధ్ . హీరోగా తన కొడుకుని రీ లాంచ్ చేసిన చిత్రం కూడా ప్లాప్ కావడంతో ఈసారి నేను కాదు అంటూ అతడు మెగా ఫోన్ ని పక్కన పెట్టి తన దగ్గర దర్శత్వశాఖలో పనిచేసిన అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు పూరి . ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మోడల్ గాయత్రి భరద్వాజ్ ని పరిచయం చేస్తున్నాడు . గాయత్రి భరద్వాజ్ చూడ చక్కగా ఉండటంతో ఈ భామ టాలీవుడ్ లో పాతుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది . మోడల్ గా రాణిస్తున్న ఈ హాట్ భామ సిల్వర్ స్క్రీన్ పై ఎలా మెరుస్తుందో చూడాలి . ఇక ఈ సినిమాకు ” వాస్కోడగామా ” అనే టైటిల్ ని పెట్టె పనిలో పడ్డాడు పూరి . మాఫియా నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రం కూడా లవ్ ని మిక్స్ చేసాడు పూరి . గతకొంత కాలంగా విజయాలు లేక ఆర్ధికంగా , హార్దికంగా చితికిపోతున్నాడు పూరి జగన్నాధ్ . అయినప్పటికీ తన కొడుకుని హీరోగా నిలబెట్టడానికి మళ్ళీ మళ్ళీ రిస్క్ చేస్తూనే ఉన్నాడు . మెహబూబా అనే సినిమా చేసి నిండా మునిగాడు పూరి . కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ కొడుకుతో సినిమా చేస్తున్నాడు . మరి ఇది ఏమౌతుందో చూడాలి .   English Title:  Akash puri next...

అభిమానిని పట్టించుకోని పవన్ కల్యాణ్

అభిమానులు హీరోలకు బూస్ట్ లాంటివాళ్ళు. వాళ్ళ సినిమాలు విడుదలయ్యాక హల్‌చల్ చేసేది వాళ్ళే. మరి సదరు హీరోగారు రాజకీయాల్లోకి వచ్చాక, ఆ అభిమానులు ఆయనను రాజకీయాల్లో కూడా హీరోను చెయ్యాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారికేమైనా అయితే వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ఆయనదే కదా. మరి జనసేన అధినతే పవన్ కల్యాణ్ ఓ అభిమాని విషయంలో ఎందుకు కినుకు వహిస్తున్నారని అభిమాని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అభిమానులు నిర్వహించిన బైక్‌ ర్యాలీలో గాయపడి కిడ్నీని కోల్పోయిన తన కుమారుడిని పవన్‌ కల్యాణ్‌ ఏ మాత్రం పట్టించుకోలేదని బాధితుడి తండ్రి మొళ్ల వీరబాబు బాధ పడుతున్నాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… మొళ్ల వీరబాబుది పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం హుకుంపేట గ్రామం. గత నెల 9న దేవరపల్లిలో పవన్‌ అభిమానుల బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో వీరబాబు కుమారుడు రాజ మనోహర్‌ పాల్గొనగా, మనోహర్‌ను బైక్‌ ఢీ కొట్టింది. కిందపడ్డ అతనిపై నుంచి మరో బైక్‌ వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన రాజ మనోహర్‌ను స్నేహితులు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఓ కిడ్నీ పూర్తిగా దెబ్బతిందని కిడ్నీని తొలగించారు వైద్యులు. ఈ ఆపరేషన...

టాక్సీ వాలా 10 డేస్ కలెక్షన్స్

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం పది రోజుల్లో దాదాపు 20 కోట్ల షేర్ వసూల్ చేసి ప్రభంజనం సృష్టించింది . సినిమా హిట్ అయితే చాలు దేవుడా అని అనుకున్న విజయ్ కి టాక్సీ వాలా రూపంలో బ్లాక్ బస్టర్ దొరికింది . నవంబర్ 17 న విడుదలైన టాక్సీ వాలా చిత్రం మొత్తం పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 19. 95 కోట్ల షేర్ వసూల్ చేయడంతో ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్య పోతున్నారు . యావరేజ్ చిత్రంగా టాక్ తెచ్చుకున్న టాక్సీ వాలా 20 కోట్ల షేర్ సాధించడం ఏంటి అని చిత్ర బృందం కూడా షాక్ అవుతోంది . విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో ఈ విజయం , ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి . విజయ్ దేవరకొండ సరసన హాట్ భామ ప్రియాంక జవాల్కర్ నటించగా కీలక పాత్రలో మలయాళ భామ మాళవిక నాయర్ నటించింది . పది రోజుల్లో ఏరియాల వారీగా టాక్సీ వాలా వసూళ్లు ఇలా ఉన్నాయి . తెలంగాణ : 7.40 కోట్లు రాయలసీమ : 1.55 కోట్లు ఉత్తరాంధ్ర : 1.72 కోట్లు ఈస్ట్ : 87 లక్షలు వెస్ట్ : 75 లక్షలు గుంటూరు : 1.05 కోట్లు కృష్ణా : 1.05 కోట్లు నెల్లూరు : 41 లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.35 కోట్లు ఓవర్ సీస్ : 2.80 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం : 19.95 కోట్లు English Title:  ...

లేవగానే ఆడవాళ్ళ తొడలు చూస్తాడట

నేను నిద్ర లేవగానే ఆడవాళ్ల తొడలు చూసే రకం అని సంచలన వ్యాఖ్యలు చేసాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ . అమ్మాయిల తోడు , మందు , సినిమా ఇదే నా జీవితం అంటూ పలుమార్లు ప్రకటించిన వర్మ తాజాగా భైరవగీత చిత్రం కోసం ప్రచారం మొదలు పెట్టాడు . అయితే కామన్ గా భైరవగీత సినిమా గురించి మాత్రమే చెబితే ఎవరూ పట్టించుకోరు కాబట్టి రజనీకాంత్ 2. ఓ చిత్రం పై కామెంట్ చేసి అటెన్షన్ కొట్టేసాడు . ఇక ఇప్పుడేమో ఆడవాళ్ళ తొడలు చూడటం తోనే నా ఉదయం పార్రంభం అవుతుందని వ్యాఖ్యానించాడు . భైరవగీత ప్రమోషన్ కంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రచారంలో నానాలని చూస్తున్నాడు వర్మ అందుకే తొడల గురించి మళ్ళీ కామెంట్ చేసాడు . మీ టూ ఉద్యమం భారత్ లో ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది అయితే అందులో ఎవరెవరి పేర్లో వచ్చాయి దాంతో నా పేరు కూడా వస్తుందని ఆశించాను కానీ రాలేదు ఏంటో మరి ! అంటూ నిర్వేదంతో అంటున్నాడు వర్మ . నిజమే ! వర్మ స్టైలే వేరు . మందు మగువ లేనిదే ముద్ద దిగదు . ఈ విషయాన్నీ పలుమార్లు చెప్పాడు వర్మ కానీ ఒక్కరు కూడా వర్మ పై లైంగిక ఆరోపణలు చేయలేదు ఎందుకో ! ఆశ్చర్యమే మరి . English Title: Ram gopal varma comments again on thighs from ...