Skip to main content

Posts

Showing posts from February, 2019

డైలాగ్ బాగుంది కానీ మహేష్ ఛాన్స్ ఇస్తాడా ?

మహేష్ బాబు కోసం ” జనగణమన ” అనే టైటిల్ ని ఎప్పుడో రిజిస్టర్ చేయించాడు దర్శకులు పూరి జగన్నాద్ అయితే పూరి కి వరుస ఫెయిల్యూర్స్ రావడంతో మహేష్ బాబు అతడితో సినిమా చేయడానికి నిరాకరించాడు . కట్ చేస్తే భారత్ – పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జనగణమన చిత్రం కోసం రాసుకున్న డైలాగ్ ” డచ్ ,ఫ్రెంచ్ ,బ్రిటీష్ ఎప్పుడూ ఎవడెవడో ఆక్రమించుకోవడమేనా?ఆ పని మనమెందుకు చేయడం లేదు ? ఎప్పుడు ఈ ఇండియన్స్ మీద పడిపోతారో అని భయపడుతూ చావాలి . STRENGTH  LIES IN ATTACK, NOT IN DEFFENCE  ని వదిలాడు పూరి అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది .   జనగణమన అనే సినిమా మహేష్ కోసం రాసుకున్న స్క్రిప్ట్ అని గతంలోనే చెప్పాడు కాబట్టి అది మహేష్ ఫ్యాన్స్ కు కూడా తెలుసు కాబట్టి మహేష్ ఫ్యాన్స్ కూడా స్పందించారు . తమ అభిమాన హీరోతో సినిమా చేయమని అడుగుతున్నారు . అయితే డిజాస్టర్ లతో ఉన్న పూరి తో మహేష్ సినిమా చేయడం కష్టమే ఇప్పట్లో ! పూరి మళ్ళీ హిట్ కొడితేనే జనగణమన సెట్స్ మీదకు వెళ్తుంది లేదంటే అంతే ! English Title: Puri jagannadh trails again for Mahesh babu from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | ...

ఎన్టీఆర్ పేరు కావాలి కానీ ఎన్టీఆర్ పార్టీ వద్దు

తాత ఎన్టీఆర్ పేరుని పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ బ్రాండ్ అనే పేరు కావాలి కానీ ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ మాత్రం వద్దట ! నోటితో వద్దని చెప్పడం లేదు కానీ తన చేతలతో మాత్రం వద్దని చెప్పకనే చెబుతున్నాడు. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎన్టీఆర్ అక్క సుహాసిని తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసింది అయితే అక్క తరుపున ప్రచారం చేయలేదు ఎన్టీఆర్ . ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు జగన్ పార్టీ లో చేరాడు.   అంతేనా చంద్రబాబు పరిపాలన బాగాలేదని , జగన్ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని చెప్పడం సంచలనం సృష్టించింది. ఇక ఎన్టీఆర్ సన్నిహితుడు కొడాలి నాని ఎప్పుడో జగన్ పంచన చేరాడు. కాగా మరో సన్నిహితుడు వల్లభనేని వంశీ కూడా త్వరలోనే జగన్ పార్టీలో చేరనున్నాడని వార్తలు వస్తున్నాయి. వంశీ వాటిని కనీసం ఖండించడం కూడా లేదు. కొడాలి నాని తెలుగుదేశంని వీడి జగన్ పంచన చేరినప్పుడు అది నాని ఇష్టం దానికి నాకు సంబంధం ఏంటి అన్నాడు ఎన్టీఆర్ , ఇక ఇప్పుడు ఏకంగా పిల్లనిచ్చిన మామనే  జగన్ పార్టీలో చేరాడు అయితే ఇంతవరకు ఎన్టీఆర్ దీనిపై స్పందించలేదు ఏంటో! మొత్తం...

భార్య బీజేపీ, భర్త మరియు కొడుకు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు ఎన్టీఆర్ . తెలుగుజాతి పౌరుషాన్ని తెలుగుదేశం పార్టీతో విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ లో చేరి కేంద్ర మంత్రి గా కూడా బాధ్యతలు చేపట్టింది ఇక ఇప్పుడేమో భారతీయ జనతా పార్టీలో ఉంది. భార్య బీజేపీ లో ఉండగా ఆమె భర్త మాజీ మంత్రి , మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాత్రం వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తన కొడుకు హితేశ్ తో సహా. భార్య ఒక పార్టీలో భర్త , కొడుకు మరో పార్టీలో చేరి చంద్రబాబు నాయుడుకు అధికారం దూరం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు తో దగ్గుబాటి కి పడలేదు దాంతో తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వచ్చాడు. అయితే పురందేశ్వరి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసింది. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన కేంద్రంలో అప్పుడు భాగస్వామిగా ఉంది, ఇక ఇప్పుడేమో కేంద్రప్రభుత్వం లోని పార్టీలో ఉంది. అప్పుడు రాష్ట్రాన్ని విడగొడుతుంటే చూస్తూ ఉంది , ఇక ఇప్పుడేమో నరేంద్రమోదీ ఆంద్రప్రదేశ్ కు ఎలాంటి సహాయం అందించకున్నా మోడీ ని ప్రశ్నించడం లేదు కానీ చంద్రబాబు అవినీతి కి పాల్పడ...

నవ్వించేందుకు బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సిద్ధం…

జీవితంలో ఎన్నో ఒత్తిడులు. రోజంతా కష్టానికి మనపై పడిన ప్రభావమది. ఒక చిన్న చిరునవ్వు ఆ మొత్తం ఒత్తిడిని చిత్తు చేస్తుంది. మనసుకు హాయినిస్తుంది. మనం పడిన శ్రమనంతా గతాన్ని చేసేస్తుంది. మరి అలాంటి నవ్వు రెండున్నర గంటలు దక్కితే ఎంత ఉల్లాసంగా ఉంటుంది. అలాంటి నవ్వును పంచేందుకు సిద్ధమవుతున్న చిత్రమే బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ . ఈ చిత్రాన్ని ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మించారు. .యువ దర్శకుడు నాగసాయి మాకం తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించారు. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించిన బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా మార్చి 15న ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది.   ఈ సందర్భంగా నిర్మాత మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ…సినిమా ధ్యేయం వినోదాన్ని పంచడం అయితే నవ్విస్తూ ఒక చిన్న ఆలోచన ప్రేక్షకుల్లో కలిగిస్తే ఆ చిత్రానికి సార్థకత చేకూరినట్లే. అలాంటి సార్థక చిత్రమే బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో సందేశాన్ని కలిపి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఎంత నాణ...

అక్రమ్ సురేష్ హీరో గా ఆర్.ఏ.ఎం మూవీ ‘అక్రమ్’ ఫస్ట్ లుక్ లాంచ్

అక్ర‌మ్ సురేష్ హీరోగా రాజధాని అమరావతి మూవీస్ బ్యానర్ లో భారీ మాస్ యాక్ష‌న్ మూవీ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఓ షెడ్యూల్, 2 పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. హాలీవుడ్ రేంజులో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది.  హీరో అక్ర‌మ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రాణా పాత్ర లుక్ ని సీనియ‌ర్‌ హీరో సుమ‌న్  లాంచ్ చేశాం. రామోజీ ఫిలింసిటీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో స‌మ‌ర్ప‌కుడు విస్సాకోటి, శివ‌కుమార్ ఇత‌ర టీమ్ పాల్గొన్నారు.   ద‌ర్శ‌కనిర్మాత‌లు మాట్లాడుతూ-“డాన్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రాక్, రాణా, అక్ర‌మ్‌, రాణా ప్ర‌తాప్ సింగ్ అనే నాలుగు గెట‌ప్పుల్లో హీరో న‌టిస్తాడు.నాలుగు స్టైలిష్ గెట‌ప్పుల‌తో ప్రేక్ష‌కుల్ని క‌థానాయ‌కుడు మంత్ర‌ముగ్ధం చేస్తాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్ .. చిన్నా పెద్దా అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మిది. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ తుర్ల‌పాటి అక్కినేనికి న‌ట సామ్రాట్ బిరుదును ఇచ్చారు. తాజా చిత్రంలో అక్ర‌మ్ సురేష్ గెట‌ప్ చూసి టాలీవుడ్ త‌లైవా అనే బిరుదును ఇచ్చారు. భారీ సెట్ లో చిత్రీక‌రించిన ఇంట‌ర్వెల్ సీన్ హైలైట్. 40 సినిమాల అనుభ‌వ‌జ్ఞుడిగా హీరో న‌టించాడు. క‌థ...

‘‘లక్షీస్ ఎన్టీఆర్’’ డిస్ట్రిబ్యూషన్ హక్కులపై పుకార్లు

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘‘ లక్ష్మీస్ ఎన్టీఆర్ ’’బిజినెస్ గురించి వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని నిర్మాతలు కొట్టిపారేసారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో రేట్ కి కొన్నారు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని ,ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు జి.వి ఫిలింస్,రామ్ గోపాల్ వర్మ మరియురాకేష్ రెడ్డి లు త్వరలోనే తెలియజేస్తామన్నారు. మార్చి 22న విడుదల. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’చిత్రాన్ని మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్చేస్తున్నట్టు ప్రకటించారు దర్శకనిర్మాతలు.ఇప్పటికే ట్రైలర్ ,ఓ సాంగ్ కి అధ్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ థియేట్రికల్ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థంచేసుకోవచ్చు. ఒక్క ఆర్జీవి యూట్యూబ్ చానల్లో కోటికి పైగా మంది చూసారు..లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ‘‘నీ ఉనికి’’ అనేసాంగ్ ను కూడా 30 లక్షల మందికి పైగా చూశారు.. వీటన్నిటినీ చూస్తుంటే‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ సినిమా కు రేపు మార్చి 22న థియేటర్లలో జనాలుబ్రహ్మరథం పట్టడం ...

ఆర్‌ ఎక్స్‌–100 ’ ఫేమ్‌ కార్తికేయ కొత్త చిత్రం ఒంగోలు షెడ్యూల్ పూర్తి!

‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా  జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంయుక్తంగా ఓ  చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.  అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.  ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఒంగోలులో జ‌రిగింది. ఈ భారీ షెడ్యూల్‌తో 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.   హీరో కార్తికేయ మాట్లాడుతూ “కొన్ని క‌థ‌లు విన‌గానే న‌చ్చుతాయి. మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తుకొస్తుంటాయి. న‌లుగురితో పంచుకోవాల‌నిపిస్తుంటాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన క‌థ అలాంటిదే. విన‌గానే న‌చ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇటీవ‌ల ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. ప్ర‌తి ఫ్రేమూ రియ‌లిస్టిక్‌గా వ‌చ్చింది“ అని అన్నారు. దర్శకుడు అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ “రియ‌లిస్టిక్ చిత్ర‌మిది. వాస్త‌వ ఘ‌ట‌న‌లనుంచి స్ఫూర్తి పొంది రాస‌కున్న క‌థ‌. ఎంతోమంది మ‌న‌సుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. హీరో పాత్ర యువ‌త‌కు రెప్ర‌జంటేష‌న్‌లాగా ఉంటుంది. అన్నీర‌కాల భావోద్వేగాలుంటాయి. అన్నీ అంశాలూ మిళిత‌మైన స‌బ్జెక్ట్ గా రూపొందించాం. అంద‌రూ చూడ‌ద‌గ్గ చి...

ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్న సీనియర్ హీరో

సూపర్ స్టార్ రజనీకాంత్  ఇద్దరు అందమైన భామలు నయనతార , కీర్తి సురేష్ లతో   రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు . ఇటీవలే పేట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజనీకాంత్ . తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది పేట కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు కాకపోతే తమిళంలో మాత్రం మంచి వసూళ్ల నే రాబట్టింది పేట . ఇక ఇప్పుడేమో ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రజనీ .   పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు రజనీకాంత్ కాగా ఈ చిత్రంలో నయనతార తో పాటుగా కీర్తి సురేష్ ని కూడా ఎంపిక చేసారు . ఇక ఈ సినిమాని మార్చి మొదటి వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు . మురుగదాస్ దర్శకుడు కాబట్టి ఈ సినిమాపై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి . యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . English Title: Nayanatara and Keerthy suresh in Rajinikanth’s next   from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UbwjNj