
ఈ బ్లాక్‌బస్టర్‌ని ఇప్పుడు చైనాలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ చైనాలోని హెచ్‌వై మీడియాతో అసోసియేట్ అయి ‘2.0’ చిత్రాన్ని చైనా భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తోంది. హెచ్‌వై మీడియా ప్రముఖ నిర్మాణ సంస్థలు సోని, ట్వంటియత్ సెంచరీ ఫాక్స్, వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్, డిస్నీ సంస్థలతో అసోసియేట్ అయి ఎన్నో సినిమాలు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ని దృష్టిలో ఉంచుకొని చాలా గ్రాండ్‌గా ‘2.0’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. చైనాలో 10,000 థియేటర్స్‌లో 56,000 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అందులో 47,000 స్క్రీన్స్‌లో 3డి వెర్షన్‌ను ప్రదర్శించనున్నారు. 2019 మే లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2G0DK7B
Comments
Post a Comment