Skip to main content

‘జెర్సీ` స‌క్సెస్‌ను ఇంత పెద్ద రేంజ్‌లో ఊహించ‌లేదు – ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి

నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా, రోనిత్ క‌మ్ర‌, స‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన చిత్రం `జెర్సీ`. ఏప్రిల్ 19న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్‌హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఇంట‌ర్వ్యూ..
`జెర్సీ` ఇన్‌స్పిరేష‌న్ ఎక్క‌డి నుండి వ‌చ్చింది?
– నిజానికి ముందు నేను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాల‌ని అనుకోలేదు. హైద‌రాబాద్‌లో ఓ ప్రెస్‌మీట్‌లో హ‌ర్ష బోగ్లే మాట్లాడుతూ స‌చిన్ టెండూల్క‌ర్ ఎంత గొప్పోడో ఆరోజు చెప్పారు. స‌చిన్ అంత గొప్ప ఆట‌గాళ్లు చాలా మంది ఉన్నా కూడా స‌చిన్ ఆయ‌న అట్యిట్యూడ్ కార‌ణంగానే స‌చిన్ గొప్ప‌వాడైయ్యాడ‌ని.. హర్ష బోగ్లే చెప్పుకొచ్చారు. నాకు స‌చిన్ టెండూల్క‌ర్ గొప్ప‌త‌నం క‌న్నా.. ఆయ‌న‌లా టాలెంట్ ఉన్నోళ్లు చాలా మంది ఉన్నారు క‌దా! అనే పాయింట్ బాగా న‌చ్చింది. సాధార‌ణంగా మ‌నం స‌క్సెస్ అయినోళ్ల‌నే గుర్తుపెట్టుకుంటాం. కానీ అంతే క‌ష్ట‌ప‌డి వేర్వేరు కార‌ణాల‌తో ల‌క్ష్యాన్ని చేరుకోని వాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్ల క‌థ చెప్పాల‌నుకున్న సంద‌ర్భంలో జెర్సీ క‌థ‌ను త‌యారు చేసుకున్నాను.
రామ‌న్ లాంబా ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్నార‌ని వార్త‌లు వినిపించాయి?
– లేదండి.. క్రికెట్ ఆడుతూ రామ‌న్ లాంబా గాయ‌ప‌డి చ‌నిపోయారు. అయితే సినిమా చూసిన వారికి రామ‌న్ లాంబా క‌థ‌కు, నా సినిమాకు లింక్ లేద‌ని అర్థ‌మ‌వుతుంది.
క‌థ ప‌రంగా ఎలాంటి రీసెర్చ్ చేశారు?
– రీసెర్చ్ అంటూ ప్ర‌త్యేకంగా ఏమీ చేయ‌లేదు. చిన్న‌ప్ప‌ట్నుంచి క్రికెట్ ఆడుతున్నాం క‌దా.. దాన్ని దృష్టిలో పెట్టుకునే క‌థ‌ను రాసుకున్నాను. క‌థ‌పై ఎక్కువ రోజులు వ‌ర్క్ చేశాను. నా తొలి చిత్రం `మ‌ళ్ళీరావా` కంటే ముందు నుండే నా ద‌గ్గ‌రున్న స్టోరి.
సినిమాకు ఇంత పెద్ద రెస్పాన్స్ వ‌స్తుంద‌నుకున్నారా?
– లేదండి.. ఇంత మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అనుకోలేదు. ఎందుకంటే సినిమా అంటే ఓ బాధ్య‌త‌. ముఖ్యంగా ద‌ర్శ‌కుడ్ని న‌మ్మే నిర్మాత డ‌బ్బులు పెడ‌తాడు. మొన్న‌టి వ‌ర‌కు నాకు కూడా అరే ఇంత మంది నన్ను న‌మ్మారే ఏమ‌వుతుందో ఏమో అనే టెన్ష‌న్ ఉండేది. ఇప్పుడు సినిమాకు హిట్ టాక్ వ‌చ్చి అంద‌ర‌రూ ఎంజాయ్ చేస్తున్నా స‌రే! నేను ఎంజాయ్ చేయ‌డానికి నాకు ఇంకా స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది. నా ద‌గ్గ‌రున్న స్క్రిప్ట్స్‌లో నాకు ఇదే ఇష్ట‌మైన స్క్రిప్ట్‌. క‌థ రాసుకున్న త‌ర్వాత రెండు, మూడేళ్లు నా ద‌గ్గ‌రే ఉంది. ఆ ప‌రిస్థితుల్లో ఎవ‌రూ నాతో ఇలాంటి సినిమా చేయ‌ర‌ని ఎవ‌రినీ అప్రోచ్ కాలేదు.
ఈ చిత్రం ద్వారా ఏం చెప్పాల‌నుకున్నారు?
– ఓ అండ‌ర్‌డాగ్ స్టోరి. ప్ర‌పంచ‌మంతా ఇత‌నేం చేయ‌లేడు అని అంద‌రూ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన
ఓ వ్య‌క్తి.. అత‌ను ఎలాంటి ప్ర‌య‌త్నం చేశాడు? దాన్ని సాధించ‌డానికి అత‌ను ఎంత వ‌ర‌కు ముందుకెళ్లాడ‌నేదే క‌థ‌.
నాని కాన్ఫిడెన్స్ లెవ‌ల్ ఎలా ఉండేది?
– నానిగారి కాన్ఫిడెన్స్ చూసి చాలా సంద‌ర్భాల్లో భ‌య‌మేసింది. ఎందుకంటే నేను ఓ మంచి సినిమా చేయాల‌నే త‌ప‌న‌తో ఈ సినిమా చేస్తూ వ‌చ్చాను. ఔట్‌పుట్‌ను డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో చూసుకున్న త‌ర్వాత ఇది మ‌నం చేసిన సినిమాయేనా అనిపించింది.
క్రికెట్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం ఏం చేశారు?
నాని, విశ్వాంత్ త‌ప్ప‌.. ఈ సినిమాలో మిగిలిన వాళ్లంద‌రూ క్రికెట‌ర్సే. క్రికెట‌ర్స్ అంద‌రికీ యాక్టింగ్‌లో కొన్ని రోజులు శిక్ష‌ణ ఇచ్చాం. స్పోర్ట్స్‌ను అథేంటిక్‌గా చూపించాలి. క్రికెట్ స‌న్నివేశాల‌ను షూ్ చేయ‌డం చాలా క‌ష్టమైంది. సాధార‌ణ సీన్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసేయొచ్చు. అదే క్రికెట్‌లో 1 మినిట్ ఏపిసోడ్‌ను ఒక‌టిన్నర రోజు షూట్ చేసిన సంద‌ర్భం కూడా ఉంది. ఒక కెమెరాతో మూమెంట్స్ క్యాప్చ‌ర్ చేయ‌డం క‌ష్టం. అందుక‌నే ఓ సైడ్ క్రికెట్ గేమ్‌ను కొన్ని రోజుల్లో చిత్రీక‌రించాం.. మ‌రో ప‌క్క స‌న్నివేశాల‌ను మ‌రికొన్ని రోజుల్లో చిత్రీక‌రించాం.
బాలీవుడ్‌లో సినిమాలు చేస్తారా?
. నేను బాలీవుడ్‌లో సినిమాలు చేయాల‌నే ఆలోచన ఇప్ప‌ట్లో లేదు.
నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్‌
– ముందు క‌థ రాసుకున్న త‌ర్వాతే దానికి త‌గ్గ హీరోల‌ను క‌లిసి క‌థ చెబుతాను. ప్ర‌స్తుతం నా ద‌గ్గ‌ర కొన్ని క‌థ‌లున్నాయండీ.. అయితే వెంట‌నే సినిమా స్టార్ట్ చేయ‌ను. కాస్త గ్యాప్ తీసుకుని సినిమా చేస్తాను.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2IM6v7M

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...