ప్రముఖ నిర్మాత కోనేరు అనిల్ కుమార్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో కన్నుమూశారు. శ్రీకాంత్ హీరోగా నటించిన రాధా గోపాలం , నితిన్ హీరోగా నటించిన అల్లరి బుల్లోడు చిత్రాలను నిర్మించాడు కోనేరు అనిల్ కుమార్. గతకొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న కోనేరు అనిల్ హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కోనేరు అనిల్ కుమార్ మరణ వార్త తో అనిల్ సన్నిహితులు , కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అనిల్ కుమార్ నిర్మించిన అల్లరి బుల్లోడు ప్లాప్ అయి ఆర్ధికంగా నష్టపరచగా రాధా గోపాలం చిత్రం మాత్రం అనిల్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అనిల్ మృతికి హీరోలు శ్రీకాంత్ , నితిన్ లు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2UYocbp
Comments
Post a Comment