Skip to main content

ఈ నెల 21న “స్టూవర్టుపురం” మూవీ విడుదల

అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో గూఢచారి ఫేమ్ ప్రీతి సింగ్ ప్రధానపాత్రలో సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “స్టూవర్టుపురం”. ప్రస్తుతం ఈ చిత్రం యు/ఏ సెర్టిపికెట్ తో సెన్సార్ పూర్తి చేసుకొని జూన్ 21 న విడుదలకు సిద్ధమౌతున్నది. ఇటీవలే ప్రముఖ దర్శకుడు సుకుమార్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ ని విడుదల చేయగా మంచి హైప్ ఏర్పడింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం గురించి సమర్పకుడు రంజిత్ కోడిప్యాక మాట్లాడుతూ …. గతంలో మా బ్యానర్ లో నిర్మించిన నందికొండ వాగుల్లోనా, మోని చిత్రాల దర్శకుడు సత్యనారాయణ ఏకారి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మరో చిత్రమిది. కమర్షియల్ హంగులతో దర్శకుడు అద్భుతంగా తెరకేకించాడు, ఈ నెల 21 న విడుదల చేస్తున్నామన్నారు.
దర్శకుడు సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ … స్టూవర్ట్ పురం ట్రైలర్ ప్రముఖ దర్శకులు సుకుమార్ గారు విడుదల చేయడం, ఈ ట్రైలర్ కు భారీ హైప్ వచ్చింది. ముఖ్యంగా యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ ని సంపాదించుకుంది. ఆ ఉత్సాహంతో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నాం. ఇక సినిమా గురించి చెప్పాలంటే నరరూప రాక్షసులైన స్టూవర్టుపురం గ్యాంగ్, హీరోయిన్ ఇంట్లోకి చొరబడతారు, ఆ క్షణంలో హీరోయిన్ వాళ్ళను ఎలా డీల్ చేసిందన్న పాయింట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దాం, రిరికార్డింగ్ కు మంచి స్కోప్ ఉంది. దానికి తగ్గట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను నవనీత్ చారి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అందించారు, తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది అన్నారు. హీరోయిన్ ప్రీతి సింగ్ మాట్లాడుతూ.. ఇందులో చాలా పవర్ ఫుల్ రోల్ పోషించాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు.

మల్లికా,రవిరాజ్,భాను ప్రసాద్ ,హర్ష నల్లబెల్లి ,శివప్రసాద్ ,సాయిరామ్ దాసరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : వెమేష్ పెట్ల , కెమెరా ,
ఎడిట్టింగ్ : లక్కీ ఏకరీ , సంగీతం : నవనీత్ చారి , కో డైరెక్టర్ : టైగర్ రాంబాబు , సమర్పణ : రంజిత్ కోడిప్యాక ,కథ స్క్రీన్ ప్లే , నిర్మాత , దర్శకత్వం : సత్యనారాయణ ఏకారి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/31CFwT5

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...