Skip to main content

హీరోయిన్ దర్శన బానిక్ ఇంటర్వ్యూ

heroine Darshana Banik interviewమీ గురించి చెప్పండి ?
మాది కొలకత్తా. నేను మోడల్ గా చేశాను. అలాగే బెంగాలీలో ఆరు సినిమాల్లో నటించాను. మరియు ఓ బెంగాలీ వెబ్ సిరిస్ లో కూడా యాక్ట్ చేశాను. సినిమాలు నాకు కొత్త కాదుగాని, తెలుగులో మాత్రం ఇదే నా మొదటి చిత్రం.

‘ఆటగాళ్లు’ చిత్రంలో మీకు హీరోయిన్ గా ఎలా అవకాశం వచ్చింది ?
నేను మోడలింగ్ చేసే ప్రాసెస్ లో లాస్ట్ ఇయర్ బాంబేలో ఓ మ్యూజిక్ వీడియోలో యాక్ట్ చేశాను. ఆ వీడియో కోరియోగ్రాఫర్ విష్ణు దేవా. ఆయనే నా ఫోటో షూట్ పిక్స్ ని ఈ చిత్ర దర్శక నిర్మాతలకి సెండ్ చేసారు. ఆ తర్వాత నేను ఆడిషన్స్ కి వచ్చాను. ఆడిషన్స్ మొత్తం సిక్స్ రౌండ్స్ జరిగాయి. సినిమాలో కొన్ని టఫ్ సీన్స్ లో యాక్ట్ చేసాక, రోహిత్ తో ఫోటో షూట్ చేసి చూశాక ఈ పాత్రకు నేను సరిపోతానని నన్ను సెలెక్ట్ చెయ్యడం జరిగింది.

ఈ చిత్రం ట్రైలర్, ప్రోమోలు చూస్తుంటే ఇది ఒక మైండ్ గేమ్ మూవీలా అనిపిస్తోంది. మరి మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
ఈ సినిమాలో నా పాత్ర పేరు అంజలి. సింపుల్ గా చెప్పాలంటే తను చాలా ఇండిపెండెంట్ మరియు వర్కింగ్ లేడి. సినిమాలోని హీరో పాత్రను సిన్సియర్ గా లవ్ చేస్తోందిల అతన్నే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. వన్ వర్డ్ లో చెప్తే ఆటగాళ్లు చిత్రంలోని ‘అంజలి’ ఓ సిన్సియర్ ప్రేమికురాలు.

మొదటిసారి తెలుగు సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటించే ముందు మీరు తెలుగు సినిమాలు ఏమైనా చూసారా ?
తెలుగు సినిమాలు బెంగాలీలోకి డబ్ అవుతాయి. అలా తెలుగు సినిమాలు చూడటం జరిగింది. ముఖ్యంగా మగధీర, ఆర్య, ధృవ, అరుధంతి, బాహుబలి సిరీస్ ఇలా అన్ని చూసాను. నాకు ‘బాహుబలి’ మూవీ చాలా బాగా నచ్చింది.

తెలుగు సినిమాలకి, బెంగాలీ సినిమాలకి ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి ?
పెద్దగా వ్యత్యాసం అంటూ ఏమి ఉండదు. ఎక్కడైనా కష్టపడే పని చెయ్యాలి. ఫ్యాషన్ తోనే నటించాలి. కో ఆర్టిస్ట్ లతో యూనిట్ తో కోఆర్డినేషన్ బాగుండాలి. రెండు సినీపరిశ్రమల్లో ఒకేలా ఉంటుంది పని. కాకపోతే తెలుగు సినిమాల బడ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది. బెంగాలీ సినిమాలు బడ్జెక్ట్ తెలుగు సినిమాలితో పోల్చుకుంటే కాస్త తక్కువుగా ఉంటుంది, అంతే తేడా.

మరి ఈ చిత్రంలో మీతో పాటు నటించిన నారా రోహిత్, జగపతిబాబు గురించి చెప్పండి ?
నాకు షూట్ లో వాళ్ళు చాలా బాగా సహకరించారు. ఇక ఈ సినిమాలో నారా రోహిత్, జగపతిబాబు పాత్రలు హైలెట్ గా ఉంటాయి. ఇద్దరూ పోటీపడి మరీ నటించారు. వారి మధ్య సాగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మా డైరెక్టర్ పరుచూరి మురళిగారు ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు.

తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. మరి తెలుగులో స్పష్టంగా ఎప్పుడు మాట్లాడతారు ?
నేను తెలుగు అర్ధం చేసుకోగలను, కానీ మాట్లాడలేను. నెక్స్ట్ టైం మాత్రం ఖచితంగా తెలుగులోనే మాట్లాడతాను.

మీకు ఇష్టమైన హీరో ఎవరు ?
బాలీవుడ్ లో అయితే షారుఖాన్. ఆయన సినిమాలన్నీ చూస్తాను. ఇక తెలుగులో ఇష్టమైన హీరోలు అంటే.. ప్రభాస్. బాహుబలి సినిమా చూసి నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలాగే అల్లు అర్జున్ అన్నా కూడా నాకు చాలా బాగా ఇష్టం. డైరెక్టర్ ల్లో రాజమౌళికి నేను పెద్ద అభిమానిని.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OOqwdB

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...