Skip to main content

Posts

Showing posts from July, 2019

`రాక్ష‌సుడు`తో మ‌ళ్లీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నాను.. ఇంకా మంచి సినిమాలు చేస్తూ మీ ప్రేమ‌, ఆశీర్వాదాలు పొంద‌డానికి క‌ష్ట‌ప‌డ‌తాను – బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌

సినీరంగంలో డిస్ట్రిబ్యూట‌ర్స్‌గా, నిర్మాత‌లుగా 20 ఏళ్ల జ‌ర్నీని పూర్తి చేశాం..  మ‌రో కొత్త ప్ర‌యాణానికి స్వీకారం చుట్ట‌డం ఆనందంగా ఉంది :  హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు

నాని గ్యాంగ్ లీడర్ టీజర్ టాక్

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ” గ్యాంగ్ లీడర్ ” . నాని హీరోగా నటిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది . ఇక ఈ గ్యాంగ్ లీడర్ టీజర్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు , కాగా ఆ టీజర్ ఎలా ఉందంటే ……. ప్రేక్షకులను అలరించేలాగే ఉంది గ్యాంగ్ లీడర్ టీజర్ . మంచి హాస్యంతో ఉంది ఈ టీజర్ , అయితే గ్యాంగ్ మాత్రం లేడీ గ్యాంగ్ కావడం విశేషం . ఈ చిత్రాన్ని ఆగస్టు 30 న విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసారు . అయితే అదే రోజున ప్రభాస్ నటించిన సాహో విడుదల అవుతున్న నేపథ్యంలో గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని వాయిదా వేస్తారేమో చూడాలి . ఎందుకంటే సాహో చిత్రంతో పోటీ పడితే నాని చిత్రానికి ఇబ్బందులు తప్పవు మరి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2y4vgpb

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం విషమం

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం విషమం గోషామహల్ మాజీ ఎం ఎల్ ఏ , మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం విషమించింది . గతకొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ముఖేష్ గౌడ్ క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్నాడు . అయితే ఇన్నాళ్లు గా చికిత్స తీసుకుంటున్నా ఆరోగ్యం మెరుగుపడకపోగా మరింతగా విషమించడంతో చేతులెత్తేశారు డాక్టర్లు . మెరుగైన వైద్యం అందించడానికి అన్ని రకాల ప్రయత్నాలు డాక్టర్లు చేసినప్పటికీ ఏవేవి ఫలించలేదు . దాంతో చికిత్స నిలిపివేశారు . డాక్టర్లు చేస్తున్న ప్రయత్నానికి ముఖేష్ గౌడ్ శరీరం స్పందించడం లేదు దాంతో ఔషదాలు పనిచేయనప్పుడు చికిత్స అందించి లాభం లేదని నిర్ణయించారట . ముఖేష్ గౌడ్ ఆరోగ్యం విషమించింది అని తెలుసుకున్న అభిమానులు కార్యకర్తలు తీవ్ర అందోళన చెందుతున్నారు . కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ముఖేష్ గౌడ్ శాసనసభ్యుడిగా , మంత్రిగా సేవలందించారు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NY2EIP

‘ఓ బేబీ’  హిందీ చిత్రంలో అలియా నటించనుందా!?

సమంతా ప్రధాన పాత్రలో    నందిని రెడ్డి దర్శకత్వంలో    సురేష్‌బాబు సమర్పకుడిగా టీజీ   విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఓ బేబీ . కొరియన్    హిట్‌ మూవీ ‘ మిస్‌ గ్రానీ ’ కి తెలుగు రీమేక్‌గా వచ్చిన ‘ ఓ బేబీ ’   ఇటీవల విడుదలై సూపర్ హిట్    టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది .    నాగ శౌర్య ముఖ్య పాత్రలో ,  లక్ష్మి , రాజేంద్ర ప్రసాద్‌ , రావు రమేశ్‌ ,  కీలక పాత్రల్లో నటించారు . ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లను రాబడుతోంది . 70 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువతిగా మారిపోయే కథాంశంతో ‘ ఓ బేబీ ’ తెరకెక్కింది . కాగా ఇప్పుడు ‘ ఓ బేబీ ’ ని బాలీవుడ్‌లోనూ తెరకెక్కించాలని సురేశ్‌బాబు భావిస్తున్నారట . ఇందులో సామ్‌ పాత్రను ఆలియా భట్‌తో చేయించాలని ప్రయత్నిస్తున్నారట . అయితే ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు . ప్రస్తుతం ‘ ఆర్‌ . ఆర్‌ . ఆర్‌ ’, ‘ బ్రహ్మాస్త్ర ’, ‘ సడక్‌ 2’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు . ఈ నేపథ్యంలో ఆమెతో రీమేక్‌ తీయడం ఇప్పట్లో సాధ్యంకాదేమో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి .. ఎలాగైనా...

విజయ్ చాలా మంచివాడు..అమలా పాల్!!

2014 లో అమల , విజయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 2017 లో విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే . ప్రముఖ తమిళ దర్శకుడు , తన మాజీ భర్త ,   ఏఎల్‌ విజయ్ రెండో పెళ్లిపై స్పందించారు నటి అమలా పాల్‌ .  ‘ విజయ్‌ చాలా మంచి వ్యక్తి . ఆయన వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ’ అని ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ ఆమె ’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా విజయ్‌ పెళ్లిపై మాట్లాడారు .  విజయ్‌తో విడాకులు తీసుకున్నాక తన సినీ కెరీర్‌ ఏమైపోతుందోనని చాలా భయపడ్డానని   పేర్కొన్నారు . ‘ నాకు చెల్లెలు , హీరోయిన్‌కు స్నేహితురాలి పాత్రల్లో నటించే అవకాశాలు మాత్రమే వస్తాయేమోనని అనుకున్నాను . మున్ముందు సినిమాల్లేక ధారావాహికల్లో నటించాల్సి వస్తుందని చాలా టెన్షన్‌ పడ్డాను . కానీ ప్రతిభ ఉంటే ఎవరూ మనల్ని ఆపలేరన్న విషయం నాకు అర్థమైంది ’ అని వెల్లడించారు అమల . ఇటీవల విజయ్‌కి .. ఐశ్వర్య అనే వైద్యురాలితో వివాహమైంది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2jW6Pqo

14 రోజుల్లో 210 కోట్లు సాధించిన కబీర్ సింగ్

రెండు వారాల్లో 210 కోట్ల వసూళ్ల తో సంచలనం సృష్టిస్తున్నాడు షాహిద్ కపూర్ . కబీర్ సింగ్ గా షాహిద్ నటనకు జేజేలు పలుకుతున్నారు ప్రేక్షకులు . జూన్ 21 న విడుదలైన కబీర్ సింగ్ సంచలన విజయం సాధిస్తోంది . రెండు వారాలు పూర్తయినప్పటికీ ఇంకా మంచి వసూళ్ల ని రాబడుతూనే ఉంది కబీర్ సింగ్ .   సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . ఇప్పటికి కూడా వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి . అయినప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం ఎక్కడా తగ్గడమే లేదు కబీర్ సింగ్ జోరు . ఇక షాహిద్ విషయానికి వస్తే సోలో హీరోగా వంద కోట్ల వసూళ్ల నే సాధించలేకపోయాడు కానీ కబీర్ సింగ్ తో మాత్రం ఏకంగా 250 కోట్ల మైలురాయిని దాటేసేలా ఉన్నాడు . ఇక కియారా అద్వానీ కి కూడా భారీ హిట్ లభించింది కబీర్ సింగ్ రూపంలో . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2XtVkco