వివాదాస్పద నటి శ్రీ రెడ్డి దర్శకులు తేజ పై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె ఎంతగా ఆరోపణలు చేస్తున్నప్పటికీ తేజ మాత్రం సందించడం లేదు, నోరు మెదపడం లేదు. శ్రీరెడ్డి ఎంతగా తిడుతున్నా తేజ మాత్రం మీడియా ముందుకు రావడం లేదు, అలాగే సోషల్ మీడియాలో నైనా తన వాదన వినిపించడం లేదు.
అయితే ఇండస్ట్రీలో మాత్రం శ్రీరెడ్డి – తేజ ల వివాదంపై పెద్ద చర్చ నడుస్తూనే ఉంది. ఇక తేజ కూడా మీడియా ముందుకు రాలేదు కానీ తన సన్నిహితుల వద్ద కామెంట్స్ చేశాడట అవి కొంతమంది శ్రీరెడ్డి చెవిన వేయడంతో తేజ కు వార్నింగ్ ఇస్తూ మళ్లీ పోస్ట్ పెట్టేసింది. దాంతో తేజ గమ్మున ఉండిపోయాడు. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ ని షేక్ చేసిన ఈ భామ ప్రస్తుతం చెన్నైలో మకాం వేసింది. అక్కడ కూడా పలు వివాదాల్లో ఇరుక్కుంది శ్రీరెడ్డి. ఇక తేజ విషయానికి వస్తే ఇటీవలే సీత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Wih6Kw

Comments
Post a Comment