Skip to main content

డ్రీమ్ టీమ్ బ్యాన‌ర్‌పై హ‌రినాథ్ పొలిచెర్ల `కెప్టెన్ రాణా ప్రతాప్‌` ఆడియో విడుదల

Captain Rana pratap audio release

డ్రీమ్ టీమ్ బ్యాన‌ర్‌పై హ‌రినాథ్ పొలిచెర్ల `కెప్టెన్ రాణా ప్రతాప్‌` ఆడియో విడుదల

ద‌ర్శ‌క నిర్మాత హ‌రినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `కెప్టెన్ రాణాప్ర‌తాప్‌`. `ఎ జ‌వాన్ స్టోరి` క్యాప్ష‌న్‌. మిలిట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుంది. ఈ చిత్రంలో హ‌రినాథ్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను సీనియర్ హీరో సుమన్, బిగ్ ఆడియో సీడీని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా

అమ‌ర్ నాథ్ మాట్లాడుతూ – “సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. సినిమాలో నా వంతు స‌హకారాన్ని అందించాను“ అన్నారు.

హీరోయిన్ నిషి మాట్లాడుతూ – “చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను. హ‌రినాథ్‌గారికి థాంక్స్‌. తెలుగులో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌డం సంతోషంగా ఉంది. ఇక్క‌డ మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను“ అన్నారు.

హీరోయిన్ జ్యోతిరెడ్డి మాట్లాడుతూ – “హ‌రినాథ్‌గారు ఓ గ్రంథం. ఓ డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌, రైట‌ర్‌, ఆర్టిస్ట్.. ఇలా అన్నీ రంగాల్లో త‌న‌వంతు ప్ర‌తిభ ఉన్న న‌టుడాయ‌న‌. ఆయ‌న ఓ మంచి సినిమా చేయాల‌నుకోవ‌డం.. అందులో మేమందరం భాగం కావ‌డం ఆనందంగా ఉంది. సరిహ‌ద్దుల్లో సైనికులు త‌మ ప్రాణాల‌ను పణంగా పెట్టి కాపాడుతున్నారు. అలాంటి సైనికులు గురించి సినిమా తీయ‌డం గొప్ప విష‌యం. నేను డిఫ‌రెంట్ పాత్ర‌ను చేశాను“ అన్నారు.

హీరో సుమన్ మాట్లాడుతూ..అమెరికాలో డాక్టర్ అయ్యికూడా మంచి మెస్సేజ్ ఉన్న సినిమాలను తీయాలనే ఉద్దేశ్యంతో దాదాపు 14 సినిమాలను చేసాడు డా. రఘు నాథ్. అందుకు అభినందించాల్సిన విషయమే.. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. నేను ఇందులో మేజర్ పాత్రలో నటించాను. చాలా పవర్ ఫుల్ పాత్ర అది. బోర్డర్ లోని ఆర్మి వాళ్ళ గురుంచి వారి గొప్పతనం గురుంచి చాలా గొప్పగా చూపించారు రఘు గారు. ఒకే వ్యక్తి డైరెక్ట్ చేసి, నటించి, నిర్మించడం అనే పనులు చేయడం చాలా కష్టం అయినా కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని సినిమాను తెరకెక్కించారు ఆయన. ఈ కథ వినగానే డేట్స్ అడజస్ట్ చేసి మరీ సినిమాలో నటించాను నేను.. అంతలా నచ్చింది నాకు సినిమా. ఒక గౌరవాన్ని కూడా తెచ్చిపెడుతుందని నమ్మకంగా చెప్పగలనని తెలిపారు.

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. డా. రఘునాథ్ అమెరికాలో మంచి హస్త వాసి ఉన్న డాక్టర్ గా రోగాలను పొగిడితే.. ఈ సినిమాలో ఆర్మి కెప్టెన్ గా దేశాన్ని కాపాడే ఆఫీసర్ గా నటించాడు. మల్టిటాలెంట్ ఉన్న వ్యక్తి రఘు. సైనికుడి రియల్ లైఫ్ ను ఈ సినిమాలో చూపించారు. అందరికీ నచ్చేలా సినిమా కథను రూపొందించారని అర్థం అవుతోంది. సాంగ్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుతున్నా అన్నారు.

డా.హ‌రినాథ్ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలు కెప్టెన్ రానా ప్రతాప్ స్టోరీ ని మలిచాను. అందుకు తగ్గట్టే క్యాస్టింగ్ కూడా కుదిరింది. అందరూ తమ తమ పాత్రల్లో జీవించారు. సైనికుడి లైఫ్ ను ఇందులో చూపించడం జరిగింది. సైనికులు లేకపోతే మనం లేము.. అనే కాన్సెప్ట్ తో కథ సాగుతుంది. వారికి ఓ పర్సనల్ లైఫ్ ఉంటుంది అది కూడా ఈ చిత్రంలో చూపించాము. చిత్రీకరణ బాగా జరిగింది. అందరికీ నచ్చే తీరులో ఉన్న ఈ చిత్రాన్ని జూన్ 21 న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జొన్నవిత్తుల, జ్యోతి రెడ్డి, వడ్లపల్లి కృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు..

న‌టీన‌టులు:
హ‌రినాథ్ పొలిచెర్ల‌,సుమ‌న్‌,పునీత్ ఇస్సార్‌,షాయాజీ షిండే ,అమిత్‌,జ్యోతిరెడ్డి,నిషి,గిరి త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి సాంకేతిక వ‌ర్గం :బ్యాన‌ర్‌: డ్రీమ్ టీమ్‌, మ్యూజిక్: చ‌ర‌ణ్‌-ష‌కీల్‌, కెమెరా: వ‌ంశీ ప్ర‌కాశ్‌, ఎడిట‌ర్‌:వెంక‌ట ర‌మ‌ణ‌, ఆర్ట్‌: గోవింద్‌,కాస్ట్యూమ్స్‌: జ‌న‌క ముని,క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: హ‌రినాథ్ పొలిచెర్ల‌



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/31mnVi3

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...