Skip to main content

Posts

Showing posts from June, 2019

‘కల్కి’ బి, సి సెంటర్ మాస్ సినిమా! – దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూ

‘కల్కి’ బి, సి సెంటర్ మాస్ సినిమా! – దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూ ‘అ!’ చిత్రంతో అటు ప్రేక్షకుల్ని, ఇటు విమర్శకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తెలుగు ప్రేక్షకులు కొత్త తరహా చిత్రాన్ని అందించారు. ‘అ!’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ కల్కి ‘. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా శివాని, శివాత్మిక, ‘వైట్ లాంబ్ పిక్చర్స్’ వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. జూన్ 28న విడుదలైన ఈ సినిమా కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా, మాస్ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మీడియాతో మాట్లాడారు . ఆయన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు… సినిమాకు ఎలాంటి స్పందన వస్తోంది? దర్శకుడిగా నా తొలి సినిమా ‘ అ! ‘ ఏ సెంటర్ సినిమా అయితే… ‘ కల్కి’ బి, సి సెంటర్ సినిమా . సరికొత్త కమర్షియల్ పంథాలో తీసిన సినిమా. ఏ ప్రేక్షకులైతే మా టార్గెట్ అనుకుని సినిమా తీశామో వాళ్ళందరికీ సినిమా నచ్చింది. అయామ్ సో హ్యాపీ. రాజశేఖర్ గారి తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్? ఆయన షూటింగ్ కి సకాలంలో రాకపోవడం ...

ప్రభాస్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన లేడీ డైరెక్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై సెన్సేషనల్ కెమెంట్స్ చేసి సంచలనం సృష్టించింది లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి . ఇంతకీ ఈ లేడీ డైరెక్టర్ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ ఏంటో తెలుసా …….. క్రష్ అని . అవును ప్రభాస్ అంటే నందిని రెడ్డి కి చాలా క్రష్ అట ! ప్రభాస్ అంటే చాలా ఇష్టమని చెప్పడమే కాకుండా అతడి దగ్గర ఈ విషయం చెప్పాలని అనిపిస్తుంది కానీ ప్రభాస్ కనబడగానే సిగ్గుల మొగ్గ అవుతానని అందుకే ఇప్పటివరకు చెప్పలేకపోయానని అంటోంది నందిని రెడ్డి . ప్రభాస్ అంటే ఒక్క నందిని రెడ్డి కి మాత్రమే కాదు ఇంకా చాలామందికి ఇష్టం . సినిమారంగంలోని పలువురు హీరోయిన్ లు కూడా ప్రభాస్ అంటే పడిచస్తున్నారు . కానీ ప్రభాస్ మాత్రం సింపుల్ గా నవ్వుతు వెళ్ళిపోతున్నాడు కానీ పెళ్లి చేసుకోవడం లేదు అలాగే తనని ప్రేమిస్తున్న వాళ్ళని పట్టించుకోవడం లేదు . అయితే ఈ రకంగానైనా నందిని రెడ్డి ప్రేమ ప్రభాస్ కు తెలుస్తుందేమో చూడాలి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2LbHIer

సినీ పెద్దలపై బాంబ్ పేల్చిన దాసరి కొడుకు

సినీ రంగానికి చెందిన పలువురు పెద్దలు నా సమస్యని పరిష్కరించడం లేదని బాంబ్ పేల్చాడు దాసరి నారాయణరావు పెద్ద కొడుకు దాసరి ప్రభు . దాదాపు పది రోజుల పాటు హైదరాబాద్ , చిత్తూర్ , బెంగుళూర్ లలో గడిపిన దాసరి ప్రభు ఎట్టకేలకు నిన్న హైదరాబాద్ వచ్చాడు . పది రోజుల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ప్రభు ని రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . మా నాన్న దాసరి నారాయణరావు పరిశ్రమలో ఎలాంటి సమస్య వచ్చినా క్షణాల్లో పరిష్కరించేవాడని కానీ మా ఇంటి సమస్యని సినీ పెద్దలు పట్టించుకోవడమే లేదంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు . నా మాజీ భార్య సుశీల తో ఆస్తుల గొడవలు ఉన్నాయని , వాటిని పరిష్కరించు కోవడానికే వెళ్లానని కానీ నావల్ల కాలేదని , అలాగే మా తమ్ముడు తో కూడా ఆస్తుల గొడవలు ఉన్నాయని అంటున్నాడు దాసరి ప్రభు . మొత్తానికి దాసరి పెద్ద కొడుకు అజ్ఞాతం వీడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RpbBJ6

`ప్రేమ‌జంట‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

సన్ వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ప్రణీత్ , సుమయ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ` ప్రేమ‌జంట‌ `. స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ద‌గ్గుబాటి వ‌రుణ్ ఈ చిత్రాన్ని జూన్ 28 న విడుద‌ల చేస్తున్నారు . మహేష్ మొగుళ్ళూరి నిర్మాత . నిఖిలేష్ తొగరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు . ఈ సినిమా రీసెంట్‌గా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ` యు / ఎ ` స‌ర్టిఫికేట్‌ను పొందింది . మంగ‌ళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది . ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా డైరెక్ట‌ర్ సాగ‌ర్‌ , టి . ప్ర‌స‌న్న‌కుమార్ పాల్గొన్నారు . డైరెక్ట‌ర్ సాగ‌ర్ ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు . ఈ సంద‌ర్భంగా ..  డైరెక్ట‌ర్ సాగ‌ర్ మాట్లాడుతూ “ ట్రైల‌ర్‌ , పాట‌ల్లో   చూపించినట్టుగా ఈ చిత్రంలోని ప్రేమ జంట సూసైడ్ వరకు వెళ్లారంటే ఎన్ని కష్టాలు పడ్డారో అర్థమవుతోంది . పిక్చరైజేషన్ చాలా బాగుంది . ప్రొడక్షన్ వేల్యూస్ కూడా చాలా బావున్నాయి .   అమ్మాయి అబ్బాయి కూడా బాగా నటించారు . అందంగా ఉన్నారు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను “ అన్నారు .  త...

వెండితెర డైరెక్టర్ అవుతున్న నాని సోదరి

హీరో నాని సోదరి దీప్తి గంటా వెండితెర మీద తన దర్శకత్వ ప్రతిభ నిరూపించుకోవడానికి సిద్ధం అవుతోంది . ఇటీవలే 15 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం కు దర్శకత్వం వహించింది . ఆ షార్ట్ ఫిలిం కు అందరి నుండి ప్రశంసలు లభిస్తుండటంతో దీప్తి తో పాటుగా నాని కూడా చాలా సంతోషంగా ఉన్నారు . ఇంతకీ నాని సోదరి డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిం ఏంటో తెలుసా …….. అనగనగా ఒక నాన్న . ఫాదర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఈ షార్ట్ ఫిలిం ని రిలీజ్ చేసారు . ఈ షార్ట్ ఫిలిం కు నాని నిర్మాతగా వ్యవహరించాడు . తన చెల్లి డైరెక్టర్ అయితే తనకు మరింత అడ్వాంటేజ్ అని భావించడమే కాకుండా ఆమెకు ఆసక్తి ఉండటంతో ఎంకరేజ్ చేస్తున్నాడు నాని . ఇక ఇప్పటికే నాని సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసాడు . అందులో తన చెల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Ko5Drq

జబర్దస్త్ కు గుడ్ బై చెబుతున్న అనసూయ ?

జబర్దస్త్ కార్యక్రమానికి హాట్ భామ అనసూయ గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది . ఒకవేళ ఇది నిజమే అయితే నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే జబర్దస్త్ లో నవ్వుల కోసం ఎంతమంది చూస్తారో తెలీదు కానీ అనసూయ అందాలను చూడటానికి మాత్రం ఎగబడి చూసేవాళ్ళే ఎక్కువ మరి . పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు అనసూయ . చిట్టి పొట్టి బట్టలలో తన అందాలను ప్రదర్శించి  కుర్రాళ్ళని , ముసలి వాళ్ళని  చంపేస్తోంది అనసూయ . అయితే ఈ భామ జబర్దస్త్ నుండి కొంతకాలం దూరం అవుదామని అనుకుంటోందట ఎందుకంటే ……. సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి దాంతో సినిమాలకు న్యాయం చేయాలంటే జబర్దస్త్ కు అన్యాయం చేయకతప్పదు అని ఫిక్స్ అయినట్లు సమాచారం . బుల్లితెర పై హాట్ యాంకర్ గా రాణిస్తున్న ఈ భామ వెండితెర పై కూడా సంచలనం సృష్టించాలని ఆశపడుతోంది .  from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/31BCuOS

యాక్సిడెంట్ కి గురైన చలాకి చంటి

జబర్దస్త్ ప్రోగ్రాం తో బాగా పాపులర్ అయిన చలాకి చంటి యాక్సిడెంట్ కు గురయ్యాడు . అయితే చలాకి చంటి కి స్వల్ప గాయాలు కావడంతో అతడ్ని కోదాడ లోని తిరుమల ఆసుపత్రికి తరలించారు . విజయవాడ వెళ్లిన చలాకి చంటి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయిన సమయంలో సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ రోడ్డులో కొమరబండ వద్ద ఆగిఉన్న లారీ ని వెనుక నుండి తన కారుతో గుద్దడంతో భారీ యాక్సిడెంట్ జరిగింది . చలాకి చంటి కి గాయాలు కావడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చంటిని కోదాడ లోని తిరుమల ఆసుపత్రికి తరలించారు . అయితే ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది . ఈ సంఘటన ఉదయం ఆరున్నర కు జరిగింది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2INwzO9

స్క్రిప్ట్ పనుల్లో ఫలక్ నుమా దాస్ 2

ఫలక్ నుమా దాస్ మంచి ఓపెనింగ్స్ సాధించడంతో ఫలక్ నుమా దాస్ 2 చిత్రానికి శ్రీకారం చుట్టాడు విశ్వక్ సేన్ . మే 31 న విడుదలైన ఫలక్ నుమా దాస్ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి అలాగే వసూళ్ల కంటే వివాదాలు చుట్టుముట్టాయి దాంతో హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్ మరింత కసిగా ఫలక్ నుమా దాస్ 2 తీయనున్నట్లు ప్రకటించాడు . ప్రకటించడం వరకే కాకుండా ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టాడు . అయితే స్క్రిప్ట్ ని పూర్తిచేసినా ఈ ఏడాది మాత్రం సెట్స్ మీదకు వెళ్ళదట , వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు విశ్వక్ సేన్ . ఇక ఈ రెండో భాగంలో భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండనున్నట్లు ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే . హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఈసారి కేవలం తెలంగాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా విజయం సాధించేలా జాగ్రత్త పడతాడట విశ్వక్ సేన్ . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2XjZJO8

సెమీ వీడియో గిఫ్టుగా ఇచ్చిన పూనమ్ పాండే

పూనం పాండే సెమీ న్యూడ్ వీడియో ని పోస్ట్ చేసి సంచలనం సృష్టిస్తోంది . దాయాది పాకిస్థాన్ పై భారత్ సంచలన విజయం సాధించడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపుగా ఓ న్యూడ్ వీడియో ని మన క్రికెట్ వీరుల కోసం అలాగే పూనం అందాలను ఆస్వాదించే వాళ్ళ కోసం సోషల్ మీడియాలో వదిలేసింది . ఇంకేముంది ఆ వీడియో వైరల్ అవుతోంది . గతంలోకూడా భారత్ గెల్చినప్పుడు నగ్న ప్రదర్శన చేస్తానని హామీ ఇచ్చింది . మాట ఇవ్వడమే కాకుండా తన మాట ని నిలబెట్టుకుంది పూనం పాండే . ఒంటి మీద ఉన్న బట్టలను తీసి పడేసి ఫ్రీ షో చేస్తానని ఈ భామ మాటిస్తే ఆ మాట నిలబెట్టుకునే వరకు నిద్ర పోదంటే నమ్మండి అంతగా అంకితభావంతో తన వలువలను (వస్త్రాలను ) తీసి పడేస్తుంది . తాజాగా ఇదే చేసింది పూనం పాండే . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2ZwEq9G

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో మహాదేవపురం

ల‌క్కీ ఆర్ట్స్ ప‌తాకంపై కె. చంద్ర‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌కత్వంలో నిర్మిస్తోన్న చిత్రం `మ‌హదేవ‌పురం`. ప్రీతిసింగ్, ప్ర‌మీల‌ హీరోయిన్స్. ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఈ రోజు రిలీజ్ చేసారు. ఈ సంద‌ర్భంగా హీరో-ప్రొడ్యూస‌ర్-డైర‌క్ట‌ర్ కె.చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ…` మ‌హ‌దేవపురం ` అనే ఊరి చివ‌రిలో ఉండే ఒక ఫారెస్ట్ లో వ‌రుస‌గా మ‌ర్డ‌ర్స్ జ‌రుగుతుంటాయి. ఆ మ‌ర్డ‌ర్స్ అక్క‌డే తిరిగే పాము చేస్తుందా? లేదా దెయ్యం చేస్తుందా? అనేది మిస్ట‌రి. ఆ మిస్ట‌రీని హీరో ఎలా ఛేదించాడు ? ఏంట‌న్న‌ది ఇంట్ర‌స్టింగ్ పాయింట్‌. ఇందులో ఆడియ‌న్స్ కు కావాల్సిన అన్ని అంశాలు పొందుప‌రిచాము. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు సినిమాటోగ్రఫీ, మ‌హేష్ నారాయ‌ణ సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లుగా నిలుస్తాయి. త్వ‌ర‌లో ఆడియో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు. అర్జున్ రాజు, సూర్య‌నారాయ‌ణ‌, బ్ర‌హ్మం, ప్ర‌స‌న్న‌, గంట గురుమూర్తి, డిఎస్ పి, మ‌ణి రాజ్ త‌దిత‌రులు న‌టిస...

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘రాజా నరసింహా’

మమ్ముటీ, జై, మహిమా నంబియర్‌ కీలక పాత్రధారులుగా మలయాళంలో తెరకెక్కిన ‘మధురరాజా’ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ టైటిల్‌తో జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధుశేఖర్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘మన్యంపులి’తో ఘన విజయం అందుకున్న వైశాక్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదలై దాదాపు వంద కోట్లు వసూళ్లు రాబట్టింది. ‘ యాత్ర ’ వంటి సూపర్‌హిట్‌ సినిమా మమ్ముటీ హీరోగా తెలుగులో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం అనువాద కార్యక్రమాల్లో ఉంది. జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘మలయాళంలో భారీ విజయం సాధించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. చక్కని సందేశం కూడా ఉంది. మమ్ముటీ, జై పాత్రలు ఆకట్టుకుంటాయి. ప్రతినాయకుడిగా జగపతిబాబు పాత్ర మరోస్థాయిలో ఉంటుంది. సన్నీలియోన్‌ నటించిన ప్రత్యేక గీతం యువతను ఉర్రూతలూగిస్తుంది. గోపీ సుందర్‌ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. త్వరలో అనువాద కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో సినిమాను విడుదల చేస్తాం’’అని అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్‌, నిర్మాణ సారధ్యం: వడ్డ...

‘కల్కి’ రిలీజ్ రైట్స్ సొంతం చేసుకున్న శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ కల్కి ‘. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, ‘హార్న్ ఓకే ప్లీజ్’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ “సినిమా ప్రేక్షకులకు నమస్కారం. ‘కల్కి’ రిలీజ్ రైట్స్ శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నేను తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఈ సినిమాకు ముందు వచ్చిన రాజశేఖర్ గారి ‘గరుడవేగ’ పెద్ద సక్సెస్ అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘అ!’ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా ఆదరించారు. ఇండియాలోనూ, ఓవ‌ర్‌సీస్‌లోనూ ఆ సినిమా బాగా ఆడింది. ఇక, ఫస్ట్ రిలీజ్ అయిన ‘కల్కి’ మోషన్ ప...

ఈ నెల 21న “స్టూవర్టుపురం” మూవీ విడుదల

అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో గూఢచారి ఫేమ్ ప్రీతి సింగ్ ప్రధానపాత్రలో సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “స్టూవర్టుపురం”. ప్రస్తుతం ఈ చిత్రం యు/ఏ సెర్టిపికెట్ తో సెన్సార్ పూర్తి చేసుకొని జూన్ 21 న విడుదలకు సిద్ధమౌతున్నది. ఇటీవలే ప్రముఖ దర్శకుడు సుకుమార్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ ని విడుదల చేయగా మంచి హైప్ ఏర్పడింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం గురించి సమర్పకుడు రంజిత్ కోడిప్యాక మాట్లాడుతూ …. గతంలో మా బ్యానర్ లో నిర్మించిన నందికొండ వాగుల్లోనా, మోని చిత్రాల దర్శకుడు సత్యనారాయణ ఏకారి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మరో చిత్రమిది. కమర్షియల్ హంగులతో దర్శకుడు అద్భుతంగా తెరకేకించాడు, ఈ నెల 21 న విడుదల చేస్తున్నామన్నారు. దర్శకుడు సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ … స్టూవర్ట్ పురం ట్రైలర్ ప్రముఖ దర్శకులు సుకుమార్ గారు విడుదల చేయడం, ఈ ట్రైలర్ కు భారీ హైప్ వచ్చింది. ముఖ్యంగా యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ ని సంపాదించుకుంది. ఆ ఉత్సాహంతో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నాం. ఇక సినిమా గురించి చ...

ఎన్నికలు వద్దు.. ఉపసంహరణే ముద్దు – నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్

నిర్మాతల మండలికి ఎన్నికలు అవసరం లేదని చాలా మంది నిర్మాతల అభిప్రాయం అని అంటున్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి ఎన్నికలు ఈ నెల 30న జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా నిర్మాతల మండలికి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయంలో ఇటీవలే నిర్మాతల మండలి సమావేశం జరిపి రెండు ప్యానల్స్ ని ఎంపికచేసింది . ఆ తరువాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రెండు ప్యానల్స్ ఒక్కటయ్యాయి . అందులో కొందరిని పక్కన పెట్టారు. నిర్మాతల మండలి చాలా బాగా జరుగునున్న క్రమంలో కొందరు కావాలని ఇస్స్యూస్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎల్ ఎల్ పి అంటూ ఛానల్స్ విషయంలో సపరేట్ గా ఉండడంతో కౌన్సిల్ కు వచ్చే ఆదాయం తగ్గింది. ఆ సమస్యను సాల్వ్ చేస్తానని నిర్మాత సి కళ్యాణ్ గారు చెప్పారు. ఎన్నికల విషయంలో కూడా అనవసరంగా ఎన్నికల కోసం డబ్బు ఖర్చు చేసే బదులు అందరు ఒక్కటిగా ప్యానల్ ని ఎన్నుకుంటే బాగుంటుంది. ఈ విషయంలో ఎఫ్ డి సి చైర్మన్ రామ్మోహనరావు, సురెష్ బాబు తో కూడా మాట్ల...

భార్యతో గొడవపడితే 15 రోజులు మాట్లాడడట ఈ హీరో

నా భార్యతో గొడవ జరిగితే 15 రోజుల పాటు మాట్లాడటం మానేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ . తాజాగా ఈ హీరో నటిస్తున్న చిత్రం ” కబీర్ సింగ్ ” . తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్నాడు . కాగా ఆ చిత్ర ప్రమోషన్ నిమిత్తం నేహా ధూపియా నిర్వహిస్తున్న ఓ షోలో పాల్గొన్నాడు షాహిద్ , ఆ సందర్బంగా తన భార్య మీరా రాజ్ పుత్ తో గొడవపడితే 15 రోజులు మాట్లాడను అంటూ చెప్పేసాడు . అయితే 15 రోజుల తర్వాత నేను సర్దుకుపోతాను లేదంటే నా భార్య నాతో రాజీకి వస్తుంది . ఇక అన్యోన్య దాంపత్యం సాగాలంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగువులు రావాల్సిందేనని అప్పుడే ఇద్దరి మధ్య మరింత ప్రేమ పెరుగుతుందని అంటున్నాడు . కబీర్ సింగ్ ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది . దాంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బాగానే పాల్గొంటున్నాడు షాహిద్ కపూర్ . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Y0ifbD

విజయవాడ వెళ్లిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విజయవాడ వెళ్ళాడు . కొద్దిసేపటి క్రితం స్పెషల్ ఫ్లయిట్ లో ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్న కేసీఆర్ విమానాశ్రయం నుండి నేరుగా విజయవాడ లోని ఓ స్టార్ హోటల్ కు వెళ్ళాడు . అక్కడి నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు కొండ మీదకు వెళ్ళాడు . తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో అమ్మవారి దర్శనం కోసం వస్తుండటంతో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసారు దేవాదాయ శాఖ అధికారులు . అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అక్కడి నుండి శారదా పీఠాధిపతిని కలవనున్నారు కేసీఆర్ . శారదా పీఠాధిపతి నిర్వహించే పూజలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో కలిసి కేసీఆర్ కూడా పాల్గొననున్నారు . కేసీఆర్ బెజవాడ రావడంతో అక్కడ భారీ ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేసారు కేసీఆర్ అభిమానులు . హైదరాబాద్ లో న్యూ ఎం ఎల్ ఏ క్వార్టర్స్ ని ప్రారంభించిన అనంతరం విజయవాడ వెళ్లారు కేసీఆర్ . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/31CnMar

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన మణిరత్నం

దక్షిణాదిన ప్రముఖ దర్శకులు అయిన మణిరత్నం కు నాలుగోసారి గుండెపోటు వచ్చింది దాంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు మణిరత్నం కుటుంబ సభ్యులు . ఈరోజు ఉదయం మళ్ళీ గుండెపోటు రాగానే వెంటనే ఆసుపత్రికి తరలించారు . అయితే ప్రమాదం ఏమి లేదని డాక్టర్లు చెప్పడంతో షాక్ నుండి తేరుకున్నారు . తన భర్తకు మళ్ళీ గుండెపోటు రావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యింది సుహాసిని . ఇంతకుముందు 2004 లో మొదటిసారి మణిరత్నం కు గుండెపోటు వచ్చింది . ఆ తర్వాత వరుసగా 2015 లో 2018 లో గుండెపోటు తో ఆసుపత్రిలో చికిత్స పొందాడు . అయితే మూడుసార్లు కూడా మళ్ళీ కోలుకున్న మణిరత్నం కు ఈసారి నాలుగోసారి గుండెపోటు వచ్చింది . చాలాకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు మణిరత్నం . ఒకప్పుడు అజరామరమైన చిత్రాలను అందించిన మణిరత్నం ఇప్పుడు వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2IMaRKh

`గుణ 369` టీజ‌ర్‌కు అద్భుత స్పంద‌న‌..!

“మ‌న `ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ‌ ను ఇక‌పై అంద‌రూ `గుణ 369` హీరో కార్తికేయ అని అన‌డం ఖాయం… అని ఘంటాప‌థంగా చెబుతున్నారు `గుణ 369` చిత్రం టీజ‌ర్ చూసిన వాళ్లు“ అని అంటున్నారు శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల‌. ఆమె స‌మ‌ర్పిస్తున్న చిత్రం `గుణ 369`. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాలకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. “మ‌నం చేసే త‌ప్పుల వ‌ల్ల మ‌న జీవితాని కి ఏం జ‌రిగినా ఫ‌ర్వాలేదు. కానీ ప‌క్క‌నోడి జీవితానికి ఏ హానీ జ‌ర‌గ‌కూడ‌దు“ అని సాయికుమార్ గంభీర‌మైన స్వ‌రంతో చెప్పే మాట‌ల‌తో ` గుణ 369 ` టీజ‌ర్ సోమ‌వారం ఉద‌యం విడుద‌లైంది. టీజ‌ర్ రిలీజైన కొద్దీ క్ష‌ణాల్లోనే నెట్టింట్లో ట్రెండ్ అయింది. ఆర‌డ‌గుల హీరో ఓ అమ్మాయి ముందు నిలుచుని `స్మైల్ ఇవ్వొచ్చు క‌దా ఒక్క సెల్ఫీ..`, `నేనూ ఎప్పుడూ అనుకోలేదండీ. ఇలా బ‌ల‌వంతంగా ష‌ట్ట‌ర్ క్లోజ్ చేసి ఒక‌మ్మాయితో మాట్లాడ‌తాన‌నీ.. నాతో మీరు మాట్లాడాల్సిన ప‌నిలేదు. మీతో మీరు మాట్లాడేయండి` అని ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తూ చెప్పే డైలాగులు యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ...

జులై 5న ‘రాజ్‌దూత్‌’ సినిమా విడుదల

స్వర్గీయ రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ రాజ్‌ దూత్‌ ‘. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై అర్జున్‌ – కార్తీక్‌ దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించారు. ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు ముగించుకుని జూలై5న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. కాగా, ఇటీవలే విడుదలై చిత్ర టీజర్‌ మిలియన్‌ వ్యూస్‌ అధిగమించి యూట్యూబ్‌లో అనూహ్యమైన ఆదరణ పొందుతోంది. తొలి చిత్రమైనా మేఘాంశ్‌ అద్భుతంగా నటించాడని చిత్ర నిర్మాత తెలియజేస్తున్నారు. రియల్‌ స్టార్‌ వారసుడిగా మేఘాంశ్‌ సంచలనాలు సష్టించడం ఖాయం అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. మేఘాంశ్‌ హీరోయిక్‌ లుక్‌ అందరినీ అబ్బురపరుస్తోంది. హీరోయిజానికి సరిపడే ఛామింగ్‌ డ్యాషింగ్‌ లుక్‌ అతడికి ఉంది. అతడిలో రియల్‌ స్పార్క్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌.. సామాజిక మాధ్యమాల చాటింగ్‌లో పలువురు మేఘాంశ్‌ లుక్‌ .. అప్పియరెన్స్‌ పై ప్రశంసలు కురిపించారు. మొత్తానికి టీజర్‌ తోనే ప్రశంసలు దక్కించుకున్న ఈ యంగ్‌ హీరోకి తండ్రి శ్రీహరి ఆశీస్సులతో పాట...

పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇవ్వడంతో పెళ్లి చేసుకుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు కట్ చేస్తే సర్దార్ గబ్బర్ సింగ్ లో నుండి తీసేసాడు . దాంతో ఇక లాభం లేదనుకున్న ఈ భామ తాజాగా పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది . ఇంతకీ పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చిన భామ ఎవరో తెలుసా …… ఇంకెవరు అనీషా ఆంబ్రోస్ . తెలుగులో నాలుగైదు చిత్రాల్లో నటించింది ఈ భామ . అయితే హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది అలాగే పవన్ కళ్యాణ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు . దాంతో ఇటీవలే పెళ్లి చేసుకుంది . తనకు పెళ్లి అయినట్లుగా తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది , అయితే భర్త పేరు వివరాలు మాత్రం తెలియజేయలేదు ఈ భామ . అనీషా ఆంబ్రోస్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FpGHvN

స్టూడెంట్స్ కి ఆఫర్ ఇస్తున్న విజయ్ దేవరకొండ

జూన్ నెల వచ్చింది మళ్ళీ పాఠశాలలు , కాలేజీ లు తెరుచుకుంటాయి , అవి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అంటే యూనిఫామ్ లు తప్పనిసరి అందుకే హీరో విజయ్ దేవరకొండ తన బ్రాండ్ అయిన రౌడీ వేర్ ని ఇన్నాళ్లు కాలేజ్ స్టూడెంట్స్ ని యూత్ కి మాత్రమే సరఫరా చేసిన ఈ రౌడీ స్టూడెంట్స్ కూడా యూనిఫామ్ ని అందించడానికి సిద్దమయ్యాడు . అయితే తన బ్రాండ్ ని కావాలనుకునే వాళ్లకు ఒక వంద రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాడు . నిన్నటి నుండి ఈ ఆఫర్ ఓపెన్ అయ్యింది ఈనెల 23 వరకు కొనసాగనుంది . రౌడీ వేర్ యూనిఫామ్ కావాలనుకునే వాళ్ళు ఆన్ లైన్ లో వాటిని పొందొచ్చు . విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ విడుదలకు సిద్ధం అవుతోంది , ఆ సినిమా అలా విడుదల అవ్వడమే ఆలస్యం హీరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు విజయ్ దేవరకొండ . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2KZ0Axj

బికినీ ట్రీట్ ఇచ్చిన నిషా అగర్వాల్

కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ బికినీ ట్రీట్ ఇచ్చి షాక్ ఇచ్చింది . అది కూడా టు పీస్ బికినీ లో హీటెక్కించింది నిషా అగర్వాల్ . నిషా పుట్టించే అందాలతో సంచలనం సృష్టిస్తున్న ఈ భామకు పెళ్లయ్యింది పిల్లలు కూడా . అక్క కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ కావడంతో నిషా అగర్వాల్ కూడా హీరోయిన్ గా సినిమాల్లోకి వచ్చింది . అయితే అక్క కాజల్ అగర్వాల్ లాగా స్టార్ డం తెచ్చుకోలేకపోయింది . దాంతో హాయిగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటూ పిల్లలను కూడా కన్నది . అయితే తాజాగా టు పీస్ బికినీ లో సేద తీరుతూ కుర్రాళ్ళ గుండెల్లో వేగం పెంచుతోంది . బికినీ లో దిగిన ఫోటోలు తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FaMcOM

2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ మహేష్ దేనట !

మహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . మే 31 న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ఈ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే . ఇక ఈ చిత్రాన్ని 2020 లో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ప్రారంభోత్సవం రోజునే సంక్రాంతి కి రిలీజ్ అని ప్రకటించారు . ఇక ఈ చిత్రం 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని స్క్రిప్ట్ అద్భుతంగా రూపొందిందని తెలుస్తోంది . ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా యాక్షన్ ని అలాగే కాస్త రొమాన్స్ ని టచ్ చేసి మిక్స్ చేసి జనాల మీదకు వదలడం అనిల్ రావిపూడి స్టైల్ . ఇప్పటివరకు ఈ దర్శకుడు చేసిన అన్ని సినిమాలు ఇదే ఫార్ములాతో చేసాడు . ఇక ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా అదే అప్లై చేస్తున్నాడట . మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది . ఇక ఈ సినిమాని 80 కోట్ల లోపు ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడట అనిల్ రావిపూడి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2wVYTrV

సంచలనం :ఆర్ ఆర్ ఆర్ నైజాం రైట్స్ 80 కోట్లా ?

జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని నైజాం లో సొంతం చేసుకోవడానికి అగ్ర నిర్మాత దిల్ రాజు తో పాటుగా ఏషియన్ సునీల్ నారంగ్ లు పోటీ పడుతున్నారట . అయితే ఇదంతా తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు ఈ ఇద్దరు కూడా . ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి వీళ్ళు కోట్ చేస్తున్న రేట్ ఎంతో తెలుసా ……. 70 నుండి 80 కోట్లట . జూనియర్ ఎన్టీఆర్ కు అలాగే రాంచరణ్ కు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దానికి తోడు అన్నింటికీ మించి ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి దర్శకుడు దాంతో హాట్ కేక్ అయిపొయింది ఆర్ ఆర్ ఆర్ . నైజాం లో ఏ చిత్రాన్ని 80 కోట్లకైనా సరే దక్కించుకోవాలని ఆ ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నారట . మరి ఎవరికి దక్కుతుందో ఆర్ ఆర్ ఆర్ . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WO90cQ

పోలీసులతో ఆట ఆడుకుంటున్న దాసరి ప్రభు

దర్శకరత్న దాసరి నారాయణరావు పెద్ద కొడుకు దాసరి ప్రభు హైదరాబాద్ పోలీసులతో ఓ ఆట ఆడుకుంటున్నాడు . ఈనెల 9 న హైదరాబాద్ నుండి చిత్తూర్ కి వెళ్లిన దాసరి ప్రభు తన వెంట సెల్ ఫోన్ తీసుకెళ్లకపోవడంతో అతడు ఎక్కడికి వెళ్ళాడు ? ఏం చేస్తున్నాడు ?ఎవరితో ఉన్నాడు ?అన్నది మిస్టరీ గా మారింది . దాసరి ప్రభు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రభు కోసం గాలింపు చేపట్టారు . అయితే తనకోసం పోలీసులు వెతుకుతున్న సమాచారం అందుకున్న ప్రభు చిత్తూర్ నుండి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాడు . పోలీసులు ఇక్కడ కూడా వెతుకుతున్నారు అని తెలుసుకొని మళ్ళీ హైదరాబాద్ నుండి కూడా వెళ్ళిపోయాడు ఎక్కడికో . అతను ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్ధం కాక పోలీసులు తల పట్టుకుంటున్నారు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2wVYSEn

పాక్ ని చిత్తుచిత్తుగా ఓడించిన ఇండియా

దాయాది పాకిస్థాన్ ని చిత్తుచిత్తుగా ఓడించి మరోసారి సంచలన విజయాన్ని నమోదు చేసింది టీమ్ ఇండియా . ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్థాన్ పై ఎప్పుడూ భారత్ దే పైచేయి అని మరోసారి చాటి చెప్పారు . ఇప్పటివరకు ప్రపంచ కప్ పోటీలలో పాకిస్థాన్ తో భారత్ ఏడుసార్లు వరుసగా విజయాలు నమోదు చేయగా 27 సంవత్సరాలుగా ఇదే పంథా పునరావృతం అవుతూనే ఉంది . నిన్న మాంచెస్టర్ లో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై 89 పరుగుల భారీ ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది భారత్ . భారత్ – పాక్ మ్యాచ్ కు వరుణుడు కాస్త ఇబ్బంది పెట్టినా ప్రపంచ వ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోయిన ప్రేక్షకులను చూసి కాబోలు వరుణ దేవుడు సెలవు తీసుకున్నాడు దాంతో పాకిస్థాన్ – భారత్ మ్యాచ్ కి అడ్డంకి లేకుండా పోయింది . ఇక రోహిత్ శర్మ సెంచరీ బాదడంతో ఈ భారీ విజయం సాధించింది . రోహిత్ కు తోడు కెప్టెన్ కోహ్లీ , మరో ఓపెనర్ రాహుల్ రాణించడం విశేషం . ఇక బౌలర్లు బుమ్రా , భువీ , కుల్దీప్ , హార్దిక్ పాండ్య , విజయ్ శంకర్ లు రాణించడంతో భారత్ పని సులువయ్యింది . మొత్తానికి పాకిస్థాన్ పై ఎప్పటికి భారత్ దే పైచేయి అని మరోసారి ఈ మ్యాచ్ ద్వారా నిరూపించి కోట్లాది భారతీయుల మనసులను గెలిచారు టీమ్ ఇండి...

శాటిలైట్ రైట్స్ లో సంచలనం సృష్టించిన బెల్లంకొండ

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ” రాక్షసుడు ” , తమిళంలో సంచలన విజయం సాధించిన రాత్ససన్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు గా రీమేక్ చేస్తున్నారు . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా అనుపమా పరమేశ్వరన్ బెల్లంకొండ సరసన నటిస్తోంది . రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ ధర పలికి సంచలనం సృష్టిస్తోంది . తెలుగు , హిందీ డబ్బింగ్ రైట్స్ రెండూ కలిపి మొత్తం 18 కోట్లకు పైగా డీల్ కుదిరినట్లు తెలుస్తోంది . శాటిలైట్ తెలుగు హక్కుల కోసం 6 కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం 12 కోట్లకు పైగా చెల్లిస్తున్నట్లుగా సమాచారం . దాంతో మేకింగ్ డబ్బులు దాదాపుగా ఇక్కడే వస్తున్నట్లు తెలుస్తోంది . తమిళంలో సంచలన విజయం సాధించిన చిత్రం కావడంతో తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ .   from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2XRdH71

Ravi Teja Finish His shoothing

పాత‌బ‌స్తి లో షూటింగ్ పూర్తిచేసుకున్న‌ రవితేజ, వి ఐ ఆనంద్, ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్మెంట్స్ “డిస్కోరాజా” మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా”. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ రామెజిఫిల్మ్‌సిటి లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, వెన్నెల కిషోర్ ల మ‌ద్య కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరించారు.త‌రువాత హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంది. రీసెంట్ గా పాత‌బ‌స్తి లో చాలా కీల‌క స‌న్నివేశాలు హీరో ర‌వితేజ గారు మ‌రియు ఇత‌ర న‌టీన‌టుల మ‌ద్య కీలక స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఈ లో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మ‌రో హీరోయిన్ ఎంపిక ఇంకా జ‌ర‌గాల్సి వుంది. టేస్ట్ వున్న నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. త్వ‌ర‌లో హైద‌రాబాద్ లో భారీ సెట్ లో మేజ‌ర్ షెడ్యూల్ ని ప్రారంభిస్తారు.   న‌టీన‌టులు ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ క...

ఆ అకౌంట్ నాగార్జునది కాదట !

అయామ్ నాగార్జున అనే అకౌంట్ నాకు లేదని , అసలు ఇన్ స్టా గ్రామ్ అకౌంటే నాకు లేదని ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు కింగ్ నాగార్జున . ఇన్ స్టా గ్రామ్ లో ఎవరో అయామ్ నాగార్జున అనే అకౌంట్ ఓపెన్ చేసాడు . దాంతో అది హీరో నాగార్జున దిగా భావించి బోలెడుమంది దాన్ని ఫాలో అవుతున్నారు . అయితే ఈ విషయం నాగార్జున కు తెలియడంతో దానిపై క్లారిటీ ఇచ్చాడు . ఇన్ స్టా లో నాకు ఎకౌంట్ లేదు ఒకవేళ ఓపెన్ చేస్తే తప్పకుండా మీకు చెబుతాను అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు నాగార్జున . తాజాగా ఈ హీరో మన్మథుడు 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/31zFmvG

రామ్ భుజాలపై కూర్చున్న సెక్సీ భామ హాట్ భామ

రామ్ భుజాలపై కూర్చున్న సెక్సీ భామ హాట్ భామ  నభా నటేష్ నభా నటేష్ తాజాగా ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ చిత్రంలోని ఓ రొమాంటిక్ స్టిల్ ని విడుదల చేశారు . ఆ స్టిల్ లో హీరో రామ్ భుజాలపై కూర్చొని నభా నటేష్ ఇచ్చిన ఫోజు సంచలనం సృష్టిస్తోంది. అసలే అందాల భామ ఆపై మెడకు ఒత్తుకుంటూ , భుజాలపై కూర్చున్న తీరుకి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోవడం ఖాయం . రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ తో పాటుగా నిధి అగర్వాల్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఇద్దరు కంచులు తమ అందాలతో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తున్నారు . ఇక నభా అయితే వీర లెవల్లో రెచ్చిపోతు కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జులై 12 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ కు గతకొంత కాలంగా కలిసిరావడం లేదు. చేస్తున్న సినిమాలన్నీ ఘోరంగా దెబ్బ కొడుతున్నాయి. దాంతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే హీరోయిన్ ల అందాలను పందెంగా వేస్తున్నాడు. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2X91yNX

పవన్ ఓటమికి చిరంజీవే కారణమంటున్న రోజా

పవన్ ఓటమికి చిరంజీవే కారణమంటున్న రోజా పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి అలాగే జనసేన పార్టీ ఘోరంగా ఓటమి చెందడానికి ముమ్మాటికీ చిరంజీవి మాత్రమే అంటూ పెద్ద బాంబ్ పేల్చింది రోజా . నగరి అసెంబ్లీ స్థానం నుండి రెండోసారి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన రోజా కు మంత్రిపదవి వస్తుందని అనుకున్నారు కట్ చేస్తే రోజా కు మంత్రిపదవి లభించలేదు దాంతో షాక్ తిన్న రోజా రెండు రోజులు సెల్ ఫోన్ లు స్విచ్ఛాఫ్ చేసుకొని ఇంట్లోనే ఉండిపోయింది . రోజా అసంతృప్తితో ఉన్న విషయం గమనించి పిలిపించి మాట్లాడాడు జగన్ , దాంతో మళ్లీ యాక్టివ్ అయ్యింది రోజా . అయితే ఓ మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై అలాగే చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేసింది రోజా . చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి పెద్ద తప్పు చేసాడని అందుకే పవన్ కళ్యాణ్ ను జనాలు అంతగా నమ్మలేదని , జనసేన ఓటమి కి అలాగే పవన్ కళ్యాణ్ ఓటమికి చిరంజీవి మాత్రమే కారణమని కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది రోజా . చిరంజీవి కనుక ప్రజారాజ్యం ని కాంగ్రెస్ లో విలీనం చేయకపోతే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని , పవన్ కళ్యాణ్ ని కూడా నమ్...

పెళ్లి చేసుకోనంటున్న భామ

నేను పెళ్లి చేసుకోను , పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మా అమ్మానాన్న లను ఎవరు చూసుకుంటారు అంటూ ఎదురు ప్రశ్న వేస్తోంది హీరోయిన్ సాయి పల్లవి . ఈ భామ పై పలు పుకార్లు షికారు చేస్తున్న ఈ తరుణంలో నేను పెళ్లి చేసుకోను అంటూ స్టేట్ మెంట్ ఇచ్చి సంచలనం సృష్టిస్తోంది . తెలుగులో ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ భామకు ఆ తర్వాత అంతగా సక్సెస్ లు దక్కలేదు . తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటిస్తోంది ఈ భామ . అయితే తమిళంలో ఈ భామకు అంతగా విజయాలు దక్కడం లేదు . ఇక తెలుగులో కూడా పరాజయాలే పలకరిస్తున్నాయి దాంతో ఇక సాయి పల్లవి పెళ్లి చేసుకోవడం ఖాయమని పుకార్లు వస్తున్నాయి . ఇవి సాయి పల్లవి చెవిన పడటంతో నేను అసలు పెళ్లే చేసుకోను , పెళ్లి చేసుకుంటే మా అమ్మానాన్న లను ఎవరు చూసుకుంటారు అంటూ తింగరి ప్రశ్న వేస్తోంది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Kis2Gq

మాల్దీవ్స్‌లో పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న రామ్‌, పూరి జ‌గ‌న్నాథ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌`

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని , నిధి అగ‌ర్వాల్‌ , న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌`. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను రామ్‌, నిధి అగ‌ర్వాల్‌ల‌పై మాల్దీవుల్లో చిత్రీక‌రిస్తున్నారు. భాస్క‌ర భ‌ట్ల ర‌చించిన `లవ్‌` సాంగ్‌ను మాల్దీవుల్లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో ఈ పాట‌ను చిత్రీక‌రిస్తుండ‌టం విశేషం. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు, దిమాక్ ఖ‌రాబ్ అనే సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూలై 12న విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. న‌టీన‌టులు: రామ్ నిధి అగ‌ర్వాల్‌ న‌భా న‌టేష్‌ పునీత్ ఇస్సార్‌ స‌త్య‌దేవ్‌ ఆశిష్ విద్యార్థి గెట‌ప్ శ్రీను సుధాంశు పాండే త‌దిత‌రులు సాంకేతిక వ‌ర్గం: ఫైట్స్‌: రియ‌ల్ స‌...

మా పల్లెటూరిలో ఆ ప్రేమలు ఎటుపోయెనో

మా పల్లెటూరిలో ఆ ప్రేమలు ఎటుపోయెనో by kuna praveen from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WJ4BwQ

దాసరి కొడుకు అదృశ్యం వెనుక హస్తం ఎవరిది ?

దాసరి కొడుకు అదృశ్యం వెనుక హస్తం ఎవరిది ? స్వర్గీయ దాసరి నారాయణరావు పెద్ద కొడుకు ప్రభు అదృశ్యం అయ్యాడు . ఈనెల 9 న బయటకు వెళ్లిన దాసరి ప్రభు మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు దాంతో అన్ని చోట్లా వెతికిన తర్వాత పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు . తెలుగు చలనచిత్ర చరిత్రలో అజరామరమైన చిత్రాలను అందించి చరిత్ర సృష్టించిన వ్యక్తి , శక్తి దాసరి . దాసరి నారాయణరావు కు ఇద్దరు కొడుకులు కాగా పెద్ద కొడుకు దాసరి ప్రభు . ఈ ప్రభు కి రెండు పెళ్లిళ్లు అయ్యాయి . మొదటి నుండి భార్యాభర్తల మధ్య గొడవలు అధికం కావడంతో నిత్యం వివాదాలు జరుగుతూనే ఉన్నాయి . పదేళ్ల క్రితం దాసరి ప్రభు ని అతడి భార్య కిడ్నాప్ చేసినట్లుగా ప్రభు నే ప్రకటించాడు . అయితే ఇప్పుడు దాసరి ప్రభు అదృశ్యం వెనుక ఉన్న హస్తం ఎవరిదీ ? అన్న అనుమానం మొదలయ్యింది . దాసరి నారాయణరావు మరణించడంతో కుటుంబంలో ఆస్తుల వ్యవహారంలో వివాదాలు జరుగుతున్నాయి . ఆ వివాదాలే ప్రభు అదృశ్యం కు కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2F9OEF3

చంద్రబాబు పై నిప్పులు చెరిగిన జగన్

చంద్రబాబు పై నిప్పులు చెరిగిన జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నాయకుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగాడు . ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు మాట్లాడిన తీరుతో తీవ్ర ఆగ్రహానికి గురైన జగన్ అసలు మీకు ప్రతిపక్ష హోదా దక్కిందంటే నేను పెట్టిన బిక్ష . మీ మాదిరిగా నేను చేసి ఉంటే ఇప్పుడు మీ పార్టీలో ఎవరూ ఉండేవాళ్ళు కాదని సంచలన వ్యాఖ్యలు చేసాడు . మంత్రిపదవులు ఇస్తానని , లేకపోతె ప్రలోభాలకు గురి చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యేదని ప్రతిపక్ష హోదా వచ్చేది కాదని , చంద్రబాబు అక్కడ కూర్చొని ఉండేవాడు కాదని , ఎంతమంది మాతో టచ్ లో ఉన్నారో పేర్లు చెప్పాలా ? అంటూ ఆవేశంతో ఊగిపోయాడు . సభలో ప్రతిపక్షం ఉండాలి , మంచి సంప్రదాయాలు రావాలని నేను తాపత్రయపడుతున్నాను కానీ ఇవేమి మీకు పట్టడం లేదు అంటూ చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసాడు జగన్ . మొదటి సభలోనే అధికార ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉండబోతోందో చెప్పకనే చెబుతున్నారు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews h...

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, కె.ఎస్‌.ర‌వికుమార్‌, సి.క‌ల్యాణ్ కాంబినేష‌న్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన కొత్త చిత్రం

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి. క‌ల్యాణ్ నిర్మాత‌గా కొత్త చిత్రం గురువారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ హిట్ కాంబినేష‌న్‌లో `జైసింహా` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత రూపొందుతున్న చిత్ర‌మిది. ఈ కార్య‌క్ర‌మంలో ముహూర్త‌పు స‌న్నివేశానికి వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, బోయ‌పాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. కోదండ రామిరెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌మించారు. జూలై నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి ప‌రుచూరి ముర‌ళి క‌థ‌ను అందిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తుండ‌గా రామ్‌ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రామ్‌లక్ష్మ‌ణ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. చిన్నా ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.   నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ: సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్‌: హ్యాపీ మూవీస్‌ ద‌ర్శ‌క‌త్వం: కె.ఎస్‌.రవికుమార్‌ క‌థ‌: ప‌రుచ...

ఆగ‌స్ట్ 9న గ్రాండ్ రిలీజ్ అవుతున్న కింగ్ నాగార్జున `మ‌న్మ‌థుడు 2`

కింగ్ నాగార్జున‌ , ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం ` మ‌న్మ‌థుడు 2 `. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడు. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని , పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా గురువారం ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. నాగార్జున వ‌ర్జీన్ యువ‌కుడిగా బ‌య‌ట‌కు క‌న‌ప‌డతారు, కానీ మ‌రో ప‌క్క‌ అమ్మాయిల వెంట‌ప‌డే ఉమ‌నైజ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నారు. ఇలాంటి బోల్డ్ రోల్‌లో నాగార్జున న‌టించ‌డం ఇదే తొలిసారి. టీజ‌ర్‌ను చూస్తుంటే సినిమాను లావిష్‌గా తెర‌కెక్కించార‌ని అర్థ‌మ‌వుతుంది. సినిమాటోగ్ర‌ఫీ పెద్ద ఎసెట్‌గా క‌న‌ప‌డుతుంది. “ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే మళ్ళీ పూలు పూస్తాయా ??” “పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బాటింగ్ కు దిగుతున్నావ్!” టీజ‌ర్ చివ‌ర్లో ` ఐ డోంట్ ల‌వ్ ఆ ఓన్లీ మేక్ ల‌వ్ “ అనే చివ‌రి డైలాగ్ యూత్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంది. సింగిల్ షెడ్యూల్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. సీనియ‌ర్ న‌ట...

ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేష‌న్‌కు మెగాస్టార్ చిరంజీవి చేయూత

ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేష‌న్‌కు మెగాస్టార్ చిరంజీవి చేయూత అడగనిదే అమ్మ అయినా పెట్టదని అంటుంటారు. మెగాస్టార్ చిరంజీవి గారిని అడగకుండానే సినిమా జర్నలిస్టులను ఇంటికి ఆహ్వానించి మరీ వారి ఆరోగ్య భద్రతకు సహాయం చేశారు. మెగా మనసును చాటుకున్నారు. మార్చిలో ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ సభ్యులకు హెల్త్ కార్డులు, ఐడి కార్డులు అందజేసిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిగారిని ఆహ్వానించగా… ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణలో బిజీగా ఉండటం వలన రాలేనని తెలిపారు. అసోసియేష‌న్‌కు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి ‘ఫిల్మ్ న్యూస్‌ క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవిగారు, బుధవారం ఉదయం అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను ఆహ్వానించారు. అడ‌గ‌కుండానే తనవంతు సహాయం చేసి జ‌ర్న‌లిస్ట్‌ల‌ను ఆనందంలో ముంచెత్తారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “సినిమా ప్రముఖులకు, ప్రేక్షకులకు టెలివిజన్ మీడియా, వెబ్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులు వారధి లాంటివారు. ఈ జర్నలిస్టుల ఆరోగ్య భద్...

ఇండియాలో భారీగా విడుద‌ల‌వుతున్న క్రిస్ హెమ్‌స్వార్త్ మెన్ ఇన్ బ్లాక్ ఇంట‌ర్నేష‌న‌ల్..

ఇండియాలో భారీగా విడుద‌ల‌వుతున్న క్రిస్ హెమ్‌స్వార్త్ మెన్ ఇన్ బ్లాక్ ఇంట‌ర్నేష‌న‌ల్.. క్రిస్ హెమ్‌స్వార్త్, తెస్సా థాంప్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన హాలీవుడ్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ మెన్ ఇన్ బ్లాక్ ఇంట‌ర్నేష‌న‌ల్ జూన్ 14న ఇండియాలో భారీ స్థాయిలో విడుద‌ల కానుంది. ఈ అమెరిక‌న్ యాక్ష‌న్ అడ్వంచ‌ర్ ను ఎఫ్ గ్యారీ గ్రే తెర‌కెక్కించారు. ఇండియాలో త‌న సినిమా షూటింగ్ జ‌రుపుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని.. త‌న అనుభ‌వాన్ని పంచుకున్నారు హీరో క్రిస్ హెమ్‌స్వార్త్. హైద‌రాబాదీ బిర్యానీకి ఫ్యాన్ అయిపోయారు హీరో క్రిస్ హెమ్‌స్వార్త్. త‌మ దేశానికి వెళ్లిన త‌ర్వాత కూడా రోజూ ఈ బిర్యానిని ఆర్డ‌ర్ చేస్తున్న‌ట్లు తెలిపారు. రోజూ సెట్స్ కు వేల సంఖ్య‌లో వ‌చ్చే అభిమానులు కూడా త‌మ‌కు ఎంతో ఉత్సాహాన్ని తీసుకొచ్చాయ‌ని తెలిపారు క్రిస్ హెమ్‌స్వార్త్. త‌మ‌ను తాము రాక్ స్టార్స్ లా ఫీల్ అయ్యేలా అభిమానులు చేసార‌ని చెప్పారాయ‌న‌. మెన్ ఇన్ బ్లాక్ ఇంట‌ర్నేష‌న‌ల్ హిందీ, త‌మిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుద‌ల అవుతుంది. సోనీ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Rev...

అంజలి, లక్ష్మీ రాయి ప్రధానపాత్రల్లో ఆనంద భైరవి..!!

అంజలి, లక్ష్మీ రాయి ప్రధానపాత్రల్లో ఆనంద భైరవి..!! అంజలి , లక్ష్మీ రాయి ప్రధానపాత్రలో ఆదిత్ అరుణ్ ప్రత్యేక పాత్రలో “ ఆనంద భైరవి ” చిత్రం హరి వేన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఇటికేల రమేష్ రెడ్డి నిర్మాతగా రూపొందుతుంది.. కర్రీ బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది.. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఇటికేల రమేష్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ అందమైన విశాఖపట్నంలో ఓ అందమైన జంట అంజలి , ఆదిత్ అరుణ్ లపై దర్శకుడు కర్రీ బాలాజీ చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి.. పృథ్వీ, బహ్మాజి, గుండు సుదర్శన్, జయవాణి లపై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి.. భారీ వ్యయంతో ఎక్కడా రాజీ పడకుండా ఈ షెడ్యూల్ ని తీశామని, తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉంటుందని తెలియపరిచారు.. దర్శకుడు కర్రీ బాలాజీ మాట్లాడుతూ ఆనందిని పాత్రలో అంజలి ఒదిగిపోయారు, ఆ పాత్ర కోసం అంజలి చాల వర్క్ అవుట్స్ చేసి స్లిమ్ అయ్యారు.. ఆనందిని పాత్రని అంజలి ప్రేమించిన విధానం, ఒక ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా తన హావా భ...

తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అక్కడా.. ఇక్కడా కూడా బిజీ బిజీగా గడుపుతోంది తాప్సీ. బాలీవుడ్ లో ప్రస్తుతం రెండు..మూడు చిత్రాల్లో నటిస్తున్న తాప్సీ.. గేమ్ ఓవర్ అనే సినిమాతో మళ్లీ తెలుగు, తమిళ్ ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. జూన్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆమె ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

వ్యాంప్ కి , హీరొయిన్ కి తేడా లేదు …గరికపాటి

గారికపాటి నరసింహ రావు గారు ఈయన ఆధ్యాత్మికత బోధనలు చేస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ ఉంటారు . ఇటీవల ఈయన తన ప్రసంగం లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెసారు .అవి ఏంటంటే ఇప్పుడున్న హీరొయిన్ లకి , వ్యాంప్ పాత్రలకి  పెద్ద తేడ ఏమి లేదని ఐటెం సాంగ్స్ కుడా హీరోయిన్స్ చేసే స్థాయికి వారు దిగజారని అభిప్రాయపడ్డారు .    అంతె కదూ గతం లో ఇలాంటి పాత్రలు చేయడానికి జయమాలిని , జయలక్ష్మి లాంటి వారు ప్రత్యేకంగా ఉండే వారని కానీ ఇపుడు వాళ్ళ లోటును హీరొయిన్స్ భర్తీ చేస్తున్నారని , మన దురదృష్టం కొద్ది వాళ్ళని మనం సెలెబ్రిటీలుగా చూస్తున్నామని అభిప్రాయపడ్డారు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2IwLoEM

దక్షిణాన రాజీపడే ప్రసక్తే లెదు …తాప్సి

తాప్సి … మంచు మనోజ్ తో జుమ్మంది నాదం తో తెరంగ్రేటం చేసిన ఈ సొట్ట బుగ్గల సుందరి ఈ మద్య కాలంలో బాలీవుడ్లో వరుసగా సినిమాలు చెస్తున్న సంగతి తెలిసింది . అయితె తనకి బాషా సరిగా రాకపోయినా కుడా తను చాలా సంవత్సరాలు దక్షిణాదిన పని చేసానని ఇప్పటికి కుడా మంచి పాత్రలూ వస్తే మల్లి సౌత్లో సినిమాలు చేస్తానని చెప్పింది . దాదాపుగా తెలుగు , తమిళ పరిశ్రమలు తాప్సి ని మర్చిపోతున్న వేళా తాప్సి చేసిన ఈ వ్యాఖ్యలు విశేషతను సంతరించుకున్నాయి .మరి తాప్సి కోరుకున్న మంచి పాత్రలను మన దర్శకులు తన దగ్గరకి తీసుకువెళ్తారో లేదో వేచి చుడాలి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2I7DToP

బిగ్ బాస్ 3 లో తీన్మార్ సావిత్రి !

తెలుగునాట త్వరలోనే బిగ్ బాస్ 3 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే . కాగా ఆ షోలో తీన్మార్ సావిత్రి పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది . వి 6 ఛానల్ లో తీన్మార్ కార్యక్రమంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది సావిత్రి అలియాస్ జ్యోతి . బిత్తిరి సత్తి అక్కగా సావిత్రి తెలంగాణ మాండలికంలో చెప్పే డైలాగ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారన్న విషయం తెలిసిందే . బిత్తిరి సత్తి – సావిత్రి ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది బుల్లితెర మీద . సదరు ఛానల్ కు విపరీతమైన రేటింగ్ ని తెచ్చిపెట్టిన కార్యక్రమం ఈ తీన్మార్ . కాగా సావిత్రి అలియాస్ జ్యోతి బిగ్ బాస్ 3 లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది . నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో గుత్తా జ్వాల , వరుణ్ సందేశ్ , కమల్ కామరాజు , జాకీ తదితరులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2XFi0m2

హాట్ భామతో వెంకటేష్ రొమాన్స్

హాట్ భామ టబు తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు అది కూడా 28 ఏళ్ల తర్వాత . 1991 లో వెంకటేష్ – టబు జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ” కూలీ నెంబర్ 1 ” . తెలుగుతెరకు ఈ చిత్రం ద్వారానే హీరోయిన్ గా పరిచయమైంది టబు . కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత అంటే 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెంకటేష్ – టబు జంటగా నటించనున్నట్లు తెలుస్తోంది . బాలీవుడ్ లో విజయం సాధించిన దే దే ప్యార్ దే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా అదే సినిమాలో వెంకటేష్ – టబు భార్యాభర్తలుగా నటించనున్నారు . త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది . బాలీవుడ్ లో అజయ్ దేవ్ గన్ -టబు పోషించిన పాత్రలను వెంకీ – టబు పోషించనున్నారు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2wKyBcl

టైట్ మినీ స్కర్ట్ లో అన్ని కనబడుతున్నాయ్

  టైట్ మినీ స్కర్ట్ వేసుకొని అక్క పుట్టినరోజు వేడుకలకు హాజరై సంచలనం సృష్టించింది జాన్వీ కపూర్ . అనిల్ కపూర్ కూతురు హీరోయిన్ సోనం కపూర్ జన్మదిన వేడుకలు జూన్ 9 వ తేదీ రాత్రి జరిగాయి . కాగా ఆ వేడుకలలో పాల్గొనడానికి వచ్చింది జాన్వీ కపూర్ . ఈ భామ అసలే ట్రెండ్ సెట్టర్ అన్న విషయం తెలిసిందే . సరికొత్త ఫ్యాషన్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టే ఈ భామ టైట్ మినీ స్కర్ట్ అందునా వైట్ కలర్ వేసుకొని వచ్చింది . ఆ మినీ స్కర్ట్ లోంచి జాన్వీ అందాలు పర్ ఫెక్ట్ గా కనబడుతూ కుర్రాళ్ళ గుండెల్ని పిండేస్తున్నాయి . జాన్వీ అందాలను తమ సెల్ ఫోన్ లలో కెమెరాలలో బంధించారు . నయా ట్రెండ్ లకు వెల్కమ్ చెప్పే ఈ భామ అందాలను చూసుకోండని పందెంగా వస్తోంది , సవాల్ విసురుతోంది ఇలా . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2XCWwGn

నిజంగానే మహేష్ మళ్ళీ ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా ?

  మహర్షి చిత్రానికి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి తో వచ్చే ఏడాది మరో సినిమా చేయనున్నాడు మహేష్ బాబు అని వినిపిస్తోంది మహర్షి రిలీజ్ కి ముందునుండి . అయితే మహర్షి రిలీజ్ అయ్యింది భారీ వసూళ్లని సాధించింది కానీ అనుకున్నట్లుగా ఇది సాలిడ్ బ్లాక్ బస్టర్ కాదు పోస్టర్ మీద మాత్రమే వేసుకునే ఎపిక్ బ్లాక్ బస్టర్ అన్నమాట . ఈ సినిమాని కొన్న ఓవర్ సీస్ బయ్యర్ అలాగే రాయలసీమ బయ్యర్ లు నష్టపోయారు . అయినప్పటికీ మహర్షి సూపర్ హిట్ చిత్రం అంటూ ఊదరగొట్టేస్తున్నారు . అంతేనా సల్మాన్ ఖాన్ హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడు అంటూ ప్రచారం కూడా చేశారు . కట్ చేస్తే నేను రీమేక్ చేయడం లేదు అసలు మహర్షి చిత్రాన్నే చూడలేదు అంటూ షాక్ ఇచ్చాడు . కట్ చేస్తే ఇపుడేమో అనిల్ రావిపూడి సినిమా అయ్యాక మళ్ళీ వంశీ పైడిపల్లి తోనే సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు . దాంతో నిజంగానే మహేష్ బాబు వంశీ కి ఛాన్స్ ఇస్తాడా ? లేక సల్మాన్ ఖాన్ న్యూస్ లాగా ఊదరగొట్టడం కోసమేనా ? from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2wLIfvd

డ్రీమ్ టీమ్ బ్యాన‌ర్‌పై హ‌రినాథ్ పొలిచెర్ల `కెప్టెన్ రాణా ప్రతాప్‌` ఆడియో విడుదల

డ్రీమ్ టీమ్ బ్యాన‌ర్‌పై హ‌రినాథ్ పొలిచెర్ల ` కెప్టెన్ రాణా ప్రతాప్‌ ` ఆడియో విడుదల ద‌ర్శ‌క నిర్మాత హ‌రినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ` కెప్టెన్ రాణాప్ర‌తాప్‌ `. `ఎ జ‌వాన్ స్టోరి` క్యాప్ష‌న్‌. మిలిట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుంది. ఈ చిత్రంలో హ‌రినాథ్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను సీనియర్ హీరో సుమన్, బిగ్ ఆడియో సీడీని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా అమ‌ర్ నాథ్ మాట్లాడుతూ – “సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. సినిమాలో నా వంతు స‌హకారాన్ని అందించాను“ అన్నారు. హీరోయిన్ నిషి మాట్లాడుతూ – “చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను. హ‌రినాథ్‌గారికి థాంక్స్‌. తెలుగులో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌డం సంతోషంగా ఉంది. ఇక్క‌డ మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను“ అన్నారు. హీరోయిన్ జ్యోతిరెడ్డి మాట్లాడుతూ – “హ‌రినాథ్‌గారు ఓ గ్రంథం. ఓ డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌, రైట‌ర్‌, ఆర్టిస్ట్.. ఇలా అన్నీ రంగాల్లో త‌న‌వంతు ప్ర‌తిభ ఉన్న న‌టుడాయ‌న‌. ఆయ‌న ఓ మంచి సినిమా చేయాల‌నుకోవ‌డం.. అందులో మేమందరం భాగం కావ‌డం ఆనందంగా ఉంది. స...