Skip to main content

Posts

Showing posts from August, 2018

అవమానించడంతో ఆ సినిమా నుండి తప్పుకున్నాడట

బాలీవుడ్ లో రూపొందుతున్న మణికర్ణిక వివాదాలు సృష్టిస్తూనే ఉంది . ఇప్పటికే దర్శకులు క్రిష్ ఆ సినిమా నుండి తప్పుకున్నారని అందుకు కంగనా రనౌత్ వ్యవహారశైలి కారణం అంటూ వార్తలు వస్తుండగా తాజాగా జరిగిన మరో సంఘటనతో అది నిజమే అనిపిస్తోంది . తాజాగా ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుగగా ఆ షూటింగ్ లో భాగంగా డైరెక్టర్ గా కంగనా రనౌత్ పేరు ఉన్న క్లాప్ బోర్డు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది కాగా ఇప్పుడు సోను సుద్ అనే నటుడు కూడా మణికర్ణిక సినిమా నుండి తప్పుకున్నాడని తెలుస్తోంది అందుకు కారణం కంగనా రనౌత్ పొగరుగా వ్యవహరిస్తూ సోనూ సుద్ ని అవమానించడమేఅని అంటున్నారు . సోనూ సుద్ సదాశివ్ అనే మరాఠా రాజుగా నటిస్తున్నాడు మణికర్ణిక చిత్రంలో , షూటింగ్ పార్ట్ కూడా చాలాభాగం అయ్యిందట కానీ లొకేషన్ లో తనపట్ల కంగనా వ్యవహరిస్తున్న తీరుతో నొచ్చుకొని మణికర్ణిక యూనిట్ కు గుడ్ బై చెప్పాడట ! కంగనా రనౌత్ వ్యవహారశైలి గతకొంత కాలంగా వివాదాస్పదం అవుతూనే ఉంది . హృతిక్ రోషన్ తో ఆమె వ్యవహారం పెద్ద దుమారమే రేపింది . English Title: actor sonu sood quit manikarnika movie from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews h...

పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి

కలర్స్ స్వాతి పెళ్లి ఎట్టకేలకు అయ్యింది . గతకొంత కాలంగా కలర్స్ స్వాతి ఓ యంగ్ హీరో ని ప్రేమిస్తోందని రకరకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ తాను ప్రేమిస్తున్న మలేషియన్ పైలట్ వికాస్ ని పెళ్లి చేసుకుంది . కొంతమంది సన్నిహితులు ఇరు కుటుంబాల బంధువులు తప్ప మిగతావాళ్ళని పెళ్లికి పిలవలేదు స్వాతి . అయితే రిసెప్షన్ మాత్రం అటు అబ్బాయ్ తరుపు వాళ్ళ కోసం కొచ్చి లో అలాగే స్వాతి తరుపు వాళ్ళ కోసం , టాలీవుడ్ కోసం హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు . చడీచప్పుడు కాకుండా స్వాతి పెళ్లి కావడంతో ఒకింత షాక్ అయ్యారు నెటిజన్లు . స్వాతి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో వాటిని షేర్ చేస్తూ మిగతావాళ్లకు తెలిసేలా చేస్తున్నారు . బుల్లితెర యాంకర్ గా ప్రారంభమైన కలర్స్ స్వాతి కెరీర్ హీరోయిన్ స్థాయి వరకు వెళ్ళింది . తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటించింది కలర్స్ స్వాతి . మొత్తానికి కోరుకున్న ప్రియుడిని పెళ్లి చేసుకున్న స్వాతి మలేషియాలో స్థిరపడుతుందా ? లేక హైదరాబాద్ లోనేనా ? అన్నది తేలాల్సి ఉంది . English Title: colours swathi married with Vikas from టాప్ స్టోరీస్...

ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లకు దగ్గరైన బాలయ్య

గతకొంత కాలంగా నందమూరి వారి ఇంట అన్నాదమ్ముల మధ్య బాబాయ్ -అబ్బాయ్ ల మధ్య సఖ్యత లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నందమూరి హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం ఒక్కటయ్యింది . హరికృష్ణ మరణం ఒక్కసారిగా నందమూరి కుటుంబాన్ని షాక్ కి గురిచేసింది , దాంతో విషాదంలో అందరి మధ్య ఉన్న అరమరికలు తొలగిపోయి అన్నగారి కుటుంబం కలిసిపోయింది . బాలకృష్ణ బాబాయ్ ఆప్యాయంగా అబ్బాయ్ లు కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ లను పలకరిస్తుంటే చూసేవాళ్లకు చూడముచ్చటగా ఉంది ఆ కలయిక . తాజాగా బాలయ్య ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లతో టిఫిన్ చేస్తూ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇంతకుముందు వరకు ఆ కుటుంబంలో ఉన్న మనస్పర్థలు ఈ దెబ్బతో పోయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య ,ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు మళ్ళీ కలవడంతో నందమూరి అభిమానులకు పండగే పండగ ! ఎన్టీఆర్ లో కూడా కొత్త జోష్ రావడానికి కారణం అవుతుంది బాలయ్య బాబాయ్ పలకరింపుల వల్ల .   English Title: good news for nandamuri fans : balakrishna with kalyan ram and Ntr from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2LN6Epg

సెప్టెంబరు 28న ఇదంజగత్

కథానాయకుడు సుమంత్ నటిస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం ఇదం జగత్ . అంజు కురియన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ సుమంత్ ఈ చిత్రంలో కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చేయ్యబోతున్నాడు. విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుంది. ఈ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది అని తెలిపారు. శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిన...

అభిషేక్ నామ చేతికి రామ్ గోపాల్ వర్మ ‘ భైరవ గీత’..!!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ప్రేమకథాచిత్రం ‘భైరవగీత’.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఈరోజు ఆర్జీవీ స్వయంగా అయన చేతులమీదుగా రిలీజ్ చేయగా, ఆ ఫస్ట్ లుక్ లో ప్రధాన పాత్రలు ఎంతో ఎమోషనల్ లుక్ లో కనపడుతుండడం విశేషం.. ధనంజయ మరియు ఇర్రా లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ మరియు క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథకి ఇంప్రెస్ అయిన ప్రముఖ నిర్మాత అభిషేక్ నామ చిత్ర హక్కులను సొంతం చేసుకోగా, ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ని సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 1 గంటకి రిలీజ్ చేయబోతున్నారు.. నటీనటులు: ధనంజయ, ఇర్రా సాంకేతిక నిపుణులు : దర్శకుడు: సిద్ధార్థ తాతోలు సమర్పిస్తున్న వారు : రామ్ గోపాల్ వర్మ నిర్మాతలు: అభిషేక్ నామా, భాస్కర్ రాశి బ్యానర్: అభిషేక్ పిక్చర్స్ from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2MIb85N

శైలజారెడ్డి అల్లుడు హిట్ అయ్యేలాగే ఉంది

మొత్తానికి ఎన్నో అవాంతరాలను అధిగమించి శైలజారెడ్డి అల్లుడు ట్రైలర్ విడుదల అయ్యింది . 1 నిమిషం 49 సెకన్ల పాటు ఉన్న ఈట్రైలర్ చూస్తుంటే సినిమా వినోద ప్రధానంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది . ఇక ఈ ట్రైలర్ తో శైలజారెడ్డి అల్లుడు హిట్ కావడం ఖాయమని అనిపిస్తోంది . ఇప్పటికే సరైన సినిమా ఏది లేదు బాక్సాఫీస్ వద్ద సరిగ్గా అలాంటి సమయంలో వస్తున్న శైలజారెడ్డి అల్లుడు బాక్సాఫీస్ ని కుమ్మేయడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . రమ్యకృష్ణ , అక్కినేని నాగచైతన్య , అనుపమ పరమేశ్వరన్ నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి మారుతి దర్శకత్వం వహించగా నాగవంశీ – పిడివి ప్రసాద్ లు సంయుక్తంగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మించారు . గోపీసుందర్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు ఆ చిత్ర బృందం . రమ్యకృష్ణ , అనుపమ పరమేశ్వరన్ లతో నాగచైతన్య ఆట ఎలా ఉందో తెలియాలంటే సెప్టెంబర్ 13 వరకు ఎదురు చూడాల్సిందే . English Title: shailajareddy alludu trailer talk from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2MH1IYb

బాహుబలి 3 నవ్వులే నవ్వులు

ప్రభాస్ బాహుబలి గా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే అయితే తాజాగా సోషల్ మీడియాలో బాహుబలి 3 నవ్వుల వర్షం కురిపిస్తోంది . బాహుబలి , బాహుబలి 2 అందరికీ తెలుసు మరి ఈ బాహుబలి 3 ఏంటి అని అనుకుంటున్నారా ? అసలు ఈ బాహుబలి 3 కి సినిమాలకు సంబంధం లేదు రాజకీయ నేపథ్యం ఉన్న బుల్లితెర సినిమా ….. యు ట్యూబ్ సినిమా అన్నమాట . మధ్యప్రదేశ్ లో త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి అక్కడ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం అధికారంలో ఉంది . ఇక కాంగ్రెస్ పార్టీ అక్కడ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి రావాలని జ్యోతిరాదిత్య సింథియా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు .శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం పై వ్యతిరేకత కూడా ఉంది దాంతో పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాడు . ఇంకేముంది భారతీయ జనతా పార్టీ కి చెందిన ఓ కార్యకర్త బాహుబలి చిత్రంలోని సన్నివేశాలకు జ్యోతిరాదిత్య సింథియా ఫోటో ని తగిలించాడు . అలాగే బాహుబలి గా శివరాజ్ సింగ్ చౌహన్ ని పోల్చుతూ రూపొందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది . English Title: baahubali 3 shivraj singh ch...

అక్టోబర్‌ 18న విజయదశమి కానుకగా మాస్‌ హీరో విశాల్‌ ‘పందెం కోడి 2’

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పందెంకోడి 2’. గతంలో మాస్‌ హీరో విశాల్‌, ఎన్‌.లింగు స్వామి కాంబినేషన్‌లో వచ్చిన ‘పందెంకోడి’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి విశాల్‌ కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘పందెంకోడి 2’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ గురువారం విడుదల చేశారు. ఆగస్ట్‌ 31న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘పందెంకోడి 2’ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర సమర్పకులు ఠాగూర్‌ మధు తెలిపారు. మాస్‌ హీరో విశాల్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాజ్‌కిరణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాతలు: విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా, దర్శకత్వం: ఎన్‌.లింగుస్వామి. ...

అవకాశం ఇస్తే పడుకుంటే తప్పులేదట

సినిమాలో ఛాన్స్ ఇస్తే , వారి కోరిక తీర్చితే తప్పేముందని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ యాంకర్ రష్మీ . జబర్దస్త్ తో బుల్లితెరపై అందాలను ఆరబోసి కుర్రకారుని పిచ్చెక్కించిన భామ ఈ రష్మీ . బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తో రష్మీ కి చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అయితే అందులో గుంటూరు టాకీస్ చిత్రం మినహా మిగతా సినిమాలు ఏవి ఆడలేదు . రష్మీ కి వచ్చిన చిత్రాల్లో ఎక్కువగా హర్రర్ నేపథ్యంలో రూపొందినవే ! అయితే విధిగా అన్ని సినిమాల్లో కూడా రా ….. స్వర్గం చూపిస్తా అంటూ అందాలను ఆరబోసి యువతని పిచ్చెక్కించింది రష్మీ . కాస్టింగ్ కౌచ్ ఆరోపణల నేపథ్యంలో స్పందించిన రష్మీ అవకాశాల కోసం వెళ్లడం అనేది ఇక్కడ కామన్ , దాన్ని నేను గౌరవిస్తాను కూడా అయితే దానికి ఒప్పుకోవడం ,ఒప్పుకోకపోవడం అన్నది వాళ్ళ వాళ్ళ ఇష్టమని ……. ఇష్టపడి వెళ్లి ఆ అనుభవం పొందాక బయటకొచ్చి గగ్గోలు పెట్టడం దారుణమని అంటోంది రష్మీ . మొత్తానికి అవకాశం ఇచ్చిన వాడి పక్కలో పడుకుంటే తప్పులేదని చెప్పకనే చెబుతోంది ఈ భామ . English title: rashmi sensational comments on castingcouch from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/...

మణికర్ణిక ఈ లొల్లేంది

బాలీవుడ్ లో రూపొందుతున్న మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రానికి క్రిష్ దర్శకుడు అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ క్లాప్ బోర్డ్ సంచలనం సృష్టించింది . ఇంతకీ ఆ క్లాప్ బోర్డ్ లో ఏముందో తెలుసా …… …. మణికర్ణిక చిత్రానికి దర్శకులు కంగనా రనౌత్ అని . ఇంకేముంది అది వైరల్ గా మారింది. ఈ విషయం కంగనా రనౌత్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించింది మణికర్ణిక చిత్రానికి దర్శకులు క్రిష్ అయితే కొంత ప్యాచ్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ గా ఉంది కాబట్టి ఆ ప్యాచ్ వర్క్ ని క్రిష్ అనుమతితో నేనే దర్శకత్వం వహించాను అంటూ అసలు విషయాన్ని చెప్పింది కంగనా . వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మణికర్ణిక చిత్రాన్ని క్రిష్ పూర్తిచేసాడు అయితే కొన్ని సన్నివేశాలు అనుకున్న స్థాయిలో రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు దర్శకులు క్రిష్ అలాగే కంగనా రనౌత్ .ఆ సమయంలోనే క్రిష్ కు కంగనా కు గొడవలు అయ్యాయని వార్తలు వచ్చాయి అయితే అవన్నీ గాలివార్తలే అని కంగనా మాత్రమే బదులిచ్చింది కానీ క్రిష్ ఇంతవరకు నోరు మెదపలేదు కట్ చేస్తే ప్యాచ్ వర్క్ కంగనా దర్శకత్వంలో పూర్తవుతోంది దానిక...

క్లాసిక్ చిత్ర పరువు తీసిన @ నర్తనశాల

1963 లో వచ్చిన నర్తనశాల ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే . కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన నర్తనశాల చిత్రం వచ్చి 55 సంవత్సరాలు అయినప్పటికీ ఆ చిత్రం ఇప్పటికి ఎప్పటికి కూడా ఎవరు గ్రీన్ . ఎన్టీఆర్ బృహన్నలగా నటించి యావత్ తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను పొందడమే కాకుండా ఏ రీతిన చూసిన క్లాసికల్ చిత్రంగా చెక్కుచెదరని విజయాన్ని సొంతం చేసుకుంది కాగా ఆ పేరుతో తాజాగా నాగశౌర్య హీరోగా @ నర్తనశాల అనే చిత్రం చేసారు కాగా నిన్న విడుదలైన ఆ చిత్రం ఘోర పరాజయం పొందడమే కాకుండా విమర్శల పాలు అవుతోంది . అంతేకాదు ఎవర్ గ్రీన్ సినిమా టైటిల్ ని పెట్టి ఆ చిత్ర పరువు తీశారు నాగశౌర్య అండ్ కో . గే కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన @ నర్తనశాల చిత్రం పై గొప్పలు చెప్పారు విడుదలకు ముందు . మా సినిమా బాగుంటేనే చెప్పండి లేదంటే మా సినిమాకు రాకండి అని కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మా సినిమాకు రండి అని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినా ఆ థియేటర్ ల వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయడం లేదు ప్రేక్షకులు . English Title: disastar talk to @nartanasala from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Revi...

లేడీ డైరెక్టర్ బి జయ మృతి

లేడీ డైరెక్టర్ బి . జయ (54) నిన్న అర్ధరాత్రి గుండెపోటుతో మరణించింది . కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బి . జయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది . మొన్ననే నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించగా తాజాగా లేడీ డైరెక్టర్ బి. జయ చనిపోవడం శోచనీయం . బి . జయ చంటిగాడు , లవ్లీ , గుండమ్మ గారి మనవడు ,ప్రేమికులు , సవాల్ , వైశాఖం చిత్రాలకు దర్శకత్వం వహించింది . పాత్రికేయురాలిగా కెరీర్ ని ప్రారంభించిన జయ సూపర్ హిట్ పత్రికని విజయవంతంగా నడిపించింది . ప్రముఖ పీఆర్ఓ బి ఏ రాజు సతీమణి బి జయ దాంతో సినీ పాత్రికేయ బృందం తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది . తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెం గ్రామంలో జన్మించింది బి. జయ . తన సతీమణి విగతజీవిగా మారడంతో కన్నీళ్ల పర్యంతం అయ్యాడు బీఏ రాజు . English Title: lady director b jaya passed away from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2wBWn9K

నాని హిట్ సినిమా తమిళ్ లో

నాని హీరోగా నటించిన ” నిన్ను కోరి ” చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇంతకుముందు ఎక్కువగా తమిళ చిత్రాలను మన తెలుగువాళ్ళు రీమేక్ చేస్తూండేవాళ్లు కానీ కాలక్రమంలో తెలుగు నుండి తమిళ్ కు రీమేక్ అవుతున్నాయి . ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది , ఎన్టీఆర్ నటించిన టెంపర్ , నాన్నకు ప్రేమతో చిత్రాలు తమిళ్ లో రీమేక్ అవుతున్నాయి కాగా అదే వరసలో ఇప్పుడు నాని సినిమా చేరింది . నాని – నివేదా థామస్ జంటగా నటించిన నిన్ను కోరి చిత్రం గత సంవత్సరం విడుదలై మంచి విజయాన్ని సాధించింది కాగా ఇప్పుడా చిత్రం తమిళ్ లో రీమేక్ కానుంది . శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన నిన్ను కోరి చిత్రం పై విమర్శలు వచ్చినప్పటికీ మొత్తానికి విజయమే కావాల్సింది కాబట్టి విజయవంతమైన నిన్ను కోరి చిత్రాన్ని తమిళ్ వాళ్ళు రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపించారు . నాని తెలుగులోనే కాకుండా తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే ! అయితే నాని పాత్రలో మాత్రం తమిళ్ లో వైభవ్ నటించనున్నట్లు తెలుస్తోంది . తెలుగునాట విజయం సాధించిన నిన్ను కోరి తమిళ్లో విజయం సాధిస్తుందా ? లేదా ? చూడాలి . English Title: nani ninnu kori...

శ్రీ హరికృష్ణ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి, సినీ నటులు శ్రీ నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉండగా పలుమార్లు కలిసేవాళ్ళం. స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి శ్రీ హరికృష్ణ గారు. తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణం. హరికృష్ణ గారు మరణం కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయినట్టుగా ఉంది. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. శ్రీ హరికృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. – డా:టి.సుబ్బరామి రెడ్డి ఎం.పి., రాజ్యసభ from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Nyi4Pl

శైలజారెడ్డి అల్లుడికి ఇబ్బందులు తప్పినట్లేనా

శైలజారెడ్డి అల్లుడు చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అనుకున్న పనులు ఏవి సకాలంలో జరగడం లేదు , వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి పనులన్నీ . అయితే తాజా పరిస్థితి చూస్తుంటే అన్ని ఇబ్బందులను శైలజారెడ్డి అల్లుడు అధిగమించినట్లే ! అని అంటున్నారు . శైలజారెడ్డి అల్లుడు ట్రైలర్ ని అనుకుంటే కుదరలేదు సింగిల్ సాంగ్ అనుకుంటే అదీ కుదరలేదు …… విడుదల ఆగస్టు 31న అని ప్రకటిస్తే అది కూడా వీలుకాలేదు దాంతో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది . అక్కినేని వంశాభిమాని చనిపోవడం, కేరళ వరదలు , నందమూరి హరికృష్ణ దుర్మరణం ఇలా వరుసపెట్టి సంఘటనలు జరగడంతో శైలజారెడ్డి అల్లుడు వాయిదాపడింది . మొత్తానికి ఇప్పుడు వరదలు లేవు , హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి కాబట్టి ఇక శైలజారెడ్డి అల్లుడు కి అడ్డంకులన్నీ తొలగిపోతే సెప్టెంబర్ 13న విడుదల అవడం ఖాయం . ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద గీత గోవిందం తప్ప మరో సినిమా ఏది లేదు కాబట్టి శైలజారెడ్డి అల్లుడు వసూళ్ల వర్షం కురిపించినా ఆశ్చర్యం లేదు . English Title: line clear for shailajareddy alludu from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2LFW...

నర్తనశాల ప్లాప్ : పేపర్ బాయ్ కి ప్లస్సా

ఈరోజు విడుదలైన నర్తనశాల ప్లాప్ కావడంతో రేపు విడుదలయ్యే పేపర్ బాయ్ చిత్రానికి మార్గం సుగమం అయ్యింది . దర్శకులు సంపత్ నంది ఈ పేపర్ బాయ్ చిత్రాన్ని తన మిత్రులతో కలిసి నిర్మించడం విశేషం . ఇక ఇటీవలే విడుదలైన పేపర్ బాయ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది అలాగే అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాని కొనుక్కునేలా చేసింది కూడా . అల్లు అర్జున్ కు ఈ చిత్ర ట్రైలర్ నచ్చడంతో తండ్రి అల్లు అరవింద్ కు చెప్పాడట ! ఇంకేముంది పేపర్ బాయ్ చిత్రాన్ని చూసాడు అల్లు అరవింద్ తనకు కూడా సినిమా నచ్చడంతో సినిమాని విడుదల చేస్తున్నాడు . దివంగత దర్శకులు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు . ఇంతకుముందే సంతోష్ శోభన్ హీరోగా పరిచయమయ్యాడు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముందుకు వస్తున్నాడు .ఈ సినిమా హిట్ అయితే అటు సంపత్ కు ఇటు సంతోష్ శోభన్ కు మంచి రోజులు వచ్చినట్లే ! పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి పేపర్ బాయ్ హిట్ కొట్టినా ఆశ్చర్యం లేదు . English Title: positive reports to sampath nandi paperboy from టాప్ స్టోరీస్ – Telugu Movie Revi...

హరికృష్ణ అంత్యక్రియలు పూర్తి

నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి కళ్యాణ్ రామ్ చితికి నిప్పటించాడు . నందమూరి కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ లు అంతిమ దహన సంస్కారాలు నిర్వహించారు ,ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని పలువురు రాజకీయ నాయకులు ,తెలుగుదేశం పార్టీ అభిమానులు ,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు . అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ అంతిమయాత్ర లో పాల్గొని హరికృష్ణ పార్దీవ దేహానికి నివాళులర్పించారు . మెహిదీపట్నం లోని హరికృష్ణ ఇంటి నుండి టోలిచౌకి , షేక్ పేట్ ల మీదుగా మహాప్రస్థానం చేరుకుంది అంతిమయాత్ర . దారి పొడవునా వేలాదిమంది జనం హరికృష్ణ కు కడసారి వీడ్కోలు పలికారు . ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హరికృష్ణ పాడె మోయడం విశేషం . హరికృష్ణ గౌరవార్థం పోలీసులు గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు . హరికృష్ణ గౌరవార్థం మహాప్రస్థానంలో నాలుగు వందల గజాల స్థలంలో స్మారక స్థూపాన్ని నిర్మించనున్నట్లు తెలంగ...

నర్తనశాల రివ్యూ

నర్తనశాల రివ్యూ : నటీనటులు : నాగశౌర్య , కాశ్మీరా పరదేశి , యామిని భాస్కర్ సంగీతం : సాగర్ మహతి నిర్మాత : ఉషా ముల్పూరి దర్శకత్వం : శ్రీనివాస చక్రవర్తి రేటింగ్ : 2/5 రిలీజ్ డేట్ : 30 ఆగస్టు 2018 ఛలో వంటి సూపర్ హిట్ తర్వాత తిరిగి స్వంత బ్యానర్ లోనే నాగశౌర్య చేసిన సినిమా @ నర్తనశాల . శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్నీ ఉషా ముల్పూరి నిర్మించారు . ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . కథ : కళామందిర్ కళ్యాణ్ ( శివాజీరాజా ) తనకు కూతురు పుట్టాలని అనుకుంటాడు కానీ అనూహ్యంగా అబ్బాయి (నాగశౌర్య ) పుడతాడు . అయితే తండ్రి కోసం తన కొడుకు ని కూతురులా పెంచుతాడు . పెరిగి పెద్దవాడైన నాగశౌర్య మహిళలల రక్షణ కోసం ఓ క్లబ్ నిర్వహిస్తుంటాడు అదే సమయంలో మానస (కాశ్మీర ) ని కాపాడతాడు అలా ఆమెతో ప్రేమలో పడతాడు . అయితే అనుకోని అవాంతరంలా సత్య ( యామిని భాస్కర్ ) ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది . మానస ని ప్రేమించిన నాగశౌర్య సత్య ని పెళ్లి చేసుకున్నాడా ? లేక మానస ని పెళ్లి చేసుకున్నాడా ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమ...

నాగశౌర్య @ నర్తనశాల ప్లాప్

ఈఏడాది మొదట్లో నటించిన ఛలో సూపర్ హిట్ కావడంతో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో @ నర్తనశాల చిత్రం చేసాడు , ఈరోజే ఆ సినిమా విడుదల అయ్యింది అయితే నర్తనశాల అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు . దాంతో నాగశౌర్య @ నర్తనశాల తో ప్లాప్ మూటగట్టుకున్నట్లైంది . అసలు ఈ సినిమా టైటిల్ తో సినిమా తీయాలని చాలామంది చాలారకాలుగా ప్రయత్నాలు చేసారు కానీ ఏవి కూడా వర్కౌట్ కాలేదు కట్ చేస్తే అది బ్యాడ్ సెంటిమెంట్ గా భావించి టైటిల్ కి ముందు @ చేర్చి @ నర్తనశాల గా విడుదల చేసారు . ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది . కొత్త దర్శకుడు కొత్త పాయింట్ తో సినిమా తెరకెక్కించాడు కానీ సెకండాఫ్ లో అనుకున్న స్థాయిలో రాణించలేదు దాంతో నాగశౌర్య ఆశలు గల్లంతయ్యాయి . పైగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో నా సినిమా నచ్చితే పదిమందికి చెప్పండి , నచ్చకపోతే ఎక్కువ మందికి చెప్పండి నచ్చలేదని అని అన్నాడు విడుదలకు ముందు ఇప్పుడు అదే అయ్యేలా ఉంది పరిస్థితి చూస్తుంటే . ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ మాత్రం ప్రేక్షకులను నీరసపడేలా చేస్తోంది దాంతో బాబోయ్ ! అంటూ తల పట్టుకుంటున్నారు ప్రేక్షకులు . English Title: Flop talk to nag...

సమంత ట్వీట్ పై మండిపడుతున్న నెటిజన్లు

నందమూరి హరికృష్ణ మరణంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సమంత ” రిప్ హరికృష్ణ ” అంటూ ట్వీట్ చేయడంతో ఆమెని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు . పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో అని సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో అయితే ఆలస్యంగా తాను చేసిన తప్పు తెలుసుకున్న సమంత వెంటనే మొదట చేసిన ట్వీట్ ని తొలగించి ” రిప్ హరికృష్ణ గారు ” అని రెండోసారి ట్వీట్ చేసింది అయినప్పటికీ ముందు చేసిన ట్వీట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు కాబట్టి అది వైరల్ అవుతూనే ఉంది . పెద్దలను గారు అని సంభోదించడం నేర్చుకో అంటూ హితువు పలికారు పలువురు నెటిజన్లు . సమంత తన పొరపాటుని సవరించుకుంది కానీ నెటిజన్లు మాత్రం ఆమెని విమర్శించడం మానలేదు పాపం . గతంలో కూడా పలుమార్లు సమంత ట్వీట్ లపై దుమారం రేగింది , కాగా తాజా సంఘటనతో మరోసారి విమర్శల పాలయ్యింది . ప్రస్తుతం ఈ భామ చెన్నై లో ఉంది , ఇటీవలే తమిళనాట అలాగే తెలుగులో విడుదలైన అభిమన్యుడు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో విజయోత్సవ వేడుకలలో పాల్గొనడానికి చెన్నై వెళ్ళింది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2wpQEEX

మహాభారతంలో అర్జునుడిగా ప్రభాస్

ప్రభాస్ బాలీవుడ్ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు . ఇప్పటికే పలు అవకాశాలు రాగా వాటిని ఏమాత్రం మొహమాటం లేకుండా తోసిపుచ్చిన ప్రభాస్ తాజాగా అమీర్ ఖాన్ రూపొందించబోయే ” మహాభారతం ” చిత్రంలో మాత్రం అర్జునుడిగా నటించడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది . ఆమేరకు అమీర్ ఖాన్ ప్రభాస్ ని సంప్రదించినట్లు , అందుకు సూత్రప్రాయంగా ప్రభాస్ అంగీకరించినట్లు తెలుస్తోంది . బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ప్రభాస్ కు మహాభారతం సరైన సినిమా అవుతుందని అలాగే అర్జునుడి పాత్ర పోషించడం ద్వారా తన సత్తా చాటే ఛాన్స్ లభిస్తుందని అంటున్నారు . అమీర్ ఖాన్ ఎప్పటినుండో మహాభారతం చిత్రాన్ని బాలీవుడ్ లో నిర్మించాలని చూస్తున్నాడు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రంలో శ్రీ కృష్ణుడి గా అమీర్ ఖాన్ నటించనున్నాడు . వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో మహాభారతం నిర్మించాలని అప్పట్లో ప్లాన్ చేసాడు కానీ మళ్ళీ మధ్యలో దాని ఊసే లేకుండా పోవడంతో అమీర్ సైలెంట్ అయ్యాడని వార్తలు వచ్చాయి కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మహాభారతం చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు . అమితాబ్ భీష్ముడిగా , దీపికా పదుకోన్ ని...

సమంతపై ఆగ్రహం

సమంత పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు , ఇప్పటికే పలుమార్లు సమంత ట్వీట్ లపై నిరసన వ్యక్తం కాగా తాజాగా నందమూరి హరికృష్ణ మరణించడంతో ” రిప్ హరికృష్ణ ” అంటూ ట్వీట్ చేసింది సమంత దాంతో నెటిజన్లు సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ముందుగా పెద్దలను గౌరవించడం నేర్చుకో అంటూ సమంతపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తన తప్పు తెలుసుకొని వెంటనే తన ట్వీట్ ని డిలీట్ చేసి మరో ట్వీట్ చేసింది . ఆ ట్వీట్ లో ” రిప్ హరికృష్ణ గారు ” అంటూ సంబోదించడంతో ఆ వివాదం సద్దుమనిగినట్లే అని అనుకున్నారు కానీ మళ్ళీ చెలరేగింది వివాదం . మొదటిసారి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అలాగే రెండోసారి చేసిన ట్వీట్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సమంత నిర్వాహకాన్ని ఎండగడుతున్నారు నెటిజన్లు . విశాల్ సరసన నటించిన అభిమన్యుడు సూపర్ హిట్ కావడంతో ఆ వేడుకలలో పాల్గొనడానికి చెన్నై కి వెళ్ళింది సమంత కాగా అక్కడి నుండే ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలయ్యింది పాపం . English Title: netizens fires on samantha #RIPHarikrishnaGaru Shocked and saddened . Strength to the family in this difficult time . — Samantha Akk...

విజయ్ దేవరకొండ ని అవమానించలేదట

నేను విజయ్ దేవరకొండ నుద్దేశించి ఎలాంటి మాటలు మాట్లాడలేదని వివరణ ఇస్తున్నాడు హీరో నాగశౌర్య . స్టార్ డం అన్నది రాంచరణ్ తోనే ఆగిపోయిందని , స్టార్ అంటే ఎన్టీఆర్ , చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు మాత్రమే అని కామెంట్ చేసాడు నాగశౌర్య దాంతో విజయ్ దేవరకొండ ని ఉద్దేశించి మాట్లాడాడని , విజయ్ ని నాగశౌర్య అవమానిస్తున్నాడని సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫాన్స్ నాగశౌర్య ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు దాంతో నాగశౌర్య వివరణ ఇస్తున్నాడు . ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయితే సూపర్ స్టార్ కాదని , ప్లాప్ ఇచ్చినా కూడా అదే స్థాయి వసూళ్లు సాధించినప్పుడే స్టార్ అవుతారని అది పవన్ కళ్యాణ్ మాత్రమే సాధించాడని అంటున్నాడు నాగశౌర్య . ఈ హీరో చెప్పేది నిజమే అయినప్పటికీ వినేవాళ్ళు , అర్ధం చేసుకునే వాళ్ళు మాత్రం మరోలా భావిస్తున్నారు . అది కూడా ఇటీవలే బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ కు మరీ ఆపాదిస్తున్నారు దాంతో ఈ గొడవ వచ్చిపడింది . మరి నాగశౌర్య మాటలు విజయ్ ఫ్యాన్స్ పట్టించుకుంటరా చూడాలి . English Title: nagashourya gives clarity on about his comments on vijay devarakoda from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | T...

హరికృష్ణ ఆవేశంతోనే బాబు అధికారంలోకి

1995 ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా అధికార పీఠాన్ని అధిరోహించడానికి హరికృష్ణ ఆవేశమే కారణం . లక్ష్మీపార్వతి ని అడ్డుపెట్టుకొని తన రాజకీయ చతురత తో పద్మవ్యూహాన్ని పన్నాడు చంద్రబాబు , కాగా హరికృష్ణ ఆవేశాన్ని క్యాష్ చేసుకొని ఆగస్టు సంక్షోభాన్ని సృష్టించాడు దాంతో తెలుగుదేశం పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోగా ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడిని చేసి వెన్నుపోటు రాజకీయాలతో అధికారాన్ని అందుకున్నాడు చంద్రబాబు . మొదట లక్ష్మీపార్వతి తో ఎన్టీఆర్ పెళ్లి ని పూర్తిగా వ్యతిరేకించింది హరికృష్ణే ! దాంతో అతడ్ని ఆయుధంగా మలుచుకొని ఎన్టీఆర్ ని గద్దె దించిన మోసకారి చంద్రబాబు . ఎన్టీఆర్ ని పడగొట్టడానికి హరికృష్ణ తో పాటుగా బాలయ్య ని తనవైపుకు తిప్పుకోవడం వల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంతేకాని పూర్తిగా అతడి సామర్ధ్యం వల్లనే కాదు . అధికారం కోసం గుంటనక్క లా వేచి చూస్తున్న సమయంలో హరికృష్ణ ఆవేశం చంద్రబాబు కు కలిసి వచ్చింది అంతే ! దాన్ని అందిపుచ్చుకొని తన కపట నాటకానికి శ్రీకారం చుట్టాడు దాంతో ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడిని చేయడంలో విజయం సాధించాడు . ముఖ్యమంత్రి అయ్యాక హరికృష్ణ ని రవాణా శాఖా మంత్రిగా నియమ...

హరికృష్ణ మృతి కి ప్రముఖుల సంతాపం

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది . సినిమారంగంలోనే కాకుండా రాజకీయరంగంలో హరికృష్ణ ది అందవేసిన చేయి కావడంతో హరికృష్ణ మృతి కి పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు , వై ఎస్ జగన్మోహన్ రెడ్డి లతో పాటుగా సినీ నటులు అక్కినేని నాగార్జున , మోహన్ బాబు , మహేష్ బాబు , అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ , పూజా హెగ్డే , కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , నాని , దేవిశ్రీ ప్రసాద్ , హంసానందిని , హరీష్ శంకర్ , మంచు లక్ష్మి , అల్లరి నరేష్ తదితరులు సంతాపాన్ని తెలియజేసారు . తెలుగుదేశం పార్టీ లో కీలకంగా వ్యవహరించిన హరికృష్ణ రవాణా శాఖా మంత్రిగా కూడా ఆరునెలల పాటు పనిచేసారు . హిందూపురం శాసనసభ్యుడి గా వ్యవహరించారు అలాగే రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేసారు హరికృష్ణ . English Title: vijay deverakonda, mahesh babu and other celebs mourn the demise of harikrishna from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews...

ఆ ఇద్దరు కూడా విజయవాడ హైవే పైనే చనిపోయారు

నందమూరి హరికృష్ణ అలాగే ఆయన తనయుడు నందమూరి జానకిరామ్ కూడా విజయవాడ హైవే పైనే చనిపోవడం అది కూడా ఇద్దరు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం అంతేకాదు ఇద్దరు కూడా డ్రైవింగ్ చేస్తూ మృత్యువాత పడటం శోచనీయం . 2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జానకిరామ్ స్వయంగా కారు నడుపుకుంటూ వేగంగా వెళ్తూ ఎదురుగ వస్తున్న ట్రాక్టర్ ని తప్పించబోయి మృత్యువాత పడ్డాడు కాగా ఆ సంఘటనలో కూడా జానకిరామ్ సీటు బెల్ట్ పెట్టుకోలేదు , ఒకవేళ సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటే జానకిరామ్ గాయాలతో బయటపడేవాడేమో ! ఇక ఈరోజు జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో కూడా నందమూరి హరికృష్ణ అత్యంత వేగంతో 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించడం ఒక కారణమైతే సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం మరో కారణం అయ్యింది . లేదంటే ఈ సంఘటనలో కూడా హరికృష్ణ బయటపడే వాడేమో ! తండ్రీ కొడుకులు ఇద్దరు కూడా విజయవాడ హైవే మీద అది కూడా నల్లగొండ జిల్లా లో చనిపోవడం అత్యంత దురదృష్టకరం . రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణం తో నందమూరి కుటుంబం మాత్రమే కాకుండా యావత్ తెలుగు ప్రజలు విషాదంలో మునిగారు . English Title: vijayavada highway :bad sentiment for ntr family from టాప్ స్టోరీస్...

సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోయిన హరికృష్ణ

నందమూరి హరికృష్ణ కు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం కానీ అదే డ్రైవింగ్ హరికృష్ణ పాలిట మృత్యువు అయ్యింది . తెలుగుదేశం పార్టీ ని స్థాపించిన సమయంలో ఎన్టీఆర్ కు చేదోడు వాదోడు గా ఉంటూ చైతన్య రథం కు రథసారధి అయ్యాడు హరికృష్ణ . తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పదవులకోసం పాకులాడలేదు , అయితే తాజా సంఘటనలో హరికృష్ణ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోయాడని నిర్దారణకు వచ్చారు . సీటు బెల్ట్ యొక్క ప్రాధాన్యత ఏంటో మరోసారి హరికృష్ణ సంఘటన రుజువు చేసింది . గతంలోకూడా హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జానకిరామ్ కూడా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే రోడ్డు ప్రమాదంలో మృతువాత పడ్డాడు కాగా ఇప్పుడేమో హరికృష్ణ కూడా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే మృతి చెందాడు . సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటే ఎయిర్ బెలూన్ తెరుచుకునేది దాని వల్ల గాయాలతో హరికృష్ణ బయటపడేవాడు , ప్రాణాలతో ఉండేవాడు కానీ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో యావత్ తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదం నెలకొంది . సీటు బెల్ట్ పెట్టుకోవాలని , హెల్మెట్ లు పెట్టుకోవాలని పదేపదే ప్రచారం చేస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం పెడచెవిన పెడుతున్నారు దాని ఫలితంగా ఇలా దురదృష్టకర సంఘ...

శోకసంద్రంలో ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ శోకసంద్రంలో మునిగాడు , తండ్రి మృతదేహాన్ని చూసి భోరున విలపించాడు . నందమూరి హరికృష్ణ ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే . రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించాడు అన్న వార్త విని తీవ్ర దిగ్బ్రాంతి కి గురైన ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి నార్కట్ పల్లి లోని ఆసుపత్రికి తరలివచ్చాడు . అక్కడ తండ్రి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక విలవిలాడాడు ఎన్టీఆర్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కూడా . తమ ఎదుగుదలకి చూసి గర్వపడుతున్నాడన్న సంతోషం ఎంతో కాలం లేకుండానే తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఏమి మాట్లాడాలో తెలీని స్థితిలో పడ్డారు ఇద్దరు సోదరులు . ఓ పెళ్లి వేడుకకు వెళ్తున్న నాన్న ఇలా విగతజీవి గా వస్తాడని ఊహించలేని సోదరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు . ఎన్టీఆర్ కళ్ళ వెంట నీళ్లు వస్తుంటే , ఉద్విఘ్న వాతావరణం నెలకొంది ఆసుపత్రి దగ్గర . ఇక ఎన్టీఆర్ తల్లి షాలిని తో పాటు మిగతా కుటుంబ సభ్యులందరికి ఇది షాకింగ్ న్యూస్ . హరికృష్ణ ఇక లేడు అన్న వార్త విని నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు . విచిత్రం ఏంటంటే హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ కూడా హరికృష్ణ మరణించిన స్థలా...

భారీ యాక్సిడెంట్ లో చనిపోయిన నందమూరి హరికృష్ణ

నందమూరి హరికృష్ణ ( 61) రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు . హరికృష్ణ మరణవార్త విన్న ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతూ హుటాహుటినా ఆసుపత్రికి తరలివెళ్లారు . ఓ పెళ్లి వేడుకలో పాల్గొనడానికి ఈరోజు తెల్లవారు ఝామున హైదరాబాద్ నుండి బయలుదేరాడు నందమూరి హరికృష్ణ . అయితే నల్లగొండ జిల్లా అన్నెపర్తి వద్ద కారు అదుపుతప్పడంతో డివైడర్ ని దాటి మరో కారుని డీ కొట్టడంతో హరికృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి దాంతో హరికృష్ణ ని నార్కట్ పల్లి లోని కామినేని ఆసుపత్రికి తరలించారు , అయితే డాక్టర్లు హరికృష్ణ ని బ్రతికించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఫలితం లేకుండా పోయింది . ఈరోజు ఉదయం 7 గంటలకు హరికృష్ణ చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు . హరికృష్ణ మృతి తో నందమూరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది . హరికృష్ణ కు ఇద్దరు భార్యలు కాగా ముగ్గురు కొడుకులు , ఒక కుమార్తె ఉన్నారు . అయితే మూడేళ్ళ క్రితమే హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ ఇదే రోడ్డు ప్రమాదంలో మరణించగా , నందమూరి హరికృష్ణ కూడా అదే ప్రమాదంలో మరణించడం విషాదకరంగా మారింది . English Title: nandamuri harikrishna dead in road accident f...

మళ్ళీ విలన్ గా మోహన్ బాబు

విలక్షణ నటుడు మోహన్ బాబు కెరీర్ తొలినాళ్ళ లో విలన్ గా నటించాడు ఆ తర్వాత హీరోగా మారాడు కట్ చేస్తే హీరోగా రేసులో వెనుకబడిపోవడంతో విలన్ వేషాలు వేసాడు మళ్ళీ హీరోగా సక్సెస్ అయ్యాక అప్పటి నుండి మళ్ళీ హీరోగానే నటిస్తున్నాడు కాగా ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ విలన్ గా మోహన్ బాబు నటించనున్నట్లు తెలుస్తోంది . అది కూడా తమిళ స్టార్ హీరో సూర్య నటించబోయే చిత్రంలో సుమా ! తమిళ స్టార్ హీరో సూర్య నటించే చిత్రంలో మోహన్ బాబు ని విలన్ గా నటించమని కోరుతున్నారట ! ఆ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అయితేనే పరిపూర్ణ న్యాయం జరుగుతుందని సూర్య అడిగాడట ! అయితే ఇంకా మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు , ఆలోచించి చెబుతానని అన్నాడట . ఒకవేళ మోహన్ బాబు మళ్ళీ విలన్ గా నటిస్తే డైలాగ్స్ డైనమైట్ లా పేలడం ఖాయం . మోహన్ బాబు డైలాగ్స్ తో షాక్ ఇవ్వడమే కాకుండా తనదైన నటనతో ప్రేక్షకులను సమ్మోహన పరచడం ఖాయం . English Title: mohan babu villain role in suriya film from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NmMnsa

ఆమని ప్రధానపాత్రలో అమ్మదీవెన ప్రారంభం

ఆమని కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ‘అమ్మ దీవెన’. పద్మ సమర్పిస్తున్నారు. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, దినేష్, శరత్ చంద్ర కీలక పాత్రలు చేయగా ఈ సినిమాకు ఎత్తరి గురవయ్య నిర్మాత. పద్మజ నాయుడు, ఎత్తరి చినమారయ్య ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. శివ ఏటూరి దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రాజ్ కందుకూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. బి.గోపాల్ ఫస్ట్ షార్ట్ డైరక్షన్ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ “కథ విన్నాక అంగీకరించిన ఆమనిగారికి ధన్యవాదాలు. దర్శకుడిగా నాకు ఇది మొదటి చిత్రం. చక్కటి కుటుంబ కథా చిత్రమిది. నాకు ఈ అవకాశం కల్పించిన మా నిర్మాతలకు ధన్యవాదాలు పిల్లలు నైతిక విలువలు తెలుసుకుంటారని అభిప్రాయము ”అని అన్నారు. ఆమని మాట్లాడుతూ “ఇదొక మంచి సినిమా. ఫ్యామిలీలో అందరికీ కనెక్ట్ అవుతుంది. కుటుంబంలో తల్లి బాధ్యత ఎలా ఉంటుందనే విషయాన్ని చూపించే సినిమా. పిల్లలను ఒక స్థాయికి తీసుకురావడానికి తల్లి ఎంత కష్టపడుతుందనే విషయాన్ని ఇందులో చక్కగా చూపిస్తున్నారు. నిర్మాత...

విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకునేది వరంగల్ అమ్మాయినేనా ?

గీత గోవిందం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న హీరో విజయ్ దేవరకొండ తన ఇమేజ్ అనూహ్యంగా పెరగడంతో తన తదుపరి చిత్రాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు . సినిమాల విషయం పక్కన పెడితే ఈ హీరో ఇంతకుముందు 40 ఏళ్ల వయసొచ్చాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట ! అయితే ఇప్పుడేమో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. నచ్చిన అమ్మాయి కనబడితే తప్పకుండా 35 ఏళ్ల లోపే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. అయితే ఈ హీరో పెళ్లి చేసుకునే అమ్మాయి ఆంధ్రానా ? లేక తెలంగాణనా ? అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. విజయ్ దేవరకొండ సోదరుడి పెళ్లి ఆమధ్య వరంగల్ జిల్లాలో జరిగినప్పుడు అక్కడికి వెళ్ళాడు ఈ హీరో అయితే అప్పుడు ఎం ఎల్ ఏ ఎర్రబెల్లి దయాకరరావు విజయ్ దేవరకొండ ఒప్పుకుంటే అతడికి కూడా ఇక్కడి అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి విజయ్ కి షాకిచ్చాడు. తన వదిన వరంగల్ అమ్మాయే కాబట్టి పైగా మంచి మనసున్న అమ్మాయి కాబట్టి ఏమో! నాకు కూడా నచ్చిన అమ్మాయి దొరికితే తప్పకుండా వరంగల్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఇక తాజాగా పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి వరంగల్ అమ్మాయిని చూసి చేసుకుంటాడేమో చూడాలి. పెళ్లి ఎప్పుడౌతుందో కానీ ప్రేమ పెళ...

వివాదంలో @ నర్తనశాల

@ నర్తనశాల చిత్రం వివాదంలో ఇరుక్కుంది , మా మనోభావాలు కించపరిచేలా నర్తనశాల చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని తక్షణం వాటిని సినిమా నుండి తొలగించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా కు దిగారు కొంతమంది హిజ్రాలు . నాగశౌర్య హీరోగా నటిస్తున్న @ నర్తనశాల ఈనెల 30న విడుదల అవుతున్న విషయం తెలిసిందే . ఆ చిత్రంలో హీరో క్యారెక్టర్ గే అని కొంతమంది హిజ్రాలకు తెలియడంతో ఫిలిం ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారు . హిజ్రాల ఆందోళనతో ఫిలిం ఛాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . మమ్మల్ని కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించకపోతే @ నర్తనశాల ప్రదర్శిస్తున్న థియేటర్ ల వద్ద నిరసన తెలుపుతామని హెచ్చరిస్తున్నారు . సినిమా విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఈ ఆందోళన టెన్షన్ పెడుతోంది చిత్ర బృందాన్ని . నాగశౌర్య సరసన అందాల భామలు యామిని భాస్కర్ , కాశ్మీరా పరదేశి నటించారు . ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం పై నాగశౌర్య చాలానే ఆశలు పెట్టుకున్నాడు . English Title: Controversy on @narthanasala from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2wmVAdE

ఎన్టీఆర్ మరో సినిమా తమిళ్ లో రీమేక్

ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేస్తుండగా తాజాగా మరో చిత్రాన్ని కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ” నాన్నకు ప్రేమతో ” చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు . ఎన్టీఆర్ విభిన్న గెటప్ లో కనిపించడమే కాకుండా విభిన్న తరహా పాత్రని పోషించాడు నాన్నకు ప్రేమతో చిత్రంలో . ఎన్టీఆర్ అంటే మాస్ కు కేరాఫ్ అడ్రస్ అలాంటిది నాన్న కు ద్రోహం చేసిన వాడిపై పగ సాధించడానికి కొత్తతరహా ప్రయోగం చేసాడు . ఎన్టీఆర్ సినిమా అంటే ఫైట్లు , యాక్షన్ , పాటలు కోరుకునే వాళ్లకు సరికొత్త ఎన్టీఆర్ ని చూపించాడు దర్శకులు సుకుమార్ దాంతో భారీ విజయం కట్టబెట్టారు ప్రేక్షకులు కట్ చేస్తే ఇప్పుడు ఈ నాన్నకు ప్రేమతో చిత్రాన్ని తమిళ్ లో భారీ ఎత్తున చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు . ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్ర పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు . English Title: ntrs another telugu film will be remake in tamil from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.t...

ఆ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ రానుందా ?

తెలుగులో ధృవ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . రాంచరణ్ – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రానికి తమిళ మాతృక ” తని ఒరువన్ ” కు రీమేక్ అన్న విషయం విదితమే ! కాగా ఇప్పుడు ఆ తని ఒరువన్ చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట ! తమిళనాట తని ఒరువన్ చిత్రంలో నయనతార – జయం రవి జంటగా నటించారు . మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కింది ఈ తని ఒరువన్ . తమిళనాట సంచలన విజయం సాధించిన తని ఒరువన్ చిత్రానికి సీక్వెల్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు మోహన్ రాజా . జయం రవి హీరోగా నటించిన ఆ చిత్రంలో విలన్ గా ఒకప్పటి గ్లామర్ హీరో అరవింద స్వామి నటించాడు . స్టైలిష్ విలన్ గా అరవింద్ స్వామి నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు . తమిళనాట ప్రభంజనం సృష్టించిన తని ఒరువన్ కి రీమేక్ వస్తే మళ్ళీ అదే స్థాయిలో విజయాన్ని అందుకునేలా ఉండాలి కాబటి భారీ ఎత్తున కసరత్తులు చేస్తున్నాడట దర్శకుడు మోహన్ రాజా . English Title: thani oruvan sequel on cards from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2N3oZmR

‘మా’ సిల్వర్‌ జూబ్లీ మెమెంటో అందుకున్న నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఈ సంవత్సరం సిల్వర్‌ జూబ్లీ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అసోసియేషన్‌లోని సభ్యుల పుట్టినరోజున వారిని ఆహ్వానించి సిల్వర్‌జూబ్లీ మెమెంటోను అందజేస్తున్నారు. ప్రముఖ నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి పుట్టినరోజు సందర్భంగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఇటీవల సిల్వర్‌జూబ్లీ మెమెంటోను అందజేసింది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ ”మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు నా కృతజ్ఞతలు. సిల్వర్‌జూబ్లీ సందర్భంగా సభ్యుల పుట్టినరోజున మెమెంటో అందిస్తున్నారు. ‘మా’ ప్రెసిడెంట్‌ శివాజీరాజాగారు మెమెంటో తీసుకోవాల్సింది నన్ను పర్సనల్‌గా ఆహ్వానించారు. ఈ మెమెంటోను శివాజీరాజా అన్నయ్య, బెనర్జీ అన్నయ్య, శ్రీరామ్‌గారు, నాగినీడుగారి చేతుల మీదుగా అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను” అన్నారు. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PLiqDV

విజయ్ దేవరకొండ టీఆర్ఎస్ తరుపున ప్రచారం చేయనున్నాడా ?

పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో యువతలో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ తెలంగాణ లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తరపున వచ్చే శాసనసభ ఎన్నికలలో ప్రచారం చేయనున్నాడా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ చతురతతో ప్రతిపక్షాలు లేకుండా చేసాడు అయినప్పటికీ అక్కడక్కడా ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది. దానికి తోడు ఎన్నికల సమయానికి ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం లు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలియడంతో తెలంగాణలో స్టార్ క్యాంపెయిన్ కంపల్సరీ అని భావిస్తున్నారట ! ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ స్టార్స్ ని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు . కాగా ఇటీవలే స్టార్ లీగ్ లో చేరిన క్రేజీ స్టార్ , టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ ని టీఆర్ఎస్ తరుపున తురుపుముక్క గా ప్రచారబరిలో దించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలాగే యంగ్ లీడర్ కల్వకుంట్ల తారకరామారావు కు మంచి స్నేహితుడు విజయ్ దేవరకొండ. కేటీఆర్ న...

ఓవర్సీస్ లో వసూళ్ల దుమ్ము దులిపేస్తున్న దేవరకొండ

విజయ్ దేవరకొండ ఓవర్ సీస్ లో వసూళ్ల దుమ్ము దులిపేస్తున్నాడు . 2 మిలియన్ డాలర్లు సాధించడం అగ్ర హీరోలకు సైతం కష్టమవుతున్న ఈరోజుల్లో ఇతగాడు మాత్రం అవలీలగా 2 మిలియన్ డాలర్ల ని దాటేసి ట్రేడ్ విశ్లేషకులతో పాటుగా టాలీవుడ్ టాప్ స్టార్స్ ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది విజయ్ దేవరకొండ దూకుడు . ఆగస్టు 15న విడుదలైన గీత గోవిందం చిత్రానికి ప్రారంభం నుండే సూపర్ హిట్ టాక్ రావడంతో భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి . 12 రోజులకు గాను ఓవర్ సీస్ లో దాదాపు 13 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించాడు విజయ్ దేవరకొండ . పలువురు అగ్ర హీరోలకు సైతం ఈ వసూళ్లు రావడం లేదు , కానీ విజయ్ దేవరకొండ మాత్రం తక్కువ సమయంలోనే పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో పాటుగా గీత గోవిందం తో ఓవర్ సీస్ లో స్ట్రాంగ్ మార్కెట్ ని ఏర్పరచుకున్నాడు . ఓవర్ సీస్ లో ఇంకా సరైన సినిమా ఏది లేదు అలాగే వసూళ్ల జోరు కూడా బాగానే ఉంది దాంతో రెండున్నర మిలియన్ డాలర్ల ని దాటడం ఖాయమని అంటున్నారు . English Title: geetha govindam joins 2 million club in overseas from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2wsOrrk

ఆ హీరోతో గీత గోవిందం చేసుంటే హిట్ అయ్యేది కాదు

గీత గోవిందం చిత్రం ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిన విషయమే ! అయితే ఈ సినిమాని మొదట వేరేవేరే హీరోలతో అనుకున్నారు , ఆలోచన చేశారట కానీ విజయ్ దేవరకొండ కు రాసి పెట్టి ఉంది కాబట్టి అతడ్ని వరించింది కట్ చేస్తే విజయ్ నటన తో పాటు అతడికున్న క్రేజ్ వల్ల ఇంతటి భారీ విజయం సొంతమయ్యింది అదే మరో హీరో ఈ గీత గోవిందం చేసి ఉంటే ఖచ్చితంగా ఇంతటి హిట్ అయ్యేది కాదు అందునా అల్లు శిరీష్ చేసి ఉంటే అస్సలు హిట్ అయ్యేది కాదు ఏదో మోస్తారు విజయం మాత్రమే అందుకునేది . దర్శకులు పరశురామ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ తో ” శ్రీరస్తు శుభమస్తు ” వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసాడు . అల్లు శిరీష్ కు మంచి హిట్ నిచ్చాడు పరశురామ్ దాంతో ఈ దర్శకుడి పనితీరు నచ్చి మరో రెండు సినిమాలు కూడా మా బ్యానర్ లోనే చేయాలనీ ఒప్పందం చేసుకున్నారు . అయితే గీత గోవిందం చిత్ర కథ మిగతా హీరోలకు వినిపించాడు కానీ విజయ్ దేవరకొండ అయితేనే కరెక్ట్ అని భావించి అతడితో చేసాడు కట్ చేస్తే బ్లాక్ బస్టర్ అయ్యింది వంద కోట్లని అవలీలగా సంపాదించింది . అదే అల్లు శిరీష్ తో కనుక ఈ గీత గోవిందం చేసి ఉంటే ఈ స్థాయి హిట్ అయ్యేది కానే కాదు . English Title:...

తిట్టుకుంటున్న మహేష్ – ఎన్టీఆర్ ఫ్యాన్స్

అగ్ర హీరోలు మహేష్ బాబు – ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు కానీ వాళ్ళ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తెగ తిట్టుకుంటున్నారు . ఇంతకీ మహేష్ అభిమానులకు ఎన్టీఆర్ అభిమానులకు గొడవలు ఎందుకంటే ……. ఇటీవలే మహేష్ బాబు పుట్టినరోజు జరిగిన విషయం తెలిసిందే . ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు . అయితే ఎన్టీఆర్ విషెష్ కి మహేష్ స్పందించలేదు దాన్ని ఆసరాగా చేసుకొని ఎన్టీఆర్ గ్రీటింగ్స్ చెబితే మీ మహేష్ స్పందించలేదు అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు . ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ ని తిడుతుండటంతో కోపం పట్టలేక మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ ని అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తిట్టడం మొదలు పెట్టారు . ఇంకేముంది ఇద్దరి అభిమానుల మధ్య యుద్ధం స్టార్ట్ కావడంతో ఒకరినొకరు తిట్టుకుంటూ మిగతావాళ్లకు ఆనందం పంచుతున్నారు . అయితే మహేష్ – ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అంతేకాదు హీరోలం మేము బాగానే ఉంటాం , స్నేహంగా ఉంటాం కానీ అభిమానులే గొడవలు పడుతుంటారు కనీసం ఇప్పుడైనా మారండి అంటూ భరత్ అనే నేను వేడుకలో అభిమానులనుద్దేశించి అన్నాడు మహేష్ కానీ అభిమానులు మాత్రం మార...

కొత్త జోన‌ర్ సినిమాలు చేయాల‌నే మా ప్ర‌య‌త్నాన్ని `నీవెవ‌రో`తో ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ – చిత్ర స‌మ‌ర్ప‌కుడు కోన వెంక‌ట్‌

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘నీవెవరో` . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 24న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం జ‌రిగిన థాంక్స్ మీట్‌లో… హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ – “సినిమా రిలీజ్ అయిన రోజు శ్రావ‌ణ శుక్ర‌వారం కాబ‌ట్టి క‌లెక్ష‌న్స్ త‌క్కువ‌గా ఉన్నా కూడా.. ఈ షోకి క‌లెక్ష‌న్స్ పెరుగుతూ వ‌చ్చి ఈరోజు ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ఈ రోజు మేం సినిమా చేయ‌డానికి ఏకైక కార‌ణం ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే. ఆడియెన్స్‌లో రెండు ర‌కాలుంటారు. ప‌దిశాతం మంది ప్రేక్ష‌కులు సినిమాను విశ్లేషిస్తే… మిగిలిన 90 శాతం ప్రేక్ష‌కులు సినిమాను ఎంజాయ్ చేయాల‌నుకునే వెళ్తారు. అలాంటి వారికి వంద‌శాతం న‌చ్చే సినిమా ఇది. ఈసారి చేసే సినిమా వంద‌శాతం అంద‌రికీ న‌చ్చేలానే చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం“ అన్నారు. చిత్ర స‌మ‌ర్ప‌కుడు కోన వెంక‌ట్ మాట్లాడుతూ – “మా టీమ్ అంద‌రం క‌లిసి ఓ సైన్యంలా ప‌నిచేశాం. ఓ సినిమా న‌మ్మ‌కంతోనే మొద‌లై.. న‌మ్మ‌కంతోనే ఎండ్ అవుతుంది. న‌మ్మ‌కం దేవుడితో స‌మానం. ...

రియ‌ల్ లైఫ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌లో న‌టించాను – ప్రియా వ‌డ్ల‌మాని

ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం `ప్రేమకు రెయిన్ చెక్ `. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పిన్నారు. అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7 న విడుద‌ల అవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ప్రియా వ‌డ్ల‌మాని పాత్రికేయుల‌తో మాట్లాడుతూ …. “నాది హైద‌రాబాద్‌. మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా ఓ సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే కొన్ని కార‌ణాల‌తో ఆ సినిమా ఆగిపోయింది. త‌ర్వాతే ప్రేమ‌కు రెయిన్ చెక్ సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. ఇందులో నేను చాలా సైలెంట్‌గా ఉండే పాత్ర‌లో న‌టించాను. త‌న ప్ర‌పంచంలో తాను ఉండే హీరోయిన్‌. ఇప్ప‌టి అమ్మాయి అంటే ప‌బ్‌ల‌కు, పార్టీల‌కు వెళ్ల‌డ‌మే కాదు.. మంచి సహృద‌యురాలై ఉంటుంది. జీవితంలో కొన్ని విలువ‌లుంటాయి. విదేశాల్లో చదువుకోవాల‌ని ఉన్నా.. త‌ల్లిదండ్రుల‌పై ఆధార‌ప‌డ‌కుండా చ‌దువుకోవాల‌ని అనుకుంటుంది. నిజ జీవితంలో నేను కూడా కామ్‌గానే ఉంట...

రికార్డ్ బ్రేక్ : వంద కోట్ల క్లబ్ లో గీత గోవిందం

గీత గోవిందం చిత్రంతో చరిత్ర సృష్టించాడు విజయ్ దేవరకొండ . గీత గోవిందం చిత్రం 12 రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి రికార్డ్ సృష్టించాడు . అగ్ర హీరోలకు సైతం ఈ స్థాయి వసూళ్లు సాధించడం కష్టమైపోతున్న ఈరోజుల్లో అవలీలగా వంద కోట్లను అది కూడా 12 రోజుల్లోనే సాధించడం విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ కి కారణం . ఆగస్టు 15న విడుదలైన గీత గోవిందం విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో బంపర్ హిట్ సాధించింది . భారీ వసూళ్ల ని సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది గీత గోవిందం చిత్రం . తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 14 కోట్ల బడ్జెట్ తోనే రూపొందింది . తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్ర బయ్యర్లు విపరీతమైన లాభాలను పొందుతున్నారు . విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ ఈ స్థాయిదా ? అని అగ్ర హీరోలు సైతం షాక్ అవుతున్నారు . కథ గా చెప్పుకున్నా ఇది గొప్ప కథ ఏమి కాదు కానీ విజయ్ మేనియా ముందు రికార్డులన్నీ బ్రేక్ అవుతున్నాయి . స్టార్ హీరోలు సైతం ఈ స్థాయి వసూళ్ల ని అందుకోవడానికి చాలా కష్టాలు పడుతున్న ఈ రోజుల్లో విజయ్ అలవోకగా 102 కోట్ల గ్రాస్ ని సాధించాడు . ఈ జోరు చూస్తుంటే మరో వారం రోజుల పాటు వసూ...

కాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు

కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా ఉందని ,మారోజుల్లో కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయని అయితే నాకు మాత్రం అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని అంటోంది సీనియర్ నటి మీనా . 90 వ దశకంలో గ్లామర్ తారగా ఓ ఊపు ఊపేసింది మీనా . తెలుగు , తమిళ , మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది మీనా . రజనీకాంత్ , కమల్ హాసన్ , చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , డాక్టర్ రాజశేఖర్ , మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించింది మీనా . అయితే ఈ భామ నటిస్తున్న సమయంలో కూడా కొంతమంది అదేపనిగా కాస్టింగ్ కౌచ్ కు పాల్పడే వాళ్ళట ! మా రోజుల్లో కూడా వెధవలు ఉన్నారని , ఇప్పుడు వినిపిస్తున్న కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు అప్పుడు కూడా ఉన్నాయని అయితే వాళ్లకు కూడా భార్యా పిల్లలు ఉన్నారన్న విషయాన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది . అంతేకాదు అప్పట్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ నాకు మాత్రం అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని అంటోంది . చాలామంది కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతున్నారు బాగానే ఉంది కానీ నాకు మాత్రం అలాంటి అనుభవం ఎదురు కాలేదని అంటున్నారు అదేంటో ! English Title: meena react on casting couch from టాప...

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ర‌వితేజ‌ , ఇలియానా ఇందులో జంట‌గా న‌టిస్తున్నారు. ఈ ఫ‌స్ట్ లుక్ లో హీరో పాత్ర‌ను మూడు భిన్న‌మైన గెట‌ప్స్ లో చూపించారు. ఫ‌స్ట్ లుక్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. ర‌వితేజ కూడా తొలిసారి త‌న కెరీర్ లో ఇలా భిన్న‌మైన కోణాలున్న పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీనువైట్ల త‌న గ‌త సినిమాల‌కు పూర్తిభిన్నంగా.. స‌రికొత్త జోన‌ర్ లో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్, ల‌య‌, వెన్నెల కిషోర్, ర‌ఘుబాబు, త‌రుణ్ అరోరా, అభిమ‌న్యు సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షెడ్యూల్ అమెరికాలోని న్యూయార్క్ లో జ‌రుగుతుంది. సెప్టెంబ‌ర్ లో షూటింగ్ పూర్తి కానుంది. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. విజ‌య్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేక‌ర్స్ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ విడుద‌ల కానుంది. న‌టీన‌టులు: ర‌వితేజ‌, ఇలియానా డీ క్రూజ్, సునీల్, ల‌య‌, వెన్నెల కిషోర...

16వ `సంతోషం` సౌత్ ఇడింయన్ ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం

16వ సంతోషం సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ జెఆర్.సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో ఆట పాట‌ల‌తో..తార‌ల త‌ళుకుబెళుకుల నడుమ అంగ‌రంగ వైభవంగా ఎంతో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి , గాన కోకిల ఎస్. జాన‌కి ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఇంకా ప‌లువురు టాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు…రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల న‌టీన‌టుల‌కు అవార్డులు అందిచ‌డం జ‌రిగింది.   మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, `నాకు అవార్డు ఇస్తానంటే వేడుక‌కు రాను. ఇవ్వ‌నంటేనే వ‌స్తాన‌ని సురేష్ కి ముందే చెప్పాను. కానీ న‌న్ను మోసం చేసి గాన గోకిల ఎస్. జాన‌కి గారు చేతుల మీదుగా అవార్డు బ‌హుక‌రించి న‌న్ను లాక్ చేసేసాడు. కాద‌న‌లేక ఈ అవార్డు తీసుకుంటున్నాను. చాలా సంతోషంగాను ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆమె చేతుల మీదుగా ఎప్పుడూ అవార్డు తీసుకోలేదు. సింగ‌పూర్ లో ఏదో వార్డుల కార్య‌క్ర‌మంలోనే ఇద్ద‌రం క‌లిసాం. మ‌ళ్లీ సంతోషం వేడుక‌ల్లోనే క‌లిసాం. తొలిసారి ఆమె చేతుల మీద‌గా సంతోషం అవార్డు తీసుకుంటున్నందుకు చాలా గ‌ర్వంగా ఉంది. ఈ సంద‌ర్భంగా సురేష కు ధ‌న్య‌వాధాలు...