
అనివార్య కారణాలతో కేజియఫ్ సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని.. డిసెంబర్ 21 నుంచి ఈ చిత్రం వాయిదా పడిందని వస్తున్న వార్తలను నిర్మాత సాయి కొర్రపాటి ఖండించారు. ఈ చిత్రం అనుకున్న సమయానికి.. అనుకున్నట్లుగా విడుదల అవుతుందని తెలిపారు ఆయన. డిసెంబర్ 21న తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BuB4cS
Comments
Post a Comment