Skip to main content

జూన్ 21న విడుద‌ల కానున్న ఫ‌స్ట్ ర్యాంక్ రాజు చిత్రం

డాల్ఫిన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకం పై న‌రేష్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మంజునాధ్ వి.కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం ఫ‌స్ట్ ర్యాంక్ రాజు. చేత‌న్ మ‌ద్దినేని క‌శిష్ ఓరా జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లై మంచి స్పంద‌న వ‌స్త్తోంది. చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో…
ప్రొడ్యూస‌ర్ మంజునాధ్ మాట్లాడుతూ… ఇటీవ‌లె విడుద‌లైన టీజ‌ర్ మ‌రియు పాట‌లు చాలా పెద్ద హిట్ అయి అద్భుత‌మైన స్పంద‌న ద‌క్కించుకుంది. ఈ చిత్రం 21న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని అన్నారు.

ఐ.ఎన్‌.శ్ర‌వ‌ణ్ మాట్లాడుతూ… ఫ‌స్ట్‌ర్యాంక్ రాజు టీజ‌ర్ చాలా బావుంది. మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అతి త్వ‌ర‌లో మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్‌చెయ్య‌డానికి మీ ముందుకు వ‌స్తుంది అని అన్నారు.

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రమ్య మాట్లాడుతూ… నేను ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్ట‌ర్‌ని చేశాను. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన మంజు సార్‌కి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. జూన్ 21న మీరంద‌రూ థియేట‌ర్స్‌కి వెళ్ళి మా సినిమాని చూడాలి. మీ అంద‌రి స‌పోర్ట్ మాకు కావాలి అని అన్నారు.

హీరోయిన్ కౌశిష్ మాట్లాడుతూ… ముందుగా మా టీజుర్‌ని పాట‌ల‌ని ఇంత బాగా హిట్ చేసినందుకు ప్ర‌తిఒక్క‌రికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. అదే విధంగా మా మూవీ కూడా మిమ్మ‌ల్ని అందరినీ త‌ప్ప‌కుండా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. మీరంద‌రూ త‌ప్ప‌కుండా మా సినిమా చూసి మ‌మ్మ‌ల్ని అద‌రించాల‌ని మ‌న‌స్సూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ద‌ర్శ‌కుడు న‌రేష్ మాట్లాడుతూ… నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన మా ప్రొడ్యూస‌ర్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. ఫ‌స్ట్ ర్యాంక్ రాజు ఈ చిత్రం ఒక వ్య‌క్తి జీవితంలో చ‌దువు వంద‌ప‌ర్సెంట్ బుద్ధి జీరో ప‌ర్సెంట్ ఉంటే ఎలా బ్ర‌తుకుతాడు, ఎలా ఉంటాడు, ఎలాంటి స‌మస్య‌లుంటాయి ఎలా సాల్వ్ చేసుకుంటాడు అనే దాని పై క‌థ న‌డుస్తుంది. మ‌రో రెండు రోజుల్లో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా మీ ముందుకు వ‌స్తుంది. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ మంచి ఆర్టిస్టుల‌తో ఈ సినిమా మొత్తం చేశాము. మీరంద‌రూ మా సినిమాని చూసి త‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాము అన్నారు.

హీరో చేత‌న్ మాట్లాడుతూ… ప్ర‌తి ఒక్క‌ళ్ళి లైప్‌లో ఒక‌ప్పుడు ఫ‌స్ట్ ర్యాంక్ ఉంటారు. నేను కూడా ఒక‌ప్పుడు ఫ‌స్ట్ ర్యాంక్ స్టూడెంట్‌నే. టీజ‌ర్‌కి వ‌చ్చిన రెస్పాన్స్‌కి చాలా హ్యాపీ. న‌న్ను మీరంద‌రూ ఎంత ట్రోల్ చేసిన ప‌ర్వాలేదు. నేను అందులో నా పాత్ర‌ని పాత్ర‌మే చూసుకుంటాను. చిన్న సినిమాలు రిలీజ్ కావు అన్న‌ది చాలా పెద్ద‌ట్రాష్ అలా ఏమీ ఉండ‌దు. కంటెంట్ బావుంటే త‌ప్ప‌కుండా రిలీజ్ అవుతాయి. నా గ‌త చిత్రం కూడా దిల్‌రాజుగారు రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మా ప్రొడ్యూస‌ర్ చాలా స్ర్టాంగ్ మ‌రియు క్యాప‌బుల్ ప‌ర్స‌న్‌. మా చిత్రం జూన్ 21న చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ద‌ర్శ‌కుడు మారుతిగారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఇండ‌స్ర్టీలో ఆయ‌న నాకు ఒక గాడ్ ఫాద‌ర్ లాంటి వారు. ఈ సినిమాకి ముందునుంచి ప‌క్క‌న ఉండి స్టోరీ అంతా విన్నారు అని అన్నారు.

చేత‌న్‌మ‌ద్దినేని, కాశిష్‌వోరా, డా..వి.కె.న‌రేస్‌, రాజ‌శ్రీ‌నాయిర్‌, ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానంద‌మ్‌, రావుర‌మేష్‌, పోసానికృష్ణ‌ముర‌ళి, నాగినీడు, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, అమిత్‌శ‌ర్మా, ప్ర‌య‌ద‌ర్శి, న‌వీన్‌నేని త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ఃఅయ్యాన్ శ్ర‌వ‌న్‌, లిరిక్స్ఃవ‌న‌మాలి, ఆర్ట్ఃస‌త్య‌సాయి, ప‌బ్లిసిటీడిజైన‌ర్ఃఅనిల్‌భాను, కో-డైరెక్ట‌ర్ఃమ‌ధుకుమార్‌కె.టి.మ్యూజిక్ఃకిర‌ణ్‌ర‌వీంద్ర‌నాధ్‌, ప్రొడ్యూస‌ర్ఃమంజునాధ్ వి. కందుకూర్‌, డైరెక్ట‌ర్ఃన‌రేష్‌కుమార్‌హెచ్‌.ఎన్‌. పి.ఆర్‌.ఓ…వంశీశేఖ‌ర్‌



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2KAwQq5

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...