Skip to main content

స‌మాజంలోని చీక‌టి కోణాల‌పై `దాడి`

వ‌రుణ్ సందేశ్ కీల‌క పాత్ర‌లో ఏ డి.జె.ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  శంక‌ర్ ఆర్ల‌ నిర్మిస్తున్న చిత్రం `దాడి`.  మధు శోభ‌.టి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో జీవ‌న్‌, చెరిష్మా శ్రీక‌ర్‌, కారుణ్య చౌద‌రి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏడిద శ్రీరామ్ కెమెరా స్విచ్ఛాన్ చేయ‌గా.. శివాజీ రాజా క్లాప్ కొట్టారు. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల‌ స‌మావేశంలో..
హీరో వ‌రుణ్ సందేశ్ మాట్లాడుతూ – “ఏడాది పాటు అమెరికాలో ఉన్నాను. గ్యాప్ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇదే. యు.ఎస్ నుండి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత చాలా క‌థ‌లు విన్నాను. ఈ క‌థ నాకు బాగా న‌చ్చింది. డైరెక్ట‌ర్ మ‌ధు మంచి స్క్రిప్ట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. నా గ‌త సినిమాల‌కు భిన్న‌మైన ప్ర‌య‌త్న‌మిది. గోకుల్ చాట్ బాంబు దాడిలో కుటుంబాన్ని కోల్పోయిన వ్య‌క్తిగా ఇందులో క‌న‌ప‌డ‌తాను. ఆ త‌ర్వాత వ‌రుస‌గా జ‌రుగుతున్న అలాంటి ప‌రిణామాలు వెనుక అస‌లు నిజాన్ని రాబ‌ట్టడానికి జ‌ర్న‌లిస్ట్‌గా మారి ఏం చేశాన‌నేదే ఈ క‌థ‌. మ‌ణిశ‌ర్మ‌ సంగీతం సినిమాకు ప్రధాన బ‌లం. ఫిబ్ర‌వ‌రిలో రెగ్యుల‌ర్ షూటింగ్‌కెళ‌తాం“ అన్నారు.
డైరెక్ట‌ర్ మ‌ధు శోభ‌.టి మాట్లాడుతూ – “అన్నీ ర‌కాల ఎమోష‌న్స్ ఉండే చిత్ర‌మిది. యూత్‌కు మంచి సందేశం ఉంటుంది. స‌మాజంలో జ‌రుగుతున్న ప‌రిణామాల వెనుకున్న చీక‌టి కోణాల‌ను వెలికి తీసే జ‌ర్న‌లిస్ట్ క‌థ ఇది. క‌చ్చితంగా హిట్ సాధిస్తాన‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.
నిర్మాత శంక‌ర్ ఆర్ల‌ మాట్లాడుతూ – “మంచి సందేశం ఉన్న చిత్రం. వ‌రుణ్ సందేశ్‌ త‌న వంతు స‌హకారాన్ని అందిస్తున్నారు. ద‌ర్శ‌కుడు మ‌ధు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి నిర్మాత‌గా మారాను“ అన్నారు.
కార్య‌క్ర‌మంలో కార‌ణ్య‌, చెరిష్మాజీవ‌న్‌, శివ‌శంక‌ర్ మాస్టర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి డాన్స్‌: శివ‌శంక‌ర్ మాస్టర్‌, సూర్య కిర‌ణ్, ఆర్ట్‌: వెంక‌ట్‌, డైలాగ్స్‌: గుత్తి మల్లిఖార్జున్‌, ఫైట్స్‌: శేఖ‌ర్‌, సంగీతం :మ‌ణిశ‌ర్మ‌, ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, కెమెరా: ప్ర‌సాద్ ఈద‌ర‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వెంక‌టేశ్ పుట్ట‌గ‌ళ్ల‌, క్రియేటివ్ హెడ్‌: మోహ‌న్‌, నిర్మాత‌లు: శ‌ంకర్ ఆర్ల‌, డైరెక్ట‌ర్‌: మ‌ధు శోభ‌.టి
English Title : Dadi movie


from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2S9C1hH

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...