Skip to main content

బేబీని స‌న్మానించిన మాజీ శాస‌న స‌భ్యులు, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త టి.వెంక‌ట్రావ్

ex mla t venkata rao praises felicitated singer babyప్ర‌తిభ‌ను ప‌రిశ్ర‌మ గుర్తిస్తుంది. గౌర‌వించి అవ‌కాశాలిస్తుంది.. కాస్త ఆల‌స్యంగా అయినా వెలుగులోకి వ‌చ్చిన గాయ‌నీమ‌ణి బేబి ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఓ సెన్సేష‌న్‌. మెగాస్టార్ చిరంజీవి అంత‌టి వారే బేబి పాట‌కు ఫిదా అయిపోయారు. ఆమె పాటను విని సతీ(సురేఖ‌)సమేతంగా పరవశించుపోయారు. ప్ర‌త్యేకించి త‌న‌ను ఇంటికి పిలిచి మ‌రీ స‌న్మానించారు. ఆస్కార్ గ్ర‌హీత ఏ.ఆర్.రెహ‌మాన్ అంత‌టి వారే ఆమె పాట‌కు ఖుదాఫీస్ అన్నారు. త‌న‌కు పాడేందుకు అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని మాటిచ్చారు. వంద‌ల చిత్రాల‌కు సంగీతం అందించిన టాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు కోటి తాను సంగీతం అందించే ప్ర‌తి సినిమాలో అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హించేందుకు సిద్ధ‌ప‌డ్డారు. ఒక‌రేమిటి.. బేబి పాడ‌తానంటే సంగీత ద‌ర్శ‌కుల క్యూ రెడీగా ఉందిప్పుడు.

`ఓ చెలియా నా ప్రియ సఖియా.. అంటూ గొంతు సవరించింది మొద‌లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సెల‌బ్రిటీ అయిపోయారు బేబి. మట్టిలో మాణిక్యం … పల్లెకోకిల అంటూ బేబీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. బేబి ప్ర‌కంప‌నాలు ఇప్ప‌ట్లో ఆగేట్టు లేవు. ఓవైపు రాజ‌కీయ నాయ‌కులు, మ‌రోవైపు సినీసెల‌బ్రిటీలు బేబీని క‌లుస్తున్నారు. అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు. తాజాగా మాజీ శాస‌న స‌భ్యులు, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త టి.వెంక‌ట్రావ్ బేబీని స‌న్మానించారు. రూ.1,11,111 (ల‌క్ష 11వేల 111రూపాయ‌లు) విరాళం ఇచ్చి .. చీర‌లు అంద‌జేశారు. ఈ ప్ర‌త్యేక స‌న్మాన‌ కార్య‌క్ర‌మంలో కోటి, గాయ‌ని గీతామాధురి, కేథ‌రిన్ థ్రెసా, హీరోయిన్ కారుణ్య (బంగారి బాల‌రాజు), న‌టి రంజిత‌, సింగ‌ర్ మ‌ధు త‌దిత‌రులు పాల్గొన్నారు.

కోటి మాట్లాడుతూ – “వాట్సాప్‌లో పాట విని షాక‌య్యాను. బేబీకి పుట్టుక‌తో వ‌చ్చిన ప్ర‌తిభ అది. ఇది ఇన్‌బిల్ట్ ట్యాలెంట్. కీర్తి అనేది ఎప్పుడు ఎలా వ‌స్తుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. చిరంజీవి – సురేఖ గారు త‌న పాట వినాల‌ని ఫోన్ చేస్తే వెంట‌నే త‌న‌ని వాళ్ల ద‌గ్గ‌రికి తీసుకెళ్లాను. చిరంజీవి గారు రూ.1ల‌క్ష విరాళం ఇచ్చారు. పాట‌లు పాడించుకుని విన్నారు. ఏ.ఆర్.రెహ‌మాన్, బాల‌సుబ్ర‌మ‌ణ్యం, జాన‌క‌మ్మ అంద‌రూ పిలిచి బేబీని ప్ర‌శంసిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. బేబి ఏ పాట పాడినా ఆక‌ట్టుకుంటోంది. 5 డిసెంబ‌ర్ త‌ర్వాత రెహ‌మాన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ర‌ఘు కుంచె తొలి పాట‌ను పాడించాడు. బేబి అద్భుతంగా పాడారు. ర‌ఘు మ్యూజిక్ బాగా కుదిరింది. రెండో పాటకు నాకు అవ‌కాశ‌మిచ్చారు బేబి. నాకు ఫోక్ మెలోడీ పాట‌ను పాడ‌బోతున్నారు. ప‌రిశ్ర‌మ సంగీత ద‌ర్శ‌కులంతా త‌న‌తో పాడించుకోవాలి. చ‌దువు లేదు. కేవ‌లం సంగీతం మాత్ర‌మే త‌న‌ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను కొన్ని మెళ‌కువ‌లు చెబుతున్నా. బేబికి అమెరికా, దుబాయ్ నుంచి పిలుపొచ్చింది. అక్క‌డ లైవ్ ఈవెంట్లు చేయ‌బోతోంది. ఎవ‌రైనా త‌న‌కు ప్రోత్సాహ‌కంగా ఎలాంటి సాయం చేయాల‌నుకుంటే చేయొచ్చు“ అని అన్నారు.

మాజీ టి.ఎమ్మెల్యే వెంక‌ట్రావ్ మాట్లాడుతూ – గొప్ప సంగీత ద‌ర్శ‌కులు.. యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించి.. ఎంద‌రో పెద్ద‌ స్టార్ల‌కు గొప్ప హిట్ సంగీతం ఇచ్చిన సంగీత ద‌ర్శ‌కులు కోటి. బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని నిగూఢంగా దాగి ఉన్న‌ బేబిలోని ట్యాలెంటును గుర్తించి స‌భ్య స‌మాజానికి ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. ప్ర‌తిభ‌ను గుర్తించి బ‌య‌ట‌కు చూపాలంటే వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కోర్చాలి. త‌న‌ని ఒక గొప్ప గాయ‌నిగా తీర్చిదిద్దేందుకు కోటి చేస్తున్న కృషిని అభినందిస్తున్నా. అంద‌రూ త‌న‌ని ప్రోత్స‌హిస్తున్నారు. కారుణ్య వంటి న‌వ‌త‌రం ఎద‌గాల‌ని కోరుకుంటున్నా. కోటి మ‌రింత‌గా ఇలాంటి మంచి ప‌నులుతో అంద‌రూ గ‌ర్వించేలా చేయాల‌ని కోరుతున్నా.

బేబి మాట్లాడుతూ -“ పాడ‌తాన‌ని .. ఆ పాట అంత వైర‌ల్ అవుతుంద‌ని అనుకోలేదు. నేను బ‌ట్ట‌లు ఉతికాక .. పక్కింటికి వెళ్లాను. అక్క‌డ ఆ అమ్మాయి పాడుతుంటే వీడియో తీసి వైర‌ల్ చేసింది. అనుకోకుండా అవ‌లీల‌గా ఆ పాట‌ను అంద‌రికీ చూపించింది. మా పాప‌కు బాబు పుట్టాడు. ఆస్ప‌త్రిలో ఉన్నాను. ఈ పాట వాట్సాప్‌లో వైర‌ల్‌గా మారింది… నీకు తెలుసా? అని అన్నారు. మీ అంద‌రి సాయంతోనే నేను హైద‌రాబాద్ కి వ‌చ్చాను. కోటి స‌ర్ బోల్ బేబి బోల్ లో పాట పాడ‌మ‌ని అన్నారు. స‌ర్ ప్రోత్స‌హిస్తున్నారంటే అది అంద‌రి ద‌య‌. పెద్ద‌లంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఇంత ఆద‌రించి న‌న్ను మీలో ఒక‌రిని చేసుకున్నారు. హైద‌రాబాద్ అంటే భ‌యం భ‌యం.. ప‌ట్నంలో మంచిగా ఉండ‌రు. లెక్క చేయ‌ని స్థితిలో ఉంటారు అని భ‌య‌పెట్టారు. కానీ ఇక్క‌డ అంద‌రూ న‌న్ను దేవుళ్లు దేవ‌త‌ల్లా క‌నిపిస్తున్నారు. ఇది నిజం. ఈ ప‌య‌నం భ‌యంగానే సాగింది. నేను పుట్టాక .. రంగంపేట‌, రాజ‌మండ్రి త‌ప్ప ఎక్క‌డికీ వెళ్ల‌లేదు. కోటి సార్ నాకు ఫోన్ చేసి ఇక్క‌డికి ర‌మ్మ‌న్నారు. భ‌య‌ప‌డొద్ద‌ని పాట గురించి అవ‌గాహ‌న క‌ల్పించి .. సంగీతంలో శిక్ష‌ణ ఇచ్చారు. తండ్రి, దేవుడు, అన్న అన్నీ త‌నే. ఈ పాట‌ను వ‌దిలిపెట్ట‌ను. పాడ‌తానో లేదో తెలీదు కానీ ప్ర‌య‌త్నిస్తాను. సార్ .. న‌డిపించిన బాట‌లో న‌డుస్తాను. లేదంటే మా ఊరు వెళ్లిపోతాను. మీ అంద‌రి దీవెన‌లు కావాలి. వెంక‌ట్రావు గారు విరాళం ఇచ్చి క‌ళ‌ను ఇంత‌గా ప్రేమించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. మ‌ట్టిలో పుట్టి పెరిగాను. కూలి ప‌ని చేసుకునేదానిని. అన్ని ప‌నులు చేశాను. ఇక్క‌డికి వ‌చ్చాను . మీ అంద‌రి ఆద‌రాభిమానుల‌తోనూ ఇలా రాగ‌లిగాను. `మిర్ర‌ర్స్` కంపెనీ ల‌క్ష్మి గారు.. ప‌ట్టు చీర‌లు ఇచ్చి రూ.30వేలు విరాళం ఇచ్చారు. నా జుత్తు రింగుల జుత్తు.. ఇది నాది కాదు.. న‌న్ను మార్చేశారిలా.. కార్ ఇచ్చి ప్ర‌యాణాల‌కు సాయం చేశారు. హైద‌రాబాద్ లో దేవ‌తులున్నారు దేవుళ్లున్నారు“ అన్నారు



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Pbx31K

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...