Skip to main content

Posts

Showing posts from March, 2019

కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న హీరోయిన్

ఉదయ్ కిరణ్ సరసన నువ్వు – నేను చిత్రంలో నటించి సంచలనం సృష్టించిన భామ అనిత . అయితే ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది కానీ ఈ భామ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది . దాంతో బాలీవుడ్ బాట పట్టేసింది టాలీవుడ్ ని వదిలేసి . తాజాగా ఈ భామ కడుపుతో ఉంది త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వ బోతోందట ! ఈ విషయాన్నీ తానే ట్వీట్ చేసి చెప్పింది .   పారిశ్రామికవేత్త రాకేష్ రెడ్డి ని పెళ్లి చేసుకున్న అనిత నాగిని సీరియల్ లో నటిస్తోంది . తన ఇద్దరు పిల్లలు అలాగే నేను క్షేమంగా ఉన్నామని 9 నెలలు కూడా పూర్తయ్యిందని త్వరలోనే పురుడు పోసుకుంటానని సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది అనిత . అంతేగా తల్లి అయ్యే మధురక్షణాలు అనితని వరించాయి అందుకే పరవశించిపోతోంది . English Title : Anitha flaunts her baby bump   from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HNURcT

పవన్ కళ్యాణ్ కు హ్యాండ్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు భీమవరం లోని ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాండ్ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ భీమవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఇక్కడి నుండి పవన్ పోటీ చేస్తున్నాడు కాబట్టి పవన్ కు అందరు హీరోల అభిమానులు మద్దతుగా నిలవాలని మొదట్లో అనుకున్నారట ! ఈ ప్రతిపాదన తీసుకొస్తే సమర్ధించారట కానీ మళ్ళీ ఏమయ్యిందో ఏమో కానీ పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారట ప్రభాస్ ఫ్యాన్స్ .   భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ దాంతో వాళ్ళు కలిసి వస్తారేమో అనుకుంటే హ్యాండ్ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట . అయితే ఇపుడు మాత్రం జగన్ పార్టీకే మా మద్దతు అని బహిరంగానే చెబుతున్నారు కానీ ఎన్నికల పోలింగ్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పవన్ ఫ్యాన్స్ . English Title : Pawan kalyan shocked with Prabhas fans   from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2uz9wjn

క్యాన్స‌ర్ ఎవేర్‌నెస్ కోసం క్రికెట్ ఆడ‌నున్న టాలీవుడ్ స్టార్స్‌

హైద‌రాబాద్ త‌ల్వార్స్‌ , టిసిఎ ( తెలుగు సినిమా అకాడ‌మీ ) ఈ రెండు టీమ్‌లు క‌లిసి ఇండో ఆఫ్రికా మీడియా కంపెనీ ఆధ్వ‌ర్యంలో మ‌న తెలుగుస్టార్స్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న తెలుగువాళ్ళ‌తో క‌లిసి క్రికెట్ ఆడ‌బోతున్నారు. మొత్తం రెండు మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి. మే17,18న మ్యాచ్‌లు జ‌రుగుతాయి. 19న సాంస్కృతిక కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది.  క్యాన్స‌ర్ ఎవేర్నెస్ కోసం  క్రికెట్ ఆడ‌టానికి ప్ర‌ధాన కార‌ణం. ఇందులో వ‌చ్చిన నిధుల‌ను ఆఫ్రికాలో ఉన్న చైల్డ్ హుడ్ క్యాన్స‌ర్ అసోసియేష‌న్‌కు అందించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లెమ‌న్‌ట్రీ హోట‌ల్‌లో విలేక‌రుల స‌మావేశంలో…   ఛైర్మెన్ ర‌మేష్ మాట్లాడుతూ…ఇంత మంచి ప‌ని కోసం ముందుకు వ‌చ్చిన  టాలీవుడ్ స్టార్స్‌కి  ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. క్యాన్స‌ర్ నుంచి బ్ర‌తికిద్దాం అన్న ఆలోచ‌నే ఈ క్రికెట్ టాలీవుడ్ అసోసియేష‌న్‌  యొక్కముఖ్య ఉద్దేశం. బిజీ షెడ్యూల్‌ని కూడా ప‌క్క‌న పెట్టి రావ‌డం గ్రేట్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ సౌత్ ఆఫ్రికాలో ఇలాంటి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌లేదు. మొట్ట మొద‌టి సారి వీళ్ళు సౌత్ ఆఫ్రికా వ‌చ్చి  మ‌న సంస్కృతిని వాళ్ళ‌కు ప‌రిచ‌యం చేసి వాళ్ళ ...

పూజా హెగ్డే తో రొమాన్స్ చేస్తున్న మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పూజా హెగ్డే తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈరోజు అన్నపూర్ణ స్టూడియో లో మహర్షి చిత్రం షూటింగ్ జరుగుతోంది . పూజా హెగ్డే – మహేష్ బాబు లపై ఓ పాటని చిత్రీకరిస్తున్నారు . దాదాపుగా షూటింగ్ పార్ట్ పూర్తికావడంతో పాటలను కూడా పూర్తిచేసే పనిలో పడ్డారు చిత్ర బృందం . ఈ పాట అనంతరం మరో పాట కోసం విదేశాలకు వెళ్లనున్నారు మహేష్ – పూజా హెగ్డే లు .   సందేశాత్మక కథతో తెరకెక్కుతున్న మహర్షి చిత్రాన్ని మే 9 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు . ఇక ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు , అశ్వనీదత్ , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు . English Title : Mahesh babu in romance mode   from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FE3yTq

ప్రభాస్ తప్పు చేస్తున్నాడా ?

ప్రభాస్ తాజాగా సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఆ సినిమా సెట్స్ పై ఉండగానే జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ” జాన్ ” అనే చిత్రం కూడా చేస్తున్నాడు . ఈ సినిమా కోసం ఏకంగా 80 కోట్ల రూపాయలతో పలు సెట్ లు నిర్మిస్తున్నారు . కేవలం సెట్టింగ్ లకే 80 కోట్లు అంటే ఇక టోటల్ సినిమా మేకింగ్ 150 కోట్లను దాటడం ఖాయమని తెలుస్తోంది .   యూరప్ సెట్స్ ని ఇక్కడ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేస్తున్నారు . దీనికి ఇంతటి భారీ ఖర్చు అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు . ఈ స్థాయి బడ్జెట్ పెరుగుతూ పోతుంటే అది చిత్ర పరిశ్రమకు ఎంతమాత్రం మంచిది కానేకాదు ఎందుకంటే సంవత్సరంలో 150 కి పైగా సినిమాలు రిలీజ్ అయితే అందులో పట్టుమని పది సినిమాలు హిట్స్ ఉండటం లేదు . ఇక బ్లాక్ బస్టర్ ల సంగతి జస్ట్ ఒకటి లేదా రెండు మాత్రమే ! కానీ బడ్జెట్ ని మాత్రం ఎవరికీ వాళ్ళు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు . ఈ క్రమంలో ప్రభాస్ కూడా అదే పని చేస్తున్నాడు . హిట్ కొడితే ఫరవాలేదు కానీ తేడా వస్తేనే ఎంత తప్పు చేసాడో తెలుస్తుంది . అప్పుడు తెలిసినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే అప్పటికే ఎంతో మంది రోడ్డున పడతారు . English Title : Hu...

అర్జున్ రెడ్డి హిందీ చిత్రం పూర్తి

తెలుగునాట ప్రభంజనం సృష్టించిన చిత్రం ” అర్జున్ రెడ్డి ” . విజయ్ దేవరకొండ ని అమాంతం పెద్ద హీరోని చేసిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా తీసిన విషయం తెలిసిందే . కాగా ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసాడు సందీప్ రెడ్డి వంగా . షాహిద్ కపూర్ హీరోగా నటించగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది ఈ రీమేక్ లో .   ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది , దాంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరింత వేగంగా పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఎందుకంటే జూన్ 21న విడుదల అని ప్రకటించిన విషయం తెలిసిందే . తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఎంతో నమ్మకంతో బాలీవుడ్ లో రీమేక్ చేసాడు సందీప్ రెడ్డి వంగా . జూన్ 21న రిలీజ్ అయితే కానీ తెలీదు సందీప్ ఆశలకు రెక్కలొచ్చాయా ? లేక ఆవిరయ్యాయా ? అన్నది . English Title : Arjun reddy hindi remake kabir singh shooting completed   from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FDwvPr

నటుడిగా సౌతాఫ్రికాలో సెటిల్ అవుతానంటున్న సునీల్

హాస్య నటుడు సునీల్ సౌతాఫ్రికాలో సెటిల్ అవుతానని , అక్కడ చిత్రాల్లో నటించే అర్హత నాకు మాత్రమే ఉందని నవ్వుల పువ్వులు పూయించాడు సునీల్ . నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని లెమన్ ట్రీ హోటల్ లో టాలీవుడ్ క్రికెట్ టీమ్ సమావేశంలో సునీల్ ఈ వ్యాఖ్యలు చేసి నవ్వించాడు . క్యాన్సర్ అవేర్ నెస్ కోసం సౌతాఫ్రికా లో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసారు . కాగా అక్కడ ఉన్న తెలుగువాళ్ళతో టాలీవుడ్ హీరోలు క్రికెట్ పోటీలలో పాల్గొనడానికి వెళ్తున్నారు కాగా అందులో సునీల్ కూడా ఒకరు . అయితే నేను నల్లగా ఉంటాను కాబట్టి అక్కడి చిత్రాల్లో నటించే అర్హత నాకు ఒక్కడికే దక్కుతుందని , దాంతో ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదుగుతాను అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు . హాస్య నటుడిగా బాగున్నా …… హీరోగా మారి కెరీర్ ని చేజేతులా నాశనం చేసుకున్నాడు సునీల్ . ఇక ఇపుడేమో మళ్ళీ కమెడియన్ వేషాలకు వచ్చాడు కానీ ఆశించిన స్థాయిలో మాత్రం బిజీ కాలేకపోతున్నాడు పాపం . English Title : Sunil turned cricketer for good cause   from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UcJ7Y4