Skip to main content

‘కల్కి’ బి, సి సెంటర్ మాస్ సినిమా! – దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూ

Jeevitha garu‘కల్కి’ బి, సి సెంటర్ మాస్ సినిమా! – దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూ

‘అ!’ చిత్రంతో అటు ప్రేక్షకుల్ని, ఇటు విమర్శకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తెలుగు ప్రేక్షకులు కొత్త తరహా చిత్రాన్ని అందించారు. ‘అ!’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి‘. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా శివాని, శివాత్మిక, ‘వైట్ లాంబ్ పిక్చర్స్’ వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. జూన్ 28న విడుదలైన ఈ సినిమా కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా, మాస్ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు…

సినిమాకు ఎలాంటి స్పందన వస్తోంది?
దర్శకుడిగా నా తొలి సినిమా ‘అ!‘ ఏ సెంటర్ సినిమా అయితే… ‘కల్కి’ బి, సి సెంటర్ సినిమా. సరికొత్త కమర్షియల్ పంథాలో తీసిన సినిమా. ఏ ప్రేక్షకులైతే మా టార్గెట్ అనుకుని సినిమా తీశామో వాళ్ళందరికీ సినిమా నచ్చింది. అయామ్ సో హ్యాపీ.

రాజశేఖర్ గారి తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్? ఆయన షూటింగ్ కి సకాలంలో రాకపోవడం వల్ల దర్శకులు ఇబ్బంది పడతారని విమర్శ ఒకటి ఉంది!
అటువంటిది ఏమీలేదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే… షూటింగ్ చకచకా పూర్తి చేయవచ్చు. హీరో రాకముందు కొన్ని సన్నివేశాలు కూడా తీయవచ్చు. ఆయన టైం కి రారు అనడం కంటే… సన్నివేశాలను మరింత బాగా తీయడానికి నాకు టైం ఇచ్చారు. రాజశేఖర్ గారు డైరెక్టర్స్ ఫ్రెండ్లీ హీరో.

‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ డైలాగ్ పెట్టాలని ఐడియా ఎవరిది?
నాదే. ఒక్కసారి కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా తీయాలని డిసైడ్ అయిన తర్వాత… ఈ ఐడియా వచ్చింది. మన మీద మనమే సెటైర్ వేసుకుంటే బాగుంటుంది అని… రాజశేఖర్ గారి గురించి ఎక్కువ ట్రోలింగ్ చేసే టాపిక్ ఏంటని చూశాం. ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ డైలాగ్ ట్రోలింగ్ టాపిక్స్ లో ఒకటి‌. దీన్ని సినిమా లో పెడదామని రాజశేఖర్ గారికి చెప్పగానే ఒప్పుకున్నారు. నేను కొత్త దర్శకుడు అయినా ఏం అడిగితే అది చేశారు.

తన కథను కాపీ చేశారని ఒక రచయిత మీడియా ముందుకు వచ్చినట్టున్నారు?
అవును. అయితే… అతను ఆరోపించిన తర్వాత మా కథను రచయితల సంఘానికి చూపించాం. రెండిటి మధ్య ఎలాంటి సారూప్యతలు లేవని తేల్చారు. దాంతో వారు సినిమాలు కూడా చూడలేదు.

సినిమా స్క్రీన్ ప్లేకి సుమారు పదిమంది వరకు వర్క్ చేసినట్టున్నారు. తెరపై చాలా పేర్లు పడ్డాయి.
వాళ్లందరూ మా స్క్రిప్ట్ విల్ టీమ్ మెంబెర్స్. కథ రాసిన తర్వాత స్క్రీన్ ప్లే ఎలా ఉంటే బాగుంటుందని చాలా వెర్షన్స్ రాస్తాం. అదంతా పూర్తయిన తర్వాత మా సిస్టర్ ఏది బాగుందో చెబుతుంది. దాన్ని ఫైనల్ చేస్తాం. స్క్రిప్ట్ విల్ టీమ్ లో నాకంటే వయసులో పెద్ద వాళ్ళు, సినిమాలపై ఏమాత్రం అనుభవం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కథలపై వర్క్ చేస్తున్నాం.

తొలుత ఈ కథను మీరు డైరెక్ట్ చేయాలనుకోలేదట. స్క్రిప్ట్ వరకు ఇచ్చి, వేరే డైరెక్టర్ తో చేయాలని అనుకున్నారట.
అవును. ఆరు నెలల్లో స్క్రిప్ట్ పై వర్క్ చేసిన తర్వాత ఈ కథలో డైరెక్ట్ చేయాలని ఎగ్జైటింగ్గా అనిపించింది. ఆరు నెలలలో లో రాజశేఖర్, జీవిత, వాళ్ల ఫ్యామిలీ తో ట్రావెలింగ్ బాగుంది. వాళ్లు సెన్సిబుల్ పీపుల్. (నవ్వుతూ) వీళ్లను భరించొచ్చు అనిపించిన తర్వాత నేనే డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యా.

జీవిత గారు సినిమా విషయంలో ఎంత వరకు ఇన్వాల్వ్ అయ్యారు?
నా అనుభవం రెండు సినిమాలు మాత్రమే. రాజశేఖర్ గారు, జీవిత గారు ముప్పై ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో సినిమాలు చేశారు. వాళ్ళు ఏదైనా చెబితే వింటాను. నేను చెప్పిందే తీయాలనుకునే రకం కాదు. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ లో కూడా ఎవరైనా నా సలహా ఇస్తే, నేను కన్విన్స్ అయితే తీసుకుంటాను. వాళ్లకు క్రెడిట్ ఇస్తా.

సినిమాలో క్లైమాక్స్ కి మంచి పేరు వచ్చింది. మీరు క్లైమాక్స్ ముందు రాసుకుని తర్వాత కథ రాస్తారట?
అవునండి. క్లైమాక్స్ యే‌ కథ అని నేను నమ్ముతా. ఒక్కసారి క్లైమాక్స్ ఎలా చేస్తే బాగుంటుందనేది రాసుకున్న తర్వాత… స్క్రీన్ ప్లే రాస్తాను. క్లైమాక్స్ వరకు రెండు గంటలు ప్రేక్షకులు ఆసక్తిగా కూర్చునేలా కథను రూపొందిస్తా‌.

‘అ!’, ‘కల్కి’… రెండు చిత్రాల్లో అసలు కథేంటో క్లైమాక్స్ వరకు తెలియదు. ట్విస్టులతో సినిమాలు తీశారు. దర్శకుడిగా మీపై ఇటువంటి చిత్రాలు తీస్తారనే ముద్ర పడుతుందేమో?
నా తదుపరి సినిమాగా మంచి ప్రేమ కథను తీస్తానేమో. ఒకే తరహా చిత్రాలు తీయడం నాకు నచ్చదు. డిఫరెంట్ జోనర్ లో డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు తీయాలని ఉంది.

శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది. అతను మీ ఫ్రెండ్. అందువల్లే మీకు బాగా చేశాడా?
ఒక్కటి మాత్రం నిజం… తను నా ఫ్రెండ్ కాబట్టి ఈ సినిమాకు తీసుకున్నా. బీటెక్ లో నేను తీసిన కొన్ని వీడియోలను తన సంగీతంతో బాగా చూపించాడు. తనకు మంచి బ్రేక్ రావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. మా సినిమాలో అందరి కంటే తనకు ఎక్కువ పేరు రావడం సంతోషంగా ఉంది.

నెక్స్ట్ సినిమా ఏంటి?
ఏమో… రెండు మూడు కథలు ఉన్నాయి. చర్చలు జరుగుతున్నాయి. త్వరలో చెబుతా. హాట్ స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్ తీసే ఆలోచనలోనూ ఉన్నాం.

మీ తొలి సినిమా నిర్మాత నానితో టచ్ లో ఉన్నారా?
ఉన్నానండి. ఇటీవలే ఆయనను కలిశా. ఒక కథ గురించి చర్చించుకున్నాం. సినిమా చేయాలంటే జాతకాలు అన్ని కలవాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Xiet0F

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...