Skip to main content

Posts

Showing posts from October, 2019

మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ నటీనటులు: తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, వాణి భోజన్, అవంతిక మిశ్రా, అనసూయ తదితరులు సంగీతం: శివకుమార్ దర్శకుడు: షామీర్ సుల్తాన్ నిర్మాత: విజయ్ దేవరకొండ విడుదల తేదీ: 1 నవంబర్ 2019 రేటింగ్: 2.5 /5 హీరోగా ఇప్పటికే నిరూపించుకున్న విజయ్ దేవరకొండ కెరీర్ తొలినాళ్లలోనే నిర్మాత అవతారం ఎత్తాడు. కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ ను స్థాపించి కొత్త దర్శకుడితో దాదాపు కొత్త నటీనటులతో మీకు మాత్రమే చెప్తా అనే చిత్రాన్ని నిర్మించాడు. విడుదలకు ముందు ప్రోమోల ద్వారా హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి మీకు మాత్రమే చెప్తా గురించి అందరికీ చెప్పొచ్చో లేదో తెలుసుకుందాం. కథ: రాకేష్ ( తరుణ్ భాస్కర్ ) ఒక టెలివిజన్ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తుంటాడు. తన జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో డాక్టర్ (వాణి భోజన్)ను చూసి లవ్ లో పడతాడు. అన్నీ సవ్యంగా జరిగి మరో రెండో రోజుల్లో వీరిద్దరికీ పెళ్లి అనగా, రాకేష్ ఉన్న ఫసక్ వీడియో ఒకటి నెట్ లో ట్రెండవుతూ ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది. ఆ వీడియోను నెట్ నుండి రాకేష్ తీయగలిగాడా? వాణి భోజన్ కంట పడకుండా ఆ వీడియోను ఉంచగలిగాడా?? చివరికి ఏమవు...

హాలీవుడ్ పై ప్రభాస్ ప్రేమ

హాలీవుడ్ పై ప్రభాస్ ప్రేమ బాహుబలి అనంతరం ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయి వరకు వెళ్లిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సాహో సినిమా బాలీవుడ్ లో సైతం సాలిడ్ సక్సెస్ ని అందుకోవడంతో ప్రభాస్ భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి వెళతాడని చెప్పవచ్చు, ఇక హాలీవుడ్ లో సైతం ప్రభాస్ కనిపించే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల ప్రభాస్ హాలీవుడ్ పై కూడా ఓ కామెంట్ చేశాడు. రీసెంట్ గా బాహుబలి బృందంతో కలిసి ప్రభాస్ లండన్స్ రాయల్ ఆల్బర్ట్ హాల్ ని సందర్శించిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమా స్పెషల్ లైవ్ స్క్రీనింగ్ పూర్తయ్యాక ప్రభాస్ స్టామినా ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. వివిధ దేశాల నుంచి వచ్చిన అభిమానులు ప్రభాస్ ని చూసేందుకు ఎగబడ్డారు. అయితే హాలీవుడ్ సినిమాలో నటించవచ్చుగా అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు రెబల్ స్టార్ కూల్ ఆన్సర్ ఇచ్చాడు. “తప్పకుండా.. హాలీవుడ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నాకు సెట్టయ్యే మంచి కథ దొరికితే హాలీవుడ్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను” అని ప్రభాస్ సింపుల్ గా ఫ్యాన్స్ కి ఆన్సర్ ఇచ్చాడు. మరి ప్రభాస్ ని హాలీవుడ్ లో చూపించడానికి ఎలాంటి డైరెక్టర్ పైనుంచి దిగివస్తాడో చూడాలి. ఇక ఇటీవల 40 పుట్టినరోజు జరుపుకున్...

సుక్కూ, రత్నవేలుకు మధ్య ఏం జరిగింది?

సుక్కూ, రత్నవేలుకు మధ్య ఏం జరిగింది? సుకుమార్, రత్నవేలుది డెడ్లి కాంబినేషన్. ఆర్య నుండి మొదలైన వీళ్ళ బంధం రంగస్థలం దాకా కొనసాగింది. సుక్కూ దర్శకత్వంలో రత్నవేలు కెమెరా వర్క్ తో దేవి శ్రీ ప్రసాద్ పాటలు.. ఇంతకంటే సూపర్ హిట్ కాంబినేషన్ ఉంటుందా అన్నట్లు సాగింది వీళ్ళ జోడి. అయితే ప్రస్తుతం లెక్క తారుమారైంది. సుకుమార్ సినిమాకు ఇన్నాళ్లూ పనిచేస్తూ వచ్చిన రత్నవేలు ఇప్పుడు సుకుమార్ అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాకు పనిచేయట్లేదు. రత్నవేలు కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి, మరి ఎందుకు సుకుమార్ రత్నవేలును పక్కనపెట్టి విదేశీ సినిమాటోగ్రాఫర్ ను పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకని సుకుమార్ ఇలా చేసాడు? అంటే దానికి రీజనింగ్ లేకపోలేదు. రత్నవేలు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. అతని క్యాలెండరు అసలు ఖాళీగా లేదు. సరిలేరు నీకెవ్వరు, ఇండియన్ 2 చిత్రాలతో రత్నవేలు చాలా బిజీగా ఉన్నాడు. కేవలం బిజీగా ఉన్న కారణంగానే రత్నవేలు సినిమా చేయట్లేదని అందుకు మించి ఏమి లేదని తెలుస్తోంది. అందుకే రత్నవేలు – సుకుమార్ – దేవి శ్రీ ప్రసాద్ త్రయం ఈ సినిమా వరకూ విడిపోయింది. అల్లు అర్...

రంగస్థలం రీమేక్ పై లారెన్స్ కన్ను.. పోటీలో టాప్ డైరెక్టర్స్

రంగస్థలం రీమేక్ పై లారెన్స్ కన్ను.. పోటీలో టాప్ డైరెక్టర్స్ టాలీవుడ్ లో గత ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా చిత్రం రంగస్థలం. రామ్ చరణ్ కెరీర్ లోనే కాకుండా బాహుబలి అనంతరం అత్యధిక లాభాలను అందించిన సినిమాల్లో రంగస్థలం టాప్ 5లో నిలిచింది. దాదాపు 200కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమాను ఇతర ఇండస్ట్రీలలో రీమేక్ చేయాలనీ కొంతమంది ప్లాన్ చేస్తున్నారు. ఇక కోలీవుడ్ సైడ్ లారెన్స్ కన్ను పడినట్లు తెలుస్తోంది. సినిమా తమిళ్ రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఆ సినిమాకు దర్శకుడు ఫిక్స్ అయినట్లు కూడా టాక్ వస్తోంది. పందెం కోడి – ఆవారా చిత్రాల దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తమిళ్ జనాలకు విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలంటే చాలా ఇష్టం. అలాగే బాలా కూడా రంగస్థలం రీమేక్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. బాలా – లారెన్స్ కాంబినేషన్ లో గతంలోనే ఒక సినిమా రావాల్సింది. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాకముందే క్యాన్సిల్ అయ్యింది. ఇక ఇప్పుడు లింగు స్వామి సెట్టవ్వకపోతే లారెన్స్ బాలా తోనే రంగస్థలం సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కోలీవుడ్ లో ...

వెంకీ మామ రిలీజ్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

వెంకీ మామ రిలీజ్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి? విక్టరీ వెంకటేష్ తొలిసారి తన మేనల్లుడు అక్కినేని నాగ చైతన్యతో కలిసి నటించిన చిత్రం వెంకీ మామ. ఇదివరకు ప్రేమమ్ లో వీళ్ళిద్దరూ ఒక స్క్రీన్ మీద కనిపించినా అది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే. ఇందులో ఇద్దరూ ఫుల్ లెంగ్త్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలవ్వగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అన్న ఫీల్ కలిగించగలిగింది. పవర్, జై లవకుశ సినిమాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇక అసలు విషయంలోకి వెళితే.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. సురేష్ బాబు అంటే సరైన ప్లానింగ్ తో సరైన సమయంలో సినిమాను రిలీజ్ చేసి హిట్టు కొడతాడని టాక్. అయితే వెంకీ మామ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఎక్కడలేని కన్ఫ్యూజన్ నెలకొంది. దాంతో షూటింగ్ అప్డేట్ విషయమై కూడా క్లారిటీ లేదు. దీనివల్ల అటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు సాధారణ ప్రేక్షకులు కూడా అయోమయానికి గురయ్యారు. మొదట ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా బరిలోకి దింపాలనుకున్నా...

బాబా భాస్కర్ ను ఎందుకు బిగ్ బాస్ లేపుతున్నాడు?

బాబా భాస్కర్ ను ఎందుకు బిగ్ బాస్ లేపుతున్నాడు? బిగ్ బాస్ లో నాగార్జున ఎవరినైనా ప్రశ్నించాడా అంటే అది బాబా భాస్కర్ ను మాత్రమే. ఎవరిదైనా తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేశాడా అంటే అది బాబా భాస్కర్ నే. ఈ సీజన్ లో నాగార్జున హోస్టింగ్ చూస్తే అసలు ఎపిసోడ్స్ చూడట్లేదనే విషయం అర్ధమైపోతుంది. మరి హోస్టింగ్ చేసేటప్పుడు మైక్రో ఫోన్ లో నాగార్జునకు సూచనలు ఇచ్చేది ఎవరో, హోస్టింగ్ కు ముందు నాగార్జునకు బ్రీఫింగ్ ఇచ్చేది ఎవరో కానీ వారికి బాబా భాస్కర్ అంటే ఇష్టం లేదనుకుంటా. అందుకే ఐదవ వారం నుండి అనుకుంట బాబా భాస్కర్ ను ఎలాగైనా టార్గెట్ చేయాలని చూసారు. బాబా భాస్కర్ కు బాబా మాస్కర్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. బాబా భాస్కర్ కామెడీ చేస్తుంటే ప్రతిసారి కామెడీ ఏంటని అన్నారు. అదే డల్ గా ఉండిపోతే ఇలా ఉండిపోతే కష్టం అన్నారు. ఇలా ప్రతిసారి బాబా భాస్కర్ ను వీలైనంత బ్యాడ్ చేయాలని చూసారు. కానీ బాబా మాత్రం అంత త్వరగా లొంగలేదు. పరిస్థితులకు ఎదురువెళ్ళాడు. భాష సమస్యను అధిగమించాడు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. నిజానికి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు కొన్ని భాష సమస్య వల్ల బాబా భాస్కర్ కు అర్ధమయ్యేది కాదు. ఎందుకంటే శ్రీముఖి,...

మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రివ్యూ

మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రివ్యూ ఒక్కో సినిమాతో విజయం సాధించి అనతికాలంలోనే మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న హీరో విజయ్ దేవరకొండ తొలిసారి నిర్మాతగా మారి తీసిన చిత్రం మీకు మాత్రమే చెప్తా. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు షామీర్ డైరెక్ట్ చేసాడు. పెళ్లి చూపులు చిత్రంతో విజయ్ దేవరకొండకు తొలి సూపర్ హిట్ ను అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఇంకా అనసూయ, ఈ నగరానికి ఏమైంది చిత్రంలో తన కామెడీతో అలరించిన అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో ఈ చిత్రంలో కనిపిస్తారు. చాలా తక్కువ సమయంలోనే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం నవంబర్ 1న విడుదల కానుంది. ఈరోజు విడుదలయ్యే చిత్రాల్లో మీకు మాత్రమే చెప్తా కు మంచి బజ్ ఉంది. ఆడియన్స్ ఫస్ట్ ఛాయస్ కూడా ఈ చిత్రమే అవ్వనుంది. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించాడట విజయ్ దేవరకొండ. తాను ఇప్పటిదాకా సంపాదించిన మొత్తంలో 70 శాతం ఈ చిత్రానికి పెట్టాడట. అయితే చిత్ర ఫేట్ తో విజయ్ కు టెన్షన్ లేదు. ఎందుకంటే మంచి ధరలకే చిత్రాన్ని అమ్మడంతో టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు తెలుస్తోంది. యూత్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తో తెరకెక్కిన...

బ్లాక్ బస్టర్ దర్శకుడికి ఈ కష్టాలేంటి?

బ్లాక్ బస్టర్ దర్శకుడికి ఈ కష్టాలేంటి? ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్సకుడికి మరో సినిమా సెట్ చేసుకోవడం ఎంత సేపు? అతని చుట్టూ నిర్మాతలు క్యూ కడతారు. ముందు మా అడ్వాన్స్ తీసుకోండంటే మాది తీసుకోండి అంటూ ఇబ్బంది పెట్టేస్తారు. హీరోలు కూడా తమకు సూట్ అయ్యే కథలేమైనా ఉన్నాయా అని కబురంపుతారు. నచ్చిన కథ ఉంటే వెంటనే లాక్ చేసుకుంటారు. ఈరోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడికి ఉండే వేల్యూ అది. ఇంకా అర్ధం కాకపోతే అనిల్ రావిపూడిని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎఫ్ 2 తో బాక్స్ ఆఫీస్ బద్దలైపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ ను అందించాడు. దిల్ రాజు కెరీర్ లో అత్యధిక లాభాలు తెచ్చి పెట్టిన సినిమాగా ఎఫ్ 2 రికార్డు సృష్టించింది. ఆ సినిమా రిలీజైన కొన్ని నెలలకే సూపర్ స్టార్ మహేష్ బాబు పిలిచి మరీ అవకాశమిచ్చాడు. తనకు సరిపోయే కథతో వస్తే వెంటనే డేట్స్ ఇస్తాడని ఆఫర్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి మహేష్ ను మెప్పించాడు. అలా సరిలేరు నీకెవ్వరు పట్టాలెక్కుతోంది. ఇప్పటిదాకా మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన అనిల్ రావిపూడి ఒక్కసారిగా టాప్ రేంజ్ కు చేరుకున్నాడు. ఇప్పుడర్ధమైందిగా బ్లాక్ బస్టర్ దర్శకుడికున్న డిమాండ్. మరి గీత గోవిందం...

విజయశాంతి, మహేష్ బాబు సెట్స్ లో ఒకరిని ఒకరు ఏమని పిలుచుకుంటారు?

విజయశాంతి, మహేష్ బాబు సెట్స్ లో ఒకరిని ఒకరు ఏమని పిలుచుకుంటారు? సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగతి తెల్సిందే. దాదాపు 13 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాల్లో తిరిగి నటిస్తోంది విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ప్రొఫెసర్ భారతి పాత్ర చాలా మంచిదని, తనకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని తెలిశాకే ఒప్పుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది విజయశాంతి. ఇంకా ఆమె చిత్ర విశేషాలు హీరో మహేష్ బాబు గురించి ఆసక్తికర విశేషాలను పంచుకుంది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా రాజకీయాలే తన తొలి ప్రాధాన్యం అని చెప్పుకొచ్చింది విజయశాంతి. మహేష్ బాబు, విజయశాంతి కలిసి పాతికేళ్ల క్రితం నటించారు. అప్పుడు మహేష్ బాబు చైల్డ్ హీరో కాగా, విజయశాంతి టాప్ హీరోయిన్. పాతికేళ్ల తర్వాత మహేష్ బాబు టాప్ హీరో అయ్యాడు, సూపర్ స్టార్ గా ఎదిగాడు. విజయశాంతి చాలా కాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తిరిగి రీ ఎంట్రీ ఇస్తోంది. మహేష్ బాబు ఇంత పెద్ద స్టార్ అవుతాడని అప్పట్లో అనుకున్నారా అన్న ప్రశ్నకు విజయశాంతి స్పందిస్తూ “బాబు హీరోగా చేసిన మొదటి సినిమా చూసి షాక్ అయ్యాను...

మనసంతా నువ్వే’ డైరెక్టర్.. మరో ప్రయత్నం

Director vn aditya coming with a new movie vaaleddari madhya మొదటి సినిమా హిట్టయితే దర్శకుల కెరీర్ సెట్టయినట్లే అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ వి యన్ ఆదిత్య. మనసంతా నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆదిత్య ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా మరో హిట్ అందుకోలేదు. ఆ మధ్య డి. రామానాయుడు సపోర్ట్ తో ముగ్గురు అనే సినిమా చేశాడు. ఆ సినిమా కూడా దెబ్బకొట్టింది. అనంతరం ఒక సినిమాను స్టార్ట్ చేయగా అది అనుకోని విధంగా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఫైనల్ గా సక్సెస్ అందుకోవాలని ఒక కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. ‘వాళ్ళిద్దరి మధ్య’ అనే టైటిల్ సెట్ చేసిన ఆ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరక్కెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. పెళ్లి, లవ్ కాన్సెప్ట్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులు విఎన్.ఆదిత్య గీతా ఆర్ట్స్ లో స్క్రిప్టు కన్సల్టెంట్ గానూ, పీపుల్స్ మీడియా లోనూ క్రియేటివ్ హెడ్ గా తన ఆలోచనలు పంచుకున్నారు. ఇక ఫైనల...

కార్తీకి ఖైదీ విషయంలో ఖాకీ సీన్ రిపీట్.. ఎందుకిలా?

karthis khaidi movie collectoins ఏదైనా పోగొట్టుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుందంటారు. ఈ సామెత తమిళ స్టార్ హీరో కార్తీకు అతికినట్లు సరిపోతుంది. ఒకప్పుడు కార్తీకు తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఉండేది. కెరీర్ స్టార్టింగ్ లోనే తెలుగులో మార్కెట్ సంపాదించుకుని సూపర్ హిట్లు కొట్టాడు. వరసగా వచ్చిన హిట్లతో కార్తీ మార్కెట్ తెలుగులో బాగా పెరిగింది. ఒకానొక దశలో తమిళంతో సమంగా తెలుగులో కూడా కార్తీ సినిమాలు బిజినెస్ చేసేవి. ఈ అభిమానంతోనే కార్తీ తెలుగులో స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టాడు. అయితే అంతా బాగుందన్న సమయంలో కార్తీ కథల ఎంపికలో చేసిన తప్పుల కారణంతో అటు తమిళ్ లో ఇటు తెలుగులో వరస ప్లాపులను ఎదుర్కొన్నాడు. కొన్ని చిత్రాలు తమిళంలో ఓకే అనిపించినా తెలుగులో ప్లాప్ అయ్యాయి. అదే సమయంలో కొన్ని తమిళ నేటివిటీ ఉన్న సినిమాలు చేయడం వల్ల అవి తెలుగులో విడుదల చేయడానికి కుదర్లేదు. ఈ కారణాల వల్ల కార్తీకి తెలుగులో మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది. ఒకప్పుడు పది కోట్లకు బిజినెస్ చేసే కార్తీ చిత్రాలు ఇప్పుడు నాలుగు కోట్లు అటు ఇటుకు మించి అవ్వట్లేదు. పైగా బాగున్న సినిమాలకు కూడా కలెక్షన్స్ రావట్లేదు. రెండేళ్ల క్ర...

ఆ రకంగా బన్నీ సుకుమార్ సినిమాకు ఫిట్టింగ్ పెట్టాడు

allu arjun involves his relatives in production for his next సుకుమార్ కు క్రియేటివ్ దర్శకుడిగా మంచి పేరుంది. రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు సుకుమార్. ఈ చిత్రం 100 కోట్ల కలెక్షన్స్ ను అధిగమించింది. మైత్రి మూవీస్ సంస్థకు భారీ లాభాలను తెచ్చి పెట్టింది రంగస్థలం. అయినా కానీ సుకుమార్ కు నెక్స్ట్ సినిమాను సెట్ చేయడానికి చాలా సమయం పట్టింది. ముందు మహేష్ బాబు కోసం కథ అనుకుని నెలల తరబడి దాని మీద వర్క్ చేసి మొత్తానికి రెడీ చేసుకుని వెళితే మహేష్, తనకు మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే వెంటనే అదే ప్రాజెక్ట్ అల్లు అర్జున్ తో సెట్ అయింది. మైత్రి మూవీస్ సంస్థ తొలి నుండి ఈ ప్రాజెక్ట్ కు నిర్మాతగా ఉంది. స్క్రిప్ట్ తయారుచేసే దశలోనే ఈ ప్రాజెక్ట్ కు కోట్లల్లో ఖర్చయింది. బోలెడంత సమయం కూడా వృథా అయింది. అయినా కానీ మైత్రి సంస్థ సుకుమార్ మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టింది. ప్రీ ప్రొడక్షన్ దశలోనే బోలెడంత ఖర్చైనా కానీ మైత్రి ఒక్క మాట మాట్లాడలేదు. సినిమాకు మంచి లాభాలు వస్తే అదే చాలు అనుకుంది. నిజానికి సుకుమార్ మీద ఆ సంస్థకు ఉన్న గురి అది. రంగస్థలం వం...

ఫ్యాన్స్ దెబ్బకి ఏడ్చేసిన హీరోయిన్

Noorin Shereef crying by fans behaviour అభిమానం డోస్ ఏ మాత్రం పెరిగినా సెలబ్రెటీలకు ఇబ్బందులు తప్పవు. ఒక మనిషి ఎలా ఉన్నా అతను అభిమాని అయితే చిన్న విషయాలకే మనసు ఫాస్ట్రాక్ లో రియాక్ట్ అవుతుంది. ఇక రీసెంట్ గా అలాంటి అభిమానుల కారణంగా ఒక మలయాళం హీరోయిన్ గాయలపాలైంది. ఆ దెబ్బకి హీరోయిన్ స్టేజిపైనే బోరున విలపించింది. అసలు వివరాల్లోకి వెళితే.. ఓరు ఆధార్ లవ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన నూరిన్ షరీఫ్ కమర్షియల్ యాడ్ ప్రమోషన్స్ కోసం ఇటీవల మంజేరిలోని ఒక సూపర్ మార్కెట్ ఓపెనింగ్ కి వచ్చింది. ఆమె వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు రెండు గంటల ముందే స్థావరనికి చేరుకున్నారు. అభిమానుల తాకిడిని ఈవెంట్ అధికారులు కంట్రోల్ చేయలేక సతమతమయ్యారు. అయితే కొందరు ఆగ్రహంతో నూరిన్ అనుకున్న సమయానికి రాకుండా ఆలస్యంగా వచ్చిందని నానా హంగామా చేశారు. సాయంత్రం ఆరు గంటలకు వచ్చిన నూరిన్ ఎవరిని పట్టించుకోకుండా స్టేజ్ పైకి వెల్లసాగింది. అయితే ఇంతలో కొంతమంది ఆమె మీదకి ఎగబడ్డారు. ఆ హడావుడి జనంలో ఊహించని విదంగా ఓ ఫ్యాన్ చేయి నూరిన్ ముక్కుని తాకింది. వెంటనే ముక్కును పట్టుకున్న నూరిన్ దెబ్బ తాకింది అని ఏడ్చేసింది. స్...

వెంకీ మామ బడ్జెట్ పోటు.. అందుకే ఆ డేటు!

venky mama release date అక్కినేని – దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా చిత్రం వెంకీ మామ. వెంకటేష్ – నాగ చైతన్య కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఇంకా ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు.గత కొన్ని నెలలుగా సినిమా రిలీజ్ తేదీపై నిర్మాత సురేష్ బాబు చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే సినిమా ఆలస్యమవ్వడానికి ప్రధాన కారణం సినిమాకు పెట్టిన బడ్జెట్ అని తెలుస్తోంది. సాధారణంగా సురేష్ బాబు ఒక సినిమాను రిలీజ్ చేస్తున్నారు అంటే దాంతో డబుల్ ప్రాఫిట్స్ ఎలా రాబట్టలా అని రిలీజ్ ప్లాన్ రెడీ చేసుకుంటారు. చిన్న బడ్జెట్ సినిమాలకే నెలలపాటు చర్చలు జరిపే ఆయన ఇప్పుడు 40కోట్లకు పైగా ఖర్చు చేసి వెంకీమామ ని నిర్మిస్తున్నారు. సాధారణంగా సినిమాను 30కోట్ల లోపే తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా బడ్జెట్ డోస్ పెరుగుతూ వచ్చింది. అందుకే సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ఇష్టపడటం లేదు. మహేష్ – బన్నీ సినిమాల మధ్య హోరాహోరీగా బాక్స్ ఆఫీస్ ఫైట్ కి రంగం సిద్దమవ్వడంతో వాటి మధ్యలో వెంకీమామను రిలీజ్ చేసి ర...

రాజ్ తరుణ్..ఈసారైనా గట్టెక్కుతాడా?

Iddari Lokam Okate Movie Poster ఉయ్యాల జంపాల సినిమాతో సింపుల్ ఎంట్రీ ఇచ్చిన యువ హీరో రాజ్ తరుణ్ రెండవ సినిమాతోనే బాక్స్ ఆఫీస్ సినిమా చూపించాడు. కుమారి 21F తో మరో ట్రేడ్ మార్క్ హిట్ అందుకున్న యువ హీరో ఆ తరువాత వచ్చిన అవకాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటు వెళ్ళాడు. మొదటి మూడు సినిమాలు తప్పితే ఆ తరువాత ఒక్క సినిమా కూడా ఈ హీరోకి అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. కొన్ని అయితే దారుణమైన నష్టాలను మిగిల్చాయి. ఇక ఇప్పుడు పోయిన మార్కెట్ ని సెట్ చేసుకోవడానికి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. చివరగా లవర్ సినిమాతో వచ్చిన రాజ్ తరుణ్ నెక్స్ట్ ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాను రిలీజ్ చేయనున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో శిరీష్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. మొదట నవంబర్ 9న రిలీజ్ అనుకున్నారు. ఆ తరువాత డిసెంబర్ 22 అనుకున్నారు. అవేవి సెట్టవ్వలేదు. ఫైనల్ గా కొత్త డేట్ సెట్ చేసుకున్న రాజ్ తరుణ్ ఎలాగైనా ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవలని స్పెషల్ గా ప్రమోషన్స్ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్రాండ్ తప్పితే ఇప్పటి వరకు సినిమాకు పెరిగిన బజ్ ఏమి కనిపించడం...

మాజీ నక్సలైట్ వద్ద ఫిదా బ్యూటీ

Sai Pallavi meet Naxalite ? ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్న బ్యూటీ సాయి పల్లవి. ఫిదా సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ఈ తమిళ బ్యూటీ పాత్రలను ఎంచుకోవడంలో మహా గడసరి అని నిరూపించుకుంటోంది. పాత్ర ఎలాంటిదైనా అందులో లీనమయ్యే విదంగా నటించగల అమ్మడు ఇటీవల ఒక పాత్ర కోసం రియల్ మాజీ నక్సలైట్ దగ్గరకి వెళ్లినట్లు తెలుస్తోంది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో వీరాటపర్వం అనే సినిమా చేస్తోంది. రానా ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఈ సినిమా చాలా రియాలిటీగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. 1990ల కాలంలో సాగే ఈ సినిమా కథలో సాయి పల్లవి నక్సలైట్ షేడ్స్ ఉన్న ఒక పాత్రలో కనిపించనుందట. అయితే ఆ సినిమాలో పాత్ర రియాలిటీగా ఉండాలని అమ్మడు ఒక రియల్ మాజీ నక్సలైట్ ను కలిసినట్లు తెలుస్తోంది. అతని అనుభవంతో అప్పట్లో నక్సలైట్స్ ఉండే వ్యవహార శైలి గురించి ఆమెకు వివరించారట. అలాగే అడవుల్లో ప్రమాదాలను ఎదుర్కోన్నప్పుడు నక్సల్స్ ఎలా ఉంటారు? అలాగే పోలీసులు ఎటాక్ చేసినపుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే విషయాల గురించి సాయి పల్లవి తెలుసుకుంటోంది. అలాగే అడవుల్...

బక్కచిక్కి, లావెక్కి.. మహేష్ సినిమా కోసం విజయశాంతి

బక్కచిక్కి, లావెక్కి.. మహేష్ సినిమా కోసం విజయశాంతి లేడీ అమితాబ్ గా టాలీవుడ్ లో పేరొందిన విజయశాంతి టాలీవుడ్ లో ఎన్నో మరుపురాని పాత్రలను పోషించింది. ముఖ్యంగా డేరింగ్ అండ్ డాషింగ్ పాత్రలకు విజయశాంతి పెట్టింది పేరు. హీరోలతో సమానంగా ఫైట్లు చేయగల నటి ఆమె. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి విజయశాంతి 13 ఏళ్ల క్రితం సినిమాలకు కామా పెట్టేసింది. మళ్ళీ ఇన్నాళ్లకు సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరు తో తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో ఆమె ప్రొఫెసర్ భారతి అనే పాత్రలో నటిస్తోందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెల్సిందే. సినిమాకు చాలా కీలకమైన ఈ పాత్ర లుక్ ను దీపావళి సందర్భంగా విడుదల చేసారు. ఆమె లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వచ్చింది. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు కూడా విజయశాంతి పాత్ర ఎలా ఉండబోతోందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ విజయశాంతి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సరిలేరు నీకెవ్వరు స్క్రిప్ట్ ను అనిల్ రావిపూడి తనకు నరేట్ చేసినప్పుడు రెండున్నర గంటలు నాన్ స్టాప్ గా కడు...

రామ్ రెడ్ స్కెచ్ అదిరిపోయిందిగా

రామ్ రెడ్ స్కెచ్ అదిరిపోయిందిగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ తో అదిరిపోయే హిట్ ను అందుకున్నా కానీ తర్వాతి సినిమాను ప్రకటించడానికి చాలా నెలలు తీసుకున్నాడు. దాదాపు 4 నెలలు తర్వాత తన తర్వాతి చిత్రం రెడ్ ను ప్రకటించాడు. ఇందులో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. తమిళంలో అరుణ్ విజయ్ నటించిన హిట్ చిత్రం తడంకు ఇది రీమేక్. అయితే ఎక్కడా దీన్ని రీమేక్ గా చెప్పట్లేదు మేకర్స్. ఇలా చెప్పడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుందని ఒకటి, తడం రీమేక్ అని తెలియగానే చాలా మంది ఒరిజినల్ వెర్షన్ ను చూసేస్తారు. దీని వల్ల తమ సినిమాకు ప్రేక్షకులు తగ్గిపోతారు. అందుకే చిత్ర యూనిట్ దీన్ని ఒక రీమేక్ గా ప్రకటించట్లేదు. ప్రెస్ మీట్ లో నిర్మాత సైతం ఒరిజినల్ లోని ఆత్మను మాత్రమే తీసుకుని తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా చాలా మార్పులు చేశారట. అందువల్ల కూడా దీన్ని రీమేక్ అనట్లేదు. ఏదైతేనేం రెడ్ చిత్ర షూటింగ్ నవంబర్ 16 నుండి మొదలవుతుంది. అలాగే ముహూర్తం రోజునే రిలీజ్ డేట్ ను ప్రకటించేశాడు రామ్ . ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. అంతా పక్కా అనుకున్నాకే రిలీజ్ డేట్ ప్రకటించినట్లు తెలుస్తోంది...

మెగా సెటైర్ తో మారుతిని టార్గెట్ చేసిన నెటిజన్లు

మెగా సెటైర్ తో మారుతిని టార్గెట్ చేసిన నెటిజన్లు సోషల్ మీడియా విస్తృతమయ్యాక ముసుగు వేసుకున్న నెటిజన్లు ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయడం సర్వ సాధారణమైపోయింది. ఎలాగో మనమెవ్వరం అనేది ప్రపంచానికి తెలీదు, మనం ఎవరినైనా ఏదైనా అనేయొచ్చు, మనల్ని ఏం చేయలేరు అన్న ధోరణి కొంత మంది ట్విట్టర్ యూజర్లలో ఎక్కువైపోయింది. ఇలాంటి ట్విట్టర్ యూజర్ల వల్ల చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బంది పడిన సందుదర్భాలున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో దర్శకుడు మారుతి చేరాడు. సాధారణంగా ఇలాంటి సంఘటనలప్పుడు వారి దూషణలకు రిప్లై ఇవ్వకపోవడమే మంచిది. వాటిని పట్టించుకోకపోతే త్వరగా ఫెడౌట్ అయ్యే చాన్సులుంటాయి, అదే ఒక్కసారి దేనికైనా స్పందిస్తే ఇక అదే పనిగా ఒకరి తర్వాత ఒకరు మాటలతో దాడులు చేయడం మొదలుపెడతారు. ప్రస్తుతం ప్రతిరోజూ పండగే సినిమాను డైరెక్ట్ చేస్తోన్న మారుతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తనని టార్గెట్ చేస్తూ ఒక ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్ కు మారుతి తన అసహనాన్ని వ్యక్తం చేసాడు. వివరాల్లోకి వెళితే.. ప్రతిరోజూ పండగే చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒకటి దీపావళి సందర్భంగా విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచ...

ఇక్కడ వెంకీ అక్కడ షారుఖ్..అసురన్ రీమేక్

ఇక్కడ వెంకీ అక్కడ షారుఖ్..అసురన్ రీమేక్ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ మరో రీమేక్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. వరుస డిజాస్టర్ తో గత కొన్నేళ్లుగా సతమతమవుతున్న బాలీవుడ్ బాద్ షా నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని మంచి కథల కోసం వెతుకుతున్నాడు. అట్లీతో అయితే ఆల్ మోస్ట్ సెట్టయిపోయింది. బిగిల్ హడావుడి తగ్గాక మరికొన్ని రోజుల్లో షారుక్ ని అట్లీ ప్రత్యేకంగా కలవనున్నారు. వీరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా తెరకెక్కుతుందో తెలియదు గాని కింగ్ ఖాన్ మాత్రం ఒక తమిళ్ సినిమాపై స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ధనుష్ అసురన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 100కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో మంచి లాభాలని అందించిన ఆ సినిమాను తెలుగులో వెంకటేష్ చేయడానికి సిద్దమయ్యాడు. ఇక బాలీవుడ్ లో చాలా మంది ఈ కథపై కన్నేసినట్లు టాక్ వచ్చింది. అయితే ఫైనల్ గా షారుక్ ఖాన్ అసురన్ చిత్ర యూనిట్ తో డీలింగ్స్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఆ సినిమాను ఎలాగైనా హిందీలో తనదైన శైలిలో రీమేక్ చేయాలనీ షారుక్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ వెలువడ...

బాలయ్య రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

బాలయ్య రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నందమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచినట్లు ఇటీవల కొన్ని రూమర్స్ వైరల్ అయ్యాయి. ఎన్టిఆర్ బయోపిక్ రెండు భాగాలు అనుకున్నంతగా ఆడలేకపోయినప్పటికీ బాలయ్య రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు కథనాలు వెలువడ్డాయి. రూలర్ నిర్మాత సి.కళ్యాణ్ కూడా బాలకృష్ణ అడిగినంత ఇచ్చినట్లు వార్తలు రావడంతో ఎట్టకేలకు నిర్మాత రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన సి.కళ్యాణ్ సినిమాకు సంబందించిన విశేషాలను తేలుపుతూ వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. “గతంలో బాలయ్యతో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన గురించి నాకు బాగా తెలుసు,బాలయ్య డిమాండ్ చేయడం అనేది నెగిటివ్ గా ఉండదు. డౌన్ టూ ఎర్త్ పర్సన్. రెమ్యునరేషన్ విషయంలో బాలయ్య బాబు ఎక్కువగా డిమాండ్ చేయలేదు. అసలు ఆ టాపిక్ మా మధ్యలో రాలేదు” అని సి. కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఇక రూలర్ సినిమా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తవుతుందని అనుకున్న సమాయానికి సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. రూలర్ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఓ లుక్ ఆడియెన్స్ కి మంచి కిక్ ఇచ్...

వెంకీ మామ బడ్జెట్ పోటు.. అందుకే ఆ డేటు!

వెంకీ మామ బడ్జెట్ పోటు.. అందుకే ఆ డేటు! అక్కినేని – దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా చిత్రం వెంకీ మామ . వెంకటేష్ – నాగ చైతన్య కలిసి నటించిన ఈ మల్టి స్టారర్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఇంకా ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు.గత కొన్ని నెలలుగా సినిమా రిలీజ్ తేదీపై నిర్మాత సురేష్ బాబు చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే సినిమా ఆలస్యమవ్వడానికి ప్రధాన కారణం సినిమాకు పెట్టిన బడ్జెట్ అని తెలుస్తోంది. సాధారణంగా సురేష్ బాబు ఒక సినిమాను రిలీజ్ చేస్తున్నారు అంటే దాంతో డబుల్ ప్రాఫిట్స్ ఎలా రాబట్టలా అని రిలీజ్ ప్లాన్ రెడీ చేసుకుంటారు. చిన్న బడ్జెట్ సినిమాలకే నెలలపాటు చర్చలు జరిపే ఆయన ఇప్పుడు 40కోట్లకు పైగా ఖర్చు చేసి వెంకీమామ ని నిర్మిస్తున్నారు. సాధారణంగా సినిమాను 30కోట్ల లోపే తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా బడ్జెట్ డోస్ పెరుగుతూ వచ్చింది. అందుకే సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ఇష్టపడటం లేదు. మహేష్ – బన్నీ సినిమాల మధ్య హోరాహోరీగా బాక్స్ ఆఫీస్ ఫైట్ కి రంగం సిద్దమవ్వడంతో వాటి మధ్యలో వెంకీమామను రి...

సుకుమార్ కు కండిషన్ పెట్టి సినిమా చేయడానికి ఒప్పుకున్న బన్నీ

సుకుమార్ కు కండిషన్ పెట్టి సినిమా చేయడానికి ఒప్పుకున్న బన్నీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో షూటింగ్ మొదలైన సమయంలోనే మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టేసాడు. అందులో ఒకటి సుకుమార్ తో సినిమా కాగా, మరొకటి దిల్ రాజు క్యాంప్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ తో సినిమా. అయితే ఈ రెండు ప్రాజెక్టులు ఎప్పుడు మొదలవుతాయనేది ఏం చెప్పలేదు బన్నీ. ఆ ప్రకటన చేసాక మళ్ళీ అల వైకుంఠపురములో షూటింగ్ తో ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల పెట్టుకోవడంతో షూటింగ్ ఆలస్యం కాకూడదని వరస షెడ్యూల్స్ లో సినిమా షూటింగ్ ను పూర్తిచేయాలనుకున్నాడు. అనుకున్న ప్రకారమే చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకూ విడుదలైన రెండు పాటల పుణ్యమాని అల వైకుంఠపురములో చిత్రానికి సూపర్ హైప్ వచ్చేసింది. ఇప్పుడు సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ అల వైకుంఠపురములోనే. అంతలా ఈ చిత్రం మీద క్రేజ్ ఏర్పడింది. మరోవైపు తన రెండు సినిమాలలో ముందు ఏది మొదలుపెట్టాలని సందిగ్దత బన్నీని చాలా కాలం వెంటాడింది. ఒక స్టేజ్ లో ముందు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయాల్సిన ఐకాన్ ను చేద్దామని ఫిక్స్ అయ్యాడు. రంగస్థలం...

బాబా భాస్కర్ కు బిగ్ బాస్ ఎందుకంత ఎలివేషన్ ఇస్తున్నారు?

బాబా భాస్కర్ కు బిగ్ బాస్ ఎందుకంత ఎలివేషన్ ఇస్తున్నారు? బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో.. అంటే ప్రేక్షకులు ఇచ్చే తీర్పుల మీదే షో నడవాలి. కానీ నిజంగా బిగ్ బాస్ లో ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగానే ఎలిమినేషన్స్ జరుగుతాయా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. షో కు మంచి టీఆర్పీలు రావడానికి నిర్వాహకులు పెద్ద ఉపయోగం లేని కాండిడేట్స్ ను ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. షో కు గ్లామర్ తీసుకొచ్చి టీఆర్పీ కోసం ఉపయోగపడే వారిని షో లో ఉంచడానికి ప్రయత్నిస్తారు. కాండిడేట్స్ ను తీసుకునేటప్పుడే ఎవరెప్పుడు ఎలిమినేట్ అయితే బాగుంటుందోనని ఒక లిస్ట్ వేసుకుంటారని సమాచారం. ఆ ప్రకారంగా బాబా భాస్కర్ ను మిడ్ సీజన్ లో ఎప్పుడైనా సమయం చూసి ఎలిమినేట్ చేద్దామని ప్లాన్ వేశారు. బాబా భాస్కర్ కు కూడా షో కు ఆహ్వానించినప్పుడు మహా అయితే ఉంటే అంత వరకూ ఉండే ఛాన్స్ లు ఉన్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే బాబా భాస్కర్ కూడా మూడు వారాలకే బట్టలు తెచ్చుకుని షో కు వచ్చాడు. తను ఇంత కాలం ఉంటానని తనే అనుకోలేదు. షో నిర్వాహకులు కూడా బాబా భాస్కర్ ను ఇంతకాలం ఉంచాల్సి వస్తుందని ఊహించలేదు. షో మొదలైనప్పటినుండే బాబా భాస్కర్ తనదైన...

సరైన దర్శకుడి కోసం వెంకీ వెతుకులాట

సరైన దర్శకుడి కోసం వెంకీ వెతుకులాట విక్టరీ వెంకటేష్ ఇప్పుడు డైలమాలో పడ్డాడు. అవి కూడా రెండు రకాల డైలామాలు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. అక్కినేని నాగ చైతన్యతో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు వెంకటేష్. ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకుని తన తర్వాతి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. వెంకీ మామ రిలీజ్ పై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఈ చిత్రం డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉన్నా ఎందుకు ఆలస్యమవుతోందో తెలీదు. నిర్మాణ సంస్థ నుండి కూడా ఎటువంటి అప్డేట్ లేదు. జనవరి లాస్ట్ వీక్ లో కానీ ఫిబ్రవరిలో కానీ విడుదల కావొచ్చు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగ చైతన్య సరసన రాశి ఖన్నా చేస్తోంది. బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. వెంకీ మామ వెంకటేష్ కెరీర్ లో 73వ చిత్రం. మరో చిత్రం చేస్తే వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రానికి చేరువవుతాడు. ఇప్పుడిదే వెంకటేష్ ను కన్ఫ్యూజన్ కు గురి చేస్తోంది. 75వ సినిమా అంటే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేయకూడదు. అనుభవమున్న దర్శకు...

ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత !!!

ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత !!! ప్రముఖ సీనియర్ నటి గీతాంజలి తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆమె చనిపోయారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషాల్లో ఆమె నటించారు. సీతారామకల్యాణం, మర్యాదరామన్న, లేతమనసులు, మురళీ కృష్ణ వంటి పలు మంచి చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. జానపద చిత్రాల్లో పద్మనాభం వంటి నటుల సరసన నటించిన ఘనత ఆమెది. ఆమె తన సహ నటుడు రామకృష్ణను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె అనేక సినిమాల్లో భామ క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షకులను పలకరించే వారు. పెళ్లైన కొత్తలో కీలక ప్రాతలతో మెప్పించారు గీతాంజలి. తెలుగుతో నటించిన ఆమె చిత్రాలు ప్రాచుర్యం పొందాయి. అందుచేత తమిళ్‌, మళయాళం, హిందీ చిత్రాల్లోనూ ఆమెకు అవకాశాలు వచ్చాయి. ఇతర భాషల్లో కూడా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. సీతారామకల్యాణం, డాక్టర్‌ చక్రవర్తి, మురళీక్రిష్ణ, అబ్బాయిగారు, అమ్మాయిగారు, కాలం మారింది, సంబరాల రాంబాబు వంటి చిత్రాలు ఈమెకు మంచి పేరుతో పాటు గుర్తింపును తీసుకుని వచ్చాయి. గీతాంజలి గారికి ఓ కుమారుడు ఉన్నాడు. 1957 లో కాకినాడ లో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. సినిమాల్లోకి వచ్చిన తర్వా...

వీడియోలతో కంటెస్టెంట్స్ ను ఏడిపించేసిన బిగ్ బాస్

వీడియోలతో కంటెస్టెంట్స్ ను ఏడిపించేసిన బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే రకరకాల ఎమోషన్స్ ను చూపిస్తుంది. హౌజ్ లోకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ ఎలాంటివాడైనా సరే ఎమోషన్స్ అన్నిటీనీ దాటుకుని ముందుకెళ్లాల్సిందే. కోపం, బాధ, ప్రేమ, ఆనందం.. ఇలా భావాలు ఏవైనా వాటిని వ్యక్తపరచకుండా ఉండలేరు. అదే బిగ్ బాస్ ఉండనివ్వడు. ఇద్దరు స్నేహంగా ఉంటే వారి మధ్య గొడవలు పెట్టి వాళ్ళ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అన్నది చూస్తాడు. ఇద్దరు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటే వారిని ఒక టీమ్ గా పెట్టి టాస్క్స్ ఆడిస్తాడు. మొత్తానికి ఒకే రకమైన ఎమోషన్ తో ఎవరినీ ఉంచడు బిగ్ బాస్. అందరినీ నవ్వించే బాబా భాస్కర్ ను ఏడిపించగలడు. అందరిచేత మిస్టర్ కూల్ అనిపించుకున్న వరుణ్ సందేశ్ కి కోపం తెప్పించగలడు, టాస్క్ లంటే 100 శాతం ఇచ్చే అలీను టాస్క్ నుండి ఎలిమినేట్ చేయగలడు, పెద్దగా ఎమోషన్స్ బయటకు రానివ్వడానికి ఇష్టపడని రాహుల్ చేత ఎమోషనల్ అయ్యేలా చేయగలడు, ఇంకా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రీముఖిని డల్ గా మార్చేయగలడు. ఇలా ఒక పర్సన్ ఎలా ఉంటాడో వాడిలోని ఆపోజిట్ కోణాన్ని ఆవిష్కరించగలడు. అందుకే బిగ్ బాస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయింది. బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు...

ఇంతకీ అలాంటి క్యారెక్టర్ కు బాలయ్య సూట్ అవుతాడా?

Balakrishna నందమూరి బాలకృష్ణ కెరీర్ పోషించని పాత్రంటూ లేదని చెప్పవచ్చు. పోలీస్, ఫ్యాక్షనిస్ట్, రాజులు, డాక్టర్.. ఇలా అన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రలలో బాలయ్య నటించేసాడు. నటన పరంగా బాలయ్యకు వంక పెట్టడానికంటూ ఏం ఉండదు. కాకపోతే ఒక్కోసారి ఆయన లుక్స్, మేకప్ విషయంలోనే ప్రేక్షకుల నుండి కంప్లైంట్స్ వస్తాయి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన 105వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. తనతో జైసింహా తీసిన కెఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనికి రూలర్ అని టైటిల్ పెట్టినట్లు దీపావళి సందర్భంగా వెల్లడించారు. ఆ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో బాలయ్య పోలీస్ లుక్ లో దర్శనమిచ్చాడు. పాకెట్ లో గన్ ఉన్నా కానీ చేత్తో ఆయుధాన్ని పట్టుకుని సీరియస్ గా చూస్తున్న బాలయ్య లుక్ ను వదిలారు. ఇది మాస్ కోసమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫైట్స్, డ్యాన్స్ లు అంటే బాలయ్య ఊపు మాములుగా ఉండదు. అయితే ఇప్పుడు డిస్కషన్ బాలయ్య పోలీస్ గా చేసిన పాత్ర గురించి కాదు. రూలర్ లో బాలయ్య రెండు గెటప్స్ లో కనిపించబోతున్నాడు. అంటే డ్యూయల్ రోల్ అన్నమాట. డ...

శృతి హాసన్ రీ ఎంట్రీ.. హీరోయిన్ గా రాణించగలదా?

Shruti Haasan మొదట ఐరన్ లెగ్ గా ముద్రపడ్డ శృతి హాసన్ .. గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ రుచి చూసింది. ఇక అంతే ఆమె వెనుతిరిగి చూసింది లేదు. వరసగా స్టార్ హీరోలతో నటిస్తూ సూపర్ హిట్లు సాధిస్తూ ఐరన్ లెగ్ అన్న వాళ్ళ చేతే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. తెలుగులో కాటమరాయుడు సినిమా తర్వాత శృతి హాసన్ మళ్ళీ నటించింది లేదు. ప్రియుడు మైఖేల్ కోర్సలే తో ప్రేమాయణం, ఆపై లండన్ లో మ్యూజిక్ కెరీర్ అంటూ సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. అయితే శృతి హాసన్ ఇప్పుడు మళ్ళీ సింగిల్. మైఖేల్ తో పెళ్లి వరకూ వెళ్తుందనుకున్న ప్రేమాయణం మధ్యలోనే బెడిసికొట్టింది. దీంతో అమ్మడు మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తమిళంలో ఒక సినిమా చేస్తోంది శృతి హాసన్. విజయ్ సేతుపతి సరసన లాబం అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. మరోవైపు తెలుగులో కూడా రీ ఎంట్రీ కోసం ఒక మంచి సినిమా కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో శృతి హాసన్ కు రవితేజ సినిమా ఆఫర్ వచ్చింది. మాస్ మహారాజ రవితేజతో గోపీచంద్ మలినేని చేయబోతున్న పోలీస్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం కూడా వచ్చింది. రవితేజ , శృతి హా...

పెళ్లి చూపులు పిల్ల.. ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Pellichoopulu actress rithu varma new movie with naga shourya పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ బాగా దగ్గరైన బ్యూటీ రీతూ వర్మ. కాస్త గ్లామర్ ఛాయలు కనిపించడంతో అమ్మడు టాలీవుడ్ లో ఇట్టే క్లిక్కవుతుందని అంతా అనుకున్నారు. కానీ అమ్మడు కోలీవుడ్ సైడ్ ఎక్కువగా అడుగులు వేసింది. మధ్యలో కొన్ని తెలుగు ఆఫర్స్ వచ్చినా నో చెప్పిందని గతంలో రూమర్స్ వచ్చాయి. అయితే బేబీ మాత్రం తనకి నచ్చిన కథలను మాత్రమే చేయడానికి ఒప్పుకుంటానని ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీతూ వర్మ మొత్తనికి ఒక తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో యువ హీరో నాగ శౌర్య కొత్త సినిమా మొదలుకానుంది. సీతారా ఎంటర్టైన్మెంట్ లో కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఆ ప్రాజెక్టును తెరకెక్కించనుంది. ఇటీవల స్క్రిప్ట్ విన్న రీతూ సింగిల్ సిట్టింగ్ లో ఒకే చెప్పేసిందట. తెలుగులో చివరగా ఈ భామ నిఖిల్ కేశవ సినిమాలో నటించింది. ఆ సినిమా తరువాత కోలీవుడ్ సైడ్ కి ఎగిరిపోయింది. ఇక మొత్తానికి నాగ శౌర్య సినిమాతో టాలీవుడ్ లో వాలింది. ఇక కొన్ని రోజుల క్రితం శర్వానంద్ తో కూడా ఒక సినిమాను మొదలుపెట్టింది. ఆ సినిమా పూర్త...

కేటీఆర్ కి స్పెషల్ షో సెట్ చేసిన విజయ్

Vijay Deverakonda and KTR టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా విజయ్ సొంత బ్యానర్ నుంచి డిఫరెంట్ ఫిల్మ్ వస్తుండడంతో టాలీవుడ్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది. ఆడియెన్స్ తో పాటు చాలా మంది సినీ ప్రముఖులు సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక నవంబర్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాను అందరికంటే ముందే తెలంగాణ ఐటి మినిష్టర్ కేటీఆర్ వీక్షించనున్నారట. హైదరాబాద్ AMB సినిమాస్ లో విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా స్పెషల్ షోని ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సపోర్ట్ తో సినిమాకు ప్రమోషన్స్ డోస్ పెంచిన రౌడి స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు కేటీఆర్ కూడా సినిమాపై లుక్కేస్తుండడంతో జనాల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం పక్కా. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అలాగే జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ ఒక కీలక పాత్రలో నటించింది. మరి విజయ్ బ...

ఫైటర్ పై ఒక్క స్పీచ్ తో అంచనాల్ని పెంచేసిన పూరి

Puri Jagannath వరస ప్లాపులతో సతమతమైన పూరి జగన్నాథ్ ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ తో కొట్టాడు. ఈ సినిమా సాధించిన విజయంతో తన పనైపోయిందనుకున్న వాళ్లకు దిమ్మతిరిగే రేంజ్ లో సమాధానం చెప్పినట్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి జగన్నాథ్ ఎక్కువ ఆలస్యం చేయకుండా విజయ్ దేవరకొండతో తన తర్వాతి చిత్రముంటుందని ప్రకటించేశాడు. ఈ ప్రకటన విన్న వెంటనే మూవీ లవర్స్ కు భలేగా అనిపించింది. హీరోలకు విభిన్నమైన క్యారెక్టరైజేషన్లు రాయడంలో పూరి సిద్ధహస్తుడు. ఆయన మూవీస్ ప్లాపై ఉండవచ్చు కానీ పూరి హీరో మాత్రం ఎప్పుడూ ప్లాప్ అవ్వలేదు. హీరోకు పూరి ఇచ్చే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అందరికీ తెగ నచ్చేస్తుంది. స్వతహాగా మంచి పెర్ఫార్మర్ అయిన విజయ్ దేవరకొండను పూరి ఎలా ప్రెజంట్ చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ కలిగింది. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే విజయ్ లో సరికొత్త కోణాన్ని చూడబోతున్నామని అందరూ ఫీల్ అయ్యారు. ఈ సినిమాకు ఫైటర్ అన్న టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా షూటింగ్ ఎప్పటినుండి అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. పూరి ఈసారి స్క్రిప్ట్ ఫినిష్ చేయడానికి కొంచెం ఎక్కువ టైమ్ తీసుకోవడం...

యంగ్ డైరెక్టర్ కి సూర్య గ్రీన్ సిగ్నల్

Hero suriya green signal to young director lokesh kankarajan కోలీవుడ్ లో యువ దర్శకులకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. సీనియర్ దర్శకుల కంటే యంగ్ డైరెక్టర్స్ బెస్ట్ అని రజినీకాంత్ – విజయ్ వంటి బాక్స్ ఆఫీస్ హీరోలు యువకులకు అవకాశాలు ఇస్తున్నారు. విజయ్ అట్లీతో  మూడు సినిమాలు చేసి తన మార్కెట్ ని పెంచుకున్నాడు. బిగిల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అదే తరహాలో కార్తీ  కూడా యువ దర్శకుడితో చేసిన ఖైదీ సినిమా కూడా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. తెలుగులో కూడా ఆ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు లోకేష్ కనగరాజాన్ స్టార్ హీరోల నుంచి మంచి ఆఫర్స్ అందుకుంటున్నాడు. నెక్స్ట్ విజయ్ ని డైరెక్ట్ చేయబోతున్న లోకేష్ కి సూర్య కూడా ఒక ప్రాజెక్ట్ కోసం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. లోకేష్ విజయ్ తో సినిమా చేసిన తరువాత ఖైదీ 2 చేసే అవకాశం ఉంది. ఇక త్వరలోనే సూర్య సినిమాని కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ప్రస్తుతం ...