Skip to main content

Posts

Showing posts from April, 2019

నాని ని దెబ్బకొట్టిన రెండు సినిమాలు

నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రం సూపర్ హిట్ కాకుండా రెండు సినిమాలు దెబ్బకొట్టాయి . జెర్సీ చిత్రం విడుదలైన రోజునే రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3 రిలీజ్ అయ్యింది . జెర్సీ చిత్రానికి యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు మాత్రం రావడం లేదు . జెర్సీ వసూళ్ల కు కాంచన 3 అడ్డుపడింది . ఒకవైపు కాంచన 3 వసూళ్లు వీర లెవల్లో సాధిస్తుంటే జెర్సీ మాత్రం చతికిల బడిపోయింది . కాకపోతే నాని నటనకు గాను ప్రశంసల వర్షం కురుస్తోంది . అలాగే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి . జెర్సీ గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడుతున్నారు కానీ పాపం వసూళ్లు మాత్రం కట్టబెట్టడం లేదు . కాంచన 3 పరిస్థితి అలా ఉంటే ఇది చాలదన్నట్లు ఎవెంజర్స్ ఎండ్ గేమ్ కూడా నాని జెర్సీ వసూళ్ల ని దెబ్బ కొట్టింది . ఎవెంజర్స్ మేనియా మాములుగా లేదు దాంతో జెర్సీ ని పట్టించుకోవడం మానేశారు ప్రేక్షకులు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2vsY5Kw

ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ కు షాక్ ఇస్తున్న హీరోలు

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి కి అంతగా కాలం కలిసి రావడం లేదు పాపం . ఎందుకంటే ఈ డైరెక్టర్ తో పలువురు హీరోలు సినిమాలు తీయడానికి ప్లాన్ చేసారు కట్ చేస్తే ఒక్కొక్కరుగా హ్యాండ్ ఇస్తూనే ఉన్నారు . ఇప్పటికే హీరో రామ్ సినిమా చేద్దామని చెప్పి హ్యాండ్ ఇవ్వగా , ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా హ్యాండ్ ఇచ్చాడట అజయ్ భూపతి కి . ఇక ఇప్పుడేమో అక్కినేని నాగచైతన్య వంతు వచ్చింది అని అంటున్నారు . అజయ్ భూపతితో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు నాగచైతన్య అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైతూ కూడా షాక్ ఇచ్చాడట ! వెంకీ మామ చిత్రం చేస్తున్న చైతూ వరుసగా మరో మూడు సినిమాలకు డేట్స్ కేటాయిస్తున్నారు కానీ అజయ్ భూపతి కి మాత్రం డేట్స్ ఇవ్వలేదు దాంతో అజయ్ భూపతి కి షాక్ ఇచ్చినట్లే అని అంటున్నారు . సూపర్ హిట్ చిత్రం తీసిన దర్శకుడికి కూడా రెండో సినిమాకు ఇన్ని ఇబ్బందులు అంటే పాపం ! ఏంటో ఆ దర్శకుడి పరిస్థితి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2LgjYrj

మారుతి దర్శకత్వంలో మెగా మేనల్లుడు

చిత్రలహరి చిత్రంతో విజయం సాధించిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా మారుతి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు . ఆరు పరాజయాలతో సతమతం అయిన సాయిధరమ్ తేజ్ కు చిత్రలహరి ఆక్సీజన్ ని అందించింది . దాంతో ఆ ఉత్సాహంతో మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు . ఇక మారుతి కూడా సాయి ధరమ్ తేజ్ ని విభిన్నంగా చూపించే ప్రయత్నం చేసున్నాడట . ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి . భలే భలే మగాడివోయ్ , మహానుభావుడు చిత్రాలతో జోరు మీదున్న మారుతి కి బాబు బంగారం , శైలజారెడ్డి అల్లుడు బ్రేక్ వేసాయి దాంతో మళ్ళీ కసిగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు మారుతి . మెగా కుటుంబం అంటే అమితంగా ఇష్టపడే మారుతి సాయిధరమ్ తేజ్ కు సాలిడ్ హిట్ ఇవ్వాలని కసిగా ఉన్నాడట . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2DJJAXf

అప్పుడే మహర్షి రీమేక్ గురించి ఆలోచనలా ?

మహర్షి సినిమా రిలీజ్ కాలేదు , హిట్ కాలేదు కానీ అప్పుడే తమిళంలో రీమేక్ గురించి అందులో తమిళ స్టార్ హీరో విజయ్ నటించడం గురించి చర్చ జరుగుతోంది . మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈనెల 9 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే రీమేక్ గురించి ఆలోచనలు చేస్తున్నారు . తమిళంలో విజయ్ ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది అని అంటున్నారట . మహర్షి తప్పకుండా హిట్ అవుతుంది అన్న ధీమా లో ఉన్నారు అందుకే ఈ చర్చ చేస్తున్నారు . అయితే సినిమా హిట్ అయితేనే ఈ ఆలోచనలు కలిసి వస్తాయి లేదంటే ఈ ఆలోచనలు చేసి ప్రయోజనం లేదు . మహర్షి చిత్రం పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి కానీ ఆ అంచనాలను అందుకుంటే కదా హిట్ అయ్యేది ! అప్పుడు రీమేక్ గురించి ఆలోచిస్తే బెటర్ ఏమో ! from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2J7UjhU

ఆ ఇద్దరూ సక్సెస్ కొడతారా ?

హీరోగా అల్లరి నరేష్ కు హిట్ అన్నది తెలియక ఏడేళ్లు అలాగే దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి కి కూడా హిట్ లేక చాలాకాలం అవుతోంది . అంతేకాదు తనని డైరెక్టర్ గా నిలబెట్టిన యమలోకం చిత్రానికి సీక్వెల్ గా యమలోకం 2 అనే సినిమా తీసి నవ్వుల పాలయ్యాడు ఎస్వీ కృష్ణారెడ్డి . కట్ చేస్తే చాలా సంవత్సరాలుగా హిట్ అన్నదే లేని అల్లరి నరేష్ – ఎస్వీ కృష్ణారెడ్డి లు కలిసి ఓ సినిమా చేయడానికి సమాయత్తం అవుతున్నారు . అయితే ఈ ఇద్దరూ కలిసి సక్సెస్ కొడతారా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . అల్లరి నరేష్ హిట్ కోసం పోరాడి పోరాడి అలిసిపోయి మహేష్ బాబు మహర్షి సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నాడు . ఇక ఎస్వీ కృష్ణారెడ్డి మళ్ళీ మెగా ఫోన్ చేతబట్టి యాక్షన్ , కట్ చెప్పాలని చూస్తున్నాడు . జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్లుగా ఈ ఇద్దరూ కలిసి చేసే సినిమా హిట్ అవుతుందా ? లేక మరో డిజాస్టర్ అవుతుందా ? చూడాలి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2ZETRNI

మహర్షి పాటలు బాగోలేవు

మహేష్ బాబు నటించిన మహర్షి చిత్ర ఆడియో మొత్తం రిలీజ్ కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే . అయితే మహర్షి చిత్రంలోని పాటలు ప్రేక్షకులను అలరించేలా లేకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు . మహర్షి చిత్రంలో మొత్తం 6 పాటలుండగా అందులో రెండు పాటలు ” పదరా పదరా పదరా ” , ” పాలపిట్ట ” అనే రెండు పాటలు మాత్రమే బాగున్నాయి . మిగతా నాలుగు పాటలు తెరమీద చూస్తే కానీ తేలేదు విజువల్స్ తో బాగుంటాయేమో కానీ వినడానికి మాత్రం ఆకట్టుకునేలా లేవు . దాంతో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మీద ఆగ్రహంగా ఉన్నారు మహేష్ అభిమానులు . దేవిశ్రీ ప్రసాద్ – మహేష్ బాబు ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఆడియో పరంగా పెద్ద హిట్ అయ్యాయి కానీ వాటికీ భిన్నంగా మహర్షి ఆడియో ఉండటంతో మహేష్ అభిమానులకు కోపం వస్తోంది . ఇక దేవిశ్రీ ప్రసాద్ కూడా కొంత కాలంగా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయలేక పోతున్నాడు . మహర్షి విషయంలో కూడా అదే తప్పు జరిగింది . అయితే గుడ్డిలో మెల్ల లాగా రెండు పాటలు బాగున్నాయి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2UQm94r

మే 31న “సువర్ణ సుందరి” విడుదల

పూర్ణ, సాక్షి చౌదరి , జయప్రద ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం “ సువర్ణసుందరి “. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలొ ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.   ఈ సందర్బంగా డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ… సువర్ణ సుందరి చిత్రంలో ఎఫ్ఎక్స్ కోసం ఏడాదిపాటు వ‌ర్క్ జ‌రిగింది. టైమ్ తీసుకున్నా ఔట్పుట్ మాత్రం అద్భుతంగా వ‌చ్చింది.గత కొంతకాలంగా తెలుగులో స్క్రీన్ ప్లే బెస్డ్ సినిమాలకు ఆదరణ లభిస్తొందు. సువర్ణ సుందరి సైతం మూడు జన్మల కాన్సెప్ట్ తో ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే తో రూపొందిచాము. ఆడియెన్స్ ఆకట్టుకొవటంతో పాటు ,కమర్షియల్‌ గా పక్కా హిట్ కొడతామన్న నమ్మంకంతొ ఉన్నామన్నారు. నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ..‌ సువర్ణ సుందరి చిత్ర ట్రైలర్ ‌ సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఆకట్టుకుంది. బడ్జెట్ ఎక్కువయినా , క్వాలిటీ ఔట్పుట్ చూశాక సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉ...

సూపర్‌స్టార్ మహేష్ ‘మహర్షి’ జ్యూక్ బాక్స్ విడుదల

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ మహర్షి ’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదైలెన ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’, ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం’, ‘ఎ వరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే ..’, ‘పదర పదర పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా.. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా..’, ‘పాల పిట్ట..’ పాటలకు శ్రోతల నుండి అద్భుతైమెన స్పందన వచ్చింది. కాగా, మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన జ్యూక్ బాక్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో అభిమానుల మధ్య ఎంతో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ‘మహర్షి’ చిత్రాన్ని విడుదల ...

ఈ బర్త్ డే నాకు చాలా ‘స్పెషల్’

తెలుగు సినిమా రంగంలోనే కాదు.. అన్ని భాషల్లోనూ కన్నడ భామలు కదం తొక్కుతున్నారు. బాలీవుడ్ లో ఐశ్వర్యారాయ్ , దీపికా పడుకోన్ చక్రం తిప్పుతుంటే.. తెలుగులో అనుష్క శెట్టి, రష్మిక మందన్న , తాజాగా శ్రద్ధా శ్రీనాధ్ వెలుగులీనుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరేందుకు మరో కన్నడ భామ ‘అక్షతా శ్రీనివాస్’ సన్నాహాలు చేసుకుంటోంది. కన్నడలో.. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి సర్జా (యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు) సరసన ‘శివ తేజస్’ సినిమా చేస్తున్న అక్షత అక్కడే.. ‘బ్రహ్మచారి- హండ్రెడ్ పర్శంట్ వర్జిన్’ అనే మరో క్రేజీ సినిమాలోనూ నటిస్తోంది. ఇప్పుడు తాజాగా ‘స్పెషల్’ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. టాలెంటెడ్ యాక్టర్ అజయ్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి వాస్తవ్ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు (మే 1) తన పుట్టిన రోజును పురస్కరించుకుని అక్షత మాట్లాడుతూ.. “కన్నడలో రెండు క్రేజీ సినిమాలు చేస్తూ.. తెలుగులో “స్పెషల్”మూవీ చేస్తుండడం చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈ బర్త్ డే నాకు చాలా చాలా స్పెషల్. తెలుగు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నది నా డ్రీమ్” అని చెబుతోంది!! from టాప్ స్టోరీస్ ...

నిత్యామీనన్ పై నిషేధమా ?

మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ పై నిషేధం విధించాలని కొంతమంది అదేపనిగా పట్టుబడుతున్నారు . దర్శక నిర్మాతల ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆమేరకు మలయాళ చిత్ర పరిశ్రమ లోని పెద్దలు జోక్యం చేసుకొని నిత్యామీనన్ తో మాట్లాడగా గుండెలు బద్దలయ్యే నిజం తెలిసిందట ! నిత్యామీనన్ తల్లి క్యాన్సర్ తో బాధపడుతోంది , పైగా చివరి స్టేజ్ లో ఉందని అందుకే నిత్యా సినిమా షూటింగ్ లకు రాకుండా దర్శక నిర్మాతలకు సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని తెలిసిందట . తెలుగు , తమిళ , మలయాళ చిత్రాల్లో నటిస్తున్న నిత్యామీనన్ కొద్దిరోజులుగా షూటింగ్ లకు హాజరు కాకుండా , సరైన సమాధానం ఇవ్వకుండా దర్శక నిర్మాతలకు ఇబ్బందులు కలిగిస్తోందట దాంతో ఆమెపై నిషేధం విధించాలని సమావేశం ఏర్పాటు చేస్తే అప్పుడు అసలు విషయం తెలిసిందట నిత్యా తల్లి కి క్యాన్సర్ అని అందుకే కొద్దిరోజులు వేచి చూడండి అని పెద్దలు చెప్పారట . పాపం నిత్యా మీనన్ కు నిజంగానే సినిమా కష్టాలు వచ్చాయి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GREcmJ

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ‘ఎన్‌.జి.కె’ అభిమానుల అంచనాలకు ధీటుగా ఉంటుంది – ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో హీరో సూర్య

గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సూర్య, ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో…. రీసెంట్‌గా ‘ఖాకి’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు.. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌లపై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్‌.జి.కె’ (నంద గోపాలకృష్ణ). ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ విడుదల కార్యకమ్రం చిత్ర యూనిట్‌ సభ్యుల నడుమ వైభవంగా జరిగింది. యూనిట్‌తోపాటు హీరో సూర్య తండ్రి, సీనియర్‌ నటుడు శివకుమార్‌, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రాజా ఈ వేడుకలో పాల్గొన్నారు. నా కల నిజమైన భావన కలుగుతోంది హీరో సూర్య మాట్లాడుతూ – ”ఎన్‌.జి.కె’ చిత్రాన్ని పొటిలికల్‌ డ్రామా, థ్రిల్లర్‌ అని అందరూ అంటున్నారు. కానీ, మరో యాంగిల్‌లో ఉండే సినిమా ఇది. 2000 సంవత్సరం తర్వాత రాజకీయ ఘటనలను అబ్జర్వ్‌ చేసిన డైరెక్టర్‌ శ్రీరాఘవగారి ద క్కోణంలో సాగే సినిమా ఇది. ఇప్పటివరకు ఏ దర్శకుడినైనా అడిగానో లేదో తెలియదు కానీ.. తొలిసారి శ్రీరాఘవగారిని ‘నాతో సినిమా చేస్తారా?’ అని 2002లో ...

కల్కి చిత్రానికి లాభాలు

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” కల్కి ” . మే 24 న విడుదల కానున్న ఈ చిత్రానికి బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . పలు చిత్రాలను నిర్మించిన కేకే రాధామోహన్ కల్కి చిత్రాన్ని 12 కోట్లకు కొన్నాడట ! ఇక శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో మరో 10 కోట్లకు పైగా వచ్చేలా ఉంది దాంతో రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ చిత్రంగా నిలిచింది కల్కి . రాజశేఖర్ సరసన ఆదా శర్మ , నందితా శ్వేత నటించగా 1980 నాటి కాలం కథతో కల్కి చిత్రం తెరకెక్కింది . కల్కి టీజర్ , ఫస్ట్ లుక్ లతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి దాంతో బిజినెస్ పరంగా మంచి వ్యాపారం జరుగుతోంది . తక్కువ బడ్జెట్ లో రూపొందిన కల్కి చిత్రానికి అప్పుడే 10 కోట్ల కు పైగా లాభాలు వస్తున్నాయి . మే 24 న విడుదల కానున్న కల్కి రిలీజ్ కి ముందే ఇంత సంచలనం సృష్టిస్తే రేపు రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2DDvqHa

మహేష్ నిర్మాత తప్పుకున్నాడట

మహేష్ బాబు తో సినిమా చేయడానికి ఏ నిర్మాత అయినా ముందుకు వస్తాడు కానీ దిల్ రాజు మాత్రం నాకొద్దు బాబోయ్ అంటూ తప్పుకుంటున్నాడని తెలుస్తోంది . మహర్షి సినిమా రిలీజ్ కి ఉంటే ఇంకా తప్పుకోవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? మహర్షి చిత్రం నుండి కాదు త్వరలోనే మళ్ళీ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రం నుండి దిల్ రాజు తప్పుకున్నట్లు తెలుస్తోంది . ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు . అయితే ఈ సినిమాకు అనిల్ సుంకర తో పాటుగా దిల్ రాజు కూడా నిర్మాణ భాగస్వామి గా ఉన్నాడు . ఇక షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అని అనుకుంటున్న ఈ సమయంలో దిల్ రాజు తప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా …… మహర్షి చిత్రాన్ని ముగ్గురు కలిసి నిర్మించడం , ఆ సినిమా బిజినెస్ లో పెద్ద తలనొప్పులు ఎదురు కావడంతో దిల్ రాజు డ్రాప్ అవుతున్నట్లు తెలుస్తోంది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2ZOolwG

యంగ్ హీరో ని అవమానించిన అమలా పాల్

బ్లాక్ బ్యూటీ అమలా పాల్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని ఘోరంగా అవమానించింది . ఇంతకీ ఈ భామ ఈ హీరోని ఎందుకు అవమానించిందో తెలుసా ….. తమిళంలో విజయం సాధించిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో ” రాక్షసుడు ” గా రీమేక్ చేస్తున్నారు . రైడ్ , వీరా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు కాగా తమిళంలో అమలా పాల్ – విష్ణు విశాల్ జంటగా నటించారు . అమలా పాల్ పాత్రలో తెలుగులో అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది ఇక విష్ణు విశాల్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు . అయితే విష్ణు విశాల్ లా నటించడం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వల్ల కాదని ఒక్క ముక్కలో తేల్చిపడేసింది అమలా పాల్ . తమిళంలో రాక్షసన్ సంచలన విజయం సాధించింది అలాగే విష్ణు విశాల్ నటనకు జేజేలు పలికారు . విష్ణు విశాల్ స్థాయి నటన బెల్లంకొండ వల్ల కాదని అనడం అంటే ఘోరంగా అవమానించడమే ! from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2V2Mktw

వార‌ణాసిలో ఇస్మార్ శంక‌ర్ యాక్ష‌న్ ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ

ఎన‌ర్జిటిక్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ` ఇస్మార్ట్ శంక‌ర్‌ `. డ‌బుల్ దిమాక్ హైద‌రాబాది` ట్యాగ్ లైన్‌. ఈ సినిమా భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ రేప‌టి నుండి వారణాసిలో చిత్రీక‌రించ‌నున్నారు. సినిమా కీల‌క ఘ‌ట్టంలో ఈ యాక్ష‌న్ పార్ట్ ఉంటుంది. కాబ‌ట్టి డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ భారీ రేంజ్‌లో ఈ సీక్వెన్స్‌ని తెర‌కెక్కిస్తున్నారు. హైద‌రాబాద్ నుండి సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వార‌ణాసి వెళుతున్నారు. పూరి స్ట‌యిల్లో రియ‌ల్ స‌తీష్ ఈ యాక్ష‌న్ పార్ట్‌ను తెర‌కెక్కించ‌బోతున్నారు. లీడ్ పెయిర్ రామ్‌, నిధి అగ‌ర్వాల్‌తో ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, దీప‌క్ శెట్టి, తుల‌సి త‌దిత‌రులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. న‌టీన‌టులు: రామ్ నిధి అగ‌ర్వాల్‌ న‌భా న‌టేష్‌ పునీత్ ఇస్సార్‌ స‌త్య‌దేవ్‌ ఆశిష్ వి...

అట్టర్ ప్లాప్ చిత్రం యూట్యూబ్ లో బ్లాక్ బస్టర్

తెలుగులో విడుదలైన కవచం అట్టర్ ప్లాప్ అయ్యింది , అయితే ఇదే చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే బంపర్ హిట్ అయ్యింది . కేవలం ఒక్క రోజులోనే ఒక కోటి అరవై లక్షల వ్యూస్ వచ్చాయి . దాంతో తక్కువ సమయంలోనే క్కువ వ్యూస్ సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది హిందీ కవచం . అన్నట్లు హిందీ లో ఈ సినిమాకు పేరేంటో తెలుసా ఇన్ స్పెక్టర్ విజయ్ . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది . పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించాడు . తెలుగులో ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉన్నారు . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పటికి ఒక్క హిట్ కూడా దక్కించుకోలేక పోయాడు పాపం . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2LdnfHC

సోకులతో షాకిస్తున్న శ్రియా విక్టర్

హాట్ భామ శ్రియా విక్టర్ సోకులతో షాకిస్తోంది . ఎంతగా స్కిన్ షో చేస్తే అంత త్వరగా స్టార్ అయిపోవచ్చు , హాట్ ఇమేజ్ తెచ్చుకోవచ్చు బాగా సొమ్ము చేసుకోవచ్చు అని భావించిన అందాల ముద్దుగుమ్మలు ఎక్కడా తగ్గడం లేదు స్కిన్ షో చేయడంలో . తాజాగా హాట్ మోడల్ శ్రియా విక్టర్ అందాలను ఉదారంగా ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . నాభి సౌందర్యాన్ని మతి పోయేలా చూపిస్తూ బొడ్డుని చూడయ్యో బొంగరమాడయ్యో అంటూ రకరకాల భంగిమల్లో , రకరకాల చీరలలో నాభి సౌందర్యాన్ని చూపిస్తోంది …… కుర్రాళ్ళని చంపేస్తోంది . తన ఇన్ స్టా గ్రామ్ లో హాట్ హాట్ ఫోజులతో దిగిన ఫోటోలు పోస్ట్ చేసి కవ్విస్తోంది . తక్కువ కాలంలోనే హాట్ మోడల్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ టాలీవుడ్ లో వెలిగిపోవాలని ఆశపడుతోంది కానీ ఈ భామ ఆశలు నెరేవేరుతాయా ? from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2J4xifw

మహేష్ రెమ్యూనరేషన్ అంతనా ?

మహర్షి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట ! టాలీవుడ్ లో ఇదే హయ్యెస్ట్ అవుతుంది , ఈ విషయం కనుక నిజమే అయితే . టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న విషయం తెలిసిందే దాంతో ఈ భారీ మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు నిర్మాతలు దిల్ రాజు , అనిల్ సుంకర . ఈ సినిమాకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఒకవైపు మహేష్ బాబు క్రేజ్ అయితే మరోవైపు అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ . ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 4 చిత్రాలు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి . అలాగే దిల్ రాజు వ్యాపార శైలి వల్ల కూడా భారీగా లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమని భావిస్తున్నారు అందుకే మహేష్ బాబు కు 50 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు భోగట్టా ! from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GQEOJm

మహర్షి పాలపిట్ట పాట రివ్యూ

మహేష్ బాబు – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మహర్షి చిత్రంలోంచి నిన్న సాయంత్రం పాలపిట్ట అనే లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు ఆ చిత్ర బృందం . పాలపిట్ట లిరికల్ వీడియో సాంగ్ మహేష్ ఫ్యాన్స్ ని విపరీతంగా అలరించేలా ఉంది . దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పాలపిట్ట పాటకు మరింత వన్నె తెచ్చింది . లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి దానికి తోడు లిరికల్ వీడియో కోసం కట్ చేసిన మహేష్ – పూజా ల స్టిల్స్ కూడా మరింతగా ఆకర్షిస్తున్నాయి . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 9న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . దానికంటే ముందుగా మే 1న హైదరాబాద్ లో మహర్షి ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నారు . మహేష్ మూడు రకాల గెటప్ లలో కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GQ12KC

సూర్య NGK ట్రైలర్ రివ్యూ

సూర్య హీరోగా నటించిన NGK చిత్ర ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే . సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది, రకుల్ ప్రీత్ సింగ్ కూడా కీలక పాత్రలో నటించింది . కాగా ఈ చిత్రాన్ని మే 31 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . NGK ట్రైలర్ మాస్ ప్రేక్షకులను అలరించేలా రూపొందింది. సూర్య మార్క్ వీరావేశ డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ తో మాస్ ని విశేషంగా అలరించేలా రూపొందించారు . అయితే ట్రైలర్ లో కొత్తదనం లేకపోవడంతో కొత్తదనం కోరుకునే వాళ్లని నిరాశ పర్చడం ఖాయం . NGK రాజకీయ నేపథ్యంలో రూపొందిన సినిమా, చాలా రోజులుగా సూర్య కు సాలిడ్ హిట్ లేకుండా పోయింది దాంతో ఈ NGK పై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా సూర్య సొంత సినిమా కావడం విశేషం . తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఏకకాలంలో విడుదల కానుంది ఈ చిత్రం . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2UKzRFS

ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రం ప్రారంభం

ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ పతాకం పై రాజు శెట్టి దర్శకత్వం లో రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రం ఈరోజు వాళ్ళ ఆఫీస్ లో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. యూనిట్ సభ్యులందరు పూజ కార్యక్రమం లో ఫల్గుని సినిమా విజయవంతం అవ్వాలని దేవుడి ని వేడుకున్నారు. అనంతరం పాత్రికేయుల సమావేశం లో దర్శకుడు రాజు శెట్టి మాట్లాడుతూ “ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ పతాకం పై నిర్మిస్తున్న మూడో చిత్రం ఇది. రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి గారు నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది మాఫియా నేపథ్యం లో లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. సినిమా అంత గోవా లో మంచి రిచ్ లొకేషన్స్ లో సినిమా చేస్తున్నాము” అని తెలిపారు. నిర్మాతలు రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి మాట్లాడుతూ “సినిమా కథ నాకు చాలా బాగా నచ్చింది. దర్శకుడు రాజు శెట్టి సినిమా ని అనుకున్న బడ్జెట్ లో ప్లాన్ చేసారు. సింగల్ షెడ్యూల్ లో సినిమా పూర్తీ చేయటానికి అని ప్రయత్నాలు చేస్తున్నాము. సుమన్ గారు, సుహాసిని గారు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సినిమా బాగా వస్తుంది అని నమ్మకం నాకుంది” అని అన్నారు. హీరో...

రాంగోపాల్ వ‌ర్మ చెప్పెది సోల్లు….. స్పెష‌ల్ మూవి ద‌ర్శ‌కుడు వాస్త‌వ్‌

ద గ్రేట్ రామ్‌గోపాల్ వ‌ర్మ కెరీర్ మెద‌ట్లో శివ‌, క్ష‌ణక్ష‌ణం అద్బుత‌మైన‌ చిత్రాలు తీసి చాలా మంది యూత్ ని ద‌ర్శ‌త్వం వైపు రావ‌టానికి మార్గం వేసిన గురువు.. అలాగే ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న కెరీర్ లో జెంటిల్‌మెన్ లాంటి చిత్రం తీసి శ‌భాష్ అనిపించుకున్నాడు. రామ్‌గొపాల్‌వ‌ర్మ త‌ను చేసిన చిత్రాలు చూసి ఇత‌ను 20 సంవ‌త్స‌రాల త‌రువాత టెర్మినేట‌ర్ లాంటి గొప్ప చిత్రాలు చేస్తాడు అని అనుకునేవారు.. శంక‌ర్ ని మాత్రం మంచి చిత్రాలు తీస్తాడు అనుకున్నారు.. కాని ఇప్ప‌డు రామ్‌గోపాల్ వ‌ర్మ తీస్తున్న నాసిర‌కం చిత్రాలు ఆఫీస‌ర్‌, ల‌క్ష్మీస్ ఎన్ టి ఆర్‌, ఐస్‌క్రీమ్ లు చూస్తుంటే అభిమానుల‌కి కొపం వ‌స్తుంది. అటు ప‌క్క శంక‌ర్ రోబో లాంటి అత్యాధునిక‌మైన సాంకేతిక ప‌ర‌మైన చిత్రాలు తీస్తున్నాడు. రామ్‌గాపాల్‌వ‌ర్మ చెప్పేది అంతా సొల్లు.. సొల్లు మాత్ర‌మే.. చాలా మంది అత‌నికి పిచ్చి ప‌ట్టిందేమె అనుకుంటున్నారు. ఆయ‌న అభిమానిగా నేను స్పెష‌ల్ చిత్రాన్ని తీసాను.. ఓక్క సారి నా చిత్రం చూసి అప్పుడు మాట్లాడు రామ్‌గోపాల్ వ‌ర్మ అని అంటున్నారు.. అంతేకాదు ఇటీవ‌ల్ మందు తాగి ఎవ‌డో రాసిచ్చిన పాటని పాడి సోష‌ల్ మీడియాలో పెట్టాడు.. మినిమ‌మ్ సెన్స్...

ఆదిత్య మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో కార్తిక్ రాజు హీరోగా ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1 మొద‌లైంది!

టాలీవుడ్ మాస్ డైర‌క్ట‌ర్ బోయ‌పాటి శ్రీను అసోసియేట్ స్వ‌రాజ్ నూనె ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్‌లో సోమ‌వారం జ‌రిగింది. కార్తిక్ రాజు , వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టిస్తున్నారు. సంప‌త్ రాజ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి సీనియ‌ర్ ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ హాజ‌ర‌య్యారు. బోయ‌పాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్ చేసి, గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దర్శ‌కుడు భీమ‌నేని శ్రీనివాస‌రావు క్లాప్‌కొట్టారు. నిర్మాత గుర‌వ‌య్య యాద‌వ్ మాట్లాడుతూ “మే 2నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెడ‌తాం. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ త‌ర‌హా చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చింది. శ్రీచ‌ర‌ణ్ పాకాల మంచి బాణీలు స‌మ‌కూర్చారు. జ‌య‌పాల్ రెడ్డి కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు“ అని అన్నారు. న‌టీన‌టులు కార్తిక్ రాజు, వ‌ర్ష బొల్ల‌మ్మ‌, సంప‌త్ రాజ్ త‌దిత‌రులు సాంకేతిక నిపుణులు స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: స్వ‌రాజ్ నూనె, నిర్మాత‌: గుర‌వ‌య్య యాద‌వ్‌ సంస్థ‌: ఆదిత్య మూవీ మేక‌ర్స్ కెమెరా: ఎన్‌.జ‌య‌పాల్ రెడ్డి ఎడిట‌ర్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఆర్ట్: ...

ఎస్ ఎల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారి ” రాజావారు రాణిగారు “

ఎస్ ఎల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారి ” రాజావారు రాణిగారు ” ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఆడు రాయాల్సిన ప‌రీక్ష ఒక‌టుంది , గీతా గీతా ఫోన్ నెంబ‌ర్ ఇవ్వ‌వే….. ఓక సారి ఎంపైర్ ఔట్ అంటే ఔటే.. లాంటి స్టేటస్ ల‌తో #RVRG హ్య‌ష్ ట్యాగ్ ల‌తో ఇంట్ర‌స్టింగ్ పోస్ట్ ల‌తో యూత్ ని ఆక‌ట్ట‌కున్నారు ఎస్‌.ఎల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు.. అంతేకాదు సోష‌ల్ మీడియాలో #RVRG పేరుతో ఈ మధ్య కొన్ని మినిమల్ పోస్టర్స్ హల్ చల్ చేస్తున్నాయి.. అసలు ఏంటి ఈ #RVRG అనే స‌స్పెన్స్ ని చిత్ర యూనిట్ ఈరోజు తెర‌దించ‌నుంది. #RVRG అంటే రాజావారు రాణిగారు అని తెలుపుతూ టైటిల్ పోస్టర్ని విడుదల చేసారు. ఈ సంద‌ర్బంగా నిర్మాత మ‌నోవికాస్ .డి మాట్లాడుతూ.. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ లొ మూవీ ల‌వ‌ర్స్ బాగా ఎక్కువ‌య్యారు. సినిమా అప్‌డేట్స్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా చిత్ర యూనిట్ ముందుగా సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఆడు రాయాల్సిన ప‌రీక్ష ఒక‌టుంది , గీతా గీతా ఫోన్ నెంబ‌ర్ ఇవ్వ‌వే….. ఓక సారి ఎంపైర్ ఔట్ అంటే ఔటే.. అని స్టేట‌స్ లు పెట్టి, #RVRG అనే ట్యాగ్ ని యాడ్ చేశాము. అయితే హ్యూజ్ రెస్పాన్స్ రావ‌టం విశేషం. అస‌లు #RVRG అం...

మహర్షి నిర్మాతల మధ్య లొల్లి

మహర్షి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల మధ్య లొల్లి షురూ అయ్యింది . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా మహర్షి చిత్రాన్ని నిర్మించారు . అయితే ఈ సినిమాకు అత్యధికంగా 150 కోట్ల ఖర్చు అయ్యిందని లెక్కలు చెబుతున్నారు . ఏ రకంగా చూసినా ఇవి దొంగ లెక్కలే ! అయితే ఆ లెక్కలను పక్కన పెడితే సినిమా రిలీజ్ కి వచ్చింది కాబట్టి బిజినెస్ పరంగా రకరకాల చిక్కులు వస్తున్నాయి . దాంతో అశ్వనీదత్ ఒకవైపు దిల్ రాజు , పివిపి లు మరోవైపు గా ఈ పోరు సాగుతోంది . అశ్వనీదత్ నిర్మించిన దేవదాస్ నష్టాలు ఈ సినిమాకు శాపంగా మారాయి . దాంతో ఈ ముగ్గురు నిర్మాతల మధ్య లొల్లి అవుతోందట . మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ మహర్షి ని కష్టాలు వీడటం లేదు . ఇప్పటికే మహర్షి చిత్రానికి సరైన బజ్ లేకపోవడంతో ఓపెనింగ్స్ ఎలా అని బాషపడుతుంటే ఇప్పుడేమో ఈ లొల్లి మహర్షి ని ఇబ్బంది పెడుతున్నాయి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GKUkoR

చిరంజీవి కొత్త సినిమా ఆగస్టు నుండి

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఆగస్టులో ప్రారంభం కానుంది . కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టు లో సెట్స్ పైకి వెళ్లనుంది . హాట్ భామ అనసూయ కీలక పాత్రలో నటించనుంది . ఇప్పటివరకు కొరటాల శివ తీసిన అన్ని సినిమాలు సందేశాత్మకంగా ఉన్నవే ! దాంతో ఈ సినిమా కూడా ఆ కోవలోకే చెందుతుందని గొప్ప సామాజిక సందేశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నాడు . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని కూడా చరణ్ నిర్మిస్తుండటం విశేషం . ఇక ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు . అయితే అంతకంటే ముందే అంటే ఆగస్టు లో కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2DD1iLT

రీ షూటింగ్ పూర్తిచేసుకున్న డియర్ కామ్రేడ్

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డియర్ కామ్రేడ్ . కాగా ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది అయితే కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వాటిని మళ్ళీ చిత్రీకరించారు దాంతో రీ షూట్ కూడా పూర్తి చేసుకున్నారు . ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాటిని కంప్లీట్ చేసి జూన్ లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ల కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన గీత గోవిందం చిత్రం సూపర్ హిట్ కావడంతో డియర్ కామ్రేడ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి . తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ బాషలలో ఈ చిత్రం విడుదల కానుంది . అయితే విడుదల తేదీలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2XSE0JG

బడ్జెట్ తగ్గించమని చెప్పాడట

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో ఇంతకుముందు ” సింహా , లెజెండ్ ” చిత్రాలు రాగా ఆ రెండు కూడా సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి . బాలయ్య ప్లాప్ లలో ఉన్న రెండు సందర్భాల్లో కూడా బోయపాటి హిట్స్ ఇచ్చాడు కట్ చేస్తే ఇప్పుడు బాలయ్య మాత్రమే ప్లాప్ లో లేడు దర్శకులు బోయపాటి శ్రీను కుల డిజాస్టర్ లతో ఇబ్బంది పడుతున్నాడు . దాంతో బాలయ్య – బోయపాటి ల కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా బడ్జెట్ తగ్గించమని సలహా ఇచ్చాడట బాలయ్య . ఇంతకీ మూడో సినిమాకు బోయపాటి ఇచ్చిన బడ్జెట్ ఎంతో తెలుసా …….. 60 కోట్లట ! అసలే బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు ఘోర పరాజయం పాలయితే ఈ సినిమాకు 60 కోట్ల బడ్జెట్ ఎలా పెడతారు ? ఒకవేళ పెట్టి తీసినా కొనేది ఎవరు ? అందుకే 40 కోట్లలో అయ్యేలా బడ్జెట్ తగ్గించమని కోరాడట బాలయ్య దాంతో బడ్జెట్ ని ఎలా తగ్గించొచ్చు అనే కోణంలో ఆలోచన చేస్తున్నాడు బోయపాటి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2J2cwNx

మహర్షి హిట్ అవుతుందా ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి మే 9 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రం హిట్ అవుతుందా ? మహేష్ కు ప్లస్ అవుతుందా అన్న చర్చ సాగుతోంది . ఎందుకంటే వంశీ పైడిపల్లి ఇంతవరకు దర్శకత్వం వహించిన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ లేకపోవడం ఒకటైతే పూజా హెగ్డే కూడా కూడా సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇంతవరకు పడలేదు . ఇక అల్లరి నరేష్ అయితే గత ఏడేళ్లుగా పరాజయాల బాటలోనే పయనిస్తున్నాడు . దానికి తోడు మహర్షి సినిమాకు సంబందించిన ప్రోమోస్ అన్ని కూడా శ్రీమంతుడు 2 లాగా అనిపిస్తున్నాయి తప్ప కొత్త కోణం కనిపించడం లేదు దాంతో మహర్షి చిత్ర విజయం పై నీలినీడలు కమ్ముకున్నాయి . అలాగే ఈ సినిమా విడుదల ఇంకా పదిరోజుల సమయం కూడా లేదు కానీ పెద్దగా చర్చ కూడా సాగడం లేదు మహర్షి గురించి దాంతో ఈ సినిమా విజయం సాధిస్తుందా ? మహేష్ కు హిట్ నిస్తుందా ? అన్న టెన్షన్ మహేష్ అభిమానుల్లో నెలకొంది . ఏది ఏమైనా మహర్షి సినిమా బాగుందని టాక్ వస్తే రికార్డుల మోత మోగడం ఖాయం , టాక్ డివైడ్ అయితేనే సమస్య . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GQjxQb

దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా ‘ఎవడు తక్కువ కాదు’ ట్రైలర్ విడుదల!

  విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ ఎవడు తక్కువ కాదు ‘. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’… ఉపశీర్షిక. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి రఘు జయ దర్శకుడు. హరి గౌర సంగీత దర్శకుడు. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తయింది. మే 11న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ “విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు తక్కువ కాదు’ ట్రైలర్ విడుదల చేశాను. ట్రైలర్ చాలా చాలా బావుంది. ఇది తమిళ సినిమా ‘గోలి సోడా’కు రీమేక్. ఆ సినిమా చాలా బావుంటుంది. ట్రైల‌ర్‌తో పాటు నేను కొన్ని విజువ‌ల్స్ చూశా. విక్రమ్ చాలా చాలా బాగా చేశాడు. ఆర్టిస్టుగా ‘రేసుగుర్రం’, ‘పటాస్’, ‘రుద్రమదేవి’, ‘ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా ‘నా పేరు సూర్య…’ సినిమాలో అంత పెద్ద పాత్రను తన భుజాల మీద మోయడం, బాగా నటించడం గొప్ప విషయం. అప్పుడు విక్ర‌మ్‌కు 15 సంవత్సరాలు అంతే. ఇప్పుడు తనకు 17 ఏళ్ళు. ఇంకా ఇంటర్ పూర్తి కాలేదు. ఆర్టిస్టుగా సి...

చిత్రీకరణ చివరి దశలో ఆమని “అమ్మ దీవెన”

సత్య ప్రకాష్ తనయుడు నటరాజ్ ను హీరోగా పరిచయం చెస్తూ, ఆమని , పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతొన్న చిత్రం “అమ్మ దీవెన”. శివ ఏటూరి దర్శకుడు. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎత్తరి గురవయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శివ మాట్లాడుతూ.. “అమ్మ దీవెన ” ప్రతి తల్లి తన కుటుంబం కోసం పడే‌ కష్టం, ఆరాటం,జీవన పోరాటాలను ప్రధానాంశంగా తీసుకుని తీస్తొన్న చిత్రం .చివరి షెడ్యూల్ చిత్రీకరణ త్వరలో చెయనున్నాము. ఒక పాట , ఒక ఫైట్ మినహా చిత్రీకరణ పూర్తయింది.మదర్ సెంటిమెంట్ తో పాటు యూత్ ను ఆకట్టుకునె అంశాలతో ఈ చిత్రముంటుందని అన్నారు.‌ నిర్మాత గురవయ్య మాట్లాడుతూ.. మా కుటుంబం లొ జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తీస్తొన్న చిత్రమిది. ఆమని‌ గారి పాత్రలొ ప్రతి కొడుకు తమ తల్లిని చూసుకుంటారు. దర్శకుడు శివ ఈ కథను అద్భుతంగా తెరమీదకు తీసుకు వస్తున్నారు.నటీనటుల సహకారం మరువలేనిది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు   నటరాజ్, శ్రీ పల్లవి, ఆమని, పోసాని, సత్య ప్రకాష్, శరణ్య (ఫిదా ఫేం),శృతి, అరుణ్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.వి.హెచ్ ,కెమెరా: సిద్దం మనో హర్, డా...

`జెర్సీ` ఎంట‌రైర్ యూనిట్‌కు మెరిట్‌లా ఎప్ప‌టికీ నిలిచిపోయే చిత్రం – రానా ద‌గ్గుబాటి

‘‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ మా టీమ్‌కి స్పెషల్‌గా ఉంటుంది. ‘అందరూ పాతబడిపోవచ్చు కానీ, ‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ పాతబడిపోదు. చాలా చాలా స్పెషల్, ప్రౌడ్‌ సినిమాగా మిగిలిపోతుంది’’ అని నాని అన్నారు. ఆయన హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల అయింది. నాటి నుంచి అప్రతిహతంగా చిత్ర విజయం సరికొత్త రికార్డ్ లను నెలకొల్పుతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్‌’లో నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ– ‘‘జెర్సీ’ రిలీజ్‌ తర్వాత నాకు వచ్చిన మెసేజెస్‌ కానీ, ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు సినిమా గురించి, నటన, టెక్నీషియన్స్‌ గురించి మాట్లాడుతున్న విధానం కానీ.. నేనెప్పుడూ ఎక్స్‌పీరియన్స్‌ చేయని ఒక ఫీలింగ్‌. ఏ సినిమాకైనా తొలి మూడు రోజులు బోల్డన్ని మెసేజ్‌లు, ఫీడ్‌బ్యాక్‌ వస్తుంటాయి. వారం తర్వాత ఆ ఫీడ్‌బ్యాక్‌ తగ్గుతూ ఉంటుంది. కానీ ‘జెర్సీ’ కి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఏ రోజుకారోజు మెసేజ్‌లతో మా ఫోన్లు నిండిపోతున్నాయి. రివర్...

నాని, సుధీర్ బాబు కాంబినేష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్రొడక్ష‌న్ నెం.36 చిత్రం `వి` ప్రారంభం

నేచుర‌ల్ స్టార్ నాని, హీరో సుధీర్‌బాబు , అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ హీరో హీరోయిన్లుగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.36 చిత్రం `వి` సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్‌, ల‌క్ష్మ‌న్‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌కుడు. దిల్‌రాజు, శిరీష్, ల‌క్ష్మ‌ణ్‌ ఆధ్వ‌ర్యంలో పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రిగాయి. ముహూర్త‌పు స‌న్నివేశానికి ద‌ర్శ‌కుడు `ఎంసిఎ` డైరెక్ట‌ర్ శ్రీరామ్ వేణు క్లాప్ కొట్ట‌గా.. `నేను లోక‌ల్‌` ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన కెమెరా స్విచ్ఛాన్ చేశారు. `ఎఫ్‌2` డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.   న‌టీన‌టులు: నాని సుధీర్ బాబు అదితిరావు హైద‌రి నివేదా థామ‌స్‌ త‌నికెళ్ళ‌భ‌ర‌ణి వి.కె.న‌రేష్‌ రోహిణి వెన్నెల‌కిశోర్ త‌దిత‌రులు సాంకేతిక నిపుణులు: మేక‌ప్‌: అర్జున్‌ కాస్ట్యూమ్స్‌: య‌న్‌.మ‌నోజ్‌కుమార్‌ కాస్ట్యూమ్ డిజైన...

దర్శకుడు సముద్ర కొత్త చిత్రం ‘జై సేన… The Power Of Youth’

సింహరాశి, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఎవడైతే నాకేంటి, అధినేత, పంచాక్షరి, సేవకుడు వంటి హిట్ చిత్రాలు అందించిన వి.సముద్ర దర్శకత్వంలో శ్రీకాంత్, సునీల్, శ్రీ ప్రముఖ పాత్రల్లో ప్రవీణ్, కార్తికేయ, హరీష్, అభిరామ్ లను పరిచయం చేస్తూ శివమహాతేజ ఫిలిమ్స్ బ్యానర్ పై సాయి అరుణ్ కుమార్ నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన…ది పవర్ అఫ్ యూత్’. ఇద్దరు ప్రముఖ హీరోలు అతిధి పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో ఆరాధ్య, నీతూ, చిత్ర, ప్రీతి శర్మ, పృథ్వి, ధన్ రాజ్, అజయ్ ఘోష్, మధు, నల్ల వేణు, చమ్మక్ చంద్ర , ఆజాద్, రాజేంద్ర నటిస్తున్నారు. దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ, ” దేశానికి వెన్నెముకైన రైతుని కాపాడండి అని స్టూడెంట్స్ ప్రభుత్వంతో, రాజకీయ నాయకులతో చేసే యుద్ధమే ఈ సినిమా కధాంశం. హైదరాబాద్, మడికరి, ఒంగోలు, వైజాగ్, బళ్ళారి, బెంగళూరు, చిక్ మంగళూరు లో 70 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. అలాగే నలుగురు కొత్త హీరోలు పరిచయం అవుతున్నారు. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత...

హాట్ భామ తల్లిగా మెప్పిస్తుందా ?

హాట్ భామ టబు అల్లు అర్జున్ తల్లిగా నటించడానికి సిద్ధం అవుతోంది . త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించనున్న చిత్రంలో టబు కీలక పాత్రలో నటించనుంది అందునా అల్లు అర్జున్ కు తల్లిగా అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటుగా సినిమా ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అన్న అనుమానం నెలకొంది . టబు కి హాట్ ఇమేజ్ ఉంది , ఇప్పటికి కూడా ఏ ఈవెంట్ కైనా హాజరైతే ఎద అందాలను చూపెడుతూ స్కిన్ షో చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతూ ఉంటోంది . అలాంటి టబు అల్లు అర్జున్ కు తల్లిగా మెప్పిస్తుందా ? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది .ఇక దర్శకులు త్రివిక్రమ్ విషయానికి వస్తే సెక్షీ భామలను , ముదురు ఆంటీ లను తన సినిమాలో కీలక పాత్రల్లో పెట్టుకుంటాడు . ఇది అతడి ప్రతీ సినిమాలో కూడా ఉంటుంది . దాంతో రకరకాల కథనాలు వినిపిస్తూనే ఉంటాయి . 47 ఏళ్ల టబు ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు పైగా హైదరాబాదీ కానీ ఉండేది మాత్రం ముంబై లో . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2UJLzQV

ఆర్ ఆర్ ఆర్ టైటిల్ ని రివీల్ చేసిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ” ఆర్ ఆర్ ఆర్ ” టైటిల్ ని రివీల్ చేసాడు . ఇంతకీ కేటీఆర్ ఆర్ ఆర్ ఆర్ కి పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా …….. ” రీజనల్ రింగ్ రోడ్డు ”. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రాంచరణ్ లు కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ” అన్న విషయం అందరికి తెలిసిందే . అయితే ప్రతీ భాషలో ఆర్ ఆర్ ఆర్ అనే ఉంటుంది కాకపోతే ప్రతీ భాషలో మరో టైటిల్ కూడా ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేయండి అని జనాల మీదకు జక్కన్న వదిలిన విషయం తెలిసిందే . అయితే ఒక్కొక్కరు ఒక్కోలా టైటిల్ పెడుతున్నారు కానీ కేటీఆర్ మాత్రం రీజనల్ రింగ్ రోడ్డు అనే కొత్త టైటిల్ ని ఆపాదించాడు . తెలంగాణ రాష్ట్రమైన హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు ని త్వరగా పూర్తిచేయాలనేది కేటీఆర్ ముందున్న లక్ష్యం దాంతో నాకు అది మాత్రమే తెలుసు అంటూ కొంటెగా సమాధానం ఇచ్చాడు నెటిజన్లు అడిగిన ప్రశ్నకు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WaU3SV

ఆ ఇద్దరూ విడిపోయారా ?

అలియా భట్ – రణ్ బీర్ కపూర్ లు గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే . ఇక పెళ్లి కావడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో స్పందించిన అలియా భట్ పెళ్లి గిల్లి జాన్తా నై అంటోంది . రణ్ బీర్ కపూర్ నాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాడు , ఉన్నాడు కానీ పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం ఇప్పట్లో లేదు అంటూ చెప్పుకొచ్చింది . దాంతో షాక్ అవ్వడం అందరి వంతు అవుతోంది . రణ్ బీర్ కపూర్ వరుసగా ప్రియురాళ్ల ని మారుస్తూనే ఉన్నాడు , ఇప్పటికే ఆ లిస్ట్ లో బోలెడు మంది ఉన్నారు , అయితే ఆ లిస్ట్ లోకి అలియా భట్ వచ్చింది , ఇక పెళ్లి కావడమే తరువాయి అని వినిపించింది కట్ చేస్తే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని అంటోంది . అంటే ఇద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది దాంతో పెళ్లి గిల్లి జాన్తా నై అని అంటోంది . పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు ఇప్పుడేమో పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటోంది ఏంటో ? from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2XUeELz

మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమా అది

మహేష్ బాబు కోసం కథ రాసి వినిపిస్తే అది నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసాడు కట్ చేస్తే అదే కథని నాని కి చెప్తే నచ్చడంతో వెంటనే సినిమా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అదే గ్యాంగ్ లీడర్ చిత్రం . మనం వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేద్దామని ప్లాన్ చేసాడు నిర్మాత అశ్వనీదత్ . అయితే మహేష్ కోసం రాసిన కథ మహేష్ కు చెప్పాడు కానీ అది నచ్చలేదట ! దాంతో రిజెక్ట్ చేసాడు మహేష్ . ఇప్పుడు అదే కథ ని నాని తో చేస్తున్నాడు విక్రమ్ కుమార్ . అయితే నాని హీరో అనుకున్నాక కొన్ని మార్పులు చేశారట స్క్రిప్ట్ లో . ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది . అది రిలీజ్ అయ్యాక కానీ తెలీదు మహేష్ మంచి పని చేశాడా ? లేదా ? అన్నది . నాని నటించిన జెర్సీ ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించగా మహేష్ నటించిన మహర్షి మే 9 న భారీ ఎత్తున విడుదల కానుంది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2ULRRQb

7000 కోట్లు సాధించిన ఎవెంజర్స్ ఎండ్ గేమ్

ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న చిత్రం ” ఎవెంజర్స్ ” ఎండ్ గేమ్ . ఈ సినిమా అయిదు రోజుల్లోనే దాదాపు 7000 కోట్ల వసూళ్ల ని ప్రపంచ వ్యాప్తంగా వసూల్ చేసి చరిత్ర సృష్టించింది . ఇక ఇండియాలో అయితే ఏకంగా వంద కోట్లకు పైగా వసూల్ చేసింది దాంతో ఎవెంజర్స్ మరింతగా  సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది . ఎవెంజర్స్ సూపర్ హీరోస్  సిరీస్ లో ఎవెంజర్స్ ఎండ్ గేమ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది .    విజువల్స్ కూడా అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు రికార్డులు కట్టబెడుతున్నారు . చైనా , అమెరికా , భారత్ లతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఎవెంజర్స్ ఫీవర్ కనిపిస్తోంది . ఇప్పటికి కూడా ఈ సినిమా కోసం తహతహలాడుతున్నారు ప్రేక్షకులు . నిన్న ఆదివారం కావడంతో పాటుగా వేసవి సెలవులు కూడా తోడవ్వడంతో ఎవెంజర్స్ రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది . ఒక్క ఇండియా లోనే 500 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు .  from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2V3VINi

Press note from Ram Gopal Varma

లక్ష్మీస్ ఎన్ టి ఆర్ సినిమా ప్రెస్ మీట్ విజయవాడ నోవాటెల్ హోటల్ లో నిర్ణయించాo,కానీ ఆ హోటల్ వాళ్లు ఎవరో వార్ణింగ్ ఇవ్వటం మూలాన భయంతో కేన్సిల్ చేశేశారు ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోట్టలూ, క్లబ్బుల, మేనేజిమెంట్లు, మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారు . నేను పైపుల రోడ్డులో NTR circle maps.app.goo.gl/j5gfvwW97b8qiC… దగ్గర నడి రోడ్డు మీద ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నా మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2UYQHpi

గీతా.. ఛలో మే3 విడుదల

రష్మీక మందన , గణేష్ నటించిన sensational మూవీ గీతా.. ఛలో weekend party ..ఈ నెల26న విడుదల అనుకున్న చిత్రం అనివార్య కారణాల వలన మే 3 న విడుదల చేయుచున్నట్లు నిర్మాతలు శ్రీ మామిడాల శ్రీనివాసరావు , దుగ్గివలస శ్రీనివాసరావు తెలియజేసారు. ఈ చిత్రం చాలా మంచి చిత్రం కన్నడలో చమ్మక్ పేరుతో రిలీజ్ అయ్యి 30 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రం. అందరూ ఈ చిత్రాన్ని చూడాలనే దృక్పధం తో మంచి కంఫర్ట్ డేట్ మే 3 న నిర్ణయించారు. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2VxflNj

‘ఏకమ్’ (ది జర్నీ ఆఫ్ ఎ జాబ్ లెస్ గాడ్ ) చిత్ర టీజర్ విడుదల

సంస్కృతి ప్రొడక్షన్స్ మరియు ఆనంద థాట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఏకమ్’. ఈ చిత్రం ద్వారా వరుణ్ వంశీ దర్శకుడిగా పరిచయం కాగా కళ్యాణ్ శాస్త్రి, పూజ, శ్రీరామ్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శివుడి మూల కతఅంశం తో తెరకెక్కించిన ఈ నూతన చిత్ర టీజర్ ను ‘మా’ అధ్యక్షుడు నరేష్ , బ్యానర్ ను నిర్మాత రాజ్ కందుకూరి మరియు అనిల్ సుంకర లు శనివారం ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రంలో మొదట నరేష్ మాట్లాడుతూ.. డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కిన చిత్రాలన్నీ విజయవంతం అయ్యాయి. ఈ ‘ఏకమ్’ చిత్రం కూడా చాలా కొత్తగా బ్యూటిఫుల్ గా కనబడుతోంది. ప్రతి జెనెరేషన్ కు కనెక్ట్ అయ్యేలా కూడా కనపడుతోంది. అందరికీ బెస్ట్ విషెస్ ను తెలువుతున్నానని అన్నారు. హీరో అభిరామ్ వర్మ మాట్లాడుతూ.. న్యూ జోనర్, క్లాసికల్ చిత్రం గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. వరుణ్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. అందరూ ఫెంటాస్టిక్ జాబ్ చేశారని అన్నారు. డైరెక్టర్ వరుణ్ వంశీ మాట్లాడుతూ.. కళ్యాణ్ శాస్త్రి గారు నాకు 11 ఇయర్స్ నుంచి తెలుసు. ఆయన నా గురువు కూడా.. ఓ రోజు నా దగ్గర ఓ కథ ఉంది, డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నానని కళ్యాణ్ గారికి చెప్పాను. కథ విని...

కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తి బాబు కాంబినేష‌న్‌లో బాలీవుడ్ డైరెక్ట‌ర్ న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి చిత్రం

`హైద‌రాబాద్ బ్లూస్‌`, `ఇక్బాల్` చిత్రాల ద‌ర్శ‌కుడు న‌గేష్ కుకునూర్ తెలుగులో తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్‌ , ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తుండ‌గా.. ప్ర‌ముఖ డిజైన‌ర్ శ్రావ్య వ‌ర్మ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇ.శివ‌ప్ర‌కాశ్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సినిమా నిర్మాణ రంగంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన నిర్మాత‌లు ప్ర‌ముఖ న‌టీనటులు, సాంకేతిక నిపుణుల‌తో సినిమాను నిర్మిస్తుండ‌టం విశేషం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా.. త‌ను వెడ్స్ మ‌ను ఫేమ్ చిరంత‌న్ దాస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఇలా క్వాలీటీ విష‌యంలో మేక‌ర్స్ కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. ప్ర‌స్తుతం వికారాబాద్‌, పూణేల్లో షూటింగ్ జ‌రుగుతోంది. ఇంకా టైటిల్ పెట్ట‌ని ఈ చిత్రం ఇప్ప‌టికే నాలుగో భాగం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది...

యంగ్ హీరో రాసలీలల టేప్ నిర్మాత చేతిలో

ఓ యంగ్ హీరో తరచుగా గోవా వెళుతూ పలువురు హీరోయిన్ లతో అలాగే మోడల్ లతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడట ! గోవా లో ఎంజాయ్ చేయడమే కాకుండా ఆ ఎంజాయ్ తాలూకు మొత్తాన్ని ఫోటోలు , అలాగే వీడియో లు తీసుకొని చూడటం అలవాటు అట పాపం ! అదే ఆ యంగ్ హీరో కొంప ముంచింది . పలువురు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసుకున్న వీడియో లు ఇప్పుడు ఓ నిర్మాత చేతికి చిక్కాయట ! దాంతో ఆ నిర్మాత ఆ వీడియో లు చూసి షాక్ అయ్యాడట ! ఏరా ! కుర్ర హీరో తెరమీద నీతులు చెప్పే నువ్వు ఇలా రెచ్చిపోవడమేంట్రా అంటూ ఆ వీడియోల తాలూకు ఫుటేజ్ నా దగ్గర ఉంది అంటూ ఆ హీరోకు సమాచారం ఇచ్చాడట దాంతో మొదట అలాంటి వీడియో లు ఏమి లేవు నన్ను బెదరించలేవు అని గట్టిగా మాట్లాడాడట ! కానీ ఆ నిర్మాత ఫలానా వాళ్లతో ఎంజాయ్ చేస్తున్న వీడియో లు నిజమే అని వివరాలతో చెప్పేసరికి బిక్కు బిక్కు మనడం ఆ హీరో వంతు అయ్యిందట. అయినా రాసలీలలు సాగిస్తే హాయిగా ఎంజాయ్ చేయాలి కానీ వీడియోలు తీయడం ఎందుకు వాటితో ఇబ్బంది పడటం ఎందుకు ? from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2IWTvMw

అభినేత్రి 2 వాయిదాపడింది

తమన్నా – ప్రభుదేవా జంటగా నటించిన ” అభినేత్రి 2 ” చిత్ర విడుదల వాయిదాపడింది . తమిళ దర్శకులు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 1 న విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు . అయితే ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ముందు చాలా సినిమాలు నిలవలేక పోతున్నాయి . దాంతో పలు చిత్రాలు విడుదల ఆగిపోయాయి . ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అభినేత్రి 2 కూడా చేరింది . తమన్నా – ప్రభుదేవా జంటగా నటించిన అభినేత్రి 2016 లో విడుదల అయ్యింది . పెద్ద హిట్ ఏమి కాదు కానీ మంచి వసూళ్ల నే సాధించింది దాంతో ఆ సినిమాకు సీక్వెల్ గా అభినేత్రి 2 తీశారు చడీ చప్పుడు కాకుండా . సినిమా రిలీజ్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసేవరకు ఎలాంటి విషయం బయటకు పొక్కనీయలేదు . ఇక ఈ సీక్వెల్ లో ప్రభుదేవా , తమన్నా , సోనూ సుద్ లతో పాటుగా నందిత శ్వేత కూడా నటించింది . మే 31 న అభినేత్రి 2 రిలీజ్ కానుంది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2IJz8mN

విజయ్ దేవరకొండ టార్గెట్ పెద్దదే !

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ పెద్ద టార్గెట్ ని ముందు పెట్టుకున్నాడు . డియర్ కామ్రేడ్ చిత్రంతో దక్షిణాది లోని నాలుగు బాషలలోకి ఎంటర్ అవుతున్నాడు . ఇప్పటికే నోటా చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరించాడు ఈ క్రేజీ హీరో , అయితే ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మాత్రం తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలుసా ….. తన మార్కెట్ ని దక్షిణాదిన మొత్తం పెంచుకోవడానికి . ఇక నుండి విజయ్ దేవరకొండ నటించిన ప్రతీ సినిమాని సౌత్ లోని నాలుగు బాషలలో విడుదల చేయడం ద్వారా మెల్లి మెల్లిగా తన మార్కెట్ పెరుగుతుందని ఆశపడుతూన్నాడు . ఏకంగా వంద కోట్ల ని టార్గెట్ గా పెట్టుకున్నాడు ఇప్పుడు . మెల్లి మెల్లిగా దాన్ని 150 కోట్ల మేరకు పెంచుకోవాలని పెద్ద కల కంటున్నాడు మరి ఈ కల సాకారం అవుతుందా ? డియర్ కామ్రేడ్ రిలీజ్ అయితే కానీ తెలీదు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2J0WN1s