Skip to main content

డిసెంబ‌ర్ 7న ‘శుభలేఖ+లు’

Subhalekha+Lu movie get release dateఇటీవల కాలంలో ఓ ప్రత్యేకమైన అటెన్షన్ రప్పించుకున్న చిత్రం ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్‌లోనూ ఓ క్యూరియాసిటీ సొంతం చేసుకున్నదీ చిత్రం. పుష్య‌మి ఫిల్మ్ మేక‌ర్స్ అధినేత బెల్లం రామ‌కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని చూసి ఫ్యాన్సీ ఆఫ‌ర్స్‌ను వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ద‌క్కించుకుని గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. హ‌నుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా విలేఖ‌రుల స‌మావేశంలో

మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ…ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న మీ ఆశీర్వాదంతో మీ అంద‌రి ముందుకు వ‌స్తున్నాం. డైరెక్ట‌ర్ శ‌ర‌త్‌గారు ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఒక మంచి కంటెంట్‌తో మేమంద‌రం మీ ముందుకు వ‌స్తున్నాం. మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాం అని అన్నారు. అంద‌రూ ఓట్లు వేసి త‌ర్వాత వ‌చ్చి మా చిత్రాన్ని అంద‌రూ చూడాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ… 25 కొత్త ఆర్టిస్ట్‌ల‌తో ఈ చిత్రాన్ని తీశాము. ప్రొడ్యూస‌ర్ విద్యాసాగ‌ర్‌, జ‌నార్ధ‌న్ క‌లిసి నిర్మించిన చిత్ర‌మిది. గోదావ‌రి, ఆనంద్ లాంటి చిత్రాలు చేసిన కె.ఎల్‌.రాధాకృష్ణ‌గారు మ్యూజిక్ అందించారు. మ్యూజిక్ వ‌ల్లే ఈ చిత్రం ఒక రేంజ్ కి వెళ్ళింది. టెక్నీషియ‌న్స్ అంద‌రూ చాలా ఇష్ట‌ప‌డి చేశారు. ప్ర‌సెంట్ ఫ్యామిలీస్ కి, యూత్‌కి మ‌ధ్య ఉండే గ్యాప్‌ని తీసుకుని చేసిన చిత్ర‌మిది. మేమందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అంద‌రికీ మా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

హీరోయిన్ ప్రియా వ‌డ్లమాని మాట్లాడుతూ… మేము లాస్ట్ 10డేస్ నుంచి రాయ‌ల‌సీమ అవ‌న్నీ ప్ర‌మోష‌న్ భాగంలో వెళ్ళాం. చిన్న సినిమాల గురించి సిటీలో అంటే అంద‌రికీ తెలుస్తుంది. కానీ ఊళ్ల‌లో తెలియ‌డం చాలా క‌ష్టం. కాని మేము అక్క‌డికి వెళ్లాక మా ట్రైల‌ర్‌, మ‌రియు సాంగ్స్‌కి చాల మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అంద‌రూ డిసెంబ‌ర్‌7న త‌ప్ప‌కుండా మా చిత్రాన్ని చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

హీరో శ్రీ‌నివాస్ సాయి మాట్లాడుతూ… మేమంద‌రం ఈ చిత్రం ద్వారా కొత్త‌ ప‌రిచ‌యం అవుతున్నాం. ఈ డిసెంబ‌ర్‌7న మీ ముందుకు రాబోతున్నాం. మా ప్ర‌య‌త్నం మేము చేసుకుంటు వెళుతున్నాం. ముఖ్యంగా మిగ‌తా చిత్రాల‌కి దీనికి డిఫ‌రెన్స్ ఏంటంటే శ‌ర‌త్ గారు చాలా నాలెడ్జ్ ఉన్న వ్య‌క్తి ఆయ‌న త‌లుచుకుంటే పెద్ద యాక్ట‌ర్స్‌ని పెట్టి తియ్య‌గ‌ల‌రు. కాని ఆయ‌న మ‌మ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేసి తీశారు. ప్ర‌మోష‌న్ కూడా ఎక్కడా పెద్ద సినిమాల‌కు త‌క్కువ కాకుండా తీశారు. మీరంద‌రూ ఫ్యామిలీస్‌తో వెళ్లి చూడ‌ద‌గ్గ మంచి చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా అంద‌రూ ఎంజాయ్ చేస్తారు. మేమంద‌రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అని అన్నారు.

హీరోయిన్ దీక్షా మాట్లాడుతూ… ఈ చిత్రం మాకు చాలా ప్ర‌త్యేక‌మైంది. మేము చాలా క‌ష్ట‌ప‌డి చేసిన చిత్ర‌మిది. ఎంతో అద్భుత‌మైన చిత్రం అంద‌రూ త‌ప్ప‌కుండా చూసి ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

 

న‌టీన‌టులుః శ్రీ‌నివాస్‌సాయి, ప్రియ‌వ‌డ్ల‌మాని, దీక్ష‌శ‌ర్మ‌రైనా, ఇర్ఫాన్‌, సింధు, తిరువీర్‌, వంశీరాజ్‌, మోనాబేద్రె, అప్పాజిఅంబ‌రీష త‌దిత‌రులు న‌టిస్తున్న

ఈ చిత్రానికి నిర్మాత‌లుః విద్యాసాగ‌ర్‌, జ‌నార్ధ‌న్ ఆర్‌.ఆర్‌, క‌థ‌-మాట‌లుః జ‌నార్ధ‌న్ ఆర్‌.ఆర్‌-విస్సు, క‌థాస‌హ‌కారంఃసి.విద్యాసాగ‌ర్‌, స్క్రీన్‌ప్లే-డైరెక్ష‌న్ఃశ‌ర‌త్‌న‌ర్వాడే, సంగీతంఃకె.యం.రాధాక్రిష్ట‌న్‌, డైరెక్ష‌న్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీఃయ‌స్‌.ముర‌ళీమోహ‌న్‌రెడ్డి, ఆర్ట్‌డైరెక్ట‌ర్ఃబ్ర‌హ్మ‌క‌డ‌లి, ఎడిట‌ర్ఃమ‌ధు, కొరియోగ్ర‌ఫీఃచంద్ర‌కిర‌ణ్‌, పి.ఆర్‌.ఓఃపుల‌గం చిన్నారాయ‌ణ‌, వీర‌బాబు బాసిశెట్టి, ప‌బ్లిసిటి డిజైన‌ర్ఃసుధీర్‌, స్టిల్స్ఃర‌ఘు, ఎగ్జిక్యూటివ్ మేనేజ‌ర్ఃసూర్య‌నారాయ‌ణ‌క‌రుటూరి, కో-డైరెక్ట‌ర్ఃఎం.స‌ర్వేశ్వ‌ర‌రావు, ప్రొడ‌క్ష‌న్‌కంట్రోల‌ర్ఃప్ర‌వీణ్‌పాల‌కుర్తి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2KTeI99

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...