నయనతార వివాదంపై స్పందించిన మురుగ చాలా మంది హీరోయిన్లకు తర్వాత వేధించే సమస్య కెరీర్ మొదట్లో చేసిన పాత్రలు. గుర్తింపు రావడం కోసం, పాత్రలు ఏవొకటి చేజిక్కించుకోవడం కోసం ఏ పాత్రలు పడితే అవి ఒప్పేసుకుంటారు హీరోయిన్లు. అయితే ఒక దశ దాటాక తమకు గుర్తింపు వచ్చి పెద్ద హీరోయిన్లు అయ్యాక అప్పుడు చేసిన పాత్రలకు రిగ్రెట్ అవుతుంటారు. అనవసరంగా ఆ సినిమా చేసాం. అది నా కెరీర్ లో చేసిన పెద్ద తప్పు అంటుంటారు. షూటింగ్ జరిగినప్పుడు అది గ్రహించినా అప్పుడు తాము చిన్న వాళ్ళు కాబట్టి స్పందించలేరు. నయనతార కూడా ఇందుకు మినహాయింపు కాదు. నయన్ ఇప్పుడు టాప్ హీరోయిన్. అటు సీనియర్ హీరోల సరసన, ఇటు యంగ్ హీరోలకు, లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు నయన్ బెస్ట్ ఛాయస్ గా మారింది. అయితే ఆ మధ్య తన కెరీర్ గురించి మాట్లాడుతూ తన కెరీర్ లో గజినీ చిత్రం చేయడం అతిపెద్ద తప్పని వ్యాఖ్యానించింది. కథ నరేషన్ లో చెప్పిన విధంగా నా పాత్ర లేదు. అలాగే ఆ సినిమాలో నా లుక్ కూడా బాగోదు. అయితే నేను ఆ విషయంలో ఎవర్నీ తప్పు పట్టాలనుకోవట్లేదు. నా కెరీర్ లో తీసుకున్న అతి చెత్త నిర్ణయంగా మాత్రమే భావిస్తున్నా అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో మురుగదాస్ వివాదంపై స్ప...