
ఇక దీనికి తోడు నైజాంలో మూడు రోజుల్లో కోటిన్నర కు పైగా షేర్ వసూల్ కావడంతో ఫలక్ నుమా దాస్ హిట్ అనే చెప్పాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ ఫలక్ నుమా దాస్ అంతగా ప్రభావం చూపించడం లేదు. ఈ ప్లాప్ టాక్ కు తోడు పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి ఈ చిత్రానికి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రం పై విశ్వక్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఫలక్ నుమా దాస్ కు నెగెటివ్ గా మారాయి. అయితే విశ్వక్ సేన్ కామెంట్స్ ఫలక్ నుమా దాస్ ని ఇబ్బంది పెడుతున్నప్పటికి ఈ హీరో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. దాంతో వివాదం మరింతగా పెరుగుతుండటంతో ఎట్టకేలకు సారీ చెప్పాడు. నోటి వరకైతే సారీ చెప్పాడు కానీ ఆటిట్యూడ్ ప్రకారం అయితే తగ్గడమే లేనట్లుగా కనిపిస్తోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2JVdufM
Comments
Post a Comment