
అక్క పోటీ చేస్తున్నప్పుడు ఆమె గెలుపు కోసం ప్రచారం చేయాల్సిన బాధ్యత తమ్ముళ్లది , కానీ ఆ బాధ్యతని విస్మరించారు ఇద్దరు తమ్ముళ్లు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు. ఇదే హరికృష్ణ బ్రతికి ఉంటే తప్పకుండా కూతురు కోసం రథసారథి అయి ప్రచారం చేసేవాడు. కానీ హరికృష్ణ లేడుగా…… ఇలాంటి పరిస్థితుల్లో తమ్ముళ్లు అండగా ఉండాల్సింది పోయి ప్రచారానికి దూరంగా ఉన్నారు. చంద్రబాబు మీద కోపంగా ఉంటే అసలు అక్క ని పోటీ చేయించకుండా ఉండాల్సింది .కానీ ఆ పని చేయలేదు , అందుకే తమ్ముళ్లు ఉండి కూడా లేనిదయ్యింది నందమూరి సుహాసిని. నాన్న లేడు , తమ్ముళ్లు రాలేదు మరి ఓటు వేసే ప్రజలు సుహాసినిని అక్కున చేర్చుకుంటారా ? లేదా ? అన్నది ఈనెల 7న తేలనుంది. 11 న ఫలితం రానుంది.
English Title: Nandamuri Suhasini has no brothers
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Qg35yM
Comments
Post a Comment