Skip to main content

వేలంటైన్స్ డే కానుక‌గా ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ `ల‌వ‌ర్స్ డే`

lovers day movie get release dateఅమ్మాయి ఓర‌చూపు చూస్తే వ‌ల‌లో ప‌డ‌ని అబ్బాయిలు ఉండ‌ర‌ని అంటారు. మ‌ల‌యాళ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ విష‌యంలో అది మ‌రోసారి రుజువైంది. కాక‌పోతే ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ మ‌రో అడుగు ముందుకేశారు. ఆమె కొంటెగా కంటి సైగ చేస్తే రాష్ట్రాల స‌రిహ‌ద్దులు దాటి మ‌రీ యువ‌కులు ఆమె గురించి ఆరా తీశారు. కేవ‌లం 27 సెక‌న్ల వీడియోతో యావ‌త్ భార‌త‌దేశాన్ని ఉర్రూత‌లూగించిన సొగ‌స‌రి ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. యువ‌కుల్లో అంత‌టి క్రేజ్‌ను సంపాదించుకున్న ప్రియా న‌టించిన మ‌ల‌యాళ చిత్రం `ఒరు ఆధార్ ల‌వ్‌`. ఈ చిత్రాన్ని తెలుగులో `ల‌వ‌ర్స్ డే` పేరుతో సుఖీభ‌వ సినిమాస్ సంస్థ విడుద‌ల చేస్తోంది. ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి నిర్మాత‌లు. ఒమ‌ర్ లులు ద‌ర్శ‌కుడు.

ఈ సినిమా గురించి నిర్మాత‌లు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి మాట్లాడుతూ “ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ న‌టించిన `ఒరు ఆధార్ ల‌వ్‌` గురించి ప్ర‌త్యేకంగా ఎవ‌రికీ ప‌రిచ‌యం చేయ‌క్క‌ర్లేదు. ప్రియా చేసిన ఒక్క కంటి సైగ‌తో ఆ సినిమాకు వ‌చ్చిన క్రేజ్ అంత గొప్ప‌ది. ఆ చిత్రం తెలుగు హ‌క్కుల కోసం చాలా మంది ప్ర‌య‌త్నించారు. భారీ పోటీ మ‌ధ్య హ‌క్కుల‌ను మేం ద‌క్కించుకున్నాం. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న తెలుగులో `ల‌వ‌ర్స్ డే` అనే పేరుతో విడుద‌ల చేస్తున్నాం. 2018లో గూగుల్‌లో టాప్‌లో ట్రెండింగ్‌లో ఉన్న అమ్మాయి ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. త‌న క‌నుసైగ‌తో ఆమె చేసిన మాయ అంత గొప్ప‌ది. తెలుగులోనూ ఆ అమ్మాయికి విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ప్రియాని హీరోయిన్‌గా పెట్టి తెలుగులో సినిమా చేయ‌డానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. యూట్యూబ్‌, ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా ప్రతి సామాజిక మాధ్య‌మంలోనూ ఆమె పేరును జ‌పించే వారి సంఖ్య అత్య‌ధికం. `ఒరు ఆధార్ ల‌వ్‌`లో కేవ‌లం 27 సెక‌న్ల పాటు ఆమె చేసిన క‌నుసైగ‌కు రెండు రోజుల్లోనే 45 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. ఇప్ప‌టికి రెండు కోట్ల మంది ఆ వీడియో చూశారు. అంత క్రేజీ ప్రాజెక్ట్ ను మేం తెలుగులో విడుద‌ల చేస్తుండ‌టం చాలా ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. రొమాంటిక్ కామెడీ చిత్ర‌మిది. హై స్కూలు చ‌దివే ఇద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ ను చెబుతుంది. షాన్ రెహ‌మాన్ సంగీతం హైలైట్ అవుతుంది“ అని అన్నారు.

న‌టీన‌టులు
నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు
కెమెరా : శీను సిద్ధార్థ్‌
ఎడిటింగ్‌: అచ్చు విజ‌య‌న్‌
సంగీతం: షాన్ రెహ‌మాన్‌
స్క్రీన్‌ప్లే: సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు
నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2PWpDzV

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...