Skip to main content

పెళ్ళిచూపులు, ఆర్ ఎక్స్ 100 ప్రొడ్యూస‌ర్స్‌ని స‌త్క‌రించిన- శుభ‌లేఖ‌+లు టీమ్‌

Shubhaleka+lu Pre Releaseఇటీవల కాలంలో ఓ వెరైటీ టైటిల్‌తో ప్రేక్ష‌కులంద‌రిలో క్యూరియాసిటీని పెంచిన‌ చిత్రం ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్‌లోనూ ఓ బ‌జ్‌ను సొంతం చేసుకున్నదీ చిత్రం. పుష్య‌మి ఫిల్మ్ మేక‌ర్స్ అధినేత బెల్లం రామ‌కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని చూసి ఫ్యాన్సీ ఆఫ‌ర్స్‌ను వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ద‌క్కించుకుని గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. హ‌నుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రామానాయుడు స్టూడియోలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జ‌రుపుకుంది. ఇంకా అశోక్‌రెడ్డి, రాజ్‌కందుకూరిగారికి స‌న్మానం జ‌రిపారు. విలేక‌రుల స‌మావేశంలో…

బెలంకొండ రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ… మా ఆహ్వానాన్ని మ‌న్నించి ఇక్క‌డ‌కి వ‌చ్చిన అతిధులంద‌రికీ మా శుభ‌లేఖ‌+లు టీమ్ త‌ర‌పున‌ కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రానికి మ్యూజిక్ చాలా బాగా కుదిరింది. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా నిలిచే చిత్ర‌మిది. ఈ చిత్రం చూసిన త‌ర్వాత డైరెక్ట‌ర్ ఎవ‌రు అని నేను అడిగాను శ‌ర‌త్ గారు చాలా బాగా తీశారు ఈ చిత్రాన్ని. ఆయ‌న ఈ చిత్రం అంత బాగా రావ‌డానికి కార‌ణం ప్రొడ్యూస‌ర్స్ అన్నారు. మీరంద‌రూ ఈ చిత్రాన్ని చూసి ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

అప్పాజీ ఆర్టిస్ట్ మాట్లాడుతూ… నాది ఈ చిత్రంలో బ్యాలెన్స్‌డ్ పాత్ర‌లో న‌టించాను. అటు పెద్ద‌త‌ర‌హాగాను, ఇటు చిన్న‌వాళ్ళ‌ను అర్దం చేసుకునేలా ఉంటుంది నా పాత్ర‌. ఈ చిత్రం టైటిల్ అలా రావ‌డానికి కార‌ణం ఈ చిత్రంలో చాలా ప్ల‌స్‌లు ఉన్నాయి. ఈ చిత్రానికి ప‌నిచేసిన టెక్నీషియ‌న్లు అంద‌రూ పెద్ద ప్ల‌స్‌లు. మీరంద‌రూ ఈ చిత్రాన్ని చూసి ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో శ్రీ‌నివాస్ సాయి మాట్లాడుతూ… ఈ స్టేజ్ మీద ఉన్న పెద్ద పెద్ద‌ల స‌పోర్ట్ మాకు చాలా అవ‌స‌రం. ఎందుకంటే చిత్రం రిలీజ్ కి ముందు ఎంత టెన్ష‌న్ ప‌డ‌తామో మీ అంద‌రికీ తెలిసిందే. అదే టెన్ష‌న్ ఇప్పుడు మాలోనూ ఉంది. మా డైరెక్ట‌ర్‌గారు సినిమాని చాలా బాగా తీశారు. ఆయ‌న చాలా కొత్త కొత్త థాట్స్‌తో మీ ముందుకు వ‌స్తారు. మా ప్రొడ్యూస‌ర్స్ ఎంత మంచి వాళ్ళంటే అంత మంచి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మేమంద‌రం కొత్త వాళ్ళం అయిన మా మీద న‌మ్మ‌కంతో తీశారు. బెల్లంకొండ రామ‌కృష్ణ‌గారిని చూసిన త‌ర్వాత మాకు ఇంకా కాన్ఫిడెంట్ లెవ్స్ బాగా పెరిగాయి. కెరియ‌ర్‌లో ఎవ‌రికైనా అప్ అండ్ డైన్స్ ఉంటాయి. కాని ఎలాగోలా ఈ కెరియ‌ర్ కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ… మా ప్రొడ్యూస‌ర్ గురించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియ‌డం లేదు. ఆయ‌న నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయ‌న ప్ర‌తి పాట విష‌యంలో నాకు బాగా డిస్క‌స్ చేసి నా వెంటే ఉండేవారు. మంచి మాట‌లు క‌థ క‌థ‌నం అందించిన శ‌ర‌త్‌న‌ర్వాడే గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. సాంగ్స్ అన్ని చాలా బాగా వ‌చ్చాయి. డిసెంబ‌ర్ 7న ఓట్ వేసి వ‌చ్చి మా సినిమాని చూడండి అని అన్నారు.

డైరెక్ట‌ర్ మాట్లాడుతూ… మా ఆహ్వానాన్ని మ‌న్నించి ఇక్క‌డ‌కు వ‌చ్చినందుకు పెద్ద‌లంద‌రికీ మా కృత‌జ్ఞ‌త‌లు. ఇది నేను నా జీవితంలో మ‌ర‌చిపోలేని రోజు. నా కోసం మా టెక్నీషియ‌న్స్ అంద‌రూ చాలా బాగా క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రూ సినిమాని ప్రేమించి చేశారు. డిసెంబ‌ర్ 7న మీ ముందుకు వ‌స్తుంది త‌ప్ప‌కుండా ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను. యూత్‌కి, పేరెంట్స్ మ‌ధ్య ఉండే గ్యాప్ గురించి తీసుకుని చేశాను. పిల్ల‌లు పెళ్లి అనే విష‌యానికి వ‌చ్చేస‌రికి ఎందుకు ఇండివిడ్యూలిటీ కోరుకుంటున్నారు అన్న పాయింట్ మీద ఉంట‌ది. మా ప్రొడ్యూస‌ర్‌గారు ప్ర‌మోష‌న్స్ చాలా బాగా చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆలాంటి ప్రొడ్యూస‌ర్స్ దొర‌క‌డం నా అదృష్టం. మ‌ళ్ళీ స‌క్సెస్‌మీట్‌లో క‌లుద్దాం అని అన్నారు.

ప్రొడ్యూస‌ర్ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ… నేను చాలా ఆనందంగా ఉన్నాను. పెళ్లిచూపులు సినిమా చూసిన‌ప్పుడు ఇంత చిన్న బ‌డ్జెట్ తో కూడా సినిమా తీయొచ్చా అని పించింది.ఆర్ ఎక్స్ 100కి, శుభ‌లేఖ‌+లు కొన్ని సిమిలారిటీస్ క‌న‌బ‌డుతున్నాయి. సినిమాలు తీయ్య‌డం ఒక ఎత్తు అయితే వాటిని రిలీజ్ చెయ్య‌డం మ‌రో ఎత్తు. ఈ చిత్రంలో ప‌నిచేసిన వారంద‌రికీ ఆల్ ద బెస్ట్ 100ప‌ర్సెంట్ మ‌ళ్ళీ ఇక్క‌డే స‌క్సెస్‌మీట్‌ను జురుపుకుంటారు అని అన్నారు.

ప్రొడ్యూస‌ర్ రాజ్‌కందుకూరి మాట్లాడుతూ… మ‌మ్మ‌ల్ని అభినందించి స‌న్మానించినందుకు ముందుగా కృత‌జ్ఞ‌త‌లు. చిన్న సినిఇమాల‌ను ఎంక‌రేజ్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో మ్యూజిక్ చాలా బావుంది. డైరెక్ట‌ర్ కూడా చాలా బాగా తీశారు. మంచి ప్రొడ్యూస‌ర్స్ దొరికారు. నిర్మాత‌లంద‌రినీ కూడా నేను మెచ్చుకుంటున్నాను అని అన్నారు.

దాస‌రి కిర‌ణ్‌కుమార్ మాట్లాడుతూ… నాకిది ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌లా లేదు స‌క్సెస్‌మీట్ లాగా ఉంది. ఇంత మంచి సినిమాను ఎలా తీశాను అంటూ అనుకుంటున్నాము. డిస్ర్టిబ్యూట‌ర్ బెల్లం రామ‌కృష్ణారెడ్డిగారు ప్ర‌మోష‌న్స్ చాలా బాగా చేశారు. ఎల‌క్ష‌న్స్ గొడ‌వ‌లో కూడా ఇంత బాగా ప్ర‌మోష‌న్స్ చేశారు. అంద‌రూ మా ఇన్సిరేష‌న్స్ ప్రొడ్యూస‌ర్స్ అన్నారు అది చాలా గ్రేట్. ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రూ బాగా క‌ష్ట‌ప‌డి చేశారు. అంద‌రూ సినిమా చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో దాస‌రి కిర‌ణ్‌కుమార్‌, అశోక్‌రెడ్డి, రాజ్‌కందుకూరి, బెల్లంకృష్ణారెడ్డి, ప్రియ‌వ‌డ్ల‌మాని, దీక్ష‌శ‌ర్మ‌రైనా, ఇర్ఫాన్‌, సింధు, తిరువీర్‌, వంశీరాజ్‌, మోనాబేద్రె, అప్పాజిఅంబ‌రీష త‌దిత‌రులు పాల్గొన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PlhtRa

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...