Skip to main content

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.21.5 కోట్లు కలెక్ట్‌ చేసిన ‘2.0’

2.0 movie first day ap ts collectionsసూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన భారీ విజువల్‌ వండర్‌ ‘2.0’. 3డి, 2డి ఫార్మాట్‌లో తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో నవంబర్‌ 29న గ్రాండ్‌గా విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎన్‌.వి.ఆర్‌. సినిమా సంస్థ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్‌తో సూపర్‌ డూపర్‌ హిట్‌ టాక్‌ సాధించిన ఈ సినిమా మొదటి రోజు రూ.110 కోట్లు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.21.5 కోట్లు దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా అధినేత ఎన్‌.వి.ప్రసాద్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ అధినేత దిల్‌రాజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ ”ప్రపంచవ్యాప్తంగా నిన్న రిలీజ్‌ అయిన ‘2.0’ సంచలనమైన కలెక్షన్లతో అద్భుత విజయంతో దూసుకెళ్తోంది. నిన్న మొదటి రోజు మన తెలుగు రాష్ట్రాల్లో రూ.21.5 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఈరోజు కూడా అన్ని ఏరియాల్లో, అన్ని థియేటర్స్‌ హౌస్‌ఫుల్స్‌ అవుతున్నాయి. ఇది ఒక విజువల్‌ వండర్‌. అద్భుతంగా తెరకెక్కించిన లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్‌గారికి, డైరెక్టర్‌ శంకర్‌గారికి, రజనీకాంత్‌గారికి, అక్షయ్‌కుమార్‌గారికి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది సంచలన విజయం సాధించే చిత్రంగా దూసుకెళ్ళి డబ్బింగ్‌ సినిమా చరిత్రలోనే సంచలనం సృష్టిస్తుందని మేం ఆశిస్తున్నాం. ప్రేక్షకుల ఆశీర్వాదం ఈ సినిమాకి ఉంది. మీ ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. 2డి ఫార్మాట్‌లో చూసినవాళ్ళు 3డి లో కూడా చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం 3డిలో ఎక్కడా టిక్కెట్స్‌ లేవు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్న సినిమా, విజువల్‌ ఫీస్ట్‌గా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సినిమా ఇది. పాన్‌ ఇండియన్‌ సినిమాని వరల్డ్‌ సినిమాగా తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నం ఇది. ఈ సినిమా సంచలన విజయం దిశగా దూసుకెళ్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాలుగు సంవత్సరాలు చిత్ర యూనిట్‌ పడిన కష్టం సినిమాలో కనిపిస్తుంది. దానికి ప్రతిఫలంగానే ప్రేక్షకులు సినిమాలోని రజనీకాంత్‌ అవతారాలన్నింటినీ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఒక కొత్త సందేశంతో కూడుకున్న ఈ సినిమా ఇంకా సంచలన రికార్డులు సాధించాలని కోరుకుంటున్నాం” అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ”2.0 చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. నేను మూడు సార్లు చూశాను. ఈమధ్యకాలంలో ఏ సినిమానీ అన్నిసార్లు చూడలేదు. ఉదయం 5 గంటలకు 3డిలో చూశాను. ఆ తర్వాత బిగ్‌ స్క్రీన్‌పై 3డిలో చూశాను. ఆ తర్వాత శ్రీరాములు థియేటర్‌లో 2డి కూడా చూశాను. విజువల్‌గా సినిమాలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కాబట్టి 3డిలో చేశారు. అయితే 2డిలో కూడా నాకు పెద్దగా డిఫరెన్స్‌ కనిపించలేదు. 2డిలో కూడా అదే ఇంపాక్ట్‌ ఉంది. 2డిలో కూడా నేను బాగా ఎంజాయ్‌ చేశాను. రోబో చిత్రాన్ని ఎలా ఎంజాయ్‌ చేశామో ఆ రేంజ్‌లోనే 2డిలో కూడా ఉంది. 3డి అద్భుతమైతే, 2డి వెరీగుడ్‌. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.21.5 కోట్లు కలెక్ట్‌ చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఆల్‌మోస్ట్‌ ఒక పెద్ద హీరో సినిమా తెలుగులో రిలీజ్‌ అయితే ఎలాంటి కలెక్షన్స్‌ ఉన్నాయో అలా ‘2.0’ చిత్రం కలెక్ట్‌ చేసింది.

మనకు తెలిసి ఇండస్ట్రీలో నవంబర్‌ ఎండ్‌, మార్చి అన్‌ సీజన్‌గా గుర్తించాం. ప్రసాద్‌గారు ఈ ప్రపోజల్‌ చెప్పినపుడు డిస్ట్రిబ్యూటర్‌గా నవంబర్‌లో రిలీజ్‌ చెయ్యడం కరెక్టేనా అని ఆయన్ని అడిగాను. తమిళ్‌; హిందీలో కూడా ఆల్రెడీ ఫిక్స్‌ అయ్యారు కాబట్టి చేద్దాం అన్నారు. అయితే నవంబర్‌లో రిలీజ్‌ అయినా సినిమా బాగుంటే ప్రేక్షకులు దాన్ని ఏ రేంజ్‌కి తీసుకెళ్తారో ఇంతకుముందు చూడడం జరిగింది. నిన్ననే రిలీజ్‌ అయిన సినిమా కాబట్టి పిల్లలు స్టార్ట్‌ అయ్యాక, ఫ్యామిలీస్‌ కూడా థియేటర్‌కి వస్తారు. ఫ్యామిలీస్‌ కూడా వస్తే సినిమా మరొక లెవల్‌కి వెళ్తుందని నా అంచనా. మనకే ఇలా ఉందంటే చిన్నపిల్లలకి ఒక విజువల్‌ వండర్‌. ఇలాంటి సినిమా శంకర్‌గారి వల్లే సాధ్యమైంది. గత 20 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సినిమాలు చూస్తే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. శంకర్‌గారు ఈ సినిమాని హాలీవుడ్‌ స్థాయిలో విజువల్‌గా చూపించారు. ఇండియన్‌ సినిమాలోనే ఇంత భారీ బడ్జెట్‌ సినిమా ఇంతవరకు రాలేదు. సినిమా మొత్తం ఒక ఎత్తయితే చివరి 20 నిమిషాలు మరో ఎత్తు. శంకర్‌గారు ఎన్ని చేసినా చివరలో ఫార్ములాను తీసుకొచ్చి రజనీకాంత్‌గారితో మేజిక్‌ చూపించారు. ఆ 20 నిమిషాల ట్రెమండస్‌ ఫీలింగ్‌తోనే ఆడియన్స్‌ థియేటర్‌ నుంచి బయటికి వస్తున్నారు. చూసినవాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నారు. సాధారణంగా ప్రతి సినిమాకీ పైరసీ చూడకండి థియేటర్‌లోనే చూడండి అని చెప్తుంటాం. పైరసీలో చూస్తే ఈ సినిమా ఎవరికీ అర్థం కాదు. తప్పనిసరిగా థియేటర్‌లోనే చూడాలి. కాబట్టి ఈ సినిమాకి లాంగ్‌ రన్‌ ఉంటుంది. ఈ సినిమా నడుస్తూనే ఉంటుంది. సంక్రాంతి వరకు ఈ సినిమా కంటిన్యూ అవుతుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను. ఇంత మంచి సినిమా తీసిన శంకర్‌గారికి, లైకా ప్రొడక్షన్స్‌కి థాంక్స్‌. ఇలాంటి సినిమాని ప్రసాద్‌గారు, మేము, యు.వి.క్రియేషన్స్‌ కలిసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాం. డిస్ట్రిబ్యూషన్‌లో ఒక సక్సెస్‌ఫుల్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్న మాకు ఇలాంటి గ్రేట్‌ ఫిలిం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని చూసిన సెలబ్రిటీస్‌ ట్విట్టర్‌లో ఉన్నవారు అక్కడ తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈరోజు ‘మహర్షి’ షూటింగ్‌కి వెళ్ళగానే మహేష్‌గారు ఈ సినిమా గురించి చెప్పారు. ‘ఏం తీశారండీ శంకర్‌గారు. చాలా బాగుంది. గౌతమ్‌ మళ్ళీ చూడాలని అంటున్నాడు’ అన్నారు. ఒకసారి బిగ్‌ స్క్రీన్‌కి పంపిద్దామని నేనే చెప్పాను. గౌతమ్‌లాంటి చిన్నబాబుకి మళ్ళీ సినిమా చూడాలనిపించిందంటే పిల్లలు ఎంతగా ఈ సినిమాని ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు” అన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2rgW1TZ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...