Skip to main content

యూత్‌కు… లేడీస్‌కు… న‌చ్చే సినిమా ‘ఐ ల‌వ్ యు’

ఓం‘, ‘‘, ‘సూపర్ వంటి భారీ బ్లాక్ బస్టర్స్‌తో తెలుగులో సంచలనం సృష్టించిన కన్నడ కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర. ఆయన సినిమా తెలుగులో విడుదలవుతుందటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. తెలుగు బాక్సాఫీస్ ను ఆయన సినిమాలు షేక్ చేసిన సందర్భాలెన్నో. కొత్త విరామం తరవాత మరోసారి తెలుగులో తన సినిమాను విడుదల చేస్తున్నారు ఉపేంద్ర.

ఉపేంద్ర హీరోగా నటించిన తాజా సినిమా ఐ లవ్ యు‘. ‘నన్నే ప్రేమించు అనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్‌. తెలుగు పరిశ్రమకు కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీతో దర్శకుడిగా పరిచయం అయిన ఆర్‌. చంద్రు, శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 14న సినిమాను విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి విశాఖ తీరంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.   

ఉపేంద్ర మాట్లాడుతూ “విశాఖపట్టణం అందమైన ప్రదేశం. ఇక్కడికి వచ్చాక థ్రిల్లయ్యా. ఇక్కడి ప్రజలు అదృష్టవంతులు. శని, ఆదివారాలు బీచ్ లో ఎంజాయ్ చేయవచ్చు. ఈ వాతావరణం చాలా బాగుంది. అంతకు మించి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఇంకా బాగున్నాయి. చంద్రుగారితో నా కాంబినేషన్‌లో ఐ లవ్ యు సెకండ్ ఫిల్మ్. ‘రాగా ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేసరికి లేడీస్ ఫిల్మ్ అవుతుంది. అంత అందమైన, ఏమీ కోరని ప్రేమ గురించి చెప్పే సినిమా ఇది. నా సినిమాల తరహాలో రెగ్యులర్ లవ్, పోస్ట్ మార్టమ్ సన్నివేశాలు ఉంటాయి. ఎక్స్‌ట్రాడిన‌రీ ఎమోష‌న‌ల్ మూవీ. తప్పకుండా భార్యాభర్తలు వచ్చి సినిమా చూడాలి. ఫస్ట్ యూత్ ఆడియన్స్ అందరూ రండి. తరవాత భార్యాభర్తలను పంపండి. ప్రేమ అంటే ఏంటి? నిజమైన ప్రేమను ఎలా చూపించాలి? అనే చక్కటి సందేశంతో చేసిన చిత్రమిది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, యాక్షన్, పంచ్ డైలాగ్స్ ఉంటాయి.   

ఆర్. చంద్రు మాట్లాడుతూ “నేను విశాఖపట్టణం రావడం ఇది రెండోసారి. గంటా శ్రీనివాసరావుగారు వాళ్ళబ్బాయి రవితో సినిమా చేయాలని ఫోన్ చేయడంతో తొలిసారి వచ్చాను. మలయాళ ప్రేమమ్ రీమేక్ చేద్దామనుకున్నాం. కానీ, కుదరలేదు. భవిష్యత్తులో తప్పకుండా రవితో సినిమా చేస్తాను. ఈ సినిమా విషయానికి వస్తే…. ఉప్పీ సార్‌ బ్రహ్మ చేశాను. ఇప్పుడీ ఐ లవ్ యు రెండో సినిమా. తెలుగులో కూడా నా రెండో సినిమా ఇది. ఇంతకు ముందు ల్యాంకో హిల్స్ శ్రీధర్ తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ నా తొలి సినిమా. గొప్ప నటుడు, దర్శకుడు అయిన ఉపేంద్రగారితో డిస్క్స్ చేసి ఈ సినిమా చేశా. ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. ఉదాహరణకు టీనేజ్‌లో మన ప్రేమను  ఎవరికి చెప్పాలో? ఎలా చెప్పాలో? తెలియక చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటారు. ‘ఐ లవ్ యు ఎక్కడ.. ఎవరికి ఎలా చెప్పాలనే సందేశంతో రూపొందించిన చిత్రమిది. అలాగే, ఉపేంద్ర సార్ క్యారెక్ట‌రైజేష‌న్ మ‌స్త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్‌తో ప్రతి ఒక్కరూ క్లైమాక్స్‌లో లేచి క్లాప్స్ కొట్టేలా ఉంటుంది. ప్రామిస్ చేస్తున్నా క్లైమాక్స్‌లో ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి ఐ లవ్ యు అని చెప్తారు. జూన్ 14న సినిమా విడుదల కానుంది. ఉపేంద్రగారితో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనిపిస్తుంది. కుదిరితే ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకు ఒకసారి ఉప్పీ సార్ తో సినిమా చేయాలనుకుంటున్నా అని అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ డా. కిరణ్ తోటంబైల్ మాట్లాడుతూ “ఒక పెద్ద సినిమాకు నేను సంగీతం అందించడం ఇదే తొలిసారి. ఉపేంద్ర సార్, రచితా రామ్, కన్నడలో స్టార్ దర్శకుడు ఆర్. చంద్రు కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరూ సినిమా చూసి మాకు మద్దతు ఇవ్వాలని, కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

సోను గౌడ మాట్లాడుతూ “అందరికీ నమస్కారం. నాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. ఉపేంద్ర సార్, చంద్రు సార్‌తో ఫస్ట్ టైమ్ వర్క్ చేశా. కన్నడతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదలవుతోంది. ఇదే నా తొలి తెలుగు సినిమా. ప్లీజ్ సినిమా చూడండి. పాటలు, ట్రైల‌ర్‌లో నేను కనిపించలేదు. అందువల్ల, సినిమాలో నా క్యారెక్టర్ ఏంటనేది మీకు తెలియదు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశా. అదేంటో సస్పెన్స్. సినిమా చూస్తే నా క్యారెక్ట‌ర్‌కి ఉన్న‌ ఇంపార్టెన్స్ తెలుస్తుంది అని అన్నారు

కెజిహెచ్ హాస్పిటల్ సూప‌ర్‌డెంట్‌ డా. అర్జున మాట్లాడుతూ “ఉపేంద్రగారి ఐ లవ్ యు మూవీ పాటల విడుదల కార్యక్రమం విశాఖలో జరగడం సంతోషంగా ఉంది. ఉపేంద్రగారి సినిమాలు ఎనర్జిటిక్ గా ఉంటాయి. విశాఖలో సినిమా షూటింగ్ చేసినా ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకలు జరిగినా ఆ సినిమా సూపర్ హిట్టే. చిత్ర బృందానికి మంచి పేరు తీసుకొస్తాయి అని అన్నారు

సోను గౌడ, బ్రహ్మానందం, హోనవళ్ళి కృష్ణ, జై జగదీష్‌, పీడీ సతీష్‌ తదితరులు నటించిన ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి

పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు ఫణి కందుకూరి 

స్టంట్స్‌: గణేష్, వినోద్, డా. కే రవి వర్మ 

కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన (ఉపేంద్ర), తేజస్విని (రచితా రామ్)

కాస్ట్యూమర్: గండశి నాగరాజ్

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మునీంద్ర కె. పుర

ఎడిటర్‌: దీపు ఎస్‌. కుమార్‌

లైన్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ సూర్య

ఆర్ట్‌ డైరెక్టర్‌: మోహన్‌ బి. కేరే

గాయకులు: ఉపేంద్ర, అర్మాన్ మాలిక్, విజయ్ ప్రకాష్, హేమంత్ మను కోకిల, శ్రేయా ఘోషల్, వాణి హరికృష్ణ

కొరియోగ్రఫీ: చిన్ని ప్రకాష్‌, ధను, మోహన్‌

లిరిక్స్: డా చల్లా భాగ్యలక్ష్మి 

సినిమాటోగ్రఫీ: సుజ్ఞాన్ 

మ్యూజిక్‌ డైరెక్టర్‌: డా. కిరణ్‌ తోటంబైల్‌

రచన, నిర్మాణం, దర్శకత్వం: ఆర్‌. చంద్రు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2EVreTR

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...