Skip to main content

ఘనంగా జరిగిన సూపర్‌స్టార్‌ కృష్ణ 77వ జన్మదిన వేడుకలు

పద్మ భూషణ్‌ నటశేఖర సూపర్‌ స్టార్‌ కృష్ణ గారి 77వ జన్మదిన వేడుకలు మే31న హైదరాబాద్‌ పద్మాలయ స్టూడియోస్‌లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుండి వచ్చిన ఘట్టమనేని కృష్ణ, మహేష్‌ అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో తన అభిమానుల మధ్య సూపర్‌స్టార్‌కృష్ణ కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ కృష్ణ సోదరుడు జి. ఆది శేషగిరి రావు, మెగా మూవీమేకర్‌ సి. అశ్వినిదత్‌, సరిలేరు నీకెవ్వరు నిర్మాత అనిల్‌ సుంకర, యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, నిర్మాతలు బి. ఏ రాజు, సేఖమూరి మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ పాత్రికేయులు ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
సూపర్‌ స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ – ” నా ప్రతి సంవత్సరం పుట్టిన రోజున నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రులతో పాటు నాకు సినీ జన్మనిచ్చిన ‘తేనెమనసులు’ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారిని, ‘గూఢచారి 116’ నిర్మాత ధూండి గారిని తలుచుకుంటాను. మీ అందరి అభిమానంతోనే 350 సినిమాల్లో నటించగలిగాను, మీ అభిమానమే మాకు శ్రీరామ రక్ష. ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజును అభిమానుల మధ్య జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో అనిల్‌ సుంకర నిర్మిస్తున్న మహేష్‌ బాబు 26 సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది”అన్నారు
యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ – ” సూపర్‌ స్టార్‌కృష్ణ గారి 77వ జన్మదిన వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నిన్ననే పెద్దాయన్ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నాం. ఆయన పుట్టిన రోజున నాది సూపర్‌ స్టార్‌ మహేష్‌ మూవీ ప్రారంభం కావడం జన్మలో మర్చిపోలేను. మా సినిమా టైటిల్‌ ‘సరిలేరు నీకెవ్వరూ’ అని పెట్టాం. నిజంగా కృష్ణగారి గురించి చెప్పాలంటే …సరిలేరు నీకెవ్వరు ఆ ఒక్క పదం సరిగ్గా సరిపోతుంది. ఒక హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన అటెంప్ట్‌ చేయని జోనర్‌ అంటూ లేదు. ప్రతి జోనర్‌లోనూ ఆయనకు సూపర్‌హిట్స్‌ ఉన్నాయి. ఇక సూపర్‌ స్టార్‌ కృష్ణ , మహేష్‌ బాబు అభిమానులకి నేను సూపర్‌స్టార్‌ మహేష్‌తో చేయబోయే సినిమా మీ అందరికి నచ్చేవిధంగా ఉండి, తప్పకుండా మీ అందరి అంచనాలను అందుకుంటుంది” అన్నారు.
ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ – సూపర్‌ స్టార్‌ కృష్ణ గారికి 77వ జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఆయన ఒక స్టార్‌. ఆయన వెలుగులో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. ఈ రోజు అద ష్టవశాత్తు మా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రారంభోత్సవం జరిగింది. కృష్ణ గారి పుట్టిన రోజున ‘దూకుడు’ సినిమా ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేస్తేనే ‘దూకుడు’ అంత పెద్ద హిట్‌ అయ్యింది. అయితే ఈ సంవత్సరం ఏకంగా ఓ సినిమా ప్రారంభోత్సవం చేశాం. ఇక ఆ సినిమా ఈ రేంజ్‌లో ఉంటుందో మీరే ఊహించుకోండి. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సూపర్‌స్టార్‌ కృష్ణ గారి మాస్‌ సినిమాలా ఉంటుంది. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
నిర్మాత బి ఏ రాజు మాట్లాడుతూ – ” సూపర్‌ స్టార్‌ కృష్ణ గారు ఎంతోమంది ప్రొడ్యూసర్స్‌, డైరెక్టర్స్‌, ఆర్టిస్ట్‌లని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నన్ను కూడా ఆయనే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నా ప్రతి ఎదుగుదలలోనూ ఆయనే ఉన్నారు” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ మహేష్‌ సేన జాతీయ అధ్యక్షులు దిడ్డి రాంబాబు, ఆల్‌ ఇండియా కృష్ణ మహేష్‌ ప్రజాసేన అధ్యక్షులు ఖాదర్‌ ఘోరీ పాల్గొని కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2KjMdDs

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...