చాంద్రాయణ గుట్ట శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఒవైసి ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటిన లండన్ కు తరలించారు . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అక్బరుద్దీన్ ఇక్కడే చికిత్స పొందుతున్నాడు . అయితే ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో లండన్ కు తరలించారు మెరుగైన వైద్యం కోసం . గతంలో చాంద్రాయణ గుట్ట వద్ద అక్బరుద్దీన్ ఒవైసి పై దాడి జరిగిన విషయం తెలిసిందే .
అప్పటి దాడిలో ప్రాణాపాయ పరిస్థితి నుండి బయట పడినప్పటికీ అప్పటి నుండి ఖరీదైన వైద్యం చేయించుకుంటూనే ఉన్నాడు అక్బరుద్దీన్ ఒవైసి. లండన్ కు తరలించడంతో అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలని ఆ అల్లా ని ప్రార్ధించాలని వేడుకుంటున్నాడు అక్బరుద్దీన్ అన్న హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2wLqrAe

Comments
Post a Comment