Skip to main content

ఎన్నికలు వద్దు.. ఉపసంహరణే ముద్దు – నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్

నిర్మాతల మండలికి ఎన్నికలు అవసరం లేదని చాలా మంది నిర్మాతల అభిప్రాయం అని అంటున్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్.
తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి ఎన్నికలు ఈ నెల 30న జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా నిర్మాతల మండలికి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయంలో ఇటీవలే నిర్మాతల మండలి సమావేశం జరిపి రెండు ప్యానల్స్ ని ఎంపికచేసింది . ఆ తరువాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రెండు ప్యానల్స్ ఒక్కటయ్యాయి . అందులో కొందరిని పక్కన పెట్టారు. నిర్మాతల మండలి చాలా బాగా జరుగునున్న క్రమంలో కొందరు కావాలని ఇస్స్యూస్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎల్ ఎల్ పి అంటూ ఛానల్స్ విషయంలో సపరేట్ గా ఉండడంతో కౌన్సిల్ కు వచ్చే ఆదాయం తగ్గింది. ఆ సమస్యను సాల్వ్ చేస్తానని నిర్మాత సి కళ్యాణ్ గారు చెప్పారు. ఎన్నికల విషయంలో కూడా అనవసరంగా ఎన్నికల కోసం డబ్బు ఖర్చు చేసే బదులు అందరు ఒక్కటిగా ప్యానల్ ని ఎన్నుకుంటే బాగుంటుంది. ఈ విషయంలో ఎఫ్ డి సి చైర్మన్ రామ్మోహనరావు, సురెష్ బాబు తో కూడా మాట్లాడాను, దాంతో పాటు చాలా మంది నిర్మాతల అభిప్రాయం కూడా అదే.

ఈ నెల 18న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విత్ డ్రా చేసుకుంటే బాగుంటుంది. ఎన్నికల తరువాత చేసే బదులు ముందే చేస్తే ఎన్నికలు లేకుండానే నిర్మాతల ప్యానల్ ని ఎంచుకోవచ్చు. ఇప్పటి వరకు నిర్మాతల మండలి ఆధ్వర్యంలో హెల్త్ కార్డ్స్, పేద విద్యార్థులకు చదువులకు సహాయం చేయడం లాంటివి చేస్తున్నాం. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే ఇలాంటి సేవ కార్యక్రమాలు మరిన్ని చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ అందరి ఉద్దేశం ఒక్కటే .. ఎన్నికలు వద్దు. అందరు పెద్ద వాళ్లతో కూర్చుని నిర్మాతల మండలి ప్యానల్ ని ఎంపిక చేస్తే బాగుంటుంది. రేవు 18న విత్ డ్రా చేసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా ముందుకు రావాలని అన్నారు.

మరో నిర్మాత శంకర్ గౌడ్ మాట్లాడుతూ .. అందరం కలిసిపోయి నిర్మాతల మండలి ఎన్నికల విషయంలో ఓ మాటమీదుంటే బాగుంటుంది. వాళ్ళు 70 శతం ఉంటె మనం 30 శాతం ఉన్నాం. అందరు ఒకే తాటిపై ఉండాలని కోరుకుంటున్నాను. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి .. అందులో తెలంగాణ నిర్మాతలకు ఇద్దరు ముగ్గురికి పదవులు ఇవ్వరా. ఎప్పుడు మీరే ఆ పదవుల్లో ఉంటారా. ఆ కమిటీలో ఈ సరైన తెలంగాణ వారికీ మంచి పదవులు వస్తాయని భావిస్తున్నాను అన్నారు.
మరో నిర్మాత జె వి ఆర్ మాట్లాడుతూ .. గత ఆరు సంవత్సరాలుగా కౌన్సిల్ వ్యవహారాలను సద్దుమణిగేలా చేసి ఇప్పుడు కొన్సిల్ ని మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఈ ఆరేళ్ళు ఎందుకు కౌన్సిల్ విషయంలో ఎవరు మాట్లాడలేదు. అందులో డబ్బు విషయంలో చాలా ఫ్రాడ్ జరిగింది. దాన్ని ఎవరు ఎందుకు ప్రశ్నిచలేదు. ఫ్రాడ్స్ ను ఎందుకు శిక్షించలేదు. అవకతవకలను కప్పిపుచ్చడానికి ఎన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఎందుకు ఎన్నికలు పెడతామని అంటున్నారు. ఎన్నికలు పెట్టడం అవసరం లేదు .. అందరు కూర్చుని మాట్లాడుకుని ఓకే మాటపై కౌన్సిల సభ్యులను నియమిచేసుకుందాం అని సాయి వెంకట్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నిర్మాతలు పాల్గొన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Ko5i8e

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...