Skip to main content

ఆమని ప్రధానపాత్రలో అమ్మదీవెన ప్రారంభం

amma deevena movie openingఆమని కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ‘అమ్మ దీవెన’. పద్మ సమర్పిస్తున్నారు. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, దినేష్, శరత్ చంద్ర కీలక పాత్రలు చేయగా ఈ సినిమాకు ఎత్తరి గురవయ్య నిర్మాత. పద్మజ నాయుడు, ఎత్తరి చినమారయ్య ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. శివ ఏటూరి దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రాజ్ కందుకూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. బి.గోపాల్ ఫస్ట్ షార్ట్ డైరక్షన్ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో

దర్శకుడు మాట్లాడుతూ “కథ విన్నాక అంగీకరించిన ఆమనిగారికి ధన్యవాదాలు. దర్శకుడిగా నాకు ఇది మొదటి చిత్రం. చక్కటి కుటుంబ కథా చిత్రమిది. నాకు ఈ అవకాశం కల్పించిన మా నిర్మాతలకు ధన్యవాదాలు పిల్లలు నైతిక విలువలు తెలుసుకుంటారని అభిప్రాయము ”అని అన్నారు.

ఆమని మాట్లాడుతూ “ఇదొక మంచి సినిమా. ఫ్యామిలీలో అందరికీ కనెక్ట్ అవుతుంది. కుటుంబంలో తల్లి బాధ్యత ఎలా ఉంటుందనే విషయాన్ని చూపించే సినిమా. పిల్లలను ఒక స్థాయికి తీసుకురావడానికి తల్లి ఎంత కష్టపడుతుందనే విషయాన్ని ఇందులో చక్కగా చూపిస్తున్నారు. నిర్మాతలు చాలా ధైర్యంగా ముందుకొచ్చారు ఇలాంటి కథను తీయడానికి. దర్శకనిర్మాతలు నన్ను కలిసి కథ చెబుతామని అన్నప్పుడు ఆలోచించాను. కానీ కథ విన్నాక ఏమీ మాట్లాడలేదు. చేస్తాననే అన్నాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ కేరక్టర్‌” అని అన్నారు. ఇక పద్మగారి గురించి చెప్పాలంటే ఆమె డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని చెప్పలేము ఈ చిత్రానికి అన్ని తానై చేశారు. ఈ చిత్రం ఆల్‌మోస్ట్ టీమ్ వర్క్ అని చెప్పాలి అన్నారు. లమ్మమ్మగారి రియల్ స్టోరీ ఆమె నిజ జీవితంలో ఎలా ఇబ్బందులు పడ్డారు. పిల్లలను ఎలా పెంచారు. ఎంత బాధ్యతగా పెంచారు అన్న కథాంశంతో ఉన్న చిత్రం అని అన్నారు.

అజయ్ ఘోష్ మాట్లాడుతూ “ఒక మాతృమూర్తి, ఒక త్యాగశీలి కథ ఇది. ఉమ్మడి కుటుంబంలో ఉన్న బంధాలను చక్కగా ఆవిష్కరించే సినిమా. ఇందులో నేను నెగటివ్ రోల్ చేస్తున్నాను” ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన కథ కాబట్టి మీరదందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను ” అన్నారు.

ఎస్వీహెచ్ మాట్లాడుతూ “మా నిర్మాతల అమ్మకథ ఇది. చాలా బావుంటుంది” అని చెప్పారు.

ఈ చిత్రానికి
సంగీతం: యస్.వి.హెచ్, డ్యాన్స్: గణేశ్ స్వామి, ఆర్ట్: పి.వి.రాజు, కథ: ఎత్తరి బ్రదర్స్. మాటలు: శ్రీను.బి., సురేశ్ కుమార్.యం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Nqeqai

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...