Skip to main content

Posts

Showing posts from 2020

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రివ్యూ

World Famous Lover Movie Review in Telugu నటీనటులు: విజయ్ దేవరకొండ ,   రాశి ఖన్నా , క్యాథెరిన్, ఇజబెల్, ఐశ్వర్య రాజేష్ తదితరులు దర్శకుడు: క్రాంతి మాధవ్ నిర్మాత: వల్లభ సంగీత దర్శకుడు: గోపి సుందర్ విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2020 రేటింగ్: 3.5 /5 విజయ్ దేవరకొండ మరో ప్రేమకథతో మన ముందుకు వచ్చాడు. తన కెరీర్ లో వచ్చిన హిట్స్ అన్నీ ప్రేమకథలే. ఈ నేపథ్యంలో మరో భిన్నమైన ప్రేమకథను ఎంచుకున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ గా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. అయితే విడుదలకు ముందే సరైన అంచనాలను ఏర్పరుచుకున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ: గౌతమ్ (విజయ్ దేవరకొండ) రైటర్ అవ్వాలన్న తన కల కోసం చేస్తున్న జాబ్ ను కూడా మానుకుంటాడు. తన కలను నెరవేర్చుకునే పనిలో భాగంగా తన లవర్ యామిని (రాశి ఖన్నా)ను పట్టించుకోవడం మానేస్తాడు. ఈ కారణంగా ఆమె గౌతమ్ ను వదిలేసి వెళ్ళిపోతుంది. దాని తర్వాత గౌతమ్ కథలు రాయడం మొదలుపెడతాడు. యల్లందు అనే పల్లెటూరులో ఒక మధ్య తరగతి ప్రేమకథ. ప్యారిస్ లో ఒక న్యూ ఏజ్ ప్రేమ కథ.. ఇలా భిన్నమైన ప్రేమకథలు రాస్తాడు. నేపధ్యాలు భిన్నవైనా ఆ ప్రేమకథలు ఏ తీరానికి చ...

“గురూ గారూ…! ఎందుకు సార్ మనకు ఇవన్నీ..”

“గురూ గారూ…! ఎందుకు సార్ మనకు ఇవన్నీ..” ప్రపంచంలో ఎన్నో రకాల ఆకులు ఉంటాయి. కొన్ని తులసిఆకు లాగా పూజకు పనికి వస్తాయి. కొన్ని గోరింటాకు లాగా అందానికి పనికి వస్తాయి. ఇక కొన్ని అరుదైన జాతులు ఉంటాయి. ఆకులే కదా..! అని లోకువగా చూడకుండా వాటిని చూసి చూడనట్లు వదిలేయ్యాలి. ఎందుకంటే అవి ఒక ఘనకార్యం నిమిత్తం ఎర్త్ మీదకు ఎంట్రీ ఇచ్చి ఉంటాయి. అలాంటి అరుదైన ఆకులలో ఒకటి “దురదగుంటాకు”. ఇక దాని గొప్పతనం గురించి అందరికీ తెలుసు. అలాంటి దురదగుంటాకు లాంటి అరుదైన వ్యక్తి “రామ్ గోపాల్ వర్మ.” ఇక ఆర్జీవీ ఘనత అలా.. పక్కన పెడితే, ప్రముఖ సాహిత్య రచయిత, అద్భుతమైన జ్ఞానిశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు. ఎన్నో గొప్ప పాటలు రాసి, నిజంగానే తెలుగు సినిమా స్థాయిని పెంచిన గీత రచయిత ఆయన. ఇప్పుడు ఆయన “ ఆర్జీవి ” సినిమాకు దర్శాత్వం వహిస్తున్నారు. బాల కుటుంబరావు గారు నిర్మాత. సొసైటీ లో కొంతమంది స్వేఛ్చ పేరుతో జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దానివల్ల కలిగే కష్ట నష్టాలు వినోదాత్మకంగా చూపిస్తున్నామని జొన్నవిత్తుల గారు తెలిపారు. గతంలో కూడా ఆయన హాస్యనటుడు ఆలీతో “సోంబేరి” అనే సినిమా చేసారు. ఇక ఇప్పుడు ఎదో గతంలో ఆయనక...

“ప్రేమికుల రోజు” నాడు మాట మార్చిన మెగా ప్రిన్స్

Solo Brathuke So Better Theme Video “కోపం,ఇష్టం,విచారం,సంతోషం,ఆనందం,బాధ ఇవన్నీ కాలంతోపాటు కారణాలతోపాటు మారిపోయే ఫీలింగ్స్. మరి ప్రేమ కూడా ఒక ఫీలింగ్ గే కదా..! మారిపోదని గ్యారెంటీ ఏంటి.?” అని గట్టిగా నిలదీస్తున్నాడు..మెగా సుప్రీమ్ హీరో సాయితేజ్ . మన గోల్ ఏంటి.? అని అడిగితే సోలో లైఫ్ అనీ, మన అజెండా ఏంటి.? అని అడిగితే ఫ్రీడమ్ అని సింగిల్ క్లబ్ మెంబర్ ల చేత చెప్పిస్తున్నాడు. ఇక తను మాట్లాడుతున్నప్పుడు వెనకాల జీవితంలో బ్రహ్మచారులు గా మిగిలిపోయిన గొప్పవాళ్లు అయిన అటల్ బిహారీ వాజ్ పేయి, ఆర్ నారాయణ మూర్తి, మరియు అబ్దుల్ కలాం అలాంటి మహానుభావుల ఫోటోలు పెట్టుకున్నాడు. ఇదంతా “ సోలో బ్రతుకే సో బెటర్ ” అనే సినిమా కోసం. ఈ సినిమాలో సాయి తేజ సరసన ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై B.V.S.N ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు తేజ్ జాన్ జిగిరీ దోస్త్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. సుబ్బు అనే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. వెరైటీ ఏంటంటే ఇంతకు ముందు ఇదే సాయితేజ్ “పిల్లా నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే” అని ప్రేమ పాఠాల...

అల వైకుంఠపురములో హిందీ రీమేక్: సూపర్ స్టార్ ఆసక్తి

అల వైకుంఠపురములో హిందీ రీమేక్: సూపర్ స్టార్ ఆసక్తి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురములో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా అక్కడి నుండి ఎక్కడా వెనక్కి తిరిగి చూసింది లేదు. రోజురోజుకీ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతూ వెళ్లడంతో నెమ్మదిగా అల వైకుంఠపురములో హిట్ స్టేటస్ నుండి సూపర్ హిట్ అక్కడి నుండి బ్లాక్ బస్టర్ ఆపై నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ స్థాయికి ఎదిగింది. తెలుగులో ఈ చిత్రం 120 కోట్ల ప్లస్ షేర్ సాధించడం విశేషం. బాహుబలి 2 తర్వాత ఈ చిత్రమే టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అటు యూఎస్ లో కూడా ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ సాధించింది. 3 మిలియన్ ప్లస్ వ్యూస్ తో టాప్ 3 ప్లేస్ లో నిలిచింది. అల వైకుంఠపురములో సక్సెస్ అటు బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించింది. తెలుగు సినిమాలపై హిందీ ఫిల్మ్ మేకర్స్ దృష్టి ఈ మధ్య ఎక్కువైంది. ఇక్కడ మంచి సినిమాలు ఏవైనా రీమేక్ కు ఛాన్స్ ఉందేమోనని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అల వైకుంఠపురములో రీమేక్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే అల్లు అరవింద్, ఎ...

“అల…వైకుంఠపురం లో” జంట మరో సినిమా

“అల…వైకుంఠపురం లో” జంట మరో సినిమా “అల.. వైకుంఠపురంలో”  సినిమాలో జంట అంటే కేవలం అల్లు అర్జున్ & పూజ హేగ్దే మాత్రమె కాదు, అక్కినేని సుశాంత్ – నివేదా పేతురాజ్ కూడా ఉన్నారు. అసలు అంత పెద్ద సినిమాలో హీరో& హీరోయిన్స్ తోపాటు మరొక జంట మధ్య కూడా ఒకటి,రెండు లవ్ సీన్స్ ప్లాన్ చేసి, రిజిస్టర్ చెయ్యడం అంత ఈజీ కాదు. అసలు అక్కడ స్పేస్ లేదు.. కానీ గురూజీ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. ఒక క్రియేటర్ ఏదీ చేసినా ఆశి అక్కడితో ఆగిపోదు. ఇప్పుడు అక్కినేని సుశాంత్ & నివేదా పేతురాజ్ జంటగా మరొక సినిమా ఫైనల్ అయినట్లు సమాచారం. అల.. సినిమాలో లాగే ఇందులో కూడా సుశాంత్ – నివేదా కొత్త సినిమా కంప్లీట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాకు ఒక కొత్త దర్శకుడి పేరుతో పాటు ఇప్పటికే సుశాంత్ తో సినిమా చేసిన మరొక దర్శకుడి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కరెక్ట్ కథ, క్యారెక్టర్, డైరెక్టర్ సెట్ అయితే సుశాంత్ నుండి ఛి.ల.సౌ లాంటి సూపర్ హిట్ సినిమా రావడం గ్యారంటీ. ప్రస్తుతం సుశాంత్ “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే సినిమా చేస్తున్నాడు.లేట్ సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెంటనే ఈ...

కేజిఎఫ్ 2 క్లైమాక్స్ : బాహుబలి2 కంటే భారీగా!

కేజిఎఫ్ 2 క్లైమాక్స్ : బాహుబలి2 కంటే భారీగా! కేజిఎఫ్ చిత్రం విడుదలైనప్పుడు అదొక సంచలనం. కన్నడ సినిమాలపై నేషనల్ వైడ్ దృష్టి పడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే కేజిఎఫ్ అనే సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ కావడం విశేషం. ఈ చిత్రం అన్ని వర్గాలను అలరించింది. రాకీ భాయ్ గా యష్ నటన, టేకింగ్, డైలాగ్స్. సినిమాటోగ్రఫీ, గోల్డ్ మైన్స్ సెటప్ ఇలా అన్నీ చిత్రానికి ప్లస్ గా నిలిచాయి. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కన్నడతో పాటు అన్ని భాషల్లో హిట్ కొట్టడం అంటే మాములు విషయం కాదు. యష్ ఈ చిత్రం తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అంతకు మూడింతల పెట్టుబడి వెనక్కి తేవడం విశేషం. ఇప్పుడు అదే ఊపుతో ఈ చిత్రానికి సెకండ్ పార్ట్ సిద్ధమవుతోన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదే ఏడాది చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నాయి. ఒక్కసారి షూటింగ్ పూర్తయితే కానీ విడుదల తేదీ గురించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కేజిఎఫ్ 2 గురించి ఇప్పటికే చాలా వార్తలు ప్రేక్షకులను ఆసక్తి కలిగించాయి. రీసెంట్ గా ఈ సి...

టాలీవుడ్ లో మరో జూనియర్ సమంత

టాలీవుడ్ లో మరో జూనియర్ సమంత “మనిషిని పోలిన మనిషి ప్రపంచంలో ఏడుగురు ఉంటారు…” అని ఎప్పుడో ఎవరో ఏదో అన్నట్లు గుర్తు. అంతేలే బ్రహ్మదేవుడు అయినా కానీ, ఎంతమందినని క్రియేట్ చేస్తాడు.? ఎంత మంది మనుషులను సృష్టించినా ఆయన్ని మాత్రం ఈ జనాలు గుర్తుపెట్టుకోరు. అందరికీ గుళ్ళు కడతారు కానీ, తమని సృష్టించిన బ్రహ్మ దేవుడికి మాత్రం ఒకే ఒక్క గుడి కూడా కట్టారు. అదే ప్రపంచంలో ఉన్న వెరైటీ అంటే. సరే ఇప్పుడు పాయింట్ లోకి వస్తే టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలకు వాళ్ల పోలికలతోనే ఉండే కొంతమంది జూనియర్స్ సోషల్ మీడియాలో మరియు బయట కనపడుతూ ఉంటారు. సీనియర్ ఎన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణ గారి తో మొదలుపెట్టి ప్రస్తుతం చిరంజీవి గారు జూనియర్ ఎన్టీఆర్ గారి పోలికలతో ఉండే మనుషులు కూడా బయట తిరుగుతూ ఫేమస్ అయ్యారు. అయితే హీరోయిన్ పోలికలతో ఉండే అమ్మాయిలు ఉండటం అదేవిధంగా ఆ హీరోయిన్ అలాగే ఉండటం చాలా రేర్.  “ఏ మాయ చేసావే” సినిమాతో టాలీవుడ్ లో నిజంగానే మాయ చేసిన సమంత పోలికలతో ఇప్పటికే ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ మనకి తెలుసు. ఆమె పేరు అశు రెడ్డి. తను ఎంత ఫేమస్ అయిందంటే, అంటే బిగ్ బాస్ సీజన్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. క...

వరల్డ్ ఫేమస్ లవర్.. దేవరకొండ చేతుల్లోనే అంతా!

వరల్డ్ ఫేమస్ లవర్.. దేవరకొండ చేతుల్లోనే అంతా! విజయ్ దేవరకొండ కు యూత్ లో క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు వసూళ్లు అదిరిపోతాయి. అయితే సినిమా ఫలితం మాత్రం కంటెంట్ మీద ఆధారపడాలి. విజయ్ నటించిన లాస్ట్ సినిమా డియర్ కామ్రేడ్ ప్లాప్ అయిన నేపథ్యంలో తన లేటెస్ట్ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ తో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా నేడే విడుదల కానుంది. చాలా తక్కువ సినిమాలతోనే విజయ్ కు స్టార్ డం వచ్చేసింది. హిట్ అయిన సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్స్ కావడంతో విజయ్ ఇమేజ్ అమాంతం పెరిగింది. అందులోనూ విజయ్ దేవరకొండ చేసే పనులకు యూత్ ఫిదా అయిపోయారు. రౌడీ అనే ట్యాగ్ లైన్ ను విజయ్ వాడుకోవడంతో ఇన్స్టంట్ గా వాళ్లకు కనెక్ట్ అయిపోయారు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి అన్నీ తానై వ్యవహరించాడు విజయ్. ఈ చిత్రానికి తనే క్రౌడ్ పుల్లర్. ఈ సినిమా ద్వారా విజయ్ కు పెద్ద టార్గెట్ ఉంది. దాదాపు 30 కోట్ల మేర వసూలు చేయాలి. అయితే టాక్ బాగుంటే ఈ మొత్తం విజయ్ కు పెద్ద కష్టం కాకపోవచ్చు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి మొదటి టాక్ ఎలా ఉం...

పెళ్లి చూపులు భామ మూడు సినిమాలను పట్టేసిందిగా

పెళ్లి చూపులు భామ మూడు సినిమాలను పట్టేసిందిగా సినిమా ఎవర్ని ఎప్పుడు ఎలా టర్న్ చేస్తుందో ఎవరూ చెప్పలేరు. పెళ్లి చూపులు సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమాలో నటించిన రీతూ వర్మకు అవకాశాలు వెల్లువలా వస్తాయని అందరూ అనుకున్నారు. అంతలా ఆ సినిమాతో ప్రభావం చూపించిందీ భామ. తన నటనతో అందరినీ మెప్పించింది. అయితే రీతూ వర్మకు అవకాశాలు వెల్లువలా ఏమీ రాలేదు. ఏవో ఒకట్రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే చాలా మంది టాలెంటెడ్ హీరోయిన్లలానే రీతూ కూడా కోలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ సినిమాలతో బిజీ అయిపోయిన ఈ హీరోయిన్ ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ తెలుగు సినిమాల్లో బిజీ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో ఛాన్స్ లు పట్టేసింది. అవి కూడా అల్లాటప్పా సినిమాలు కాదు, జనాల్లో బజ్ ఉన్న సినిమాలే. మరి ఈ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. శర్వానంద్ హీరోగా తెలుగు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది. ఆ సినిమాలో హీరోయిన్ గా రీతూ వర్మ నటిస్తోంది. అది కాకుండా న్యాచురల్ స్టార్ నాని నటించనున్న టక్ జగదీష్ సినిమాలో హీరోయిన్ గా రీతూ వర్మ ఎంపికైంది. నాని సినిమాలకు ఉండే బజ్ వేరు. అందులోనూ ఈ సినిమాకు శి...

వరల్డ్ ఫేమస్ లవర్ ప్రివ్యూ

వరల్డ్ ఫేమస్ లవర్ ప్రివ్యూ నటీనటులు: విజయ్ దేవరకొండ,   రాశి ఖన్నా , క్యాథెరిన్, ఇజబెల్, ఐశ్వర్య రాజేష్ తదితరులు దర్శకుడు: క్రాంతి మాధవ్ నిర్మాత: వల్లభ సంగీత దర్శకుడు: గోపి సుందర్ విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2020 విజయ్ దేవరకొండ నటించిన సినిమాలకు యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ విజయ్ ప్రేమ కథలు చేసాడంటే దానిపై ఉండే ఆసక్తే వేరు. వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమాకు బజ్ చాలా బాగుంది. ప్రోమోలు, పాటలు అన్నీ కూడా చిత్రంపై అంచనాలు పెంచేసాయి. అందులోనూ తన కెరీర్ లో ఇదే చివరి ప్రేమకథ అని చెప్పి విజయ్ కూడా ఆసక్తికర కామెంట్లు చేయడంతో అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. విజయ్ సరసన ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటించడం విశేషం. రాశి ఖన్నా, క్యాథెరిన్, ఇజబెల్, ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. నాలుగు భిన్న ప్రపంచాలను ఈ చిత్రంలో చూపించామని దర్శకుడు క్రాంతి మాధవ్ తెలిపాడు. ప్రేమికుల రోజు స్పెషల్ గా ఈ చిత్రం విడుదల కానుండడం విశేషం. విజయ్ నటించిన ఆఖరి చిత్రం డియర్ కామ్రేడ్ ప్లాప్ అయిన నేపథ్యంలో విజయ్ ఈ సినిమాతో హిట్ కొట్ట...

ప‌వ‌న్ కోసం హాట్ హీరోయిన్?

ప‌వ‌న్ కోసం హాట్ హీరోయిన్? ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత సినిమాలు చేస్తున్నా ఆయ‌న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. అందుకే క్రిష్ ఆయ‌న క్రేజ్‌కి త‌గ్గ‌ట్టే పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన భారీ సెట్ల నిర్మాణం గ‌చ్చిబౌలీలోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో జ‌రుగుతోంది. తాజ్‌మ‌హ‌ల్ సెట్‌తో పాటు చార్మినార్‌, వాట‌ర్ ఫాల్స్ సెట్‌ని కూడా నిర్మిస్తున్నారు. అన్నీ పూర్త‌యితే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని క్రిష్ భారీ గానే ప్లాన్ చేస్తున్నారు. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ బందిపోటు దొంగ పండుగ‌ల సాయ‌న్న‌గా క‌నిపించ‌బోతున్నారు. జాన‌ప‌ద చిత్రాల లుక్‌లో ఈ సినిమా వుండే అవ‌కాశం క‌నిపిస్తోంది. అంతేనా మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల క‌థ‌, కోహినూర్ వ‌జ్రం చుట్టూ ఈ చిత్ర క‌థ సాగుతుంద‌ని తెలుస్తోంది. అయితే ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా ప‌లువురిని ప‌రిశీలించిన క్రిష్ ఈ చిత్రం కోసం శ్రీ‌లంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని రంగంలోకి దింపుతున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆమ...

సాయిధ‌ర‌మ్‌తేజ్ మ‌ళ్లీ హిట్టు కొట్టేలా వున్నాడే!

సాయిధ‌ర‌మ్‌తేజ్ మ‌ళ్లీ హిట్టు కొట్టేలా వున్నాడే! `సుప్రిమ్‌` మూవీ త‌రువాత వ‌రుస ఫ్లాప్‌ల‌ని ఎదుర్కొన్న సాయిధ‌ర‌మ్‌తేజ్‌ కు ఇటీవ‌ల వ‌చ్చిన ` చిత్ర ల‌హ‌రి ` చిత్రంతో ఊర‌ట ల‌భించింది. ఇక `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రం సూప‌ర్‌హిట్ గా నిల‌వ‌డంతో సాయిధ‌ర‌మ్‌తేజ్ స‌క్సెస్ ట్రాక్ ఎక్కేశాడు. అదే ఊపుతో `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` చిత్రాన్ని చేస్తున్నాడు. భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సింగిల్‌గా వుండ‌ట‌మే సోబెట‌ర్ అనే స్లోగ‌న్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సింగిల్స్ అంథెమ్ వీడియోని వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా  హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేశారు. `సింగ‌ల్ సోద‌ర‌సోద‌రీమ‌ణులారా…ఇది మ‌న ఫీలింగ్‌.. మిగ‌తా వాళ్లు వాలెంటైన్స్‌డేని సెల‌బ్రేట్ చేసుకోవ‌చ్చు… అంటూ సింగిల్ అంథెమ్ వీడియోని షేర్ చేశాడు. న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్ చేసిన తొలి సింగిల్ హీరో సాయి ధ‌ర‌మ్‌తేజ్ మాట‌ల‌తో మొద‌లై సింగిల్స్‌కి ఓ స్లోగ‌న్‌గా సాగింది. ఈ సి...

హీటెక్కిస్తున్న తేజ హీయిన్‌!

హీటెక్కిస్తున్న తేజ హీయిన్‌! సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `నువ్వు నేను` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది ఉత్త‌రాది చిన్న‌ది అనిత‌. తొలి సినిమా సూప‌ర్‌హిట్ కావ‌డంతో తెలుగులో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. సింధీ ఫ్యామిలీకి చెందిన అనిత ఆ త‌రువాత తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌రుస చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది. తెలుగులో అనిత న‌టించిన చివ‌రి చిత్రం `మ‌న‌లో ఒక్క‌డు`. ఆర్పీ ప‌ట్నాయ‌క్ ఇందులో హీరోగా న‌టించాడు. ఈ సినిమా త‌రువాత తెలుగులో క‌నిపించ‌కుండా పోయిన అనిత హిందీ సీరియ‌ల్స్‌లో రాణించ‌డం మొద‌లుపెట్టింది. నాగిన్ 3, నాగిన్ 4 సీరియ‌ల్స్‌తో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. 2013లో రోహిత్‌రెడ్డి అనే వ్యాపార వేత్త‌ని వివాహం చేసుకుంది. ఇద్ద‌రూ అన్యోన్యంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి త‌రువాత కూడా సీరియ‌ల్స్‌లో న‌టిస్తూనే వుంది. మ‌రో ప‌క్క హాట్ హాట్ ఫొటోల‌తో నెటిజ‌న్స్‌ని క‌వ్విస్తోంది. తాజాగా అనిత పెట్టిన ఓ ఫొటో నెటిజ‌న్స్‌ని హీటెక్కిస్తోంది. భర్త రోహిత్‌రెడ్డితో క‌లిసి వెకేష‌న్‌కి వెళ్లిన అనిత అక్క‌డ బాత్ ట‌బ్బులో న్యూడ్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ...

పాయ‌ల్ రాజ్‌పుత్ జాన్ ఇత‌నే!

పాయ‌ల్ రాజ్‌పుత్ జాన్ ఇత‌నే! ` RX100 ` సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. హాట్ హాట్ స‌న్నివేశాల్లో ఈజ్‌తో న‌టించి ఔరా అనిపించింది. ఇందు పాత్ర‌లో అత్యంత స‌హ‌జంగా న‌టించి ఆక‌ట్టుకుంది. ఆ త‌రువాత చేసిన `ఆర్‌డిఎక్స్` చిత్రంలోనూ అలివేలుగా న‌టించి శృంగార పాఠాలు నేర్పించిన పాయ‌ల్‌కు ఓ బాయ్ ఫ్రెండ్ వున్నాడ‌ట‌. అత‌నే త‌న జాన్ అంటూ ఏకంగా సోష్ మీడియా వేదిక‌గా త‌న అభిమానుల‌కు ప‌రిచ‌యం చేసి షాకిచ్చింది. పాయ‌ల్ బాయ్‌ఫ్రెండ్ పేరు సౌర‌భ్ డింగ్రా. అత‌ను ముంబైలో మోడ‌ల్‌. ఓకానొక సంద‌ర్భంలో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ట‌. ఇద్ద‌రూ గ‌త కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారు. ఒక‌రి లోపాల‌ని ఒక‌రు ఇష్ట‌ప‌డుతున్నారు. తాజాగా సౌర‌భ్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని ఇద్ద‌రి మ‌ధ్య వున్న అనుబంధాన్ని పాయ‌ల్ సోష‌ల్‌మీడియా ఇన్‌స్టా వేదిక‌గా బ‌య‌టిపెట్టింది. త‌న లోపాల‌ని ఇష్ట‌ప‌డే ఏకైక వ్య‌క్తి అంటూ త‌న ప్రియుడి పుట్టిన రోజు వేడుక‌ని త‌న అభిమానుల‌తో క‌లిసి పాయ‌ల్ జ‌రుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోల‌ని పాయ‌ల్ షేర్ చేసింది కూడా. ఆ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. పాయ...

సూర్య మామూలు హీరో కాదు రియ‌ల్ హీరో!

సూర్య మామూలు హీరో కాదు రియ‌ల్ హీరో! మ‌నం ఎంత సంపాదించాం అన్న‌ది కాదు.. ఎంత మందిని సంపాదించుకున్నాం. ఎంత మంచిని సంపాదించుకున్నాం అన్న‌ది ముఖ్యం. ఈ సూత్రాన్ని బాగానే వంట‌బ‌ట్టించుకున్నారు త‌మిళ హీరో సూర్య‌ . ఎంత ఎదిగినా ఒదిగి వుండే సూర్య గత ప‌దేళ్లుగా అగ‌రం షౌండేష‌న్ పేరుతో ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌ని న‌డిపిస్తున్నారు. దీని ద్వారా ఆర్థికంగా చితికి చ‌దువుకోలేని పిల్ల‌ల‌ని సేక‌రించి అగ‌రం ఫౌండేష‌న్ ద్వారా చ‌దువు చెప్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ తాను రీల్ హీరోను మాత్ర‌మే కాద‌ని రియ‌ల్ హీరోని కూడా అని నిరూపిస్తూ ప‌దిమందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన అగ‌రం ఫౌండేష‌న్ కార్య‌క్ర‌మంలో ఓ అమ్మాయి ధీన గాథ విని వేదిక‌పైనే చ‌లించి చిన్న పిల్లాడిలా క‌న్నీళ్లు పెట్టుకున్నారు సూర్య‌. తాజాగా ఆయ‌న చేసిన ఓ ప‌ని ప‌లువురిని అబ్బుర‌ప‌రుస్లోంది. విమానం ఎక్కాల‌న్న‌ది సామాన్యుడికి జీవిత‌కాలం ఓ క‌ల‌గానే మిగిలిపోతుంటుంది. అలాంటి ఓ వంద మంది సామాన్యుల క‌ల‌సి ఈ గురువారం నిజం చేసి సూర్య త‌న గొప్ప మ‌న‌సును మ‌రోసారి చాటుకున్నారు. సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం `సూర‌రాయిపోట్రు`. ఇదే చిత్రాన్ని తెలుగు...

ఆమీర్ క్యాలెండర్ 2020 రిలీజ్

ఆమీర్ క్యాలెండర్ 2020 రిలీజ్ బాలీవుడ్ లో ఉండే నటులలో ఆమీర్ ఖాన్ ఒక రకమైన మనిషి. “తనదే లోకం – తనదో తత్వం” అన్నట్లు ఉంటాడు. తనకు నచ్చితే తప్ప సినియా చెయ్యడు. సినిమా రిలీజ్ టైంలో కూడా తనకు మాత్రమే సాధ్యం అనిపించే విధంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తాడు ఆమీర్ ఖాన్. తన PK సినిమాకు యావత్ దేశం మొత్తం రకరకాల మారు వేషాలతో తిరిగి ప్రమోట్ చేసుకున్నాడు. తన గత చిత్రం “దంగల్” సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయి విజయం సాధించింది. ప్రస్తుతం ఆమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా హాలీవుడ్ నటుడు టామ్ హ్యంక్స్ నటించిన “ఫారెస్ట్ గంప్” కు రీమేక్. అయితే తాజాగా ముంబై కి చెందిన ప్రసిద్ద చిత్రకారుడు, ఆమీర్ అభిమాని మనోజ్ సిన్హా  ఆమీర్ ఖాన్ సినిమాలలో  హిట్ అయిన పాత్రలు వాటికి సంబంధించిన డైలాగ్స్ తో ఒక క్యారికేచర్ స్పెషల్ క్యాలెండర్ తయారు చేసారు. ఆ క్యాలెండర్ ని చూసిన ఆమీర్ ఖాన్ మురిసిపోయారు. అందాజ్ అప్నా అప్నా, దిల్ చాహతా హై, లగాన్, గజినీ, తారే జమీన్ పర్, 3 ఇడియట్స్, సీక్రెట్ సూపర్ స్టార్.. ఇలా అన్ని సినిమాల్లో ఆమీర్ క్యారెక్టర్ లు, డైలాగ్స్ అందులో క్రియేట్ చేసారు. ఇక ఆమీర్ ప్రస్...

క్రిష్ చెబుతున్న‌ది కోహినూర్ క‌థేనా?

క్రిష్ చెబుతున్న‌ది కోహినూర్ క‌థేనా? భార‌త జాతి సంప‌ద‌తో పాటు మ‌ణిమ‌కుట‌మైన కోహినూర్ వ‌జ్రాన్ని, నెమ‌లి సింహాస‌నాన్ని బ్రిటీష్ మూక‌లు మ‌న దేశం నుంచి అప‌హ‌రించుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే అది వారి చేతుల్లోకి ఎలా వెళ్లింది? ఎక్క‌డి నుంచి అది చేతులు మారుతూ చివ‌రికి బ్రిటీష్ వారికి చేతికి చిక్కింది అన్న‌దాని వెన‌క పెద్ద క‌థే వుంది. ఇప్పుడు ఆ క‌థ‌నే వెండితెర‌పై ఆవిష్క‌రిస్తున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాజాగా మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ` పింక్‌ ` రీమేక్‌లో న‌టిస్తున్న ప‌వ‌న్ ఆ వెంట‌నే క్రిష్ చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కించాడు. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ చిత్రంగా ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఏ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్న ఈ చిత్రం తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగ‌ల సాయ‌న్న క‌థ అని గ‌త వారం ప‌ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మొఘ‌ల్ సామ్రాజ్యం దేశాన్ని ఏలుతున్న కాలంలో తెలంగాణ‌లో ఉన్న‌వాడిని కొట్టి లేనివాడికి పంచిన రియ‌ల్ హీరో పండుగ‌ల సాయన్న‌. అత‌ని చేతికి కోహినూర్ వ‌జ్రం ఎ...

బ‌న్నీ ఆ సినిమా రైట్స్ వేస్ట్ చేశాడా?

బ‌న్నీ ఆ సినిమా రైట్స్ వేస్ట్ చేశాడా? అల్లు అర్జున్ న‌టించిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ కావ‌డంతో మ‌రో సినిమాతో ప్రేక్ష‌18 నెల‌లు ప‌ట్టింది. అయితే సీరియ‌స్ మోడ్ చిత్రాల్లో న‌టించిన స‌రైనోడు, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. ఇలా మూడు చిత్రాలు సీరియ‌స్ టోన్‌లో రూపొందిన‌వే కావ‌డంతో త‌దుప‌రి చిత్రంలో ఫుల్ ఎంట‌ర్‌టైన‌మెంట్ వుండాల‌నుకున్నార‌ట‌. ఇందు కోసం బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `సోనూకి టిటు కి స్వీటీ` చిత్ర తెలుగు రీమేక్ హ‌క్కుల్ని తీసుకున్నారు. ` అల వైకుంఠ‌పుర‌ములో ` చిత్రానికి ముందు త్రివిక్ర‌మ్‌తో ఈ చిత్రాన్నే రీమేక్ చేయాల‌నుకున్నారు. కానీ త్రివిక్ర‌మ్ చెప్పిన లైన్ న‌చ్చ‌డంతో ఆ చిత్రాన్ని ప‌క్క‌న పెట్టి కొత్త క‌థ‌తో ముందుకెళ్లారు. అదే `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచి బ‌న్నీకి మ‌ర‌పురాని విజ‌యాన్ని అందించింది. అయితే ఈ సినిమా ప్లేస్‌లో చేయాల‌నుకున్న`సోనూకి టిటు కి స్వీటీ` రీమేక్ రైట్స్ మాత్రం వేస్ట‌యిపోయాయని చెబుతున్నారు. ...

శివ 143 నాకు విలన్ గా మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది – నిర్మాత డిఎస్.రావు

శివ 143 నాకు విలన్ గా మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది – నిర్మాత డిఎస్.రావు నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేసిన డి.ఎస్.రావు వరుసగా సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఆయన శివ 143 సినిమాలో విలన్ గా నటించాడు. ఫిబ్రవరి14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంలో ఆయనతో స్పెషల్ ఇంటర్వ్యూ… నేను ఒకసారి మీటింగ్ లో ఉండగా డైరెక్టర్ తేజ గారు నన్ను చూసి నా నెక్స్ట్ సినిమాలో విలన్ నువ్వే అన్నారు, ఆచ్చర్యపోయి నిజమేనా అని ఆయన్ని అడిగాను, అలా మొదటిసారి హోరా హోరీ సినిమాలో విలన్ గా కెరీర్ స్టార్ట్ చేశాను. ఆ సినిమా తరువాత వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాను. ఇప్పటికి 30 పైగా చిత్రాల్లో నటించాను. మంచి పాత్రల్లో నటిస్తున్నాను, ఈ ఏడాదిలో నిర్మాతగా ఒక పెద్ద సినిమా చెయ్యబోతున్నాను. రామసత్యనారాయణ గారి శివ 143 సినిమాలో మంచి పాత్ర చేసాను, విలన్ గా నాకు మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందని భావిస్తున్నాను. డైరెక్టర్ శైలేష్ సాగర్ మంచి కథ రాసుకున్నాడు, సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ సహకారంతో నిర్మతగా మ...

సితార‌లో నాగ‌శౌర్య సినిమా మొద‌లైంది!

సితార‌లో నాగ‌శౌర్య సినిమా మొద‌లైంది! `అశ్వథ్థామ‌` వంటి యాక్ష‌న్ సినిమాతో రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు యంగ్ హీరో నాగ‌శౌర్య‌ . ఈ సినిమా మిశ్ర‌మ ఫ‌లితాన్ని అందించినా వెంట‌నే మరో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం ఈ గురువారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభమైంది. `పెళ్లిచూపులు` ఫేమ్ రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లిచూపులు, కేశ‌వ చిత్రాల త‌రువాత కోలీవుడ్ వెళ్లిపోయిన రీతూ వ‌ర్మ అక్క‌డ విక్ర‌మ్‌, గౌత‌మ్ మీన‌న్‌ల క‌ల‌యిక‌లో రూపొందుతున్న `దృవ‌న‌క్ష‌త్రం`లో న‌టించింది. ఈ సినిమా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పూర్తి కాక‌పోవ‌డంతో రీతూ కెరీర్ అక్క‌డే ఆగిపోయింది. దీంతో మ‌ళ్లీ తెలుగు బాట‌ప‌ట్టింది. శౌర్య సినిమాతో మ‌ళ్లీ తెలుగులో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది. కొత్త క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన న‌టీన‌టులు, కీల‌క సాంకేతిక వ‌ర్గం వివ‌రాల్న...

బ‌స్తీ బాల‌రాజ్ వ‌చ్చేశాడు!

బ‌స్తీ బాల‌రాజ్ వ‌చ్చేశాడు! `ఆర్ ఎక్స్ 100` సినిమాతో చిన్న‌ చిత్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన హీరో కార్తికేయ గుమ్మ‌కొండ‌. హీరోగా మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్నా ఆ త‌రువాత చేసిన వ‌రుస చిత్రాలు గుణ 369, 90 ఎం.ఎల్ ఆశించిన విజ‌యాల్ని అందించ‌లేక‌పోయాయి. దీంతో కొంత ఆలోచ‌న‌లోప‌డ్డ కార్తికేయ ఈ ద‌ఫా మెగా కాంపౌండ్‌లో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. గుణ 369 చిత్ర ట్రైల‌ర్ లాంచ్‌లో స‌ర‌దాగా గీతా ఆర్ట్స్‌లో సినిమా చేసే అవ‌కాశం ఇవ్వండి సార్ అని కార్తికేయ అడిగిన మాట‌ని నిజం చేస్తూ అల్లు అర‌వింద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాసు నిర్మాత‌గా నిర్మిస్తున్న చిత్రం `చావు క‌బురు చ‌ల్ల‌గా`. ఈ చిత్రం ద్వారా కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈచిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ గురువారం హైద‌రాబాద్‌లో మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని హీరో కార్తికేయ గుమ్మ‌కొండ ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ చిత్రంలో కార్తికేయ బ‌స్తీబాల రాజు పాత్ర‌లో ఊర‌మాస్ గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నారు. కార్తికేయ రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో కార్తికేయ గ‌ల్ల లు...

అకీరా, ఆద్యా కోసం ప‌వ‌న్ కాస్ట్‌లీ గిఫ్ట్‌?

అకీరా, ఆద్యా కోసం ప‌వ‌న్ కాస్ట్‌లీ గిఫ్ట్‌? ఏపీ రాజ‌కీయాల కార‌ణంగా గ‌త రెండేళ్లుగా సిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాజాగా వ‌రుస చిత్రాల‌తో స్పీడు పెంచిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` రీమేక్‌తో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టిన ప‌వ‌న్ ఈ సినిమా త‌రువాత మ‌రో మూడు చిత్రాల‌ని కూడా మొద‌లుపెట్టే ఆలోచ‌న‌లో వున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పిరియాడిక్ చిత్రాన్ని సైలెంట్‌గా ప్రారంభించారు కూడా. ఈ సినిమా త‌రువాత మ‌రో రెండు లేదా మూడు చిత్రాల్ని తెర‌పైకి తీసుకురానున్నార‌ట‌. ఇదిలా వుంటే త‌ను అంట‌గీక‌రించిన చిత్రాల‌కు పారితోషికం తీసుకోకుండా వాటాలు అడుగుతున్నార‌ని, ఆ రూపంలో ప‌వ‌న్‌కు ఒక్కో చిత్రానికి 40 నుంచి 50 కోట్ల వ‌ర‌కు అందే అవ‌కాశం వుంద‌ని తాజా స‌మాచారం. తాజాగా భారీ మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న పిల్ల‌లు అకీరా, ఆధ్యా కోసం కాస్ట్‌లీ గిఫ్ట్‌ని రెడీ చేయిస్తున్నారు. దీని ఖ‌రీదు అక్ష‌రాలా 5 కోట్ల‌ని తెలిసింది. రేణూ దేశాయ్‌ తో విడిపోయినా పిల్ల‌ల ఆల‌నా పాల‌నా ప‌వ‌నే చూస్తున్నారు. ఇందులో భాగంగా అకీరా, ఆధ్యాల కోసం...

యంగ్ హీరో నానితో తలపడుతున్నాడు

యంగ్ హీరో నానితో తలపడుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ చిత్రం V ఉగాది సందర్భంగా మార్చ్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే. ఇందులో నాని ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సాధారణంగా మన హీరోలు నటించే నెగటివ్ షేడ్స్ కాకుండా పూర్తి స్థాయి విలనీ ఈ చిత్రంలో పోషించాడని తెలుస్తోంది. సుధీర్ బాబు ఈ చిత్రంలో మరో కీలక పాత్ర చేయగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్సకత్వం వహించాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఉగాది సందర్భంగా రిలీజ్ కావడంతో వేరే సినిమాల నుండి పోటీ తప్పదని ట్రేడ్ పండితులు విశ్లేషించారు. అయితే పోటీ ఒక స్ట్రగ్లింగ్ హీరో నుండి రావడం కొత్తగా ఉంది. గత కొంత కాలంగా హిట్ ఇవ్వడం కోసం పాట్లు పడుతున్న రాజ్ తరుణ్ ఇప్పుడు నాని సినిమాతో తలపడబోతుండడం విశేషం. కెరీర్ మొదట్లో వరస హిట్లు ఇస్తూ యంగ్ హీరోల్లో బెస్ట్ ఆప్షన్ గా ఎదిగిన రాజ్ తరుణ్, క్రమంగా మంచి కథల్ని ఎంచుకోవడంలో విఫలమై వరస ప్లాప్స్ ను ఎదుర్కొన్నాడు. ఇప్పటికే వరసగా ఆరు సినిమాల ప్లాప్స్ అందుకున్న రాజ్ తరుణ్, ఇకనైనా హిట్ కొట్టకపోతే కెరీర్ కు చాలా ప్రమాదం. ఇతని లా...

చరణ్ ఫస్ట్ లుక్.. ఈసారైనా పక్కానా?

చరణ్ ఫస్ట్ లుక్.. ఈసారైనా పక్కానా? ఆర్ ఆర్ ఆర్.. గతేడాది నుండి ప్రేక్షకులు ఎక్కువగా వింటున్న పేరు. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయమున్నా ఏదోక అప్డేట్ తో ప్రేక్షకుల నోళ్ళలో నానుతోంది ఈ చిత్రం. దీనికి రాజమౌళి దర్శకుడన్నది ఒక కారణమైతే, రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి ఈ సినిమా చేస్తుండడం మరో కారణం. అయితే ప్రతి రాజమౌళి సినిమాలనే ఇది కూడా షూటింగ్ ఆలస్యమవ్వడం మూలాన ఈ ఏడాది జులైకి విడుదల కావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి షిఫ్ట్ అయిపోయింది. దీంతో ఫ్యాన్స్ కొంత నీరుగారినా, సినిమా ఎప్పుడు వచ్చినా తాము గర్వపడే రీతిలోనే ఉంటుంది కాబట్టి సర్ది చెప్పుకున్నారు. అయితే గతేడాది కాలం నుండి అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఆర్ ఆర్ ఆర్ టీమ్ ను అడుగుతూ వస్తోంది అప్డేట్స్ గురించే. ఈ సినిమా అప్డేట్స్ విషయంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ బొత్తిగా స్పందించకపోవడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా వివిధ రకాల మీమ్స్ చేసిన విషయం తెల్సిందే. ఏదైనా పండగ వస్తోందంటే గతేడాది నుండి ఆర్ ఆర్ ఆర్ నుండి అప్డేట్ వస్తుందని ప్రచారం జరగడం, తర్వాత అలాంటిదేం లేకపోవడం జరుగుతూ వస్తోంది. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్....

“భళా బన్ దేవ్” –“హాథీ మేరే సాథీ” టీజర్

“భళా బన్ దేవ్” –“హాథీ మేరే సాథీ” టీజర్ “సీత కష్టాలు సీతవి – పీత కష్టాలు పీతవి” అని వెనక ఒక పాత సామెత ఉంది. దాన్ని సినిమా ఇండస్ట్రీ కి లింక్ చేసుకుంటే, పెద్ద ఇంట్లో పుట్టిన స్టార్స్ పిల్లలకు కూడా ఎంతో తపన,టాలెంట్ ఉంటాయి. కానీ బయట చాలా మంది స్టార్ కిడ్స్ ని విమర్శిస్తూ ఉంటారు. అలా, బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా, సొంత గుర్తింపు కోసం తపిస్తూ, కష్టపడుతూ, తనను తానూ ఎప్పటికప్పుడు కొత్తగా డిఫైన్ చేసుకునే బహుముఖ ప్రజ్ఞా శాలి రానా దగ్గుబాటి . ఒక నటుడు, ఒక హీరో, ఒక విలన్, ఒక సప్పోర్టింగ్ ఆర్టిస్ట్, ఒక యాంకర్, ఒక ప్రొడ్యూసర్ ఇలా ఎప్పటికప్పుడు ఒక కర్మయోగి లా వచ్చిన పని, నచ్చిన పని చేసుకుంటూ వెళ్తాడు రానా. ఇప్పుడు రానా నటించిన మరొక పాన్ ఇండియా ఫిల్మ్ “హాథీ మేరే సాథీ” సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ అ టీజర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో రానా ఆదివాసి యోధుడు “బన్ దేవ్” అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఇక టీజర్ చూసినట్లయితే రానా లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ చూసి మనం ఫిదా అవ్వడం గ్యారంటీ. ఇక మరొక పాత్రలో తమిళ్ నటుడు విష్ణు విశాల్ కూడా నటిస్తున్నారు. సినిమా కథ ప్రకరం, నాగరిక మానవులు...

వరుణ్ సందేశ్ మిస్ అయిన ఆ రెండు సూపర్ హిట్ సినిమాలు

వరుణ్ సందేశ్ మిస్ అయిన ఆ రెండు సూపర్ హిట్ సినిమాలు జీవితంలో అయినా, కెరియర్ లో అయినా అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కొక్కోసారి మనకంటే మనకు వచ్చిన అవకాశం గొప్పదిగా ఉంటుంది. అప్పుడు మనం ఇగో లను పక్కన పెట్టి, ఆ అవకాశం ఉపయోగించుకుని ఇంకో మెట్టు పైకి ఎక్కాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం మిస్ అయినప్పుడే ఆ అవకాశం గొప్పతనం తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఫిలాసఫీ ఎందుకంటే, కొంతమంది టాలీవుడ్ లో నోట్లో వెండి స్పూన్ తో పుట్టిన హీరోలు ఉన్నారు. వాళ్ళను ఎలాగు మాస్ జనం కనెక్ట్ అవ్వడం కష్టం. ఎదో లవ్ కథలు నాలుగు చేసుకుని హిట్లు కొట్టి ఫామ్ లోకి వస్తారు. కొన్ని సార్లు రాంగ్ డెసిషన్ వల్లనో.., రాంగ్ గైడెన్స్ వల్లో మంచి సబ్జెక్ లు మిస్ చేసుకుంటారు. ఆనక, సినిమాలు మిస్ అయ్యాక బాధ పడుతూ ఉంటారు. వాళ్ళల్లో మన ఎన్నారై స్టార్ వరుణ్ సందేశ్ కూడా ఉన్నారు . రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తను తెలియక 100% లవ్, గుండె జారి గల్లంతయ్యిందే లాంటి సినిమాలు మిస్ చేసుకున్నానని చెప్పారు. తను ఫస్ట్ సినిమాకే తమన్నా తో చేశా కదా… అని 100% లవ్ సినిమాను, ఆల్రెడీ “ఔను… వాళ్లిదరూ ఇష్టపడ్డారు” సినిమా లాగే ఉంది కదా ! అని గ...

తెలుగు పండక్కి ప్రభాస్.. కన్ఫర్మ్ఏనా?

తెలుగు పండక్కి ప్రభాస్.. కన్ఫర్మ్ఏనా? రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా సినిమాలకే కమిటైన విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే యాక్షన్ థ్రిల్లర్ సాహో చేసినా అది ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. కేవలం హిందీ భాషలో బాగా ఆడిన ఈ సినిమా మిగతా భాషల్లో ఫెయిలైంది. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమా విషయంలో ప్రభాస్ అత్యంత కేర్ తీసుకుని చేస్తున్నాడు. తన నెక్స్ట్ సినిమా జిల్ సినిమాతో విజయాన్ని అందుకున్న రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కాకుండా తర్వాత స్క్రిప్ట్ దగ్గరనుండి అన్నీ సమీక్షించి మళ్లీ అన్నీ సెట్ అనుకున్నాకే షూటింగ్ మొదలుపెట్టారు. అసలు ఈ సినిమా షూటింగ్ గతేడాదే మొదలుకావాల్సి ఉన్నా పైన చెప్పిన కారణాల వల్ల ఆలస్యమై గత నెలలో మొదలైంది. అప్పటినుండి షూటింగ్ హైదరాబాద్ లోని వివిధ సెట్స్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన లేక్ సెట్ లో ప్రభాస్, పూజ లపై బోట్ సీన్స్ లు చిత్రీకరిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తై, ఆ తర్వాత ట్రైన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేయబోతున్...

సిద్ తో కలిసి మరో మ్యాజిక్ కు సిద్దమైన తమన్

సిద్ తో కలిసి మరో మ్యాజిక్ కు సిద్దమైన తమన్ గతేడాది వచ్చిన అతిపెద్ద చార్ట్ బస్టర్ రొమాంటిక్ సాంగ్ ‘సామజవరగమన’. ఐదు నెలల క్రితం విడుదలైన ఈ సాంగ్ అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విడుదలకు చాలా ముందే పాటను విడుదల చేయడం రిస్క్ అనుకున్నారంతా. కానీ అల వైకుంఠపురములో చిత్రం నుండి మొదటి సాంగ్ గా సామజవరగమన ను విడుదల చేసారు. ఈ సాంగ్ విడుదలవ్వడమే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమన్ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం, సిద్ శ్రీరామ్ గాత్రం కలిసి ఈ పాటను ఒక క్లాసిక్ గా నిలిపింది. సామజవరగమన సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. తెలుగు పాటల వరకూ ఉన్న రికార్డులు అన్నిటినీ ఈ పాట చెరిపేసింది. ఇప్పటికీ ఈ సాంగ్ ప్రతిచోటా వినిపిస్తుండడం విశేషం. యూట్యూబ్ లో ఇప్పటికే ఈ సాంగ్ 160 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతోంది. అలాగే జియో సావన్ లో కూడా రీసెంట్ గా ఈ సాంగ్ 100 మిలియన్ ప్లేస్ ను క్రాస్ చేసింది. ఇంతటి లెజండరీ హిట్ అయిన సాంగ్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోంది. లిరిక్ రైటర్ పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ సిద్ శ్రీరామ్, తమన్ కలిసి మరోసారి పనిచేయబోతున్నట్లు ...

మంచు మ‌నోజ్ బ్రేకింగ్ ఇచ్చేశాడు!

మంచు మ‌నోజ్ బ్రేకింగ్ ఇచ్చేశాడు! మంచు మ‌నోజ్ నుంచి సినిమా వ‌చ్చి దాదాపు మూడేళ్లు దాటింది. త‌మిళ ఈలం నేత వేళు పిళ్లై ప్ర‌భాక‌ర‌న్‌కు సంబంధించిన‌ యాదార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా మంచు మ‌నోజ్ చేసిన చిత్రం `ఒక్క‌డు మిగిలాడు`. ఈ సినిమా ప‌రాజ‌యం త‌రువాత మాన‌సికంగా కొంత వైరాగ్యానికి లోనైన మంచు మ‌నోజ్ కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చారు. తాజాగా త‌న భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తితో విడిపోయిన త‌రువాత త్వ‌ర‌లో ఫైర్ బాల్‌లా వెల‌గ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాన‌ని, మ‌రో వారం రోజుల్లో కొత్త అప్‌డేట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. అన్న‌ట్టే వారానికి మించి టైమ్ తీసుకున్నా మంచు మ‌నోజ్  బ్రేకింగ్ న్యూస్‌తో వ‌చ్చాడు. గురువారం ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. మ‌నోజ్ న‌టిస్తున్న తాజా చిత్రానికి `అహం బ్ర‌హ్మ‌స్మి` అనే టైటిల్‌ని క‌న్ఫ‌మ్ చేశారు. ఈ టైటిల్ ఫ‌స్ట్‌లుక్‌తో పాటు ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్‌ని కూడా మ‌రోజ్ షేర్ చేశారు. `3 సంవ‌త్స‌రాల త‌రువాత మీ ముందుకు వ‌స్తున్నాను. నా తొలి సినిమా స‌మ‌యంలో ఏ భావోద్వేగంతో ఉన్నానో...