Skip to main content

`బిగ్గెస్ట్ న్యూఇయ‌ర్ ఈవెంట్ బ్రోచ‌ర్‌ లాంచ్

biggest new year event brochure launchకొత్త సంవ‌త్స‌రంలో అడుగుపెడుతున్న వేళ‌.. 31 రాత్రి సెల‌బ్రేష‌న్స్ కోసం యూత్ ఎగ్జ‌యిటింగ్‌గా ఎదురు చూడ‌డం స‌హ‌జం. అలాంటి ఉత్సాహం ఉర‌క‌లెత్తే యూత్ కోసం భారీ మ‌స్తీ ఈవెంట్‌కి సంబంధించిన వివ‌ర‌మిది. టాలీవుడ్‌లోనే ది బెస్ట్ ఈవెంట్‌ని టాలీవుడ్ టాప్ స్టార్ల‌తో ప్లాన్ చేస్తోంది యు-మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంస్థ‌. ఈ కొత్త సంవత్స‌ర ఈవెంట్‌ని `2019 ఎలైట్ న్యూఇయ‌ర్ ఈవ్‌` పేరుతో హైటెక్ సిటీ- యోలో అరేనా (లేన్ బిసైడ్ కింగ్స్‌)లో నిర్వ‌హించ‌నున్నారు. ఈవెంట్‌లో పాల్గొనే స్టారాధిస్టార్ల వివ‌రాల్ని తొంద‌ర్లోనే రివీల్ చేయ‌నున్నారు.

తాజాగా ఈ ఈవెంట్‌కి సంబంధించి బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. టాలీవుడ్ యువ‌క‌థానాయిక‌లు యామిని భాస్క‌ర్‌, నిత్యాశెట్టి, అలేఖ్య ఏంజెల్‌ లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఈ షోకి సంబంధించిన టిక్కెట్ బ్రోచ‌ర్‌ని యామిని భాస్క‌ర్ లాంచ్ చేయ‌గా, బుక్‌మై షో ఇత‌ర వెబ్‌సైట్ల బ్రోచ‌ర్‌ని నిత్యా శెట్టి, అలేఖ్య లాంచ్ చేశారు. బుక్ మై షో, గోవెంట్జ్‌, నియ‌ర్‌బై డాట్‌కాం వంటి వెబ్‌సైట్ల‌లో టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి.

బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ అనంత‌రం యామిని భాస్క‌ర్ మాట్లాడుతూ -“ప్ర‌తియేటా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల్ని యూత్ ప్ర‌త్యేకంగా జ‌రుపుకుంటుంది. ఈ ఏడాది కూడా 31 రాత్రి సంబ‌రాల కోసం ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారంతా. హైద‌రాబాద్‌లోనే బిగ్గెస్ట్ ఈవెంట్‌ని యు మీడియా నిర్వ‌హిస్తోంది. ఇందులో ర‌క‌ర‌కాల డ్యాన్సింగ్ షోస్, స్కిట్స్, స్పెష‌ల్ షోలు రంజింప‌జేస్తాయి. అంద‌రికీ వెల్‌కం“ అని అన్నారు.

నిత్యా, అలేఖ్య మాట్లాడుతూ – “హైదరాబాద్ బెస్ట్ ఈవెంట్‌లో పార్టిసిపెంట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ షోలో స్పెష‌ల్ లైవ్ ట్రీట్ యూత్‌కి మ‌స్త్ మ‌జాగా అందిస్తాం“ అని తెలిపారు. టాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో ది బెస్ట్ ఈవెంట్‌ని నిర్వ‌హిస్తున్నామ‌ని నిర్వాహ‌కులు వెల్ల‌డించారు.

కాళిచ‌ర‌ణ్ సంజ‌య్, తారా చౌద‌రి, త్రివేణిరావ్‌, దీపు నాయిడు, అలేఖ్య ఏంజెల్‌, స్పేస్ విజన్ సీఈవో న‌ర‌సింహారెడ్డి, ఎస్ మీడియా సుమంత్‌- ప్ర‌శాంత్, కేట్ టెక్నాల‌జీస్ కార్తీక్‌, ఫ్లాంట్ మార్కెట్ కెప్టెన్ అహ్మ‌ద్, యూమీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత‌లు క‌ళ్యాణ్ సుంక‌ర‌, వివాన్ కుసుంబా త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RB77i5

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...