Skip to main content

కేర్ ఆఫ్ వాట్సప్’ ట్రైలర్ విడుదల

C/O WhatsApp Trailer Launchమహాముని ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ రెడ్డి సమర్పించు చిత్రం ‘కేర్ ఆఫ్ వాట్సప్’. బాహుబలి లో ప్రభాస్ చైల్డ్ యాక్టర్ నిఖిల్, సాహితి హీరో హీరోయిన్స్ గా నీరజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు అల్లాడి రవీందర్ రెడ్డి కాగా.. నిర్మాత లక్ష్మి కాంత్ రెడ్డి. ఈ చిత్ర ట్రైలర్ ను సీనియర్ డైరెక్టర్ సముద్ర చేతుల మీదుగా, ఆడియో బిగ్ సీడీని నటుడు నోయల్ చేతుల మీదుగా విడుదల చేయించారు. కోటేశ్వర్ రావు, మిర్చి మాధవి, రాజేందర్,తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొదటగా

సముద్ర మాట్లాడుతూ లవ్డ్ టీనేజ్ స్టోరీ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. యాక్షన్, ఎమోషన్స్ ఉన్నప్పుడే సినిమా ఆడుతుంది.. అది ఈ సినిమాలో కనపడుతోంది.. ఫైట్స్, సాంగ్స్ బాగున్నాయి.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

మరో ముఖ్య అతిథి నటుడు నోయల్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉంటుందని అనుకుంటున్నా.. ఒక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే వాట్సప్ లో వచ్చేస్తుంది. అంత ఇంపార్టెంట్ ఉంది వాట్సప్ అలాంటి పేరుతోనే సినిమాను ప్లాన్ చేశారు యూనిట్. వీరి కష్టం కనపడుతోంది..అందరికీ బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నాఅన్నారు.

దర్శకుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..ప్రొడ్యూసర్ ఎంతో సప్పోర్ట్ చేయబట్టే ఈ సినిమా ఇక్కడి దాకా చేరుకుంది. ప్రతి రోజూ వాట్సప్ తోనే రోజు మొదలవుతుంది.. వాట్సప్ తోనే రోజు ముగుస్తుంది..ఇలాంటి తరుణంలో మా సినిమా అందరికీ ప్రతి రోజూ గుర్తుకు రావాలనే సినిమా కు ఈ టైటిల్ పెట్టడం జరిగింది అన్నారు.

నిర్మాత లక్ష్మీ కాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. డైరెక్టర్ చాలా కస్టపడి సినిమా చేశారు.. అందరూ మంచి సహకారాన్ని అందించారు. అతి త్వరలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు.

ఈ సినిమాలో అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు, చాలాకష్టపడి సినిమా చేశాము.. తప్పకుండా నచ్చే చిత్రం అవుతుందని ఆశిస్తున్నాం అని హీరో నిఖిల్, హీరోయిన్ సాహితితెలియచేసారు.

 

నిర్మాత: లక్ష్మీ కాంత్ రెడ్డి, సహా నిర్మాత: కొండా రాఘవేంద్ర రెడ్డి,(దేవకర్ర), దర్శకుడు: అల్లాడి రవీందర్ రెడ్డి సంగీతం: రాజేష్ తేలు, డీఓపీ: భాస్కర్ దోర్నాల, ఎడిటర్: వినోద్ అద్వై, యాక్షన్: నాభ. రాబిన్ సుబ్బు, ఆర్ట్: మోహన్, డీటీఎస్: కలి యస్. అశోక్, డిఐ: భానుప్రకాష్.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PmwDFK

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...