Skip to main content

`గుణ 369` టీజ‌ర్‌కు అద్భుత స్పంద‌న‌..!

“మ‌న `ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ‌ను ఇక‌పై అంద‌రూ `గుణ 369` హీరో కార్తికేయ అని అన‌డం ఖాయం… అని ఘంటాప‌థంగా చెబుతున్నారు `గుణ 369` చిత్రం టీజ‌ర్ చూసిన వాళ్లు“ అని అంటున్నారు శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల‌. ఆమె స‌మ‌ర్పిస్తున్న చిత్రం `గుణ 369`.
స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాలకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం.
“మ‌నం చేసే త‌ప్పుల వ‌ల్ల మ‌న జీవితాని కి ఏం జ‌రిగినా ఫ‌ర్వాలేదు. కానీ ప‌క్క‌నోడి జీవితానికి ఏ హానీ జ‌ర‌గ‌కూడ‌దు“ అని సాయికుమార్ గంభీర‌మైన స్వ‌రంతో చెప్పే మాట‌ల‌తో `గుణ 369` టీజ‌ర్ సోమ‌వారం ఉద‌యం విడుద‌లైంది. టీజ‌ర్ రిలీజైన కొద్దీ క్ష‌ణాల్లోనే నెట్టింట్లో ట్రెండ్ అయింది. ఆర‌డ‌గుల హీరో ఓ అమ్మాయి ముందు నిలుచుని `స్మైల్ ఇవ్వొచ్చు క‌దా ఒక్క సెల్ఫీ..`, `నేనూ ఎప్పుడూ అనుకోలేదండీ. ఇలా బ‌ల‌వంతంగా ష‌ట్ట‌ర్ క్లోజ్ చేసి ఒక‌మ్మాయితో మాట్లాడ‌తాన‌నీ.. నాతో మీరు మాట్లాడాల్సిన ప‌నిలేదు. మీతో మీరు మాట్లాడేయండి` అని ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తూ చెప్పే డైలాగులు యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. `మాలాంటి వాళ్లు మీలాంటి వాళ్ల‌ను చూసి భ‌య‌ప‌డేది, గొడ‌వ‌లంటే మూసుకుని కూర్చునేది మాకేద‌న్నా అవుతుంద‌ని కాదు. మా అనుకున్న వాళ్ల‌కు ఏద‌న్నా అవుతుంద‌న్న చిన్న భ‌యంతో…` అని టీజ‌ర్‌లో ఆఖ‌రిగా హీరో నోటి వెంట వ‌చ్చే డైలాగులు మాస్ జ‌నాల చేత చ‌ప్ప‌ట్లు కొట్టిస్తున్నాయి. టీజ‌ర్‌కు వ‌స్తున్న స్పంద‌న గురించి
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “టీజ‌ర్ విడుద‌లైన కొన్ని క్ష‌ణాల నుంచే ఫోన్లు మొద‌ల‌య్యాయి. టీజ‌ర్ చాలా బావుందంటూ అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. టీజ‌ర్‌లో డైలాగులు, లొకేష‌న్లు, న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్, కెమెరా, కాస్ట్యూమ్స్… ఇలా ప్ర‌తి విష‌యం గురించి డీటైల్డ్ గా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. టీజ‌ర్ ఎంత బావుందో, సినిమా అంత‌కు వెయ్యి రెట్లు బావుంటుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌ల‌ను. ఫ‌స్ట్ లుక్‌కు, ఇప్పుడు టీజ‌ర్‌కు వ‌స్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి యూనిట్ అంతా ఆనందంగా ఉన్నాం“ అని చెప్పారు.
నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ “మా టీజ‌ర్ కు అద్భుత‌మైన స్పందన‌ వ‌స్తోంది. యువ‌త‌కు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విష‌యాలు, మాస్ ప్రేక్ష‌కుల‌ను న‌చ్చే స‌న్నివేశాల స‌మాహారంగా టీజ‌ర్ ఉంద‌ని, ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుంద‌ని… ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఇదే ఉత్సాహంతో ఈ నెలాఖ‌రున పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. మూడు రోజుల మిన‌హా షూటింగ్ పూర్త‌యింది. ఆ స‌న్నివేశాల‌ను కూడా త్వ‌ర‌లోనే తెర‌కెక్కిస్తాం. ఇప్ప‌టిదాకా వ‌చ్చిన ఔట్‌పుట్ చూశాం. చాలా సంతృప్తిక‌రంగా ఉంది. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే హిట్ సినిమా తీశామ‌నే కాన్ఫిడెన్స్ వ‌చ్చింది. సినిమాకు స‌ర్వ‌త్రా పాజిటివ్ బ‌జ్ క్రియేట్ అయింది. మా హీరోగారి కెరీర్‌లోనూ, మా కెరీర్‌లోనూ `గుణ 369` చెప్పుకోద‌గ్గ‌ గొప్ప సినిమా అవుతుందనే న‌మ్మ‌కం ఉంది“ అని అన్నారు.
సాంకేతిక నిపుణులు
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, భాను, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు : స‌త్య కిశోర్‌, శివ మల్లాల.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2ZueZFs

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...