Skip to main content

Posts

Showing posts from November, 2019

మాస్ మహారాజా చాలా బ్యాడ్ అంటున్నాడే

Disco Raja teaser on the way మాస్ మహారాజా రవితేజ హిట్టు కొట్టి చాలా కాలమైంది. అతని రీసెంట్ సినిమాలు అన్నీ వరసగా ప్లాపులుగా మిగిలాయి. నిజానికి అతని లాస్ట్ మూడు సినిమాలు టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. కలెక్షన్స్ కూడా కిందస్థాయికి పడిపోవడంతో అసలు రవితేజ సినిమా అంటే ప్రేక్షకులకు డౌట్స్ వచ్చే పరిస్థితి నెలకొంది. లాస్ట్ ఐదు సినిమాల్లో ఒకటే హిట్ కొట్టాడంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రవితేజ ఎంతో రిస్క్ చేసి చేస్తున్న సినిమా డిస్కో రాజా. రవితేజ మీద గత కొన్ని సినిమాలుగా ఉన్న ప్రధాన కంప్లైంట్. అవి బాగా రొటీన్ గా ఉన్నాయని. అందుకే రవితేజ ఈసారి విభిన్న సినిమాలను తెరకెక్కించే విఐ ఆనంద్ తో డిస్కో రాజా అనే సినిమా చేస్తున్నాడు. ఇది పునర్జన్మల నేపథ్యంలో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. అంటే సైన్స్ ను, నమ్మకాలను ఈ సినిమాలో కలిపి చూపించబోతున్నారు. రివెంజ్ యాంగిల్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో రవితేజ హిట్ కొట్టలేకపోతే తన కెరీర్ ప్రమాదంలో పడ్డట్లే. కానీ డిస్కో రాజా విభిన్న సినిమా అనే ఇంప్రెషన్ తన ఫస్ట్ లుక్ పో...

తేజుతో ఈ మెగా ప్రొడ్యూసర్ మరొకటి

తేజుతో ఈ మెగా ప్రొడ్యూసర్ మరొకటి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ కష్టాల్లో ఉన్న ప్రతిసారీ మెగా నిర్మాత అల్లు అరవింద్ అండగా నిలుస్తూనే ఉన్నాడు. నిర్మాతగా అల్లు అరవింద్ స్థాయి గురించి చెప్పాల్సిన పనిలేదు. తన జడ్జిమెంట్ ఆన్ ది స్పాట్ ఉంటుందని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అందుకే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హిట్లే ఎక్కువ ఉంటాయి. ఆ సంస్థ నుండి ప్లాప్ చిత్రాలు రావొచ్చేమో కానీ బ్యాడ్ సినిమాలు మాత్రం అరుదుగా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్ కు అండగా ఉంటుండడం నిజంగా అభినందించతగ్గ విషయమే. తేజు తన మొదటి చిత్రంగా రేయ్ సినిమాను చేసిన సంగతి తెల్సిందే. అయితే ఆ సినిమా విడుదలకు కష్టాలు పడడంతో తొలి చిత్రంతోనే తేజు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వెంటనే అల్లు అరవింద్ రంగంలోకి దిగి దిల్ రాజు సహకారంతో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాను నిర్మించి సూపర్ హిట్ అందించాడు అల్లు అరవింద్. రేయ్ కంటే ముందే పిల్లా నువ్వు లేని జీవితం సినిమా విడుదలై తేజుకి ప్రేక్షకుల్లో గుర్తింపు తీసుకొచ్చింది. దాని తర్వాత విడుదలైన రేయ్ ప్లాప్ అయినా ఆ ప్రభావం తేజ్ కెరీర్ పై పడలేదు. రేయ్ తర్వాత...

అనిల్ రావిపూడి ఈ విషయంలో తగ్గుతాడా?

అనిల్ రావిపూడి ఈ విషయంలో తగ్గుతాడా? ప్రస్తుతం తెలుగులో ఉన్న ప్రామిసింగ్ దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. 100 పెర్సంట్ సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అనిల్ రావిపూడి ఈ చిత్రం ముందు వరకూ కూడా మీడియం హీరోలతోనే పనిచేసాడు. తన మొదటి సినిమా పటాస్ ను కళ్యాణ్ రామ్ తో చేసిన అనిల్ రావిపూడి తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్, రవితేజ హీరోగా రాజా ది గ్రేట్, వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 2 సినిమాలను చేసాడు. ఈ నాలుగు సినిమాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఎఫ్ 2తో అయితే అనిల్ పేరు మార్మోగిపోయింది. దీంతో మహేష్ పిలిచి మరీ అవకాశమిచ్చాడు. ఏదైనా కథ ఉంటే చెప్పమని అడగ్గా, సరిలేరు నీకెవ్వరు కథతో ఇంప్రెస్ చేసాడు అనిల్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. డిసెంబర్ మొదటి వారానికి షూటింగ్ పూర్తవుతుందని వార్తలు వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు జనవరి 11న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలవ్వగా దానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు మళ్...

ఆదిత్య వర్మ.. విక్రమ్ ఫుల్ హ్యాపీస్

ఆదిత్య వర్మ.. విక్రమ్ ఫుల్ హ్యాపీస్ సినిమా ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే వాళ్ళు ఎంత కష్టపడ్డా, తమ పిల్లలు సినిమాల్లోకి వస్తానంటే ఆ కష్టం ఉండకూడదనే భావిస్తారు. వాళ్ళకి పెర్ఫెక్ట్ లాంచ్ ఇవ్వాలని కలలు కంటారు. విలక్షణ నటుడు విక్రమ్ కూడా అలాగే భావించాడు. తన కొడుకు ధృవ్ విక్రమ్ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు తనకి అంతా పెర్ఫెక్ట్ ఉండాలని అర్జున్ రెడ్డి రీమేక్ ను సజెస్ట్ చేసాడు. ఈ సినిమా అయితే ఆల్రెడీ ప్రొవెన్ సబ్జెక్ట్, పైగా నటనకు మంచి పేరు వచ్చే అవకాశముంది. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా విజయ్ దేవరకొండకు ఎంత పేరు వచ్చిందో మనందరం చూసాం. అందుకే అర్జున్ రెడ్డి రీమేక్ చేస్తే ధృవ్ విక్రమ్ కు హీరోగా మంచి పేరు వస్తుందని తలచాడు విక్రమ్. అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అంటారు. ధృవ్ విక్రమ్ విషయంలో అదే జరిగిందా అనిపిస్తుంది. ఇంటెన్సిటీ ఉన్న సినిమాలను పెర్ఫెక్ట్ గా తీస్తాడు అన్న పేరున్న బాల అర్జున్ రెడ్డి రీమేక్ కు దర్శకుడిగా ఎంచుకున్నా సినిమా అంతా చూసాక, అది బాలేదని దాన్ని మొత్తం తీసి చెత్తబుట్టలో పడేయాల్సిన పరిస్థితి. కొడుకు...

షారుఖ్ తెలుగు వాళ్ళతోనే సెటిల్ అవుతున్నాడుగా

షారుఖ్ తెలుగు వాళ్ళతోనే సెటిల్ అవుతున్నాడుగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సినిమా వస్తోందంటే ఇదివరకు బాక్స్ ఆఫీస్ వద్ద హంగామా మాములుగా ఉండేది కాదు. అతని సినిమాలు ఎలా ఉన్నా మినిమం గ్యారంటీ అన్న తరహాలోనే ఉండేవి. ఇక హిట్ అయిందంటే చెప్పాల్సిన పనేముంది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల గలగలలే. అయితే గత కొన్నేళ్ల నుండి పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. షారుఖ్ సినిమాలు ఇదివరకటిలా ఆడట్లేదు. అసలు ఈ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన దమ్ము చూపించి చాలా కాలమే అయింది. ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన సినిమాలు కూడా టపా కట్టేశాయి. దానికి తోడు కొన్ని మూస సినిమాలు కూడా చేసి ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. దీంతో షారుఖ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసాడు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న కొన్ని ప్రాజెక్టులను కూడా క్యాన్సిల్ చేసేసాడు. షారుఖ్ ఖాన్ నటించిన లాస్ట్ సినిమా గత క్రిస్మస్ కు విడుదలైంది. మరుగుజ్జు పాత్రలో చేసిన జీరోపై భారీ ఆశలు పెట్టుకున్నాడు షారుఖ్. సల్మాన్ ఖాన్ తో స్పెషల్ రోల్ కూడా వేయించాడు. కానీ ఈ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయింది. జీరోకు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఇది అసలు ఒక టాప్ హీరోకు వచ్చే కలెక్షన్స్ ఏనా అన్న డౌట్ వచ్చేలా ...

యూట్యూబ్ సెన్సేషన్ @భార్గవ్ రైట్స్

యూట్యూబ్ సెన్సేషన్ @భార్గవ్ రైట్స్ టాలెంట్ ఉండాలే కానీ ఈరోజుల్లో రాణించడానికి దారులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ విప్లవం మొదలయ్యాక షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు అంటూ టాలెంట్ ఉన్న యువతకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎంతో మంది యువత రాణిస్తున్నారు కూడా. వీరిలో భార్గవ్ రెడ్డి అనే రైటర్ కం యాక్టర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సీఏపిడిటి, హే పిల్లా అనే యూట్యూబ్ ఛానల్స్ కు సబ్స్క్రైబ్ అయిన ప్రేక్షకులకు భార్గవ్ సుపరిచితమే. సిఏపిడిటి అనేది మొదట ఒక ఫేస్ బుక్ పేజీగా మొదలైంది. తర్వాత యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టారు. కంటెంట్ ను డిఫరెంట్ గా ప్రెజంట్ చేయడం వాళ్ళ స్పెషలిటీ. ముఖ్యంగా ప్రతి షార్ట్ ఫిలిమ్ క్లైమాక్స్ లోనూ వాళ్ళు ఇచ్చే ట్విస్ట్ లు బాగా ఫేమస్ అయ్యాయి. అయినా వాళ్ళకి సబ్స్క్రైబర్లు అంత సులభంగా ఏం రాలేదు. క్వాలిటీ కంటెంట్ నే నమ్ముకుని ముందుకు సాగరు. వాళ్లే హే పిల్లా అని మరో యూట్యూబ్ ఛానల్ ను కూడా మొదలుపెట్టారు. ఇది మహిళలకు ప్రత్యేకంగా మొదలైన ఛానల్. ఈ రెండు ఛానల్స్ ఫాలో అయ్యేవారికి భార్గవ్ సుపరిచితుడే. స్వతహాగా రైటర్ అయిన భార్గవ్ ఈ మధ్య లీడ్ రోల్ లో ...

అర్జున్ సురవరం మూవీ రివ్యూ

అర్జున్ సురవరం మూవీ రివ్యూ నటీనటులు: నిఖిల్ సిద్దార్ధ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, సత్య, పోసాని, తరుణ్ అరోరా తదితరులు. దర్శకత్వం: టి ఎన్ సంతోష్ నిర్మాత‌లు: రాజ్ కుమార్ ఆకెళ్ళ, వేణు గోపాల్ కావియా సంగీతం: సామ్ సిఎస్ సినిమాటోగ్రఫర్: సూర్య ఎడిటర్: నవీన్ నూలి రేటింగ్: 2.5 /5 ఒక సినిమాకు ఎన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ ఎదుర్కొన్న సినిమా అర్జున్ సురవరం . దాదాపు ఏడాదికి పైగా వాయిదా పడిన అర్జున్ సురవరం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి హిట్ కోసం ఎదురుచూస్తోన్న నిఖిల్ కు ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎటువంటి ఫలితాన్ని అందించింది అన్నది రివ్యూలో చూద్దాం. కథ: అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్) ఇంట్లో సాఫ్ట్ వేర్ జాబ్ అని అబద్ధం చెప్పి టివి 99లో జర్నలిస్ట్ గా పనిచేస్తుంటాడు. బిబిసిలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అవ్వాలనేది అతని కల. అయితే ఈ క్రమంలో అర్జున్ కు కావ్య (లావణ్య త్రిపాఠి)తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీస్తుంది. అంతలోనే బిబిసిలో కూడా ఆఫర్ వస్తుంది. ఇలా లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న సమయంలో అర్జున్ ఒక క్రైమ్ లో ఇరుక్కుంటాడు. సెన్సేషనల్ న్యూస్ లు కవర్ చేసే అర్జున్ చ...

ఇండియాలో దూసుకుపోతున్న ఫ్రోజెన్ 2

ఇండియాలో దూసుకుపోతున్న ఫ్రోజెన్ 2 సీక్వెల్స్ ఎక్కువగా వస్తోన్న 2019లో మరో హాలీవుడ్ యానిమేటడ్ చిత్రం విడుదలైంది. 2013లో వచ్చిన వాల్ట్ డిస్నీ వారి హాలీవుడ్ చిత్రం ఫ్రోజెన్ కు సీక్వెల్ గా గత వారం ఫ్రోజెన్ 2 విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మధ్య హాలీవుడ్ సినిమాలు ఇండియా మార్కెట్ పై బాగా దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా యానిమేటెడ్ సిరీస్ అయితే అందులో ప్రముఖ పాత్రలకు ఇండియాలోని టాప్ స్టార్స్ చేత డబ్బింగ్ చెప్పిస్తుండడం బాగా కలిసొస్తోంది. ఈ ఏడాది విడుదలైన ది లయన్ కింగ్ కు ఇలానే చేసారు. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, తెలుగు నుండి నాని, జగపతి బాబు, బ్రహ్మానందం , అలీ వంటి స్టార్స్ ఇంపార్టెంట్ రోల్స్ కు డబ్బింగ్ చెప్పి క్రేజ్ తీసుకొచ్చారు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం. ఇప్పుడు ఫ్రోజెన్ 2 విషయంలో కూడా ఇదే చేసారు. ఇందులో ఎల్సా పాత్రకు తెలుగులో నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పింది. అలాగే చిన్నప్పటి ఎల్సా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ చిత్రం ఇప్పుడు ఇండియాలో మంచి వసూళ్లను రాబడుతోంది. తొలి వీకెండ్ లోనే ఫ్రోజెన్ 2 అదరగొట్టింది. మొదటి మూడు రోజులకే ద...

మాస్ ఎంబీ సోమవారాలు.. 5 రోజులు, 5 పాటలు

మాస్ ఎంబీ సోమవారాలు.. 5 రోజులు, 5 పాటలు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రమోషన్స్ విషయంలో మొదటినుండి కంప్లైంట్స్ ఉండేవి. ఒకవైపు అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రానికి ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతుండడం, విడుదలైన పాటలు సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. దీంతో అనిల్ రావిపూడి ప్రమోషన్స్ విషయంలో కంగారు పడకండి, ఇంకా సంక్రాంతికి కదా రిలీజ్ అంటూ సెటైరికల్ వీడియో కూడా పోస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఒక్కసారి టీజర్ విడుదలయ్యాక పరిస్థితిలో బాగా మార్పు వచ్చింది. ఫ్యాన్స్ కు నచ్చేలా కట్ చేసిన టీజర్ వారికి ఫీస్ట్ లా అనిపించింది. అందుకే ఈ టీజర్ దాదాపు 120 గంటలకు పైగా టాప్ ప్లేస్ లోనే ట్రెండ్ అయింది. 25 మిలియన్ వ్యూస్ కు పైగా వచ్చిన ఈ టీజర్ కు 5 లక్షల లైకులు కూడా రావడం విశేషం. టీజర్ కు వచ్చిన బజ్ తో సరిలేరు నీకెవ్వరు టీమ్ సరికొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతోంది. రీసెంట్ గా మాస్ ఎంబీ మండేస్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేసి, ఏమిటో గెస్ చేయండి అంటూ ఫ్యాన్స్ ను ఊరించిన సంగతి తెల్సిందే. హ్యాష్ ట్యాగ్ ను...

రాజా వారు రాణి గారు మూవీ రివ్యూ

రాజా వారు రాణి గారు మూవీ రివ్యూ నటీనటులు: కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్, దివ్య నార్ని, రాజ్ కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం తదితరులు దర్శకత్వం: రవికుమార్ కోలా నిర్మాణం: మనోవికాస్ & మీడియా9 మనోజ్ సంగీతం: జయ్ కె రేటింగ్ : 2.75 /5 కొన్ని సినిమాలకు తెలియకుండానే ఒక రకమైన పాజిటివిటీ వస్తుంది. ట్రైలర్ వలనో, మరొకటో కానీ ఆ సినిమా బాగుంటుందనే నమ్మకం కలిగిస్తుంది. హీరో పేరు, దర్శకుడి పేరు కూడా తెలియకుండా ఈ సినిమాకి వెళ్ళాలి అన్న ఆలోచన వస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రేక్షకులకు అలా అనిపించిన సినిమా రాజా వారు రాణి గారు . కథ: ఈ సినిమా కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. కథ ఏంటనేది ట్రైలర్ లోనే చెప్పేసారు. రాజా (కిరణ్ అబ్బవరం), రాణి (రహస్య గోరఖ్) ను చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆ ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం ధైర్యం సరిపోదు. ఈ నేపథ్యంలో రాజా స్నేహితులు అతనికి సహాయపడుతుంటారు. వాళ్ళు చేసిన సహాయాలేంటి? దాని వల్ల రాజా పడిన ఇబ్బందులేంటి? చివరికి రాజా ప్రపోజ్ చేయగలిగాడా లేదా? రాణి మనసులో ఏముంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూసి తెలుగుకోవాల్సిందే. నటీనటులు: ఈ సినిమాల...

నితిన్ ఏంటి ఆ సినిమా చేయను అంటున్నాడు?

Is Nithin Work in that movie? దశాబ్దన్నర నుండి సినిమాలు చేస్తున్నా కానీ నితిన్ కెరీర్ టాప్ గేర్ లోకి వెళ్లకపోవడానికి తరుచూ వచ్చే ప్లాప్స్ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇష్క్ అప్పుడు హిట్లు వచ్చినా తర్వాత వెంటనే ప్లాపులు రావడంతో నితిన్ కెరీర్ పైకి వెళ్ళలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అ..ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక నితిన్ కెరీర్ దూసుకుపోతుందని ఆశించారు. అయితే హ్యాట్రిక్ ప్లాపులు నితిన్ ను చుట్టుముట్టాయి. లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు ఒకటి తర్వాత ఒకటిగా వచ్చి ప్లాపులుగా మిగిలాయి. వరస ప్లాపులతో నితిన్ కెరీర్ పూర్తిగా డల్ అయింది. దీంతో ఏడాది పాటు గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఆసక్తికర సినిమాలను లైన్లో పెట్టాడు నితిన్. మొదటగా ఛలోతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేసారు. దీంతో పాటే వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాకూ కమిట్ అయ్యాడు నితిన్. వెంకీ అట్లూరి తొలిప్రేమతో సూపర్ హిట్ అందుకున్నా, mr. మజ్నుతో ఘోరమైన ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడ...

విజయశాంతి అనిల్ రావిపూడికి చుక్కలు చూపించిందిట

Anil Ravipudi explains how Vijayshanti agreed to act in Sarileru Neekevvaru దర్శకుడిగా అనిల్ రావిపూడి ది విజయవంతమైన ప్రస్థానం. ఇప్పటికి నాలుగు సినిమాలు చేసిన అనిల్ రావిపూడి నాలుగు సినెమాలతోనూ విజయాలు అందుకున్నాడు. అందులోనూ ఒకదాన్ని మించి ఒక సినిమా హిట్ అవ్వడమే కాకుండా దర్శకుడిగా తన రేంజ్ ను కూడా పెంచుకుంటూ వస్తున్నాడు. తన మొదటి చిత్రం నందమూరి కళ్యాణ్ రామ్ తో చేసిన అనిల్ రావిపూడి, తర్వాత వరసగా సాయి ధరమ్ తేజ్, రవితేజ, వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పనిచేసాడు. సక్సెస్ పరంగా కూడా నాలుగు సినిమాలు పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2… ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం చేస్తోన్న ఐదవ సినిమాతో తన రేంజ్ ను మరింత పెంచుకుంటున్నాడు అనిల్ రావిపూడి. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో సినిమా చిత్రీకరణ పూర్తైపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసి జనవరి 11న సినిమాను విడుదల చేయాలన...

బాలకృష్ణ, రోజా… జరిగే పనేనా?

  Boyapati want to cast Roja as villain నందమూరి బాలకృష్ణ , రోజా అంటే 90లలో సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అందుకే ఈ జంటను స్క్రీన్ పై చూడాలని ప్రేక్షకులు కూడా కోరుకునే వారు. వీరిద్దరూ కలిసి భైరవ ద్వీపం, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య వంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత రోజా నెమ్మదిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడం, అటుపై అవి కూడా తగ్గించేసి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుండడం జరుగుతూ వస్తోంది. మరోవైపు నందమూరి బాలకృష్ణ హీరోగా కొనసాగుతూనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ముందు టిడిపిలోనే పనిచేసిన ఇద్దరూ తర్వాత రోజా వైసిపికి వెళ్లడంతో ప్రత్యర్ధులయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అయితే బాలకృష్ణ ప్రతిపక్ష పార్టీలో ఉంటే, రోజాది అధికార పక్షం. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే జబర్దస్త్ లో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు రోజా పలు సందర్భాల్లో బాలకృష్ణపై వాడివేడి వ్యాఖ్యలు చేసింది. ఆయన ప్రవర్తనను తప్పుపట్టింది. ఇప్పుడు అధికార పక్షం కాబట్టి వి...

బెల్లంకొండ అస్సలు తగ్గను అంటున్నాడే!

  Top cast and crew for Bellamkonda Srinivass next బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ మొదటినుండి ఒకటే పంథాను ఫాలో అయ్యాడు. తను చిన్న హీరో కాబట్టి తన చుట్టూ ఉండే సెటప్ భారీగా ఉండాలని ప్రయత్నిస్తూ వచ్చాడు. అయితే ఈ స్ట్రాటజీ బెల్లంకొండకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అల్లుడు శీను , జయ జానకి నాయక సినిమాలు బాగున్నాయి అని పేరు తెచ్చుకున్నా కానీ ఓవర్ బడ్జెట్ వల్ల కాస్ట్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. ఇక మిగతా సినిమాలన్నీ బొక్క బోర్లా పడ్డాయ్. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ కొంత తగ్గినట్లే కనిపించాడు. సీత సినిమాకు లో బడ్జెట్ లోనే వెళ్ళాడు, వర్కౌట్ అవ్వలేదు. రాక్షసుడు సినిమాకు కూడా లో బడ్జెట్ నే ఎంచుకున్నాడు. ఈసారి అంత పేరున్న వాళ్ళను ఎవరినీ తీసుకోలేదు. సీత సినిమాలోనైనా కాజల్ అగర్వాల్ ఉందేమో కానీ రాక్షసుడులో అనుపమతోనే సెటిల్ అయ్యాడు. అయితే రాక్షసుడు వర్కౌట్ అయ్యింది. తన కెరీర్ లో మొదటి హిట్ గా నిలిచింది. ఈ సినిమా హిట్ అయ్యాక అదే ఉత్సాహంలో వెంటనే సినిమాను చేసెయ్యలేదు బెల్లంబాబు. చాలా టైమ్ తీసుకున్నాడు. తన ఫిజిక్ ను బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. లుక్ మార్చేశాడు. సిక్స్ ప్యాక్ కూడా తెచ్చుకున్నాడు. ఫైనల్ గా తన...

అడ్డాల మొత్తం కొత్తవాళ్ళతోనే వెళ్తున్నాడుగా

Casting call for Srikanth Addala Asuran remake గత నెలలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలలో ధనుష్ నటించిన అసురన్ సినిమా ఒకటి. ఇది తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇది ఒక రా అండ్ ఇంటెన్స్ కథ. వయొలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా రా గా చూపిస్తేనే ఈ సినిమాకు కిక్కు. ఇలాంటి సినిమాను వెంకటేష్ రీమేక్ చేయాలనుకోవడమే తెలుగు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అసురన్ కు ఉన్న ఇమేజ్ కు, వెంకటేష్ కు ఉన్న ఇమేజ్ పూర్తిగా భిన్నం. వెంకటేష్ చేయడమే వింత అనుకుంటే సురేష్ బాబు అండ్ కో మరో పెద్ద షాక్ ఇచ్చారు. ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతను శ్రీకాంత్ అడ్డాల కు అప్పగించారు. శ్రీకాంత్ అడ్డాల పూర్తిగా సాఫ్ట్ డైరెక్టర్, ఆయన సినిమాల్లో మంచితనం ప్రవహిస్తూ ఉంటుంది. అందరినీ నవ్వుతూ ఉండమని చెప్పే ఫిలాసఫీ కూడా ఉంటుంది. ఇప్పటిదాకా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సినిమాల్లో గట్టిగా ఒక్క ఫైట్ కూడా లేదు. అలాంటిది అసురన్ లో ఏ శరీర భాగం కనిపిస్తే దాన్ని నరికేసు...

వరసగా సినిమాలను లైన్లో పెడుతోన్న నిఖిల్

Nikhil announces his next films after Arjun Suravaram ఏడాది పాటు నరకం అనుభవించి ఈ శుక్రవారం తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు యువ హీరో నిఖిల్ . అర్జున్ సురవరం , నిఖిల్ ను చాలా ఇబ్బంది పెట్టిందన్నది వాస్తవం. సినిమా షూటింగ్ పూర్తవుతోంది అన్న సమయంలో టైటిల్ విషయంలో వివాదం తలెత్తడం, తర్వాత టైటిల్ మార్చుకుని విడుదలకు సిద్ధమవుతుంటే కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యం కావడం జరిగాయి. అయితే ఆ ఆలస్యం ఏకంగా ఏడాది పాటు ఉంటుందని ఊహించలేకపోయాడు నిఖిల్. మొదట డిసెంబర్ 2018లో సినిమాను విడుదల చేద్దామనుకున్నాడు. అయితే మొదటిసారి వాయిదా పడి మే 1 కి మారింది. ఇక అక్కడినుండి సినిమా ఎన్ని సార్లు వాయిదా పడిందో లెక్కే లేదు. సినిమా విడుదలను ప్రకటించడం అది వాయిదా పడటం, అంతా ఓ ఆనవాయితీలా జరిగిపోయింది. అయితే ఈ కాలమంతా తాను ఎన్ని సార్లు గదిలో ఒక్కడ్ని కూర్చుని ఏడ్చానో లెక్కేలేదు అంటున్నాడు నిఖిల్. తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన సమయంలో తన కుటుంబం, స్నేహితులు అండగా ఉండి తనకు అండదండగా నిలిచారని చెప్పుకొచ్చాడు. ఏదైతేనేం మొత్తానికి నిఖిల్ కష్టాలు గట్టెక్కి అర్జున్ సురవరం నవంబర్ 29న విడుదలకు సిద్ధమైంది. పోటీగా వస్తో...

విజయ్-పూరి మధ్యలో ఇంద్రగంటికి ఏం పని?

విజయ్-పూరి మధ్యలో ఇంద్రగంటికి ఏం పని? హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఆసక్తికర సినిమాలను లైన్లో పెడుతున్నాడు విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్ విఫలమైనా కానీ విజయ్ దేవరకొండకు అవకాశాలు ఏం తగ్గట్లేదు. ఇప్పటికిప్పుడు చేతిలో నాలుగు చిత్రాలు విజయ్ వి సిద్ధంగా ఉన్నాయి. మరో ఇద్దరు దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారు. వచ్చే ఏడాది అంతా విజయ్ ఫుల్ బిజీగా ఉండనున్నాడు. అయితే చేతిలో ఎన్ని సినిమాలున్నా కొత్తగా దర్శకులు వచ్చి తనకు కథ చెబుతుంటే నచ్చితే ఓకే చేసేస్తున్నాడు. అది ఎప్పుడు చేయాలి తన దగ్గర డేట్స్ ఉన్నాయా లేవా అన్నది పెద్దగా లెక్క చెయ్యట్లేదు. ఇప్పటికే ఫుల్ బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా మరో సినిమాను ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజెస్ లో ఉంది. లెక్క ప్రకారమైతే ఈ సినిమా పూర్తవ్వగానే విజయ్ పూరి జగన్నాథ్ తో సినిమా చేయాల్సి ఉంది. వరస ప్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ సక్సెస్ కొట్టి మంచి ఊపుమీదున్నాడు. విజయ్ తో ప్రాజెక్ట్ గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తు...

వెంకీ మామ రిలీజ్ డేట్ లో మరింత కన్ఫ్యూజన్

వెంకీ మామ రిలీజ్ డేట్ లో మరింత కన్ఫ్యూజన్ విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కిన వెంకీ మామ చిత్రంపై ఇంకా రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్లు తొలగిపోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి మొదట ఈ సినిమాను అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల చేద్దామనుకున్నారు కానీ సరిగ్గా అప్పుడే వెంకటేష్ కు గాయం కావడంతో షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ తారుమారయ్యాయి. అక్టోబర్ చివరికి షూటింగ్ పూర్తయినా నవంబర్ లో స్లంప్ కారణంగా సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. అందుకే సరైన రిలీజ్ డేట్ కోసం వెంకీ మామ నిర్మాత సురేష్ బాబు తెగ ప్రయత్నించాడు. సంక్రాంతికి బరిలో నిలుపుదామనుకున్నాడు కానీ అప్పటికే నాలుగు చిత్రాలు షెడ్యూల్ అయ్యి ఉండడంతో అది మంచి పద్దతి కాదని వెనక్కి తగ్గాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎప్పుడూ చాలా క్లారిటీతో ఉంటానని, లైఫ్ లో తొలిసారి కన్ఫ్యూజ్ అవుతున్నానని, వెంకీ మామను ఎప్పుడు విడుదల చేయాలో అర్ధం కావడంలేదని పేర్కొన్నాడు. అయితే మా టీమ్ అంతా డిసెంబర్ 13న విడుదల చేద్దామని అంటున్నారని, ఆరోజు వెంకటేష్ పుట్టినరోజు కారణంగా అప్పుడు విడుదలైతే బాగుంటుందని భావిస్తున్నారని పేర్కొన్నాడు. సంక్ర...

నాగబాబు విషయంలో జబర్దస్త్ దే తప్పుందా?

నాగబాబు విషయంలో జబర్దస్త్ దే తప్పుందా? జబర్దస్త్ – నాగబాబు వ్యవహారం గత కొన్నాళ్ల నుండి బాగా హైలైట్ అవుతోంది. ఎక్కడ చూసినా ఇదే న్యూస్. జనాలు కూడా దీని గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే జబర్దస్త్ తో నాగబాబు రిలేషన్ ఈనాటిది కాదు. దాదాపుగా ఏడున్నరేళ్లుగా జబర్దస్త్ ను అంటిపెట్టుకుని ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కాపు కాసాడు. తానే కష్టాల్లో ఉన్నప్పుడు జబర్దస్త్ సహాయపడడంతో నాగబాబు ఈ షో పట్ల చాలా కృతజ్ఞతగా ఉంటున్నాడు. ఒకానొక టైమ్ లో జబర్దస్త్ ద్వారా వచ్చిన డబ్బుతోనే తాను ఫ్యామిలీని నడిపినట్లు నాగబాబు చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటాడు. అలాంటి అనుబంధం ఉన్న నాగబాబు సడెన్ గా బయటకు వచ్చేయడంతో ప్రేక్షకులకు ఏం అర్ధం కాలేదు. దీనిపై కారణాలు ఏముంటాయా అన్న ఆరాలు తీశారు కానీ వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదు. పోనీ నాగబాబు ఏదైనా చెప్తాడా అంటే అతను కారణాలు చెబుతానని చెప్పి మొదటి నుండి తన జబర్దస్త్ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాడు. దాన్ని ఒక సిరీస్ లా ప్లాన్ చేసాడు నాగబాబు. అయితే ఇప్పటిదాకా చెప్పినదాన్ని బట్టి చూస్తే నాగబాబు జబర్దస్త్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడాడు. తనకు మరో లైఫ్ ఇచ్చిన శ్యామ్...

నిత్యా మీనన్ వ్యాఖ్యలపై కంగనా రియాక్షన్ ఎలా ఉంటుందో!

నిత్యా మీనన్ వ్యాఖ్యలపై కంగనా రియాక్షన్ ఎలా ఉంటుందో! బాలీవుడ్ లో కంగనా స్టయిలే వేరు. ఆమెను ఒక ఫైర్ బ్రాండ్ లా చూస్తారు అందరూ. ఏదైనా ఆమె విషయం వస్తే వామ్మో ఆమెతో ఎందుకులే అనుకుని పక్కకు తప్పుకుంటారు. కొందరు సాఫ్ట్ వ్యక్తులైతే ఆమె గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. మళ్ళీ ఏం మాట్లాడితే ఏం గొడవ జరుగుతుందో అని లైట్ తీసుకుంటారు. కొంతమంది డేర్ చేసి మాట్లాడినా కంగనా ఫైర్ ముందు వాళ్ళు నిలవలేరు. ఎంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడానికైనా ఆమె వెనుకాడదు. ఒకవేళ ఆమె తగ్గినా ఆమె చెల్లెలు అస్సలు తగ్గదు. తనకు సంబంధం లేని వ్యవహారాల్లో తల దూర్చి మొత్తం పెంట పెంట చేసేస్తుంటుంది. హ్రితిక్ రోషన్ వంటి పెద్ద హీరోనే గడగడలాడించింది కంగనా. తనతో పెట్టుకోలేక ఒక దణ్ణం పెట్టి పక్కకుతప్పుకున్నాడు. మణికర్ణిక వివాదంలో క్రిష్ తో పోరు ఎలా సాగిందో మనం చూసాం. న్యాయం క్రిష్ వైపు ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. అంతలా కంగనా వ్యవహరించింది. హీరోయిన్స్ ను కూడా కంగనా వదిలిపెట్టింది లేదు. ఆమె జోలికి రాకున్నా సరే తాప్సి, అలియా భట్ వంటి హీరోయిన్లను కంగనా చాలా ఇబ్బంది పెట్టింది. వాళ్ళను కావాలని కవ్వించింది. అందుకే కంగనా అంటేనే భయపడే పరిస్థ...

పబ్లిసిటీ విషయంలో బన్నీ కుమ్మేస్తున్నాడుగా

పబ్లిసిటీ విషయంలో బన్నీ కుమ్మేస్తున్నాడుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫలితం తర్వాత చాలా మధనపడ్డాడు. ఈ సినిమా విజయం సాధిస్తుందని బాగా నమ్మాడు బన్నీ. అందుకే ఎప్పుడూ లేనంత ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. అయితే చివరికి నా పేరు సూర్య సినిమా పరాజయం పాలైంది. దాంతో బన్నీ దాదాపు ఆరు నెలలు బయటకు రాలేదు. ఏడాది పాటు తన తర్వాతి సినిమాను మొదలుపెట్టలేదు. అయితే చివరికి తనకు రెండు సూపర్ హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జత కట్టాడు. అల వైకుంఠపురములో అనే ఫన్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నాడు. నా పేరు సూర్యలో ఫన్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయని టాక్ వచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఈసారి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ విషయంలో ఎక్కడా కొదవ రాకుండా చూసుకుంటున్నాడు. అలాగే పబ్లిసిటీ విషయంలో కూడా బన్నీ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే అల వైకుంఠపురములో విషయంలో బన్నీ చాలా పర్సనల్ గా తీసుకుని ప్రమోషన్స్ చూసుకుంటున్నాడు. సాధారణంగా హీరోలు ప్రమోషన్స్ ఎలా చేయాలన్న విషయంలో ఇంతలా మధనపడిపోరు. దానికి ప్రత్యేకంగా పిఆర్ టీమ్ ఉంటుంది. వాళ్లకు లక్ష...

ఖైదీ ఆన్లైన్ రిలీజ్ పై తమిళనాట దుమారం

ఖైదీ ఆన్లైన్ రిలీజ్ పై తమిళనాట దుమారం ఓటిటి ప్లాట్ఫార్మ్స్… అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటివన్నమాట. ఇవి వచ్చాక ప్రేక్షకులు సినిమాలు చూసే పద్దతి మారిపోయింది. అసలు కొన్ని సినిమాలకు అమెజాన్ వంటి వాటిలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేస్తున్నారు. సినిమా పోస్టర్ మీదే ఆ సినిమా ఎక్కడ విడుదలవుతుందో వేస్తుండడంతో జనాలు ఆ చిత్రం ఆన్లైన్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడమనేది బొత్తిగా తగ్గిపోయింది. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఎప్పటినుండో గొడవ చేస్తున్నాడు. నెల రోజుల్లోనే సినిమాను డిజిటల్ గా రిలీజ్ చేసుకునే పర్మిషన్ ఇవ్వడం వల్ల థియేటర్ లో సినిమా చచ్చిపోతుందని సురేష్ బాబు అంటూనే ఉన్నాడు. నిర్మాతలు అందరూ ఈ విషయంలో కలిసి రావాలని కనీసం మూడు నెలలు ఆ ఓటిటి ప్లాట్ఫామ్స్ లో విడుదల కాకుండా చూడాలని, చిన్న సినిమాలకైతే పర్లేదు కానీ మీడియం బడ్జెట్, కొంచెం పేరున్న సినిమాలకు ఈ పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుందని వాపోయాడు. ఇప్పుడు కాదు గత ఏడాదిన్నర కాలం నుండి సురేష్ బాబు ఈ విషయంలో మొత్తుకుంటూనే ఉన్నాడు. అయితే నిర్మాతలు భారీ స్థాయిలో డబ్బులు చూస...

వరుణ్ తేజ్ కోసం ప్లాప్ దర్శకుడ్ని సెట్ చేస్తున్న మెగా నిర్మాత

varun tej to act in flop directors movie మెగా హీరో వరుణ్ తేజ్ మొదటినుండి తన కథల ఎంపికలతో ఇంప్రెస్ చేస్తున్నాడు. మొదటి సినిమానే ఏ మాత్రం కమర్షియల్ అంశాలు లేని ముకుందను ఎంచుకున్న వరుణ్ తేజ్, తర్వాత కూడా కమర్షియల్ పంథాలో నడవకుండా కంచె వంటి అవార్డు విన్నింగ్ సినిమాను చేసాడు. అయితే కథల విషయంలో మధ్యలో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న వరుణ్ తేజ్ తొలిప్రేమ, ఎఫ్ 2, గడ్డలకొండ గణేష్ వంటి రీసెంట్ చిత్రాల విజయాలతో 25 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలలో ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాడు. గద్దలకొండ గణేష్ లో నెగటివ్ ఛాయలున్న పాత్రను చేసిన వరుణ్ తేజ్, ఈసారి బాక్సర్ అవతారం ఎత్తబోతున్నాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి చెప్పిన కథకు ఫ్లాట్ అయిన వరుణ్ తేజ్ అతనికి అవకాశం ఇచ్చాడు. అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం బాక్సర్ గా సరైన ఫిజిక్ ను, లుక్ ను తీర్చిదిద్దుకునే పనిలో పడ్డాడు వరుణ్ తేజ్. వచ్చే ఏడాది మొదట్లో ఈ చిత్రం ప్రారంభమై వేసవికి కానీ, ఆగష్టు నెలలో కానీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు వరుణ్ తేజ్ ఆ తర్వాతి చిత్రం గురించి కూడా ప్రచారం మొదలైపోయ...

జబర్దస్త్ పై ఆసక్తి చూపిస్తున్న మా అధ్యక్షుడు

జబర్దస్త్ పై ఆసక్తి చూపిస్తున్న మా అధ్యక్షుడు జబర్దస్త్ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. నవ్వుల రాజు నాగబాబు జబర్దస్త్ తో తనకున్న ఏడున్నరేళ్ళ అనుబంధాన్ని తెంచేసుకుని జీ తెలుగులో వేరే షో చేయడానికి కమిటైన సంగతి తెల్సిందే. జబర్దస్త్ ను, నాగబాబును విడదీసి చూడటానికి ఇప్పటికీ ఎవరికీ మనసు ఒప్పట్లేదు. తన నవ్వులతో జబర్దస్త్ కు ఒక కళ తీసుకొచ్చిన నాగబాబు, ఎన్నోసార్లు జబర్దస్త్ కు పెద్దన్న పాత్ర పోషించి అండగా నిలబడ్డాడు. కారణాలు ఏవైనా ఇప్పుడు నాగబాబు జబర్దస్త్ నుండి దూరమయ్యాడు. ఇప్పటికీ ఇంకా జబర్దస్త్ షో లో జడ్జిగా ప్రత్యామ్నాయం దొరకలేదు. ఏడున్నరేళ్ళు జబర్దస్త్ ను అంటిపెట్టుకుని ఉన్న నాగబాబు వెళ్ళిపోతే ఆయనకీ ప్రత్యామ్నాయం వెతకడానికి యాజమాన్యం కిందా మీదా పడుతున్నారు. అలీ, సాయి కుమార్, బండ్ల గణేష్ అంటూ వివిధ పేర్లను పరిశీలించి వారితో సంప్రదింపులు జరిపారు కూడా. అయితే ఏదీ సెట్ అవ్వట్లేదు. ఇదిలా ఉంటే సీనియర్ నటుడు, మా అధ్యక్షుడు నరేష్ జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరించడానికి తనకు ఆసక్తి ఉందని చెప్పకనే చెప్పాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ ను చూస్తుంటానని చాలా ఎంజాయ్ చేస్తానని అన్నాడు. ఈ...

ఏ మాయ చేసావేపై సంచలన వ్యాఖ్యలు చేసిన గౌతమ్ మీనన్

ఏ మాయ చేసావేపై సంచలన వ్యాఖ్యలు చేసిన గౌతమ్ మీనన్ సినిమా మీద ఉన్న ప్యాషన్ తో నటులు, దర్శకులు, నిర్మాతలు అవుదామని ఇండస్ట్రీకి వస్తుంటారు చాలా మంది. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. ఇక్కడ సక్సెస్ లో ఉన్నవాడు చెప్పిందే నడుస్తుంది. సినిమా మీద ప్యాషన్ తో వచ్చే దర్శకులు, కథల విషయంలో ఒక్కోసారి కాంప్రమైజ్ కారు. తాము నమ్మిందే జరగాలని లేదంటే తనలోని దర్శకుణ్ణి, క్రియేటర్ ను చంపేసినట్లు ఫీల్ అయిపోతారు. అల్టిమేట్ గా ఎవరికైనా కావాల్సింది విజయం మాత్రమే. నీ ప్యాషన్ కొద్దీ నీ దురదను తెచ్చి అందరికీ రుద్దుతాను అంటే కుదరదు. అప్పుడు నువ్వే డబ్బులు పెట్టి నీకు నచ్చినట్లు తీసుకోవాలి. ఇతరుల అభిప్రాయాలు తీసుకోకుండా నేను డైరెక్టర్ ని, నేను చెప్పిందే జరగాలి అంటే, సినిమా అనేది కోట్లలో వ్యాపారం. ఏ నిర్మాత దర్శకుడి ప్యాషన్ తీర్చడానికి సినిమాలు తీయాలి అనుకోడు. సినిమాకు మంచి జరుగుతుంది అంటే నువ్వు నమ్మింది సడలించడానికి ముందుకు రావాలి. దానివల్ల నీలోని ఫిల్మ్ మేకర్ ను చంపేశారు అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే విభిన్న చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ సెన్సిబుల్ సినిమాలు తీస్తాడన్న పే...

మెగా హీరో సినిమాను వదులుకున్న మహేష్ హీరోయిన్

మెగా హీరో సినిమాను వదులుకున్న మహేష్ హీరోయిన్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ . ఈ సినిమాలో చాలా పద్దతిగా, సంప్రదాయబద్ధంగా కనిపించి అలరించింది. అయితే అనుకున్నంత పద్దతి కియారా కాదని లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో ఆమె వేసిన బోల్డ్ పాత్ర చూస్తే తెలిసిపోతుంది. అయితే భరత్ అనే నేను సినిమా విజయంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో అవకాశం సంపాదించింది కియారా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమై దారుణంగా పల్టీ కొట్టింది. మరోవైపు కియారా బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. ఆమె నటించిన కబీర్ సింగ్ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమెకు అక్కడ అవకాశాలు క్యూ కట్టాయి. అయితే బాలీవుడ్ లో అవకాశాలు పెరిగినా సౌత్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతోంది కియారా. కానీ ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమాలో అవకాశం వస్తే మాత్రం చేజార్చుకుంది. వరుణ్ తేజ్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వరుణ్, గద్దలకొండ గణేష్ సినిమాతో తనలోని మరో కోణాన్ని కూడా పరిచయం చేసా...

కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయిన దేవరకొండ ఫ్యామిలీ

కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయిన దేవరకొండ ఫ్యామిలీ టాలెంట్ ఉంటే మనల్ని ఆపేవాడు ఎవడూ లేడని నిరూపిస్తున్నాడు విజయ్ దేవరకొండ. మొదట్లో చాలా చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను ఆరంభించిన విజయ్ దేవరకొండ తర్వాత హీరోగా ఒక్కసారిగా జువ్వుని పైకెగిశాడు. అనతికాలంలోనే మిడ్ రేంజ్ హీరోలలో ప్రామిసింగ్ గా కనిపిస్తున్న విజయ్ దేవరకొండ మరిన్ని మంచి చిత్రాలతో టాప్ రేంజ్ కు చేరుకోవాలని ఆశిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో విజయ్ దేవరకొండ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. అయితే అందులో తనది అసలు గుర్తింపు లేని పాత్ర. ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్టుంటుంది. నువ్విలా సినిమాలో కూడా క్రికెటర్ గా కనిపిస్తాడు. అది కూడా అంతే. అయితే ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కీలకమైన రిషి పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ కనిపించేది కాసేపే అయినా ఆ పాత్ర బలమైన ముద్ర వేస్తుంది. హీరోగా విజయ్ దేవరకొండ చేసిన మొదటి సినిమా పెళ్లి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండను అందరూ గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. పెళ్లి చూపులు ఒకెత్తు అయితే ...

సైరా పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సీనియర్ నటుడు

సైరా పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సీనియర్ నటుడు సీనియర్ నటుడు గిరిబాబు ఎన్నో విలక్షణమైన పాత్రలతో, అటు విలన్ గా, ఇటు కమెడియన్ గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసాడు. ప్రస్తుతం అతని కొడుకు రఘుబాబు ఇండస్ట్రీలో క్యారెక్టర్ నటుడిగా ఫుల్ బిజీగా ఉంటోన్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే గతంలో గిరిబాబు చిరంజీవికి వ్యతిరేకంగా కొన్ని ఇంటర్వ్యూలలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తన కొడుకు బోసు బాబు సినిమా విషయంలో చిరంజీవి అండ్ కో కావాలనే తొక్కేశారని, అందువల్లే తన కొడుకు సినిమా ఆడకుండా పోయిందని, కెరీర్ కూడా నాశనమైందని వాపోయాడు. ఇదిలా ఉంటే ఇటీవలే మరో ఇంటర్వ్యూలో గిరి బాబు సైరా సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక ఇంటర్వ్యూలో మీరు ఒక్కోసారి చిరంజీవిని ప్రశంసిస్తారు, కష్టపడి పైకొచ్చిన వ్యక్తిగా గుర్తిస్తారు, మరేందుకు కొన్నిసార్లు విమర్శిస్తారు. అసలెందుకిలా అని ప్రశ్నించగా దానికి గిరిబాబు ఆసక్తికర సమాధానం చెప్పాడు. గిరిబాబు మాట్లాడుతూ తన చిరంజీవితో విబేధాలు ఏం లేవని, ఆయనతో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, చిరంజీవితో నేను ఎన్నో సినిమాల్లో కలిసి నటించాను. తనతో నాకెందుకు ఇబ్బందులు ఉ...

మాస్ ఎంబీ ప్రతి సోమవారం రచ్చ చేస్తాడుట

మాస్ ఎంబీ ప్రతి సోమవారం రచ్చ చేస్తాడుట సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలవుతోన్న విషయం తెల్సిందే. అయితే నెల క్రితం నుండి ఈ సినిమాకు ప్రమోషన్స్ సరిగా లేవని మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందడం మొదలుపెట్టారు. ఒకవైపు అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రానికి ప్రమోషన్స్ భీభత్సంగా జరుగుతుండడం, సరిలేరు నీకెవ్వరు నుండి ఏ అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన సమంజసమే అనిపించింది. అయితే ప్రస్తుతం పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఒక్క టీజర్ తో సరిలేరు నీకెవ్వరు టీమ్ రచ్చ లేపింది. ఈ టీజర్ అప్లోడ్ అయ్యి 100 గంటలు దాటినా కూడా ఇంకా టాప్ లోనే ట్రెండ్ అవుతోంది. అప్పుడే 25 మిలియన్ వ్యూస్ కు చేరువైంది. మరోవైపు అల వైకుంఠపురములో నుండి వచ్చిన మూడో పాట ఓ మై గాడ్ డాడీ అనుకున్నంత రెస్పాన్స్ రాబట్టకపోవడంతో తొలిసారి సరిలేరు నీకెవ్వరు పైచేయి సాధించినట్లైంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం సరిలేరు నీకెవ్వరు చిత్ర నిర్మాత అనిల్ సుంకర ప్రమోషన్స్ పై ఆసక్తి ఉన్నవాళ్లు, వినూత్న పద్దతిలో ప్రమోషన్స్ చేయగలమన్న ఆశ ఉన్నవాళ్లు తమను సంప్రదించమని, తమతో కలిస...