Skip to main content

ప్ర‌స్తుత స‌మాజానికి అద్దం ప‌ట్టే సినిమా – హీరో శ్రీ‌కాంత్‌

Operation2019 movie success meetఅలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్పించు టి. అలివేలు నిర్మించిన క‌ర‌ణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆప‌రేష‌న్ 2019. శ్రీ‌కాంత్‌, మంచుమ‌నోజ్, సునీల్‌ న‌టించిన‌ ఈ చిత్రం డిసెంబ‌ర్ 1వ తేదీన‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా ఆదివారం స‌క్సెస్‌మీట్‌ను జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో…

చిత్ర హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ… ఈ చిత్రాన్ని ఇంత స‌క్సెస్ చేసినందుకు ముందుగా అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రం ఒక ప్ర‌పోజ‌ల్‌తో తీసిన చిత్రం. ప్ర‌స్తుతం స‌మాజంలో ఉండే ప‌రిస్థితుల‌కి అనుగుణంగా ఉన్న చిత్ర‌మిది.ఈ మ‌ధ్య‌కాలంలో నేను న‌టించిన చిత్రాల్లో నాకు న‌చ్చిన చిత్ర‌మిది. మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. చాలా పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ప‌బ్లిక్ టాక్ చాలా ఇంపార్టెంట్‌. ప్ర‌తి ఒక‌ళ్ళూ క‌నెక్ట్ అయ్యే చిత్ర‌మిది. ప్రొడ్యూస‌ర్ ఈ చిత్రం కొన్న బ‌య్య‌ర్లు అంద‌రూ సేఫ్ ఎవ్వ‌రికీ న‌ష్టం రాకూడ‌దు. అంతా బానే ఉంది కాని మాకు కొంత అసంతృప్తి అన్న‌ది కొన్ని రివ్యూస్ వ‌ల్ల అనిపించింది. ఎవ‌రి అభిప్రాయం వాళ్ళ‌ది. మేము మీ అభిప్రాయాన్ని గౌర‌విస్తున్నాం కాద‌న‌డంలేదు కాని. ఒక రివ్యూ ఇచ్చేట‌ప్పుడు కొంచం ఆలోచించాలి. ప్రొడ్యూస‌ర్ చాలా క‌ష్ట‌ప‌డి ఒక చిత్రాన్ని నిర్మిస్తాడు. అందులో ఎంతోమంది టెక్నీషియ‌ల‌న్ల‌కి ప‌ని దొరుకుతుంది. మీరు అలా రాయ‌డం వ‌ల్ల కేవ‌లం రేటింగ్స్ చూసి సినిమాకి వెళ్ళేవారు చాలా మంది ఉంటారు. ఒక స‌క్సెస్ వ‌స్తే ఇండ‌స్ర్టీలో చాలా మంది టెక్నీషియ‌న్ల‌కి ప‌ని దొరికిన‌ట్లే. అంద‌రూ థియేట‌ర్‌కి వెళ్ళి చూడండి అంద‌రూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి చివ‌రి వ‌ర‌కు ప్రేక్ష‌కులు మ‌ధ్య‌లో లెగ‌కుండా సినిమా మొత్తం చూసి బ‌య‌ట‌కు వ‌చ్చాడంటే సినిమా స‌క్సెస్ సాధించిన‌ట్లే. ఈ చిత్రం చూస్తే చాలా మంది జ‌నాల్లో ఓటు ఎవ‌రికి వెయ్యాలి అన్న‌ ఎవేర్‌నెస్ వ‌స్తుంది. ఈ చిత్రం చేసిన త‌ర్వాత అప్పుడ‌ప్పుడూ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తే బావుంట‌ద‌నిపించింది అని అన్న‌రు.

న‌టుడు శివ‌కృష్ణ మాట్లాడుతూ… ఈ చిత్రం స‌క్సెస్ అయినందుకు డైరెక్ట‌ర్ బాబ్జీకి, ప్రొడ్యూస‌ర్‌కి నా కృత‌జ్ఞ‌తలు. నాకు అతి ఇష్ట‌మైన హీరోల్లో శ్రీ‌కాంత్ ఒక‌రు. స‌రైన టైంలో స‌రైన మెసేజ్ వ‌చ్చింద‌ని నా అభిప్రాయం. కులాల‌కి, మ‌తానికి డ‌బ్బులు తీసుకుని ఓటు వేస్తే ఎలా ఉంట‌ది అన్న దాని గురించి తీసుకుని చూపించారు. ఈ చిత్రంలో న‌టించేట‌ప్పుడు నాకు నా పాత రోజులు గుర్తుకువ‌చ్చాయి. సినిమా గ్రాఫ్ ఎప్పుడైతే బావుంటుందో అప్పుడు సినిమా స‌క్సెస్ అయిన‌ట్లే నేను కూడా కొన్ని చిత్రాల్ని నిర్మించాను కాబ‌ట్టి నాకు తెలుసు అని అన్నారు.

ద‌ర్శ‌కుడు బాబ్జీ మాట్లాడుతూ… నాకు తెలిసినంత‌వ‌ర‌కు సినిమా బాగోలేదు అని ఎవ్వ‌రూ అన‌లేదు. సినిమా చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడు బ‌య‌ట‌కు వ‌చ్చి బావుంద‌నే అన్నారు కాని బాలేద‌ని మాత్రం ఎవ్వ‌రూ అన్న‌లేదు. డైరెక్ట‌ర్‌గా ఫీల్ అయి సినిమా తియ్య‌లేదు బాధ్య‌త గ‌ల పౌరిడిగా ఫీల అయి తీశాను. డ‌బ్బులు కోసం కూడా నేను సినిమా తీయ‌లేదు. కేవ‌లం ఒక బాధ్య‌త‌తో సినిమాని తీశాను. సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని తిట్టాను అన్నారు. నేను ఏమీ అన‌లేదు. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ చాలా బావుంది. ముద్దుల సినిమానే తియ్యాల‌ని రూల్ లేదుగా. రెవెన్యూకూడా పెరుగుతూనే వ‌స్తుంది. సినిమా చాలా బావుంది ద‌య‌చేసి అంద‌రూ థియేట‌ర్‌కి వెళ్ళి చూడండి అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ… ఈ సినిమాని చాలా క‌ష్ట‌ప‌డి తీశాను. హీరో, డైరెక్ట‌ర్ బాబ్జీగారు చాలా స‌హ‌కారాన్ని అందించారు. ఒక కామ‌న్ మ్యాన్ ప్ర‌జ‌ల‌కు సేవ చెయ్యాలంటే ఎలా అని ఉన్న డ‌బ్బుల‌తో సీట్ కొన్ని ఎమ్ఎల్ఎ అయి ఏ విధంగా స‌హాయ‌ప‌డ‌తాడు. రాజ‌కీయ ప‌రిణామాల పై వ‌చ్చిన చిత్రం ఇది . ఓటు హ‌క్కును మ‌నం ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న‌దాన్ని బ‌ట్టి మంచి కాన్సెప్ట్‌తో వ‌చ్చిన చిత్ర‌మిది అంద‌రూ చూసి మీ ఆద‌ర‌ణ అంద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో చిత్ర యూనిట్ అంద‌రూ పాల్గొన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zCWWCx

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...