
కానీ 2019 లో జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నాడు పవన్ కళ్యాణ్ . తమ్ముడికి అండగా తెరవెనుక చిరంజీవి , నాగబాబు లు పెద్ద ప్రయత్నాలే చేస్తున్నారట . ఎన్నికల నాటికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుండి అలాగే తెలుగుదేశం పార్టీ నుండి నాయకులు తరలి రానున్నారని దాంతో జనసేన తరుపున ఎక్కువమంది శాసనసభ్యులు గెలవడం ఖాయమని , ఒకవేళ ప్రజలు పెద్ద ఎత్తున మార్పు కోరుకుంటే జనసేన అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నాగబాబు అండ్ కో . గతంలో కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 294 నియోజకవర్గాలలో 292 గెలుస్తామని గొప్పలు పోయారు కట్ చేస్తే గెలిచింది 17 మాత్రమే !
English Title: EC assigns Glass Tumbler symbol to Pawan Kalyan
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2T7H81R
Comments
Post a Comment