Skip to main content

`ప్రేమ‌జంట‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

సన్ వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ప్రణీత్, సుమయ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `ప్రేమ‌జంట‌`. స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ద‌గ్గుబాటి వ‌రుణ్ ఈ చిత్రాన్ని జూన్ 28న విడుద‌ల చేస్తున్నారు. మహేష్ మొగుళ్ళూరి నిర్మాత. నిఖిలేష్ తొగరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా రీసెంట్‌గా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/` స‌ర్టిఫికేట్‌ను పొందింది. మంగ‌ళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా డైరెక్ట‌ర్ సాగ‌ర్‌, టి.ప్ర‌స‌న్న‌కుమార్ పాల్గొన్నారు. డైరెక్ట‌ర్ సాగ‌ర్ ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా.. 

డైరెక్ట‌ర్ సాగ‌ర్ మాట్లాడుతూ ట్రైల‌ర్‌, పాట‌ల్లో  చూపించినట్టుగా ఈ చిత్రంలోని ప్రేమ జంట సూసైడ్ వరకు వెళ్లారంటే ఎన్ని కష్టాలు పడ్డారో అర్థమవుతోంది. పిక్చరైజేషన్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా చాలా బావున్నాయి.  అమ్మాయి అబ్బాయి కూడా బాగా నటించారు. అందంగా ఉన్నారు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ సినిమాను ప్రతిఒక్కరూ నిర్మిస్తారు కానీ విడుదల వరకు తీసుకురావడం అంత తెలికేమీ కాదు. కానీ ఈ చిత్ర నిర్మాత మహేష్ గారు ఆ కష్టాన్ని అధిగమించినట్టు కనిపిస్తున్నారు

ఆయన పెట్టిన డబ్బు తిరిగి రావాల‌ని కోరుకుంటున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కనపడుతుంది. ఇటీవల వచ్చిన యూత్ ఫుల్ కంటెంట్‌తో ఉన్న మూవీస్ అన్నీ సక్సెస్ అవుతున్నాయి.`ప్రేమ జంట` కూడా విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను అన్నారు

 దగ్గుబాటి వరుణ్ మాట్లాడుతూ మా బ్యానర్ లో ఈ సినిమా విడుదల కానుండడం చాలా ఆనందంగా ఉంది. కంటెంట్ గురుంచి తెలియగానే వెంటనే సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాము. నిఖిలేష్ మహేశ్ ఇద్దరూ స్నేహితులు అవడంతో ఈ సినిమాను ఎంకరేజ్ చేశాను. మంచి సబ్జెక్ట్ తో వస్తున్నాం ఆదరించండి అన్నారు

నిర్మాత మహేష్ మాట్లాడుతూ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న నేను సినీ ఫీల్డ్ లోనికి రావడం జరిగింది. కంటెంట్ చాలా బాగుంది. గ్రేస్ ఫుల్ అబ్బాయి, బ్యూటిఫుల్ అమ్మాయి ల ప్రేమే ఈ చిత్రం. అందరికీ నచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు నిఖిలేష్ మిమ్మల్ని తప్పకుండా అలరించే చిత్రం అవుతుంది అన్నారు

దర్శకుడు నిఖిలేష్ మాట్లాడుతూ పదమూడేళ్ల క్రితం ఓ కల కన్నాను. ఆ కల ఇప్పుడు ఇలా నిర్మాత మహేష్ వలన ఈ రోజు నిజమైంది. మహేష్ నా స్నేహితుడు మా జర్నీ  లో సినిమాపై ఇంట్రెస్టింగ్ తో అడుగుపెట్టడం జరిగింది. ఔట్ ఫుట్ చాలా బాగోచ్చింది. పెళ్లి చేసుకోవడానికి ఉన్న వయసు.  ప్రేమించడానికి పనికి రాదా… ? ఒక వేళ ప్రేనిస్తే ఎలాంటి పరుణామాలను ఎదుర్కుంటారనే ముఖ్యాంశాలు ఈ ప్రేమజంట సినిమాలో చూపించాం. సహజంగా తీసిన కథాంశం కనుకే సహజంగా ఉన్న యాక్టర్స్‌ని తీసుక‌న్నాం. మ్యూజిక్ కూడా అద్భుతంగా వచ్చింది.  నిర్మాత  మహేష్ పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగితీరుతుంది..అది ఈ నెల 28న సినిమా విడుదలైన తరువాత మీకే అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు

హీరోయిన్ సుమయ‌ మాట్లాడుతూ  “ నాకు యాక్టింగ్ లో జీరో నాలెడ్జ్. కానీ డైరెక్టర్ సర్ ఎంతో ప్రొత్సహించారు.  అందరం కష్టపడి పనిచేసాము. మా కష్టం యెక్క ఫలితం దాని తాలూకు విజయం సినిమా విడుదల అయ్యాక తెలుస్తుంది. బ్యూటిఫుల్ లవ్ స్టొరీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా అని తెలిపారు

ప్రసన్న కుమార్, టిక్ టాక్ దినేష్, బెంజ్ బాబు, సురేష్ శెట్టి పల్లి లతో పాటు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రామ్ ప్రణీత్, సుమయ , రాజా రవీంద్ర, ఉత్తేజ్, షఫీ, సూర్య, బెంజ్ బాబు, దినేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: నిఖిలేష్, డిఓపి: సురేష్ శెట్టిపల్లి, ఎడిటర్: ఎమ్ ఆర్. వర్మ, డిటీఎస్: కృష్ణం రాజు, సౌండ్ ఈఫ్: యతి రాజు, ప్రొడ్యూసర్: మహేష్ మొగులూరి, డైరెక్టర్: నిఖిలేష్ తోగరి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2L7cHIm

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...