Skip to main content

కొత్త జోన‌ర్ సినిమాలు చేయాల‌నే మా ప్ర‌య‌త్నాన్ని `నీవెవ‌రో`తో ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ – చిత్ర స‌మ‌ర్ప‌కుడు కోన వెంక‌ట్‌

neevevaro movie press meetఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘నీవెవరో` . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 24న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం జ‌రిగిన థాంక్స్ మీట్‌లో…

హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ – “సినిమా రిలీజ్ అయిన రోజు శ్రావ‌ణ శుక్ర‌వారం కాబ‌ట్టి క‌లెక్ష‌న్స్ త‌క్కువ‌గా ఉన్నా కూడా.. ఈ షోకి క‌లెక్ష‌న్స్ పెరుగుతూ వ‌చ్చి ఈరోజు ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ఈ రోజు మేం సినిమా చేయ‌డానికి ఏకైక కార‌ణం ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే. ఆడియెన్స్‌లో రెండు ర‌కాలుంటారు. ప‌దిశాతం మంది ప్రేక్ష‌కులు సినిమాను విశ్లేషిస్తే… మిగిలిన 90 శాతం ప్రేక్ష‌కులు సినిమాను ఎంజాయ్ చేయాల‌నుకునే వెళ్తారు. అలాంటి వారికి వంద‌శాతం న‌చ్చే సినిమా ఇది. ఈసారి చేసే సినిమా వంద‌శాతం అంద‌రికీ న‌చ్చేలానే చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం“ అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు కోన వెంక‌ట్ మాట్లాడుతూ – “మా టీమ్ అంద‌రం క‌లిసి ఓ సైన్యంలా ప‌నిచేశాం. ఓ సినిమా న‌మ్మ‌కంతోనే మొద‌లై.. న‌మ్మ‌కంతోనే ఎండ్ అవుతుంది. న‌మ్మ‌కం దేవుడితో స‌మానం. సినిమాను తీసేవాళ్లు.. చేసేవాళ్లు.. చూసేవాళ్లు.. అంద‌రికీ జాబ్ శాటిస్‌ఫాక్ష‌న్ ఇచ్చిన సినిమా. మా టార్గెట్ రీచ్ అయ్యామ‌ని అనుకుంటున్నాం. జేబు శాటిస్‌ఫాక్ష‌న్ ఇంకా రాలేదు. ఆడియెన్స్‌కు సినిమా రీచ్ అవుతుంది. మా న‌మ్మ‌కాన్ని అంద‌రూ న‌మ్మాల‌ని లేదు. అయితే అంద‌రూ న‌మ్మే వ‌ర‌కు మంచి సినిమాలు చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతూనే ఉంటుంది. కొత్త ప్ర‌య‌త్నాలు వ‌ల్ల కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ ఇండ‌స్ట్రీలోకి వ‌స్తారు. ఎం.వి.వి.స‌త్యనారాయ‌ణ‌గారు ఏడాదికి వంద‌కోట్ల ట‌ర్న్ ఓవ‌ర్ ఉంటుంది. అలాంటి వ్య‌క్తి.. కొత్త సినిమాలు చేయాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాం. వెంకీ నుండి బాద్‌షా వ‌ర‌కు సినిమాలు చేసి స‌క్సెస్ అయినా కూడా… హౌస్ డ్రామాలు ఎన్ని రోజులు తీస్తారు అని తిట్టారు. రూట్ మార్చి ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్ పెట్టి 2014 నుండి కొత్త జ‌ర్నీ స్టార్ట్ చేశాం. కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయాల‌ని ప్రారంభించిన మా జ‌ర్నీలో మేం చేసిన నిన్నుకోరి.. ఈవాళ చేసిన నీవెవ‌రో సినిమాలు వ‌చ్చాయి. ఎంక‌రేజ్ మెంట్ అంద‌రికీ చాలా ముఖ్యం. ఈ సినిమా కోసం ఎవ‌రు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. కొన్ని వంద‌లు మంది .. వేల గంట‌లు ప‌నిచేస్తే.. ఓ సినిమా వ‌స్తుంది. అలాంటి సినిమాను ఓ ప‌ది రూపాయ‌ల పెన్‌తో కొట్టి ప‌డేయ‌డం స‌రికాదు.. ఇది నా ఆక్రోశం కాదు.. ఆవేద‌న‌. ఆడియెన్స్ కోస‌మే మేం సినిమాలు చేస్తాం. రాసేవాళ్లు అది అర్థం చేసుకుంటే చాలు. సినిమా జ‌ర్నీలో చాలా ఎమోష‌న్స్ మిళిత‌మై ఉంటాయి. కొత్త ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నం మాది. మా టార్గెట్‌ని వంద‌కు వెయ్యి శాతం పూర్తి చేశాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు హ‌రినాథ్ మాట్లాడుతూ – “మా ప్ర‌య‌త్నాన్ని ఆద‌రించిన ఆడియెన్స్‌కు థాంక్స్‌. అవ‌కాశం ఇచ్చిన కోన వెంక‌ట్‌, ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌గారికి థాంక్స్‌. ప్ర‌తి ఒక న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ధ‌న్య‌వాదాలు. ఆదిగారు త‌న న‌ట‌న‌తో క‌ల్యాణ్ అనే క్యారెక్ట‌ర్‌కి ప్రాణం పోశారు. తాప్సీ, రితికా సింగ్‌కి థాంక్స్‌“ అన్నారు.
స‌ప్త‌గిరి మాట్లాడుతూ – “ఆదిగారు సెటిల్డ్ పెర్ఫామ‌ర్‌. త‌న‌తో పాటు కోన‌గారికి, స‌త్య‌నారాయ‌ణ‌గారికి ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌“ అన్నారు.

రితికా సింగ్ మాట్లాడుతూ – “నాలోని కొత్త కోణాన్ని ప‌రిచ‌యం చేసిన చిత్ర‌మే నీవెవ‌రో. నాపై న‌మ్మ‌కంతో నాకు అవకాశం ఇచ్చిన హ‌రినాథ్‌, కోన వెంక‌ట్‌, ఎం.వి.వి.సత్య‌నారాయ‌ణ‌గారు.. సెట్స్‌లో స‌పోర్ట్ చేసిన తాప్సీ, నీర‌జ కోన‌, తుల‌స‌మ్మ‌, శివాజీరాజాగారు స‌హా అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.
శివాజీరాజా మాట్లాడుతూ – “ఆది తండ్రి రవిరాజా పినిశెట్టిగారి వంటి గొప్ప డైరెక్ట‌ర్ వ‌ల్ల‌నే నేను న‌టుడిగా ఎదిగాను. ఆయ‌న త‌న‌యుడు ఆది మా అందరికీ కావాల్సిన వాడే. న‌ట‌న‌లో ఆది డేడికేష‌న్ తెలిసిందే. కోన వెంక‌ట్‌కు సినిమాయే ప్ర‌పంచం. రితికా సింగ్ మంచి న‌టి.. మంచి ఎన‌ర్జీతో ఉంటుంది. సినిమా స‌క్సెస్ కావ‌డం చాలా ఆనందంగా ఉంది“ అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2wrTzvQ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...