Skip to main content

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ట్రైలర్ లాంచ్

స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న చిత్రం `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ`. స్వరూప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ట్రైల‌ర్‌ను `మ‌హాన‌టి` దర్శకుడు నాగి మరియు నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా…

మధుర శ్రీధర్ మాట్లాడుతూ “ఇంట్రెస్టింగ్ టైటిల్. `మ‌ళ్ళీరావా`లాంటి మంచి చిత్రాన్ని నిర్మించి, అభిరుచి గ‌ల నిర్మాత అని పేరు తెచ్చుకున్న రాహుల్ యాద‌వ్ న‌క్కా ఈ సినిమా నిర్మాత అంటే సినిమా ఏంటో అర్థం అవుతుంది. నవీన్ మంచి యాక్టర్. అతను నటిస్తున్న ఈ డిఫరెంట్ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.

డైరెక్ట‌ర్ నాగి మాట్లాడుతూ “నవీన్ నాకు `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` చిత్రం నుంచి పరిచయం. త‌న‌లో మంచి నటుడు ఉన్నాడు. యూనిక్‌గా ప్రమోట్ చేస్తే సినిమాపై ఆటో మేటిక్‌గా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇలాంటి ప్రమోషన్స్‌తోనే వస్తున్నారు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` టీమ్. ట్రైలర్‌లో కామెడీ, థ్రిల్లర్ కనిపిస్తున్నాయి. మంచి సబ్జెక్ట్‌తో వస్తున్నారని మాత్రం అర్ధం అవుతుంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలుతున్నా“ అన్నారు.

చిత్ర దర్శకుడు స్వరూప్ మాట్లాడుతూ “ ఏజెంట్ అనే ప‌దం ప‌క్క‌న ఇంగ్లీష్ పేర్లతో ఉన్న టైటిల్స్ చాలా కనిపిస్తాయి మనకు. అందుకే ఏజెంట్ పక్కన స్వచ్ఛమైన తెలుగు పేరు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ఈ `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` అనే టైటిల్ ను ఈ చిత్రానికి పెట్టాం. మొదట్లో నిర్మాత రాహుల్‌గారు క‌న్విన్స్ అవ‌లేదు. టైటిల్ డిజైన్ చేశాక క‌న్విన్స్ అయ్యారు. టైటిల్ లాగానే సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆత్రేయ మిమ్మల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, థ్రిల్ చేస్తాడు. సినిమా చూశాక మంచి ఫీలింగ్‌తో బ‌య‌ట‌కు వ‌స్తారు“ అన్నారు.

నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా మాట్లాడుతూ “ స్క్రిప్ట్ నన్ను ఆలోచింప చేసింది. టైటిల్ చూసి భయపడ్డాను. కానీ డిజైన్ చూశాక స‌ర్‌ప్రైజ్ అయ్యాను. నవీన్ లాంటి నటుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు గ‌ర్వంగా ఫీల్ అవుతున్నా. నా సినిమాకు ప్రతిసారి కొత్త టాలెంట్‌ల‌ను ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నా. అలానే ఈ చిత్రంతో నవీన్‌తో పాటు డైరెక్టర్ స్వరూప్ కూడా పరిచయం అవుతున్నారు. ఇక ఈ మా `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` డిఫరెంట్ గా ఉండంతో పాటు ఆలోచింప చేస్తుందని నమ్మకంగా చెప్పగలను“ అని అన్నారు.

హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ “ను యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌తో అందరికీ సుపరిచితుడ్నే. ఇప్పుడు ఈ చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నా. నాకు చాలా స్పెష‌ల్ మూమెంట్ ఇది. లండన్ లో ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్ రైటర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టాను. బాలీవుడ్‌లో కొన్ని వెబ్ సీరీస్‌లు కూడా చేశాను. ఇప్పుడు ఈ చిత్రంలో మెయిన్ లీడ్‌గా న‌టిస్తున్నాను. ఈ స్క్రిప్ట్ ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి త‌యారు చేసుకున్నాను. త‌ర్వాత నిర్మాత రాహుల్‌గారిని క‌లిశాం. జూన్ 21న సినిమా మీ ముందుకు వస్తోంది. ఈ చిత్రం తప్పకుండా నవ్విస్తుందని చెప్పగలను“ అని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ రాబిన్, సౌండ్ డిజైనర్ నాగార్జున్ తల్లపల్లి,పాట‌ల ర‌చ‌యిత కృష్ణ కాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ, రామ్ దూత్, సుహాస్, శ్రద్ధా రాజగోపాలన్, కృష్ణేశ్వర్ రావు, విశ్వనాథ్, ప్రశాంత్, సందీప్ రాజ్, విను వర్మ, అప్పాజీ అంబర్శ్ దర్భ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆడియోగ్రఫీ: అజిత్ అబ్రహామ్ జార్జి, మ్యూజిక్: మార్క్ రాబిన్, సౌండ్ డిజైన్: నాగార్జున్ తల్లపల్లి, లిరిక్స్: కృష్ణ కాంత్, సింగర్: అనురాగ్ కులకర్ణి, కాస్ట్యూమ్స్: మోనిక యాదవ్- వనజ యాదవ్, ఆర్ట్: క్రాంతి ప్రియం, ఎడిటర్-కో డైరెక్టర్: అమిత్ త్రిపాఠి, సినిమాటోగ్రఫీ: సన్నీ కృపాటి, స్క్రీన్ ప్లే: స్వరూప్- నవీన్ పొలిశెట్టి, ప్రొడ్యూసర్: రాహుల్ యాదవ్ నక్కా, స్టోరీ-డైలాగ్స్- డైరెక్షన్: స్వరూప్ ఆర్.ఎస్.జె.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Xx5swQ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...