Skip to main content

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నుంచి… జూన్ 14న భారీ అంచనాలతో వస్తున్న సెన్సేషనల్ బోల్డ్ మూవీ “ఐ లవ్ యు”

కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర ఇప్పటివరకు చేసిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓం, ఏ, సూపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సంచలనం సృష్టించాడు. ఉపేంద్ర నుంచి సినిమా వస్తుందంటే ఉండే అంచనాలే వేరు. కన్నడలో ఆయన నటించిన ప్రతీ సినిమా తెలుగు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందర్భాలెన్నో. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత మరో సెన్సేషన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని తనదైన క్యారెక్టరైజేషన్ తో మనముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో ఐ లవ్ యు అనే సినిమాతో ఎంటర్ టైన్ చేసేందుకు ఉంపేద్ర సిద్ధమౌతున్నాడు.

తెలుగులో అత్యధిక థియేటర్లలో జూన్ 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 8న విశాఖపట్టణం సముద్రతీరంలో ఐ లవ్ యు ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన స్టార్ హీరోయిన్ డింపుల్ క్వీన్ రచిత రామ్ హీరోయిన్ గా నటిచింది. ఉపేంద్ర ఈ సినిమా కోసం మరింత ఫిట్ గా, స్టైలిష్ గా కనిపిస్తూ… నవ యువకుడిగా, యంగ్ ఎనర్జిటిక్ గా కనిపించనున్నాడు. స్టైలింగ్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర అద్భుతమైన పాటలకు డ్యాన్సులు ఇరగదీయడం విశేషం. డైరెక్టర్ ఆర్‌. చంద్రు కథ, కథనం మీద నమ్మకంతో…. శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో భారీ ఖర్చుతో, గ్రాండియర్ విజువల్స్ తో, సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్ తో అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా తెరకెక్కించారు. ఉపేంద్ర సినిమాల నుంచి ప్రేక్షకులు ఎలాంటి ఎంటర్టైన్ మెంట్ కోరుకుంటారో అలాంటి అంశాలతో పాటు…. ఈసారి అదనంగా ఎవ్వరూహించని, లవ్, ఫ్యామిలీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని జోడించారు. గతంలో ఉపేంద్ర నుంచి వచ్చిన సినిమాల కంటే పది రెట్లు ఎక్కువ ఎంటర్ టైన్ ఈ సినిమా నుంచి పొందుతారని చిత్ర దర్శక నిర్మాత ఆర్. చంద్రు ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు. అన్నట్టు ఇందులో బ్రహ్మానందం చేసిన కామెడీ మరో హైలైట్ గా నిలవనుంది. చాలా కాలం తర్వాత ఆయన నుంచి మంచి కామెడీ సీన్స్ ఈ సినిమా ద్వారా రానున్నాయి.

ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఎలోటిక్, బోల్డ్ సినిమాకే హైలైట్ గా నిలవనుంది. ఈ హాట్ సాంగ్ ఎవ్వరూహించని ప్రత్యేకమైన సందర్భంలో వచ్చే పాట కావడంతో ప్రేక్షకులు థ్రిల్ కు గురవ్వడం ఖాయం. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఐ లవ్ యు ఫస్ట్ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది.

 

సోను గౌడ, బ్రహ్మానందం, హోనవళ్ళి కృష్ణ, జై జగదీష్‌, పీడీ సతీష్‌ తదితరులు నటించిన ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి
పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి
స్టంట్స్‌: గణేష్, వినోద్, డా. కే రవి వర్మ
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన (ఉపేంద్ర), తేజస్విని (రచితా రామ్)
కాస్ట్యూమర్: గండశి నాగరాజ్
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మునీంద్ర కె. పుర
ఎడిటర్‌: దీపు ఎస్‌. కుమార్‌
లైన్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ సూర్య
ఆర్ట్‌ డైరెక్టర్‌: మోహన్‌ బి. కేరే
గాయకులు: ఉపేంద్ర, అర్మాన్ మాలిక్, విజయ్ ప్రకాష్, హేమంత్ మను కోకిల, శ్రేయా ఘోషల్, వాణి హరికృష్ణ
కొరియోగ్రఫీ: చిన్ని ప్రకాష్‌, ధను, మోహన్‌
లిరిక్స్: డా చల్లా భాగ్యలక్ష్మి
సినిమాటోగ్రఫీ: సుజ్ఞాన్
మ్యూజిక్‌ డైరెక్టర్‌: డా. కిరణ్‌ తోటంబైల్‌
రచన, నిర్మాణం, దర్శకత్వం: ఆర్‌. చంద్రు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WwL4Qb

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...