World Famous Lover Movie Review in Telugu నటీనటులు: విజయ్ దేవరకొండ , రాశి ఖన్నా , క్యాథెరిన్, ఇజబెల్, ఐశ్వర్య రాజేష్ తదితరులు దర్శకుడు: క్రాంతి మాధవ్ నిర్మాత: వల్లభ సంగీత దర్శకుడు: గోపి సుందర్ విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2020 రేటింగ్: 3.5 /5 విజయ్ దేవరకొండ మరో ప్రేమకథతో మన ముందుకు వచ్చాడు. తన కెరీర్ లో వచ్చిన హిట్స్ అన్నీ ప్రేమకథలే. ఈ నేపథ్యంలో మరో భిన్నమైన ప్రేమకథను ఎంచుకున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ గా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. అయితే విడుదలకు ముందే సరైన అంచనాలను ఏర్పరుచుకున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ: గౌతమ్ (విజయ్ దేవరకొండ) రైటర్ అవ్వాలన్న తన కల కోసం చేస్తున్న జాబ్ ను కూడా మానుకుంటాడు. తన కలను నెరవేర్చుకునే పనిలో భాగంగా తన లవర్ యామిని (రాశి ఖన్నా)ను పట్టించుకోవడం మానేస్తాడు. ఈ కారణంగా ఆమె గౌతమ్ ను వదిలేసి వెళ్ళిపోతుంది. దాని తర్వాత గౌతమ్ కథలు రాయడం మొదలుపెడతాడు. యల్లందు అనే పల్లెటూరులో ఒక మధ్య తరగతి ప్రేమకథ. ప్యారిస్ లో ఒక న్యూ ఏజ్ ప్రేమ కథ.. ఇలా భిన్నమైన ప్రేమకథలు రాస్తాడు. నేపధ్యాలు భిన్నవైనా ఆ ప్రేమకథలు ఏ తీరానికి చ...
“గురూ గారూ…! ఎందుకు సార్ మనకు ఇవన్నీ..” ప్రపంచంలో ఎన్నో రకాల ఆకులు ఉంటాయి. కొన్ని తులసిఆకు లాగా పూజకు పనికి వస్తాయి. కొన్ని గోరింటాకు లాగా అందానికి పనికి వస్తాయి. ఇక కొన్ని అరుదైన జాతులు ఉంటాయి. ఆకులే కదా..! అని లోకువగా చూడకుండా వాటిని చూసి చూడనట్లు వదిలేయ్యాలి. ఎందుకంటే అవి ఒక ఘనకార్యం నిమిత్తం ఎర్త్ మీదకు ఎంట్రీ ఇచ్చి ఉంటాయి. అలాంటి అరుదైన ఆకులలో ఒకటి “దురదగుంటాకు”. ఇక దాని గొప్పతనం గురించి అందరికీ తెలుసు. అలాంటి దురదగుంటాకు లాంటి అరుదైన వ్యక్తి “రామ్ గోపాల్ వర్మ.” ఇక ఆర్జీవీ ఘనత అలా.. పక్కన పెడితే, ప్రముఖ సాహిత్య రచయిత, అద్భుతమైన జ్ఞానిశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు. ఎన్నో గొప్ప పాటలు రాసి, నిజంగానే తెలుగు సినిమా స్థాయిని పెంచిన గీత రచయిత ఆయన. ఇప్పుడు ఆయన “ ఆర్జీవి ” సినిమాకు దర్శాత్వం వహిస్తున్నారు. బాల కుటుంబరావు గారు నిర్మాత. సొసైటీ లో కొంతమంది స్వేఛ్చ పేరుతో జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దానివల్ల కలిగే కష్ట నష్టాలు వినోదాత్మకంగా చూపిస్తున్నామని జొన్నవిత్తుల గారు తెలిపారు. గతంలో కూడా ఆయన హాస్యనటుడు ఆలీతో “సోంబేరి” అనే సినిమా చేసారు. ఇక ఇప్పుడు ఎదో గతంలో ఆయనక...