Skip to main content

Posts

Showing posts from May, 2019

ప్రభాస్ ఆ మేజిక్ ని రిపీట్ చేస్తాడా ?

ప్రభాస్ హీరోగా నటించిన సాహో టీజర్ ని జూన్ 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రంజాన్ పండగ సందర్భాన్ని పురస్కరించుకొని సాహో టీజర్ ని రిలీజ్ చేయనున్నారు . 250 కోట్ల భారీ బడ్జెట్ తో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది . ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తున్న ఈ చిత్ర టీజర్ మొదట్లో వచ్చినప్పటికీ పూర్తిస్థాయి టీజర్ ని మాత్రం పవిత్ర రంజాన్ ని పురస్కరించుకొని విడుదల చేయనున్నారు . ఇక ఈ సినిమాని ఆగస్టు 15 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు . తెలుగు , హిందీ , తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . బాహుబలి . బాహుబలి 2 చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఆ మేజిక్ ని ప్రభాస్ రిపీట్ చేస్తాడా ? అన్న అనుమానం నెలకొంది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2XmT7LG

సమంత కు వెటకారం ఎక్కువే !

సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ” ఓ బేబీ ” కొరియన్ సినిమా ” మిస్ గ్రానీ ” కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఓ బేబీ చిత్రంలోని టైటిల్ సాంగ్ ని నిన్న సాయంత్రం విడుదల చేసారు . ఈ టైటిల్ సాంగ్ చూస్తుంటే సమంత కు ఎంత వెటకారం ఉందో ఇట్టే అర్ధమైపోతుంది . తన క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో ఈ పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేసారు దర్శకురాలు నందిని రెడ్డి . నందిని రెడ్డి దాదాపు రెండేళ్ల తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఓ బేబీ . నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ప్రతీ చిత్రం రీమేక్ లేదంటే ఫ్రీమేక్ అయి ఉంటుంది తప్ప స్ట్రైట్ చిత్రం ఇంతవరకు చేయలేదు . ఇక ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా కూడా కొరియన్ రీమేక్ కావడం విశేషం . మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నాగశౌర్య , రావు రమేష్ , లక్ష్మి తదితరులు నటించారు . వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత ఓ బేబీ తో ఆ ఫీట్ ని కంటిన్యూ చేస్తుందా చూడాలి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2QDlouW

హిప్పీ తో హిట్ కొడతాడా ?

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో కార్తికేయ తాజాగా హిప్పీ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . జూన్ 6 న హిప్పీ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది . ఇక నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది . టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ థాను నిర్మిస్తుండటం విశేషం . ఇక ఈ సినిమా కూడా ఆర్ ఎక్స్ 100 లాగే అడల్ట్ కంటెంట్ తో  సాగిపోయేలా ఉంది . ప్లే బాయ్ గా కార్తికేయ నటిస్తున్నాడు . దాంతో ఈ సినిమా యూత్ ని నచ్చేలా తీర్చిదిద్దామని అంటున్నారు హిప్పీ చిత్ర బృందం . దిగంగన , జజ్బా సింగ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు . ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అందాలను ఆరబోయడమే కాకుండా శృంగార సన్నివేశాలలో రెచ్చిపోయి నటించారు .  from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Kjeav8

నాని కి మరో ప్లాప్ తప్పదా ?

హీరో నాని తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది . శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ కావడంతో అప్పటి నుండి ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి హీరోలందరూ భయపడుతున్నారు . ఎంతమంది హీరోలను కలిసినా శ్రీకాంత్ కు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు అయితే నాని మాత్రం ధైర్యం చేసి ఛాన్స్ ఇస్తున్నాడు . దాంతో నానికి మరో ప్లాప్ తప్పదని అంటున్నారు . ఇప్పటికే జెర్సీ చిత్రంతో కొంత ఇబ్బంది పడ్డాడు నాని . జెర్సీ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ , విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు దాంతో నాని మార్కెట్ కి కొద్దిగా దెబ్బ పడింది . ఇక ఇప్పుడేమో ప్లాప్ డైరెక్టర్ తో సినిమా అంటే మరో ప్లాప్ తప్పదేమో ! అనిపిస్తోంది . నాని ధైర్యం చేసి ఛాన్స్ ఇస్తున్నందుకు హిట్ అయితే మంచిదే లేకపోతేనే ఇబ్బంది పాపం . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WCPP9Y

దేవిశ్రీ ప్రసాద్ పై ఆగ్రహంగా ఉన్న మహేష్ ఫ్యాన్స్

సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు . ఇంతకీ మహేష్ ఫ్యాన్స్ కు దేవిశ్రీ ప్రసాద్ మీద కోపం ఎందుకో తెలుసా ……. ….. వరుసగా మహేష్ బాబు తో సినిమాలు చేస్తున్నాడు దేవి కానీ చిరస్థాయిగా నిలిచిపోయే పాటలుమాత్రం ఇవ్వలేకపొతున్నాడు పైగా మహర్షి చిత్రంలో పదర పదరా పదరా అనే పాట తప్ప మిగతావి ఆకట్టుకునేలా లేవు దాంతో మహేష్ బాబు తదుపరి సినిమాలో దేవి కి ఛాన్స్ ఇవ్వొద్దు అని విమర్శలు గుప్పిస్తున్నారు . అయితే ఈ విమర్శలు దేవి చెవిన పడ్డట్లున్నాయి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఒక లవ్ సాంగ్ , ఒక ఐటెం సాంగ్ చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు ఇస్తానని హామీ ఇచ్చాడు . మరి దేవి ఆ హామీని నిలబెట్టుకుంటాడా ? చూడాలి . సరిలేరు నీకెవ్వరు జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2KgGCgZ

మూడు సినిమాలు ప్లాప్

నిన్న రిలీజ్ అయిన మూడు సినిమాలు కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయాయి . నిన్న రిలీజ్ అయిన చిత్రాల్లో సూర్య నటించిన ” ఎన్ జి కే ” , విశ్వక్ సేన్ నటించిన ” ఫలక్ నుమా దాస్ ” , తమన్నా – ప్రభుదేవా నటించిన ” అభినేత్రి 2 ” చిత్రాలు ఉన్నాయి . ఇక వీటిలో ఫలక్ నుమా దాస్ కు యువత ఫిదా అవుతున్నారు కాస్త , మిగతా సినిమాలు మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి . సూర్య నటించిన NGK మాత్రం డిజాస్టర్ అయ్యింది , అంతేకాదు ఓపెనింగ్స్ దారుణంగా ఉన్నాయి ఈ చిత్రానికి . సూర్య స్టార్ హీరో తమిళనాట ఓకే కానీ తెలుగులో మాత్రం NGK థియేటర్ లన్ని వెలవెలబోయాయి . యునానిమస్ గా ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది . ఇక ఆ తర్వాత తమన్నా – ప్రభుదేవా జంటగా నటించిన అభినేత్రి 2 చిత్రానికి కూడా ప్లాప్ టాక్ వచ్చింది . అయితే ఫలక్ నుమా దాస్ చిత్రం మాత్రం బిసి కేంద్రాల్లో కొద్దిగా బెస్ట్ అనిపించేలా కనబడుతోంది . ఇది కూడా ప్లాప్ జాబితాలో చేరింది కాకపోతే గుడ్డిలో మెల్ల లాగా మిగతా చిత్రాలకంటే కొద్దిగా బెటర్ అన్నమాట . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Mi3YFA

మేకప్ లేకుండా వచ్చి భయపెట్టిన కాజల్

కాజల్ అగర్వాల్ తాజాగా మేకప్ లేకుండా వచ్చి భయపెట్టింది . మేకప్ వేసుకోకుండా దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసి షాక్ ఇచ్చింది కాజల్ . అయితే ఈ ఫోటోకు ఓ క్యాప్షన్ కూడా పెట్టింది . మేకప్ వేసుకోకుండా ఇలా దర్శనం ఇస్తేనే నిజమైన సౌందర్యం అని హితబోధ చేస్తోంది . నిజమే కాజల్ అగర్వాల్ చెప్పింది అక్షరాలా నిజం కాకపోతే హీరోయిన్ లను కానీ అందమైన అమ్మాయిలను కానీ మేకప్ లేకుండా చూస్తే తట్టుకోగలమా ? మేకప్ తో చూసి చూసి ఒక్కసారిగా మేకప్ లేకుండా కనిపిస్తే దడుసుకోవడం ఖాయం . కాజల్ అగర్వాల్ ఫోటోలు చూస్తే అలాగే ఉంది పరిస్థితి . ఈ భామ ఇటీవలే సీత అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది , అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందింది . సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ కాజల్ అగర్వాల్ తన క్యారెక్టర్ ని బాగా పోషించింది అన్న పేరు మాత్రం వచ్చింది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2EMLbMo

13 ఏళ్ల తర్వాత మళ్ళీ నటిస్తున్న విజయశాంతి

లేడీ సూపర్ స్టార్ గా లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి స్టార్ హీరోలకు ధీటుగా ఇమేజ్ ని క్రేజ్ ని సొంతం చేసుకుంది . అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమాలకు దూరం అయ్యింది కట్ చేస్తే 13 సంవత్సరాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది . ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎమోషనల్ అయిన విజయశాంతి ఓ ప్రకటన జారీ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది . కృష్ణ నటించిన ఖిలాడీ చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నేను మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది . పార్లమెంట్ సభ్యురాలిగా సేవలందించిన విజయశాంతి రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది దాంతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Xhxbl2

జూనియర్ ఎన్టీఆర్ ని వివాదంలోకి లాగుతున్నారు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయ్యాయి , తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది దాంతో కొంతమందికి కావాల్సినంత పని దొరికింది నందమూరి – నారా కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి . ఇక ఈ విషయంలో అందరికంటే ముందున్నాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ . ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ని పలుమార్లు వివాదంలోకి లాగడానికి ప్రయత్నించిన వర్మ తాజాగా మరోసారి ఎన్టీఆర్ పై ట్వీట్ చేసి సంచలనం సృష్టిస్తున్నాడు . తాతకు తగ్గ వారసుడుగా రాణించాలంటే తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టు లేకపోతే తెలుగుదేశం పార్టీ కనుమరుగు అవడం ఖాయం అంటూ జూనియర్ ని రెచ్చగొడుతున్నాడు . మామయ్య వెన్నుపోటు బాబాయ్ ముందుపోటు తో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని , నువ్ టీడీపీ పగ్గాలు చేపడితే తెలుగుదేశం పార్టీని కాపాడవచ్చని లేదంటే పచ్చ పార్టీ కనుమరుగు అవడం ఖాయమని అంటున్నాడు . అంటే ఇలా వ్యాఖ్యానించడం ద్వారా ఎన్టీఆర్ ని వివాదం లోకి లాగుదామనే భావిస్తున్నాడు వర్మ . ఉన్నపలంగా తెలుగుదేశం పార్టీ పగ్గాలు నాకు ఇవ్వంటే చంద్రబాబు ఇస్తాడా ఏంటి ? లోకేష్ బాబు ఏమంటాడు ? బాలయ్య బాబాయ్ ఏమంటాడు ?ఎలా రియాక్ట్ అవుతారో ? ఎంత పెద్ద తతంగం . from టాప్ స్టోరీస్ – Telugu Movie R...

సల్మాన్ ని రిజెక్ట్ చేస్తున్న భామ

సల్మాన్ ఖాన్ తో ఇప్పుడంటే నటించాను కానీ ఇకపై అతడితో నటించేది లేదు అంటూ కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది హాట్ బ్యూటీ దిశా పటాని . చీటికీ మాటికీ అందాలను ఆరబోస్తూ సంచలనం సృష్టిస్తున్న ఈ భామ తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భారత్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది . అయితే దిశా పటాని కి అంతగా ప్రాముఖ్యత లేకపోవడం ఒక కారణం అయితే ప్రమోషన్ లలో కూడా ఎక్కడా దిశా ని పిలవడం లేదట ! దాంతో ఇకపై సల్మాన్ ఖాన్ చిత్రాల్లో నటించేది లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది . ఇక అందుకు కారణం కూడా చెబుతోంది సల్మాన్ ఖాన్ కు నాకు వయసు రీత్యా చాలా తేడా ఉంది అది స్క్రీన్ పైన కూడా కనిపిస్తోంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటోంది కానీ అసలు విషయం ఏంటంటే దిశా బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ వద్దని ఉంటాడు . ఈ ఇద్దరు ప్రేమ పక్షులు కదా అందుకు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WlLyZr

అభినేత్రి 2 కూడా ప్లాప్ జాబితాలో

ఈరోజు మూడు సినిమాలు విడుదల కాగా సువర్ణ సుందరి అనే సినిమా రిలీజ్ ఆగిపోయింది . ఇక అందులో అభినేత్రి 2 కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది . తమన్నా , ప్రభుదేవా నందితా శ్వేత కలిసి నటించిన చిత్రం అభినేత్రి 2 . తమిళ దర్శకులు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది . పెద్దగా పబ్లిసిటీ లేకుండానే విడుదలైన ఈ చిత్రం కు ప్లాప్ టాక్ వచ్చేసింది . అభినేత్రి యావరేజ్ కావడంతో దానికి సీక్వెల్ గా అభినేత్రి 2 చేసారు . ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ జరుపుకుందో తెలీదు కానీ సడెన్ గా టీజర్ తో ముందుకు వచ్చారు . కట్ చేస్తే ఈరోజు విడుదల కూడా అయ్యింది . అయితే తమన్నా , నందితా శ్వేత , ప్రభుదేవా ల నటన బాగున్నప్పటికీ కథనం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో డిజాస్టర్ గా తేల్చేస్తున్నారు ప్రేక్షకులు . మొత్తానికి మూడు సినిమాలు రిలీజ్ అయితే అందులో ఫలక్ నుమా దాస్ మాత్రమే కాస్త బెటర్ గా ఉంది . మిగతావి హామ్ ఫట్ . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2YSzCem

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ‘కార్తికేయ – 2 ‘

2014 లో యువకథానాయకుడు నిఖిల్ , స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘ కార్తికేయ ‘ చిత్రం విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో విదితమే. అప్పటినుంచే ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ – 2 ‘ చిత్రం రూపొందనుందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికది నిజమవుతోంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం ను ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని కథానాయకుడు నిఖిల్ పుట్టినరోజు జూన్ 1 సందర్భంగా అధికారికంగా వెల్లడి చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ..’నిఖిల్ హీరోగా దర్శకునిగా నా తొలి చిత్రం ‘కార్తికేయ’ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో మా కాంబినేషన్ లో రూపొందనున్న ‘కార్తికేయ – 2 ‘ చిత్రం పై అంచనాలు అధికంగానే ఉంటాయన్న ది వాస్తవం. దీనికి తగినట్టుగానే ఈ చిత్రం ఉంటుంది. ‘కార్తికేయ’ కు కొనసాగింపుగా ‘కార్తికేయ – 2 ‘ ఉంటూనే కధా,కధనాల విషయంలో సరికొత్తగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ సీక్వెల్ ఈచిత్రం అన్నారు. ‘ కార్తికేయ –...

“స్టూవర్టుపురం” మూవీ ట్రైలర్ ని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన క్రేజీ దర్శకుడు సుకుమార్…

అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో గూఢచారి ఫేమ్ ప్రీతి సింగ్ ప్రధానపాత్రలో సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ స్టూవర్టుపురం “. ప్రస్తుతం ఈ చిత్రం యు/ఏ సెర్టిపికెట్ తో సెన్సార్ పూర్తి చేసుకొని జూన్ 14 న విడుదలకు సిద్ధమౌతున్నది. ఈ సందర్బంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేసారు. అనంతరం సుకుమార్ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా ఆసక్తి కలిగిస్తుంది. దర్శకుడు సత్యనారాయణ చాలా కొత్త ఐడియా తో ఈ సినిమాను తెరకెక్కించాడు. పైగా ఈ సినిమాకు ఆయన ఒక్క దర్శకుడు మాత్రమే కాకుండా ఎడిటింగ్, కెమెరా ఇలా ఆల్ రౌండర్ గా పనిచేసి చాలా తక్కువ సమయంలో సినిమా చేసాడు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఈ టీం కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు. సమర్పకుడు రంజిత్ కోడిప్యాక మాట్లాడుతూ …ప్రముఖ దర్శకుడు సుకుమార్ గారికి మా ధన్యవాదాలు. మా సినిమా ట్రైలర్ విడుదల చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు.గతంలో మా బ్యానర్ లో నిర్మించిన నందికొండ వాగుల్లోనా, మోని చిత్రాల దర్శకుడు సత్యనారాయణ ఏకారి అద్భుతంగా తెర...

డ్రీమ్ టీమ్ బ్యాన‌ర్‌పై హ‌రినాథ్ పొలిచెర్ల `కెప్టెన్ రాణా ప్రతాప్‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ద‌ర్శ‌క నిర్మాత హ‌రినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `కెప్టెన్ రాణాప్ర‌తాప్‌`. `ఎ జ‌వాన్ స్టోరి` క్యాప్ష‌న్‌. మిలిట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుంది. ఈ చిత్రంలో హ‌రినాథ్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. జ‌వాన్ లుక్‌లోని హ‌రినాథ్ పొలిచెర్ల లుక్‌ను ఫ‌స్ట్ లుక్‌గా విడుద‌ల చేశారు. మూడు షెడ్యూల్స్‌లో సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. జూన్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. చ‌ర‌ణ్‌-ష‌కీల్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వంశీ ప్ర‌కాష్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. న‌టీన‌టులు: హ‌రినాథ్ పొలిచెర్ల‌ సుమ‌న్‌ పునీత్ ఇస్సార్‌ షాయాజీ షిండే అమిత్‌ జ్యోతిరెడ్డి నిషి గిరి త‌దిత‌రులు సాంకేతిక వ‌ర్గం క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: హ‌రినాథ్ పొలిచెర్ల‌ బ్యాన‌ర్‌: డ్రీమ్ టీమ్‌ మ్యూజిక్: చ‌ర‌ణ్‌-ష‌కీల్‌ కెమెరా: వ‌ంశీ ప్ర‌కాశ్‌ ఎడిట‌ర్‌: వెంక‌ట ర‌మ‌ణ‌ ఆర్ట్‌: గోవింద్‌ కాస్ట్యూమ్స్‌: జ‌న‌క ముని from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2HKVN0m

NGK తో మళ్ళీ దెబ్బ తిన్న సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య కు గతకొంత కాలంగా కాలం కలిసి రావడం లేదు , చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతూనే ఉన్నాయి . ఇప్పటికే వారు ప్లాప్ లతో రేసులో వెనుకబడిన ఈ హీరో తాజాగా ఎన్ జి కే తో మరోసారి దెబ్బతిన్నాడు . సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన NGK ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది . సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి నటించగా కీలక పాత్రలో జగపతిబాబు నటించాడు . కాగా ఈ సినిమా కి అసలే క్రేజ్ లేకుండా పోయింది , అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా ఉండటంతో సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ వస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అని అనుకున్నారు కానీ ఈ చిత్రానికి ఏకంగా ప్లాప్ టాక్ వచ్చేసింది . డివైడ్ టాక్ వస్తే ప్రమోషన్ తోనో లేక మరో కారణంగానో హిట్ టాక్ తెచ్చుకోవచ్చు కానీ ఏకంగా ప్లాప్ టాక్ వచ్చింది కాబట్టి ఎన్ జి కే ను కాపాడటం కష్టమే ! from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2HLDVCu

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎస్‌విసి, జిఎంబి, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భారీ చిత్రం ప్రారంభం

సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న భారీ చిత్రం ‘ సరిలేరు నీకెవ్వరు ‘. ఈ చిత్రం ప్రారంభోత్సవం సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు (మే 31) అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టగా, మెగా మేకర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, దిల్‌ రాజు సంయుక్తంగా స్క్రిప్ట్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడికి అందించారు. ఫస్ట్‌షాట్‌ను అనిల్‌ రావిపూడి దేవుడి పటాలపై చిత్రీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో… ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ – ”ఈ రోజు మే 31 సూపర్‌ స్టార్‌ కృష్ణగారి పుట్టిన రోజు సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు 26వ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ప్రారంభం అయ్యింది. దిల్‌ రాజు, అనిల్‌ రావిపూడి సహకారంతో అభిమానులకు, రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు అదిరిపోయే రేంజ్‌ లో సంక్రాంతికి విడుదల చేస్తున...

NGK రివ్యూ

NGK రివ్యూ నటీనటులు : సూర్య , రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి సంగీతం : యువన్ శంకర్ రాజా నిర్మాత : ఎస్ ఆర్ ప్రభు , ప్రకాష్ బాబు ఎస్ ఆర్ దర్శకత్వం : సెల్వ రాఘవన్ రేటింగ్ : 2/ 5 రిలీజ్ డేట్ : 31 మే 2019 సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” ఎన్ జి కే ” . రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి , జగపతిబాబు తదితరులు నటించిన ఈ రాజకీయ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా? లేదా ?అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . కథ : నందగోపాల్ (సూర్య ) ఉన్నత చదువులు చదివినప్పటికీ వ్యవసాయం మీద మక్కువతో ఉద్యోగం వదిలేసి ఊరికి చేరుకుంటాడు . స్వతహాగా ప్రజా సమస్యలపై నిత్యం స్పందించే నందగోపాల్ రాజకీయాల్లోకి వెళితేనే ప్రజలకు సరైన న్యాయం చేయగలమని భావించి రాజకీయాల్లోకి వస్తాడు . అయితే మంచి చేయాలనీ రాజకీయాల్లోకి వచ్చిన నందగోపాల్ కు రాజకీయాల్లో ఉన్న జాడ్యం ఏంటి అన్నది తెలిసిందా ? దానికోసం నందగోపాల్ ఏమి చేసాడు ? చివరకు తన లక్ష్యాన్ని చేరుకున్నాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . హైలెట్స్ : సూర్య రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ సాయి పల్లవి డ్రా బ్యాక్స్ : స్క్రీన్ ప్లే ...

సల్మాన్ ఖాన్ భారత్ సినిమాపై వివాదం

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ” భారత్ ” చిత్రంపై వివాదం నెలకొంది . జూన్ 5 న భారత్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ వివాదం నెలకొంది దాంతో గందరగోళంగా మారింది వ్యవహారం . భారత్ అనే పేరుని సినిమాకు ఎలా వాడతారని ప్రశ్నిస్తూ విపిన్ త్యాగి అనే వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు . భారత్ పేరుని బిజినెస్ కోసం వాడొద్దని హితువు పలుకుతున్నాడు . ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ పేరు భారత్ కావడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు విపిన్ త్యాగి . భారత్ పేరు వెంటనే మార్చాలని , సినిమా విడుదల ఆపేయాలని అంటున్నాడు . రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో ఈ వివాదం అంటే అటు దర్శక నిర్మాతలకు ఇటు బయ్యర్లకు కూడా ఇబ్బందే ! అయితే ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి .సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ నటించిన భారత్ జూన్ 5 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2YWFQd5

ప్రీమియర్ షోలు వేసి దెబ్బతిన్నాడా ?

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ ‘ ఫలక్ నుమా దాస్ ” . ఈరోజు విడుదల కాగా నిన్ననే ప్రీమియర్ షోలు వేసాడు ఈ హీరో . అతినమ్మకంతో షోలు వేసి దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది చూస్తుంటే . ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ , సెకండాఫ్ లో మాత్రం విశ్వక్ సేన్ తేలిపోయాడు దాంతో ఈ సినిమాకు యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది . ఫలక్ నుమా దాస్ సినిమాపై బాగా నమ్మకం పెట్టుకున్న ఈ హీరో అతితో ప్రీమియర్ షోలు వేసాడు . టీజర్ , ట్రైలర్ లు బాగా సక్సెస్ కావడంతో ప్రీమియర్ షోలు అన్ని కూడా ఫుల్స్ అయ్యాయి . కానీ ప్రీమియర్ షోల టాక్ మాత్రం బాగోలేదు . యావరేజ్ అని తేల్చేశారు ప్రీమియర్ షో చూసిన వాళ్ళు . అయితే యువతకు మాత్రం ఈ సినిమా నచ్చేలా ఉంది . అది హిట్ కావడానికి సరిపోతుందా ? అంటే డౌటే ! from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Mk2D18

తీవ్ర ఉద్రిక్తత : సూర్య కటౌట్ కూల్చివేత

స్టార్ హీరో సూర్య భారీ కటౌట్ కూల్చివేతలో తమిళనాడు లోని తిరుత్తణి లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సూర్య నటించిన ” ఎన్ జి కే ” చిత్రం విడుదల అవుతుండటంతో ప్రపంచంలోనే పెద్దదైన కటౌట్ ని ఏర్పాటు చేసారు తిరుత్తణి లోని సూర్య అభిమానులు . 215 అడుగుల ఎత్తు ఉన్న ఈ కటౌట్ ని అనుమతి లేదని పైగా రోడ్డు పక్కనే ఉందనే కారణంతో అధికారులు సూర్య కటౌట్ ని తొలగించారు . 7 లక్షల వ్యయంతో భారీ కటౌట్ ని ఏర్పాటు చేస్తే ఇలా సినిమా రిలీజ్ రోజున కటౌట్ ని తొలగించడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు . అంతేకాదు తిరుత్తణి లో గలాటకు దిగారు కూడా . ఫ్యాన్స్ హడావుడి ఎక్కువ కావడంతో పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారు . పోలీసులు సూర్య అభిమానులపై లాఠీ ఛార్జ్ చేయడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2XfaH41

తమిళ బిగ్ బాస్ 3 లో శ్రీరెడ్డి ?

కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సంచలనం సృష్టించిన భామ శ్రీ రెడ్డి కాగా ఈ భామ తమిళ బిగ్ బాస్ 3 లో పార్టిసిపేట్ చేయనున్నట్లు తెలుస్తోంది . తెలుగు బిగ్ బాస్ లో పాల్గొనాలని భావించింది శ్రీరెడ్డి అయితే కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది టాలీవుడ్ పైనే కావడంతో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న వాళ్ళు శ్రీ రెడ్డి ని తీసుకోవడానికి అంగీకరించడం లేదు దాంతో తమిళనాట ట్రై చేసింది సక్సెస్ అయ్యింది . కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్ 3 లో శ్రీ రెడ్డి పాల్గొన్నట్లుగా తెలుస్తోంది . త్వరలోనే తమిళ బిగ్ బాస్ స్టార్ట్ కానుంది . ఇక తెలుగులో కూడా రంగం సిద్ధం అవుతోంది , రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఫైనల్ లిస్ట్ మాత్రం రాలేదు . టాలీవుడ్ లో వివాదాన్ని రాజేసిన శ్రీరెడ్డి కోలీవుడ్ లో ఏం చేస్తుందో ఏమో ! from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2W5KXWs

మహేష్ కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు ప్రారంభం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం ” సరిలేరు నీకెవ్వరు ” ఈరోజు ప్రారంభమైంది . ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో మహేష్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2020 జనవరిలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈ చిత్రాన్ని అనిల్ సుంకర , దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు .   ఇటీవలే మహర్షి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి కి ఛాన్స్ ఇచ్చాడు . అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ కావడంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక యధావిధిగా మహేష్ బాబు ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనలేదు సెంటిమెంట్ ప్రకారం . రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2wrewaO

ఫలక్ నుమా దాస్ రివ్యూ

నటీనటులు : విశ్వక్ సేన్ , తరుణ్ భాస్కర్ , హర్షిత సంగీతం : వివేక్ సాగర్ నిర్మాతలు : కరాటే రాజు , మనోజ్ , సందీప్ దర్శకత్వం : విశ్వక్ సేన్ రేటింగ్ : 2. 5/ 5 రిలీజ్ డేట్ : 31 మే 2019   టీజర్ , ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేలా చేసిన విశ్వక్ సేన్ ఫలక్ నుమా దాస్ చిత్రాన్ని పూర్తి నమ్మకంతో ఒకరోజు ముందుగానే షో వేసాడు . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే . కథ : దాస్ ( విశ్వక్ సేన్ ) ఫలక్ నుమా లో పుట్టి పెరిగినోడు , చిన్నప్పుడే శంకరన్న ని చూసి పెద్దయ్యాక నేను కూడా ఓ గ్యాంగ్ నడిపియ్యాలని అనుకుంటడు . అదే ఏరియాలో సఖి ని చూసి ప్రేమిస్తాడు . అయితే అనూహ్యంగా శంకరన్న ని ఓ గ్యాంగ్ చెంపేస్తుంది దాంతో శంకరన్న ని చంపిన వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తాడు దాస్ . ఇంతలో ఓ హత్య కేసులో దాస్ ని ఇరికిస్తారు , దాంతో ఆ కేసు నుండి బయట పడటానికి దాస్ ఏం చేసాడు ? కేసు నుండి బయట పడ్డాడా ? ఫలక్ నుమా దాస్ మాస్ కి దాస్ అనిపించుకున్నాడా ? లేదా ? తెలియాలంటే సినిమా చూడాల్సిందే . హైలెట్స్ : విశ్వక్ సేన్ తరుణ్ భాస్కర్ కామెడీ నేచురల్ డైలాగ్స్ ...

ప్లాప్ అని ఒప్పుకున్నాడు

ఎబిసిడి చిత్రం మేము ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు , ఆ సినిమా ప్లాప్ అంటూ అసలు విషయాన్నీ ఒప్పుకున్నాడు హీరో అల్లు శిరీష్ . సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ – యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎబిసిడి . ఈనెల 17 న విడుదలైన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి తేడా కొట్టింది దాంతో ప్లాప్ అయ్యింది . అయితే ఈ విషయాన్నీ నిజాయితీగా ఒప్పుకోవడం అల్లు శిరీష్ గొప్పతనమే ! ఎందుకంటే సినిమా ప్లాప్ అయినప్పటికీ హిట్ అంటూ ప్రచారం చేసుకునే వాళ్ళు ఉన్న ఈరోజుల్లో నా సినిమా ఆడలేదు అంటూ చెప్పడం గొప్పతనమే మరి . అల్లు శిరీష్ అల్లు అర్జున్ లా స్టార్ డం తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు కానీ కుదరడం లేదు . ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి అంతగా కలిసి రావడం లేదు పాపం ఈ హీరోకు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Z45gpt

ఎన్ జి కే ఓపెనింగ్స్ ఇంత దారుణమా ?

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఎన్ జి కె రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది . అయితే ఈ సినిమా పట్ల అంతగా సానుకూలంగా లేరు ప్రేక్షకులు దాంతో ఈ సినిమాకు ఓపెనింగ్ బుకింగ్స్ లేకుండా పోయాయి . సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు అలా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేయగానే ఇలా ఫుల్స్ అయిపోతాయి కానీ సూర్య ఎన్ జి కే కు మాత్రం అడ్వాన్స్ బుకింగ్ చాలా చాలా దారుణంగా ఉన్నాయి . దీనికి కారణం సూర్య నటించిన చిత్రాలు గతకొంత కాలంగా ప్లాప్ అవుతూ ఉండటమే ! దానికి తోడు ఈ సినిమాకు అస్సలు బజ్ లేదు ఇంకేముంది ఎన్ జి కే చిత్రానికి ఓపెనింగ్స్ లేకుండాపోయాయి . రేపు సినిమా రిలీజ్ అయి టాక్ బాగుంటే తప్ప సినిమా ప్లాప్ అవ్వడం ఖాయమే అని అంటున్నారు . టాక్ బాగుంటే టికెట్స్ తెగుతాయి లేదంటే ఇది కూడా ప్లాప్ జాబితాలో చేరడం ఖాయం . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2HIOzdg

మహేష్ బాబు పై సెటైర్ వేసిన యంగ్ హీరో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పై సెటైర్ వేసాడు యంగ్ హీరో విశ్వక్ సేన్ . మహర్షి చిత్ర విజయోత్సవ వేడుకలో మహేష్ బాబు కాలర్ ఎగరేసి సంచలనం సృష్టించాడు అయితే నిజానికి ఆ కాలర్ ఎగరేయాల్సింది నేను అని కానీ మరొకరు ఎగరేశారు కాబట్టి నేను కాలర్ ఎగరేయడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు విశ్వక్ సేన్ . ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ” ఫలక్ నుమా దాస్ ” . రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది ఈ చిత్రం . అయితే సినిమా నేను ముందుగానే చూసుకున్నాను అలాగే మరికొంతమంది కూడా చూసారు తప్పకుండా సూపర్ హిట్ కొట్టబోతున్నాం అంటూ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసాడు . అంతేకాదు హిట్ అయ్యాక కాలర్ ఎగరేద్దామనుకున్నా కానీ ఈలోపే మరొకరు ఎగరేశారు కాబట్టి నేను ఆ పని చేయను అంటూ పరోక్షంగా మహేష్ బాబు ని ఉదహరించారు విశ్వక్ సేన్ . ఇక ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతోందో రేపు తెలిసిపోనుంది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WeGHZX

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్

  సాహో చిత్రం నుండి ముగ్గురు సంగీత దర్శకులు తప్పుకోవడం సంచలనం అయ్యింది . ఆగస్టులో రిలీజ్ అని డేట్ కూడా ప్రకటించుకున్నాక సంగీతం నుండి తప్పుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు . సంగీత దర్శకులు తప్పుకోవడంతో సాహో ఆగస్టులో రిలీజ్ అవుతుందా ? అని నిరాశలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు ఆ చిత్ర బృందం . సాహో టీజర్ జూన్ 5 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు . దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి . నిరాశలో ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పడంతో పరవశించి పోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ . అంతేకాదు ఆగస్టు 15 న సాహో రిలీజ్ అవ్వడం ఖాయమని అంటున్నాడు దర్శకుడు సుజిత్ . ఇప్పటికే సాహో చిత్రం పై భారీ అంచనాలున్నాయి , ఇక టీజర్ తో ఆ అంచనాలు మరింతగా పెరగడం ఖాయం . ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటించగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2I6MUNA

దొరసాని ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్

శివాత్మిక – ఆనంద్ దేవరకొండ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం దొరసాని . మహేంద్ర దర్శకత్వంలో మధుర శ్రీధర్ – యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర బృందం దొరసాని చిత్రంపై అంచనాలు పెంచేలా చేసారు . శివాత్మిక దొరసాని లుక్ లో చాలా బాగుంది , అయితే దొరసాని ని ప్రేమించే యువకుడిగా ఆనంద్ దేవరకొండ మాత్రం అంతగా ఆకట్టుకునేలా కనిపించడం లేదు . సినిమా చూస్తే కానీ తెలీదు ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ స్టార్ డం ని అందుకునేలా ఉన్నాడా ? లేదా ? అన్నది . జూన్ 6 న దొరసాని టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు , ఇక సినిమాని జూలై 5 న విడుదల చేయనున్నారు . రాజశేఖర్ – జీవిత ల కూతురు శివాత్మిక , విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి . మరి ఆ అంచనాలను ఈ దొరసాని అందుకుంటుందా ? చూడాలి . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WfdLRt

అజయ్ “స్పెషల్” మూవీ ప్రీమియర్స్ కి అద్భుత స్పందన….. జూన్ 14న గ్రాండ్ రిలీజ్

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడులో ప్రతి నాయకుడిగా నటించి అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకొని, పలు చిత్రాల్లో హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు అజయ్ . ఇక ఇప్పుడు ఓ అద్భుతమైన స్టోరీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్న స్పెషల్ చిత్రంలో ముఖ్య భూమిక పోషించారు. ఇది ఒక మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒకమ్మాయి లవ్ చేసి వదిలేస్తుంది. చీట్ చేస్తుంది. ఆ అమ్మాయి అలా అతన్ని చీట్ చేయడానికి కారణమైన వాళ్లమీద ఈ మైండ్ రీడర్ రివెంజ్ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్ చేసి వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారా సైకాలజీ స్కిల్ నేపథ్యంలో సాగుతుంది. హాలీవుడ్ తరహా కథాంశంతో తీసిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మాతగా, వాస్తవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జూన్ 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంద...

హృదయాలను ఏలే ‘దొరసాని’

రియలిస్టిక్ అండ్ ఇంటెన్సిటీ ఉన్న కథలకు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. అలాంటి ఓ రియలిస్టిక్ స్టోరీతో వస్తోన్న చిత్రమే ‘ దొరసాని ’. టైటిల్ కు తగ్గట్టుగానే ఇది తెలంగాణలోని ఓ ప్రాంతంలో 80 దశకం లో జరిగిన కథగా వస్తోంది. లేటెస్ట్ గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ పరిశ్రమ వర్గాల్లోనూ మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఆ ఆసక్తిని మరింత పెంచేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది. కథ లోంచి పరిచయం అయిన రాజు, దొరసాని చూడ ముచ్చటగా ఉన్నారు. కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్ పై వచ్చిన హీరో ఆరాధనగా చూస్తున్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ ఒక రకంగా కథలోని ఆత్మను చెబుతోంది.  రాజు కళ్ళల్లో ప్రేమ, దొరసాని కళ్ళల్లో దర్పం ఈ ప్రేమ కథ లో వైరుధ్యాన్ని చూపిస్తున్నాయి. హీరో, హీరోయిన్ల డ్రెస్సింగ్ తో పాటు ఆమె ఉన్న కార్ ను బట్టి కథకు తగ్గట్టుగా నాటి కాలపు వాతావరణాన్ని ఈ చిత్రంలో రీ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం వస్తోన్న రియలిస్టిక్ మూవీస్ లో ఈ చిత్రం ఓ కొత్త తరహాగా నిలువబోతోందని ఈ లుక్ చెప్పకనే చెబుతోంది. ఆనంద్ దేవరకొండ , శివాత్మిక హీ...

నా క‌థ‌ను నేనే తెర‌పై చూసుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాను – ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత చింత కింద మల్లేశం

ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత చింత‌కింది మ‌ల్లేశం జీవిత‌క‌థ‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం ` మ‌ల్లేశం `. వెండితెర‌పై ఈయ‌న పాత్ర‌లో ప్రియ‌దర్శి క‌నిపించ‌నున్నాడు. రాజ్‌.ఆర్ ద‌ర్శ‌కుడు. రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి నిర్మాత‌లు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జూన్ 21న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత చింత‌కింది మ‌ల్లేశం, పల్లెసృజ‌న నిర్వాహ‌కులు గ‌ణేశం, త‌రుణ్ భాస్క‌ర్‌, సందీప్‌కిష‌న్‌ , ప్రియ‌ద‌ర్శి, రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా… గ‌ణేశం మాట్లాడుతూ – “నేను సినిమాలు చూస్తాను కానీ.. ఇండ‌స్ట్రీ గురించి పెద్ద‌గా తెలియ‌దు. రెండేళ్ల క్రితం రాజ్‌గారు న‌న్ను క‌ల‌సి ఇలా మ‌ల్లేశంగారి సినిమా తీద్దామ‌నుకుంటున్నాను అని చెప్పారు. నిజ‌మైన క‌థ‌ను త‌క్కువ స‌మ‌యంలో చెప్ప‌డ‌మ‌నేది చాలా గొప్ప విష‌యం“ అన్నారు. చింత‌కింది మ‌ల్లేశం మాట్లాడుతూ – “ఒక‌రోజు రాజ్‌గారు ఫోన్ చేసి యూ ట్యూబ్‌లో మీరు మాట్లాడింది చూశాను. దాని గురించి సినిమా తీయాల‌ని అనుకుంటూ ఉన్నాను అన్నారు. రెండున్న‌రేళ్ల...

సూర్య ఇప్పుడైనా హిట్ కొడతాడా ?

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగులో హిట్ కొట్టి చాలాకాలం అవుతోంది . ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోలకు పోటీగా భారీ ఓపెనింగ్స్ వచ్చేవి ఈ హీరో చిత్రాలకు కానీ వరుస ప్లాప్ లతో సూర్య చిత్రాలకు గిరాకీ లేకుండాపోయింది . అయితే సూర్య కున్న క్రేజ్ తో ఈ హీరో నటించిన ప్రతీ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తూనే ఉన్నారు . అయితే అవి వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోతున్నాయి . తాజాగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ” ఎన్ జీకే ” . సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రేపు భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు . తెలుగు , తమిళ బాషలలో విడుదల అవుతున్న ఈ చిత్రంపై సూర్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఇక తెలుగులో ఈ సినిమా దాదాపు 9 కోట్ల షేర్ వసూల్ చేయగలగాలి అప్పుడే ఈ సినిమాని కొన్న వాళ్ళు సేఫ్ అవుతారు . 9 కోట్ల షేర్ అంటే దాదాపు 20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలి . మరి సూర్య ఆ వసూళ్ల ని సాధిస్తాడా ? హిట్ కొడతాడా ? from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WvHd50

సుధీర్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు

యాంకర్ సుధీర్ ని ఆటపట్టిస్తూ నవ్వుకుంటూ సంతోషంలో మునిగి తేలుతున్నారు డీ జోడి యాంకర్ ప్రదీప్ . ఒక్క ప్రదీప్ మాత్రమే కాదు మరో యాంకర్ రష్మీ అలాగే ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న డ్యాన్స్ మాస్టర్ శేఖర్ కూడా . డీ జోడీ అనే కార్యక్రమం బుల్లితెరపై సక్సెస్ అయిన విషయం తెలిసిందే . ఈ కార్యక్రమంలో సుధీర్ – రష్మీ లు రెండు గ్రూప్ ల లీడర్లుగా వ్యవహరిస్తున్నారు . కాగా ఆవేడుకలో విలక్షణమైన ఎంట్రీ ఇస్తూ ఆకట్టుకున్నారు సుధీర్ – రష్మీ లు . అయితే రానురాను సుధీర్ ని బకరా ని చేసి ఆడుకుంటున్నారు మిగతావాళ్ళు . ఇక ఇదంతా సరదా కోసమే అయినప్పటికీ సుధీర్ మాత్రం పెద్ద బఫున్ అయిపోతున్నాడు ఈ షోలో . ఇక నిన్న జరిగిన ఈ షోలో లుంగీ మీద వచ్చాడు సుధీర్ ఇంకేముంది ఆ లుంగీ తో మరింతగా ఉడికించి అవమానించారు దాంతో నవ్వుల వర్షం కురిసింది . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2HIcd9v

భారీ కటౌట్ తో రికార్డ్ బ్రేక్ చేసిన ఫ్యాన్స్

సూర్య హీరోగా నటించిన ” ఎన్ జీకే ” రేపు భారీ ఎత్తున విడుదల అవుతున్న నేపథ్యంలో సూర్య అభిమానులు భారీ కటౌట్ ని ఏర్పాటు చేయించి రికార్డ్ బ్రేక్ చేసారు . ఇంతకీ ఈ కటౌట్ ఎత్తు ఎంతో తెలుసా ……. దీనికైన ఖర్చు ఎంతో తెలుసా …….. కటౌట్ ఎత్తు 215 అడుగులు కాగా దీనికి 7 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది అంతేకాదు 35 రోజుల పాటు 40 మంది కార్మికులు కస్టపడి పనిచేస్తే ఈ కటౌట్ సాధ్యమయ్యింది . భారతదేశంలోనే ఈ కటౌట్ భారీది అనే చెప్పాలి , ఎందుకంటే ఇప్పటివరకు 180 అడుగుల కటౌట్ అజిత్ ది ఏర్పాటు చేసారు ఫ్యాన్స్ , దాంతో ఆ రికార్డ్ ని బద్దలు కొట్టారు సూర్య ఫ్యాన్స్ . తమిళనాడు లోని తిరువళ్లూరు జిల్లా అభిమానులు ఈ భారీ కటౌట్ ని ఏర్పాటు చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు . ఇక రేపు విడుదల కానున్న ఎన్ జీకే ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2KdBB95

పవన్ ఫ్యాన్స్ ని నిరాశపరిచిన బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ తో నేను సినిమా చేయడం లేదు , మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నేనే చెబుతాను అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసిపవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేశాడు . పవన్ కళ్యాణ్ కు భక్తుడు బండ్ల గణేష్ దాంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడని అనుకుంటున్న సమయంలో ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు బండ్ల గణేష్ . రాజకీయ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే . రాజకీయాల్లో ఘోర ఓటమి చవిచూసాడు కాబట్టి ఇక సినిమాలపై దృష్టి పెడతాడని అంతా అనుకుంటున్న సమయంలో బండ్ల గణేష్ ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో ఉన్నాడని వార్తలు వచ్చాయి . అయితే ఇవి పవన్ చెవిన పడ్డాయేమో ! కోప్పడ్డాడేమో !! అందుకే బండ్ల గణేష్ ఖండన ఇచ్చాడు . రాజకీయాల్లో దెబ్బతిని ఉన్నాడు కాబట్టి కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత సినిమాలపై దృష్టి పెట్టడం ఖాయం . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2wrWcOH

ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను …..

ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అంటూ ప్రమాణస్వీకారం చేయనున్నాడు జగన్ . ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీకి అవుతున్న రెండో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలనీ 2009 లోనే అనుకున్నాడు జగన్ కానీ కాంగ్రెస్ పార్టీ జగన్ ఆశలపై నీళ్లు చల్లింది దాంతో సైలెంట్ అయ్యాడు , అయితే తండ్రి మరణంతో పెద్ద ఎత్తున చనిపోయిన కుటుంబాలను కలిసి ఓదార్చాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యక్తిరేకించడంతో పాటుగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా చేయడంతో జగన్ కాంగ్రెస్ పార్టీకి , పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు . అప్పటి నుండి పోరాటం చేస్తూనే ఉన్నాడు . 2014 లో అధికారం దక్కుతుందని అనుకుంటే కొద్దిలో అదృష్టం చేజారింది దాంతో పట్టువదలని విక్రమార్కుడిలా తండ్రికి అధికారం ని అందించిన పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం అయ్యాడు , తిరుగులేని భారీ మెజారిటీ తో ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టబోతున్నాడు . ఈరోజు విజయవాడలో ప్రజల సమక్షంలో జగన్ ఆంధ్రప్రదేశ్...

మోడీ పట్టాభిషేకం నేడే

భారత ప్రధానమంత్రి గా మళ్ళీ రెండోసారి పదవీ ప్రమాణం చేయనున్నారు నరేంద్ర మోడీ . దేశ వ్యాప్తంగా నమో …… నరేంద్ర మోడీ అనేలా చేసి సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించాడు దాంతో ఈరోజు అంగరంగ వైభవంగా మోడీ కి పట్టాభిషేకం జరుగనుంది . ప్రపంచ దేశాల నుండి పెద్ద ఎత్తున అతిథులు హాజరు కానున్నారు . కాంగ్రెస్ పార్టీ ని మట్టికరిపించి దేశ వ్యాప్తంగా కమలం వికసించేలా చేసాడు మోడీ . ఈరోజు రాత్రి 7 గంటల సమయంలో రాష్ట్రపతి భవన్ లో మోడీ కి పట్టాభిషేకం జరుగనుంది . రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు . ఇక ప్రధాని దాదాపు 64 మందితో మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది . తెలంగాణ నుండి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించిన జి . కిషన్ రెడ్డి కి మంత్రి పదవి  ఛాన్స్ ఖాయమైనట్లు తెలుస్తోంది . ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరు కానున్నారు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2HI5zQS

జగన్ బయోపిక్ నేనే తీస్తానంటున్న పూరి జగన్నాధ్

జగన్ బయోపిక్ నేనే తీస్తానంటున్న పూరి జగన్నాధ్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతుండటంతో అతడి బయోపిక్ తీయడానికి పలువురు పోటీ పడుతున్నారు . నిన్న మొన్నటి వరకు జగన్ ఊసెత్తడానికి భయపడ్డారు అయితే కొంతమంది నటీనటులు మాత్రం ధైర్యంగా జగన్ కు అండగా నిలిచారు . కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ కు రెండో ముఖ్యమంత్రిగా అవుతుండటంతో జగన్ బయోపిక్ కు డిమాండ్ ఏర్పడింది . తాజాగా మహి వి రాఘవ యాత్ర 2 అంటూ జగన్ బయోపిక్ కు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించగా దర్శకులు పూరి జగన్నాధ్ కూడా నేను సైతం అంటూ ముందుకు వస్తున్నాడు . జగన్ బయోపిక్ నేనే తీస్తా అని అంటున్నాడు పూరి .జగన్ బయోపిక్ నేనే తీస్తానంటున్న పూరి జగన్నాధ్ గతకొంత కాలంగా ఈ దర్శకుడికి సరైన సక్సెస్ లేదు . దాంతో ఊసులోనే లేకుండాపోయాడు . కాకపోతే ఇప్పుడు హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు . అది వచ్చే నెలలో విడుదల కానుంది . అది సక్సెస్ అయితే జగన్ బయోపిక్ తీస్తానంటే గ్రీన్ సిగ్నల్ దొరుకుతుందేమో ! లేకపోతే అంతే ! from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2HIY2k...

విజయ్ దేవరకొండ అంటే ఈ హీరోకు కోపమా !

హీరో కం దర్శకుడు అయిన విశ్వక్ సేన్ కు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అంటే కోపమా ! ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఇదే ! ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుండి హీరోగా వచ్చి సంచలనం సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ . అనూహ్యంగా వరుస విజయాలతో సంచలనం సృష్టించి సడెన్ స్టార్ అయ్యాడు . విజయ్ దేవరకొండ కు ఊహించని క్రేజ్ రావడంతో నిజంగానే టాలీవుడ్ హీరోలలో కొంతమందికి నచ్చలేదు కూడా . ఇక ఇప్పుడేమో విశ్వక్ సేన్ కూడా హీరోగా సత్తా చాటడానికి వస్తున్నాడు అందునా తెలంగాణ వాడు కావడంతో ఇప్పటికే ఒకడ్ని ఎత్తి నెత్తిన పెట్టుకున్నం మళ్ళీ ఇంకొకడా ? అంటూ ఫిలిం నగర్ లో చర్చ సాగుతోంది . ఈ విషయం విశ్వక్ సేన్ చెవిన పడటంతో నాకు నాని అన్న స్ఫూర్తి అంటూ సినిమా కోసమే పుట్టానంటున్నాడు . అయితే ఎక్కడా విజయ్ దేవరకొండ పేరు మాత్రం ఎత్తడం లేదు అంటే విజయ్ దేవరకొండ అంటే విశ్వక్ సేన్ కు కోపం అని అందుకే ఇలా వ్యాఖ్యానించి ఉంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా ఫలక్ నుమా దాస్ విజయం సాధిస్తే కొంతమందికి మాత్రం నిద్దర పట్టదు . అలాగే విజయ్ దేవరకొండ – విశ్వక్ సేన్ ల మధ్య కూడా మరింత పోటీ నెలకొనడం ఖాయం from టాప్ స...

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటి

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది సీనియర్ నటి తనూజ . బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తల్లి ఈ తనూజ. ఈ సీనియర్ నటి హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది. తనూజ వయసు 75 సంవత్సరాలు. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ముంబై లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాజోల్ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో కన్నీళ్ల పర్యంతం అయ్యింది. ఇటీవలే కాజోల్ మామ వీరు దేవగన్ మరణించిన విషయం తెలిసిందే. మామయ్య మరణంతో దుఃఖసాగరంలో ఉన్న కాజోల్ కు తల్లి కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆమెని ఓదార్చడం అజయ్ దేవగన్ వల్ల కూడా కావడం లేదట. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WzT4yO

గుణ 369 ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న చిత్రం ` గుణ 369 `. బుధవారం ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “ఇటీవ‌ల ఒంగోలులో చిత్రీక‌రించిన భారీ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కొత్త త‌ర‌హా క‌థ‌లతో ఇత‌ర భాష‌ల్లో సినిమాలు వ‌స్తున్న‌ట్టు… తెలుగులో సినిమాలు రూపొంద‌ట్లేద‌నే బాధ‌ను మా సినిమా తీరుస్తుంది. కంటెంట్ ప‌రంగా ఆద్యంతం కొత్త‌గా ఉంటుంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన కాసేప‌టికే చాలా మంది ఫోన్లు చేసి ప్ర‌శంసిస్తున్నారు. పోస్ట‌ర్ వైవిధ్యంగా ఉంద‌ని మెచ్చుకుంటున్నారు. స‌ర్వ‌త్రా పాజిటివ్ వైబ్రేష‌న్స్ క‌నిపిస్తున్నాయి“ అని అన్నారు. నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ “ఒంగోలులో భారీ షెడ్యూల్‌ను నిర్విఘ్నంగా పూర్తి చేశాం. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఫైన‌ల్ స్టేజెస్‌లో ఉన్నాయి. సి...

రాజ్ తరుణ్ లవ్ చేసింది ఏ హీరోయిన్ ని ?

ఉయ్యాలా జంపాల చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరో రాజ్ తరుణ్ . ఉయ్యాలా జంపాల చిత్రం తర్వాత ఈ హీరో వరుస విజయాలు సాధించాడు , అయితే ఆ తర్వాత ఈ హీరో రేసులో లేకుండాపోయాడు వరుస ప్లాప్ లతో . తాజాగా ఈ హీరో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాజ్ తరుణ్ తాజాగా తన ప్రేమ విషయం గురించి ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు . రాజ్ తరుణ్ లవ్ లో ఉన్నట్లు ట్వీట్ చేయడంతో అసలు రాజ్ తరుణ్ లవ్ చేస్తున్న హీరోయిన్ ఎవరు ? అన్న చర్చ సాగుతోంది . రాజ్ తరుణ్ నటించిన చిత్రాల్లో ఎక్కువగా యంగ్ హీరోయిన్స్ నటించారు పైగా ఓ ముగ్గురు హీరోయిన్ లతో రాజ్ తరుణ్ బాగా క్లోజ్ అనే రూమర్స్ వచ్చాయి . కట్ చేస్తే ఇప్పుడు లవ్ అంటున్నాడు కాబట్టి ఈ హీరో లవ్ చేసిన హీరోయిన్ ఎవరై ఉంటారబ్బా ? అన్న ఆసక్తి మొదలయ్యింది .  from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Kavnqd

‘ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ ట్రైలర్ విడుదల… త్వరలో విశాఖలో ఆడియో వేడుక!

కన్నడ సూప‌ర్‌స్టార్‌ ఉపేంద్ర నటించిన తాజా సినిమా ‘ ఐ లవ్ యు ‘. ‘నన్నే… ప్రేమించు’ అనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్‌. తెలుగు పరిశ్రమకు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో దర్శకుడిగా పరిచయం అయిన ఆర్‌. చంద్రు, శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సినిమా ప్రీ రిలీజ్ ట్రైలర్ సోమవారం బెంగళూరులో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ‘ఈగ’ ఫేమ్ సుదీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్ణాటక విద్యాశాఖ మంత్రి జిటి దేవెగౌడ, మాజీ మంత్రి హెచ్.ఎం. రేవణ్ణ, వైఎస్సార్‌సీపీకి చెందిన‌ ఏపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి (కావలి నియోజకవర్గం), ‘స్పెషలిస్ట్ హాస్పిటల్స్’ రామచంద్రే గౌడ, ‘మోహన్ మూవీస్’ మోహన్ కుమార్, బహర్ ఫిలిమ్స్ బాషా, లక్ష్మి ప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. ‘ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఫస్ట్ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు ఆర్. చంద్రు మాట్లాడుతూ “ఉపేంద్రగారు అభిమానుల చక్రవర్తి. చంద...

ఎన్ జి కె ప్రేక్షకులకు ఒక యూనిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది – హీరో సూర్య

సూర్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ , సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రూపొందిన చిత్రం ‘ ఎన్‌.జి.కె ‘. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు. సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం జె.ఆర్.సి ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో బిగ్‌ టికెట్‌ను హీరో సూర్య ఆవిష్కరించి ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్‌కి అందించారు. ఈ సందర్భంగా… నిర్మాత అనీల్‌ సుంకర మాట్లాడుతూ – ”హీరో తమిళ హీరో అయినప్పటికీ మన తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. శ్రీరాఘవగారు డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం మంచి హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. అలాగే మా రాధామోహన్‌గారికి ఈ సినిమా మరో పెద్ద సక్సెస్‌గా నిలవాలని కోరుకుంటున్నాను” అన్నారు. సినిమాటోగ్రాఫర్‌ శివకుమార్‌ విజయన్‌ మాట్లాడుతూ – ”ఈసినిమా కోసం యూనిట్‌ అంతా చాలా కష్టపడింది. ఇదొక లాంగ్‌ జర్నీ. సూర్యగారు, శ్రీరాఘవ గారి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు. మిర్యాల రవ...