మెగా బ్రదర్ నాగబాబు గొంతు కు ఏమయ్యింది ! గతకొంత కాలంగా నాగబాబు వాయిస్ సరిగా లేదు , మాటలు సరిగ్గా మాట్లాడలేక పోతున్నాడు దాంతో ఇటీవల నటించిన ” గీత గోవిందం ” చిత్రంలో వేరే వాళ్ళ చేత నాగబాబు పాత్రకు డబ్బింగ్ చెప్పించారు . ఇప్పటి నుండి కాదు గత ఆరు నెలలుగా గొంతు సమస్యతో బాధపడుతున్నాడు నాగబాబు . ఇక ఈ విషయాన్నీ జబర్దస్త్ కార్యక్రమం చూస్తున్న వాళ్లకు మరింతగా స్పష్టం అవుతుంది ఎందుకంటే జబర్దస్త్ ప్రోగ్రాం లో వివిధ సందర్భాల్లో నాగబాబు మాట్లాడాల్సి ఉంటుంది కానీ ఇంతకుముందు లా నాగబాబు మాట్లాడలేక పోతున్నాడు ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పొడిపొడి మాటలు మాత్రమే మాట్లాడుతున్నాడు అంతే !
ఇంతకుముందు నాగబాబు నటించిన చిత్రాల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు కానీ తాజాగా గీత గోవిందం చిత్రంలో మాత్రం డబ్బింగ్ చెప్పుకోలేకపోయాడు అందుకు గొంతు సహకరించకపోవడం వల్లే ! మరి ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్నాడు నాగబాబు . మరి ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో డబ్బింగ్ చెప్పడం డౌటే !
English Title: what about nagababu voice
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2LtUa5L
Comments
Post a Comment