
శివసేన అధినేతగా మహారాష్ట్ర పై తీవ్ర ప్రభావం చూపించిన వ్యక్తి బాల్ థాకరే . ఆయన జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ” థాకరే ” . నవాజుద్దీన్ సిద్ధికి బాల్ థాకరే పాత్రలో నటిస్తుండగా అమృతారావు మీనా థాకరే పాత్రలో నటిస్తోంది . చిత్ర నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని 2019 జనవరి 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . జనవరి 23 బాల్ థాకరే పుట్టినరోజు కావడం విశేషం దాంతో ఆ రోజున విడుదల చేయనున్నారు . అయితే బాల్ థాకరే అంటే సింహస్వప్నం అన్న విషయం తెలిసిందే . దాంతో సెన్సార్ బోర్డు కెన్నీ డైలాగ్స్ కు కట్ చెప్పిందట . ఆరు డైలాగ్ లతో పాటుగా రెండు సన్నివేశాలను కూడా తొలగించాలని డిమాండ్ చేసిందట కేంద్ర సెన్సార్ బోర్డు దాంతో చిత్ర బృందం తీవ్ర తర్జన భర్జన పడుతోంది . మొత్తానికి ఇంకా సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు సెన్సార్ సమస్య ఓ కొలిక్కి రావచ్చు .
English Title: Censor problems facing Thackeray biopic
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2ENLeby
Comments
Post a Comment